పేద vs ధనిక కష్టం | Telugu Kathalu | Telugu Moral Stories | Neethi Kathalu | Comedy Videos

ఘణాపురం పురం అనే గ్రామంలో చాలా మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతికేవారు, ఆ ఊరిలో ఎవరు చదువుకున్న వారు  లేక పోవడంతో ఆ ఊరిలోనే ఉంటున్న జమీందారు వాళ్ళ కుటుంబంలో ఉంటున్న వాళ్లు రైతులపై అజమాయిషీ చూపిస్తూ ఉండేవారు. రైతులు వాళ్ళ సొంత పొలాలలో కూలీలుగా చేస్తుండేవారు, అదే ఊరిలో రాజు అనే ఒక రైతు ఉండేవాడు, అతని కూతురి పేరు జానూ, ఒకరోజు జానూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి

జానూ :- నాన్న ఏంటి నాన్న పొలం మనది కష్టం మనది, అయినా ఆ జమీందారు వాళ్ళ కుటుంబానికి మనం ఎదో బానిసల్లాగా పని చేయడం ఏంటి నాన్న, నాకు ఏమి అర్ధం కావడం లేదు ఈ ఊరిలో ఏమి జరుగుతుందో

రాజు :- చూడమ్మా జానూ నువ్వు చిన్న పిల్లవి, నీకు ఈ ఊరిలో జరిగే విషయాలు ఏవి నీకు తెలియదు, ఈ ఊరిలో ఉంటున్న జమీందారు తాతల తండ్రుల కాలం నుంచి మన లాంటి పేద వాళ్ళ పరిస్థితి ఇంతేనమ్మా కాదని వాళ్లకి ఎదురు తిరిగిన వాళ్ళు కానీ ఊరు వదిలి వెళ్లిన వాళ్ళు బ్రతికిన దాఖలాలు లేవు, జమీందారు దగ్గర పనిచేసే కొంత మంది రౌడీలు ఉంటారు, వాళ్లతో మనుషులని కొట్టిస్తారు అవసరం అయితే చంపేస్తారు కూడా, అందుకే ప్రజలందరూ వాళ్లకి బయపడి వాలు చెప్పింది విని బానిసలుగా పని చేస్తున్నారు, ఇంకా మన చేసేది ఏమి లేదమ్మా మన జీవితాలు ఇంతే అమ్మ తప్పదు తల్లి జానూ కి చెప్తూ బాధ పడుతుంటాడు,

అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఆ ఊరి జమీందారు పొలం లో పని చేస్తున్న రైతుల దగ్గరికి వచ్చి

జమీందారు:- నాదరికి చెబుతున్నాను వినండి, మీకు మేము మా కుటుంబంలో మనుషులు అంటే భయం లేకుండా పోయింది, మన ఊరిలో ఉన్న పొలాలలో సరైన పంట పండితే వచ్చే పంట ఎంతో మీ అందరికి బాగా తెలుసు, మీ అందరికి మేము అంటే భయ భక్తులు తగ్గి ఈ సారి పంట తక్కువగా పండించారు, మీ పొలాలలో పండిన పంటనంత మాకు ఇచ్చి మేము మీకు బిక్షగా పదివేసే కొంత ధాన్యాన్ని తీసుకుపోవాలి అనే నియమాన్ని ఉల్లంఘించారు, ఎవరి ఇండ్లలో వాళ్ళు కొంత ధాన్యాన్ని దాచుకున్నారు అని నాకు సమాధానం వచ్చింది, మీ అంతటా మీరుగా ఆ దాచిన ధాన్యాన్ని తీసుకువచ్చి నాకు ఇచ్చెయ్యాలి ఒకవేళ మీరు తీసుకురానట్లయితేఈ మా సైనికులు తీసుకువస్తే మాత్రం మీకు వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. అని చెప్తాడు అలా జమీందారు చెప్పిన కొంత సెప్పటికే ఆ ఊరి ప్రజలలో కొందరు తాము దాచుకున్న కొంత ధాన్యాన్ని జమీందారు ముందు ఉంచుతారు,

జమీందారు :- ఏ రా నన్నే మోసం చేయాలి అనుకుంటున్నారా? మీరు ఇలా చేసినందుకు శిక్షగా ఊరిలో బ్రతుకుతున్న ప్రజలందరికి మూడు రోజులు ఏ ఆహార  పదార్థాలు తినకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తాడు

ఇంతలో జమీందారు ముందుకు ఒక గర్భవతి మహిళ అయిన ఉమా  వచ్చి

ఉమా :- అయ్యా నేను ఇప్పుడు  గర్భవతిని పైగా నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు, మూడు రోజులు తిండి తిప్పలు మానేసి ఉంటె నేను నా పిల్లడు బ్రతకలేము అని బ్రతిమాలుకుంటూ ఉంటుంది

జమిన్దారు :- అంటే నువ్వు ఏమంటున్నావు ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకోసం నిన్ను వదిలేయాలి అంటున్నావా? అయినా మీలాంటి పేదవాళ్లకు పిల్లలు కుటుంబాలు ఎందుకె, అయినా మీలాంటోళ్ళు బ్రతికినా చచ్చినా ఎవరికీ ఏ నష్టం లేదు, అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు జమీందారు

జమీందారు చేసే అకృత్యాలని చూసి తట్టుకోలేక పోతారు ఊరి జనాలు కానీ ఎవరు ఏమి చేయలేక ఆకలి బాధతో ఇళ్లలో బాధపడుతూ ఉండిపోతారు. మూడు రోజులు గడిచిన తరువాత రాజు జమీందారు ఇంటికి వెళ్తాడు

రాజు :- జమీందారు గారు ఈ రోజుతో మీరు ఇచ్చిన మూడు రోజుల గడువు ముగిసింది, రెండు నెల క్రితం మీ మా పంటని తీస్కొని మాక్ కొంత ధాన్యం ఇస్తాం అన్నారు కానీ ఇప్పటి వరకు ధాన్యం ఇవ్వలేదు, అని అడుగుతాడు.

జమీందారు :- ఏంట్రా పోయినసరి పండించినత పంటని మీరు ఈ సారి పండించలేకపోయారు, కాబట్టి నీకు ఎలాంటి ధాన్యం నీకు రాదు అని చెప్తాడు.

రాజు “= అదేంటయ్యా అలా అంటారు మేము కష్టపడి సంపాదించిన దాంట్లోనుంచి కొంత మాకు ఇవ్వమంటే కూడా లేవని చెప్తున్నారు, ఇలా అయితే మా పొలాలు మాకు సొంతంగా ఇచ్చేయండి మాకు కావలసిన పంట మేము వేసుకొని పంట పండించుకుంటాము అని అంటాడు

జమీందారు “= ఏంట్రా ఆ పొలం ఈ పొలం అని అంటున్నావు, మీ పొలం నేను లాక్కొని కొన్నాయి నెలలు అవుతుంది, అని మోసం

మాయ మాటలు చెప్పి  అక్కడనుండి వెళ్ళిపోతాడు,

జమీందారు జనాలందరికి డబ్బాశ చూపిస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్హం అనేలా చేస్తున్నాడు.

ఒకరు=మోజు ఊరి ప్రజలందరూ ఒక దగ్గర కలుసుకొని ఎలాగైనా సరే ఊరి జమీందారుని ఊరి నుండి ఎలాగైనా సరే వెళ్ళగొట్టాలని నిర్మయించుకుంటారు, అనుకున్న ప్లాన్ ప్రకారమే ఒకరోజు రైతులందరూ జమీందారు ఇంటికి వెళ్లి

రాజు :- చూడండి జమీందారు గారు ఇన్ని రోజులు మీ ఆట సాగింది ఇప్పుడు మాకు మా పొలాలు కూడా ముఖ్యం, మీరు మా పొలాలు మాకు తెరిగి ఇవ్వండి, ;ఇకపోతే మీ మీద మర్యాద పోతుండు అని అంటాడు

అప్పుడు జమింన్దాద్ర ఊరందరు కలిసి ఇలా నా మీదకు వచ్చారంటే వీళ్ళకి నా మీద భయం పోయింది ఇప్పుడు ఆ పొలాలు గనక తిరిగి ఇవ్వకుంటే నన్ను వీళ్ళు చంపేసేలా ఉన్నారు అని చెప్పి ఎవరి పొలాలు తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తాడు

ఆ రోజునుంచి తమ పొలాలలో తామే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, పిల్లనదురు బడులకు పోతూ చాలా సంతోషంగా ఉంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *