పేద vs ధనిక ఆట బొమ్మలు 3 | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Fairy Tales

కీర్తన వాళ్ళ అమ్మ కీర్తనని వేరే ఊరు తీసుకెళ్లిన తరువాత కీర్తన బేబీ ఇద్డు ఒకరిని ఒకరు కలుసుకోలేక పోతారు, కీర్తన బేబీ ఎంత దూరంగా ఉన్న కూడా వాళ్ళ మనసులో ఒకరంటే ఒకరికి ఉన్నస్నేహం మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది, ఎలాగైనా ఒకరిని ఒకరు కలుసుకోవాలని రోజు అనుకుంటూనే ఉంటారు. ఒకరోజు బేబీ వాళ్ళ అమ్మ శాంతాదేవి కీర్తన దగ్గరికి వచ్చి

శాంతాదేవి :- అమ్మ బేబీ నాకు పని దొరకక ఈరోజుకి వారం రోజులు అవుతుంది. ఇలా పని దొరికి దొరకక ఉంటె మనం ఇల్లు గడపడం చాలా కష్టాంగా ఉంది. నువ్వు ఎలాగూ ఆదుకోవడానికి మట్టి బొమ్మలు తయారు చేసుకుంటున్నావు కదా, అలాజె నీతో పాటు నేను కూడా ఇంకా చాలా ఆటబొమ్మలు మట్టితో తాయారు చేస్తాను, అలా తయారు చేసిన బొమ్మలను మనం, మన దగ్గర ఉన్న తోపుడు బండిలో తీసుకెళ్లి పట్నం లో అమ్ముదాం, ఇలా కూలికి వీళ్ళు వాళ్ళింట్లో వీళ్ళింట్లో పాచి పని చేసి డబ్బులు సంపాదించడం చాలా కష్టాంగా ఉంది తల్లి, పైగా ఎంత పని చేసినా కూడా వాళ్ళు సరిగా డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా మనం పేదవాళ్లం, తిరిగి ఏమి అనలేము అన్న చులకన భావంతో నన్ను అందరు అనరాని మాటలు అంటున్నారు, ఎలాగైనా మట్టి బొమ్మలు చేసి ఎవరి కిందా బ్రతుకుండా మన బొమ్మలు మనం అమ్ముకొని డబ్బులు సంపాదించడం మంచిది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది

బేబీ :- అమ్మ నువ్వు నాకోసం వేరే వాళ్ళతో మాటలు పాడడం నాకు నచ్చడం లేదమ్మా, నువ్వు ఆనందంగా ఉంటావు అనుకుంటే నేను ఎంత కషటపడానికైనా సిద్దంగానే ఉన్నాను, నువ్వు అనుకున్నట్టుగానే మనం మట్టి బొమ్మలు చేసి ఊరూరా తొరిగి అమ్మి డబ్బులు సంపాదించుకుందాం అమ్మ అని అంటుంది.

ఇద్దరు కలిసి పిల్లలు ఆదుకునే బొమ్మలు మట్టి తో తాయారు చేస్తారు, బేబీ శాంతాదేవి కొన్ని బొమ్మలు తోపుడు బండిమీద పెట్టుకొని అమ్మడానికి పట్టణానికి వెళ్తారు

బేబీ  :- రావాలమ్మా రావాలి అందమైన మట్టి బొమ్మలు, మీ పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించని మట్టి బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలకంటే తక్కువ ఖర్చుతో మీ పిల్లల ఆనందాన్ని పంచుకునే మట్టి బొమ్మలు, అని అరుస్తూ అమ్ముతూ ఉంటుంది.

అలా తిరుగుతూ తిరుగుతూ బేబీ తనకు తెలియకుండానే కీర్తన వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి బొమ్మలు అమ్ముతూ ఉంటుంది. బేబీ మాటలు విన్న కీర్తన ఒక్క సారిగా బేబీ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చ్హి

కీర్తన :- బేబీ ఎన్ని రోజులయ్యింది బేబీ నిన్ను చూసి, ఆరోజు మా అమ్మ బలవంతంగా నను ఇక్కడికి తీసుకు వచ్చింది, అప్పటినుండి నిన్ను తలుచుకొని రోజు లేదు, ఇంకా కూడా నువ్వు ఇచ్చిన మట్టి బొమ్మలతోనే ఆడుకుంటూ ఉన్నాను, ఇప్పుడు అనుకోకుండా నువ్వే కనిపించావు అని బాబైతో మాట్లాడుతూ ఉండగా శాంతాదేవి అక్కడకు వస్తుంది

శాంతాదేవి :- చూడమ్మా కీర్తన నువ్వు బేబీ మంచి స్నేహితులు అన్న విషయం నాకు తెలుసు, కానీ మీ అమ్మ నిన్ను బాబైతో కలిసినట్టు చూసిందంటే మల్లి మమ్మల్ని తిట్టి పోస్తుంది, ఇప్పటికే మేము ఉన్నదాంట్లో గౌరవంగా బ్రతుకుతున్నాము, మా ఊరిలో మీ అమ్మ మా పరువు తీసింది చాలు ఇక ఇక్కడ మమ్మల్ని చూసిందంటే ఇక్కడ కూడా మా పరువు పోతుంది, మీ స్నేహాన్ని కాదనడం నా ఉద్దేశం కాదు కానీ మీ అమ్మకి బయపడి మీ ఇద్దరినీ దూరంగా ఉంచవలసి వస్తుంది అని చెప్పి బేబీని  అక్కడనుండి తీసుకెళ్లి పోతుంది. అలా బరువెక్కిన గుండెలతో బేబీ కీర్తన చెరోవైపు వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత బేబీ సొంతగా బొమ్మలు అమ్మడం మొదలు పెడుతుంది. అలా ఒకరోజు బేబీ కీర్తన వాళ్ళ ఇంటి ముందుకు వచ్చ్హి

బేబీ :- బొమ్మలమ్మ బొమ్మలు అందమైన మట్టి బొమ్మలు అని అరుస్తూ ఉంటుంది

ఆ మాటలు బేబీ వె ఆర్డమైన కీర్తన పరిగెత్తుకుంటూ బేబీ దగ్గరకు వస్తుంది.

కీర్తన :- బేబీ నువ్వు బొమ్మలుఅమ్మడం చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది, ఇంట్లో ఉన్న మా అమ్మ నీతో నన్ను ఆడనివ్వకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తుంది, నేను ఒక పని చేస్తాను, రోజు స్కూల్ కి పోతున్నానని చెప్పి నీతో పాటు బొమ్మలు అమ్మడానికి వస్తాను, అలాగే మా అమ్మ నాకు చాలా రకాల ప్లాస్టిక్ బొమ్మలు బొమ్మలు తీసుకొస్తుంది, కానీ నాకు ఆ పీల్స్టిక్ బొమ్మలతో ఆదుకోవాలి అనిపించదు, ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చి నీ బండిలో పెడదాము, ఎవరికీ ఏ బొమ్మలు కొనాలని అనిపిస్తే అవి కొంటారు, అప్పుడు నేను నీతో ఎంచక్కా రోజంతా ఉండొచ్చు అలాగే నీకు కొంత తోడు ఉన్నట్లు ఉంటుంది అని చెబుతుంది, బేబీ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి రోలంతా మట్టి బొమ్మలు, కీర్తన ఇచ్చిన ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముతుంటారు

అలా అమ్ముతుండగా ఒకరోజు కేతన వాళ్ళ అమ్మ కీర్తనని బాబైతో బొమ్మలుఅమ్ముతూ ఉండడం చూస్తుంది, ఆలా చూసిన ఆమె కోపముతో ఊగిపోతోంది. వెంటనే బేబీ ఆట బొమ్మల బండి దగ్గరికి వెళ్లి బండి ఫై ఉన్న బొమ్మలన్నింటిని నాశనం చేస్తుంది, అది చూసిన  కీర్తన

కీర్తన :- అమ్మ నువ్వు చేస్తుంది అస్సలు బాలేదమ్మా, నా స్నేహితురాలిని నువ్వు అవమానిస్తున్నావు, ఇలా కఠినంగా ప్రవర్తించే నీతో ఉండడం కంటే నేను బేబీతో ఉండడమే నాకు ఇష్టం అని ఖరాకండిగా చెప్పేస్తుంది కీర్తన

ఆ మాటలు విన్న కీర్తన వాళ్ళ అమ్మ కూడా ఏమి మాటాడకుండా ఉండిపోతుంది,

ఇంతలో అక్కడికి వచ్చిన బేబీ తల్లి శాంతా దేవి

శాంతా దేవి :- చూసారా వీళ్ళు చిన్నపిల్లలు అయినా ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో, కుల మత జాతి తేడా లేకుండా వీళ్ళలో పెరుగుతున్న స్నేహాన్ని మనం తుంపిస్తే ఇంతకన్నా పెద్ద పాపం ఏది ఉండదు, మీరు ఏమి అనుకోక పోతే వేల సన్రహాని ఇలానే కొనసాగిద్దాం అని అంటుంది శాంతాదేవి,

వాలందరి మాటలు విన్న తరుక్కువాత కీర్త తల్లి కూడా మారిపోతుంది, మీ స్నేహాన్ని నేను ఎప్పటికి కాదని అనను  అని మాట ఇస్తుంది. ఆరోజు నుంచి బేబీ కీర్తి ఎంతో స్నేహంగా బ్రతుకుతుంటారు, అల్లా కొద్ద్దిరోజుల్లేనే బేబీ శాంతాదేవి ఎంబోమ్మలుఅమ్మి డబ్బులు సంపాదిస్తారు. అలా అందరు కలిసిపోవడం వల్ల బేబీ కీర్తి ఎంతో ఆదంగా ఆడుకుంటూ వాళ్ళ స్నేహాన్ని కాపాడుకుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *