పేద vs ధనిక జీవితం 2 | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Comedy Videos

అది ఒక పెద్ద బంగ్లా ఆ బంగ్లా లో శాంతి శంకరయ్య దంపతులు వాళ్ల గారాల బిడ్డ శ్యామ్ నివసిస్తూ ఉంటారు . వాళ్లకి డబ్బు ఉంది అన్న పొగరు ఎక్కువ. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో చాలా పేద కుటుంబం అయినా దేవి అనే ఆమె మరియు వాళ్ల కొడుకు బాలు ఇద్దరు కూడా పని చేస్తూ ఉండే వాళ్ళు. అక్కడ మిగిలిన కూరలు అన్నం తింటూ వాళ్ళ కాలన్ని గడుపుతు ఉండే వాళ్ళు. రోజులు గడిచాయి ఒకరోజు శ్యాం పుట్టినరోజు కారణంగా ఆ ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ లో ఎవరు ఊహించని విధంగా జరుగుతుంది. ఒక బంగారు కాసులు ఉన్న డబ్బులు అతని కూర్చోబెడతారు . ప్రభు పైన ఉన్న షవర్ నుంచి బంగారు కాసులు టాబ్బులోకి పడుతూ ఉంటాయి . అందరూ దాన్ని చూసి చాలా ఆశ్చర్య పోతారు. బాలు తల్లితో….. అమ్మ ఏం చేస్తుంది నాకు ఏమీ అర్థం కావడం లేదు . అని అడుగుతాడు అందుకు తల్లి…. ఏం లేదురా ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు శ్యామ్ కి ఇలాగే జరుగుతుంది. ఈ బంగారు కాసులతో ఇప్పుడు స్నానం చేపిస్తారు. తర్వాత వాడిని పేద వాళ్లకి పంచుతారు.
అని సమాధానం చెబుతుంది అందుకు అతను చాలా ఆశ్చర్యంగా….. మన ఎందుకు చేస్తారు అమ్మ దాని వల్ల ఉపయోగం ఏంటి నిజంగా వాళ్ళు పేదవాళ్లకు సహాయం చేయాలి అనుకుంటే . మామూలుగానే డబ్బుని అంద చేయొచ్చు కదా ఇలా ఎందుకు .
తల్లికి ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక…. డబ్బువున్న వాళ్ళు కదా వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది . నువ్వేం మాట్లాడకుండా జరగబోయేది చూస్తూ ఉండు.
అని అంటుంది తల్లి చెప్పినట్టుగానే ఆ దంపతులిద్దరూ కూడా ఆ పిల్లవాడికి ఆ బంగారు కాసుల లో నీళ్ళతో స్నానం చేపిస్తారు ఆ తరువాత కొత్తబట్టలు ధరింపచేసి . ఆ టబ్బులో ఉన్న నా కాసుల నీ అక్కడికి వచ్చిన పేదవాళ్లతో….. నా కొడుకు బంగారు కాసుల లో ఎప్పుడు ఇలాగే ఉండాలని మీరందరూ దీవించండి . వాటిని తీసుకోండి అని అక్కడికి వచ్చిన పేదవాళ్ల తో చెప్తాడు . వాళ్లంతా చాలా సంబరపడిపోతూ ఆ టబ్బులో ఉన్న బంగారు కాసులు కోసం ఎగబడతారు . వాళ్లు కొట్టుకున్న దాకా జరుగుతుంది తన్ను కొని ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకొని …. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి బాబు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు . అదంతా చూసిన బాలు కి ఆ పద్ధతి అస్సలు నచ్చలేదు . తర్వాత భోజనాలు జరుగుతాయి . ఆ దంపతులిద్దరూ….. దేవి ఫంక్షన్ అయిపోయిన తర్వాత మిగిలింది ఇంటికి తీసుకు వెళ్ళు. ఎంత ఉంటే అంత తీసుకెళ్ళు మీ చుట్టుపక్కల జనాలు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా వీటిని పంచు ఫంక్షన్ బాగా జరిగిందనీ అందరికీ చెప్పు .
అని అంటారు. అందుకు ఆమె అంటుంది భోజనం అంతా బాలు దేవి ఇద్దరు కూడా ఇంటికి తీసుకు వెళ్తారు వాళ్ళు కొంచెం ఉంచుకొని చుట్టుపక్కల లేని వాళ్ళుకి కూడా వాటిని అందిస్తారు .
ఆ తర్వాత బాలు దేవి ఇద్దరూ ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా బాలు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అతని పుట్టిన రోజు నాడు ఏం జరిగిందో ఆలోచిస్తాడు. అతను తన స్నేహితులు అందరూ నీటి కాలువ కి వెళ్లి అక్కడ స్నానాలు చేసి ఎంతో చక్కగా ఆడుతున్న దృశ్యం తన కళ్ళముందు కనబడుతూ ఉంటుంది. దాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు బాలు .
తల్లి ఆశ్చర్యంగా ….. బాలు ఏమైందిరా నవ్వుతున్నావ్ . అని అంటుంది బాలు…. అమ్మ ఏం లేదు నా పుట్టినరోజు నాడు నా స్నేహితులతో నేను ఏటిగట్టుకు వెళ్లేవాణ్ణి . అక్కడ మేము మునిగి స్నానం చేసి ఇంటికి వస్తే నువ్వు నాకు కొత్త బట్టలు వేసి కుంకుమ బొట్టు అక్షింతలు వేసి నన్ను దీవించే దానివి. నా స్నేహితులు వస్తే అందరికీ పరమాన్నం ఇచ్చే దానివి. కానీ ఈరోజు శ్యాం వాళ్ళింట్లో అలా ఎందుకు చేశారో నాకు అస్సలు అర్థం కాలేదు డబ్బు ఉన్న వాళ్ళందరూ అలాగే చేసుకుంటరార్మ్మ.
అందుకు ఆమె ఏడుస్తూ ఉంటుంది .
బాలు….. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేనేమైనా తప్పుగా మాట్లాడానా చెప్పమ్మా ఏడవకుండా చెప్పమ్మా.
తల్లి… బాలు మన పరిస్థితి బాగోలేదని నువ్వు నన్ను వేలెత్తి చూపిస్తావా. మన పరిస్థితి పేదరికంలో ఉంది కాబట్టి మనం అలాగే జరుపుకుంటారు . వాళ్లు డబ్బున్నవాళ్ళు కాబట్టి అలా సాగిపోతుంది. మనం పేదవాళ్లం కాబట్టి మనకి ఉన్నదాంట్లోనే సద్దు కుంటాము.
ఇంకెప్పుడూ దాని గురించి ఆలోచించకు మాట్లాడకు అని అంటుంది. బాలు …. అమ్మా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు . వాళ్లకి జరిగినట్టుగా నాకు కూడా కావాలి అని నేను అనుకోవడం లేదు అమ్మా వాళ్ళు చేసిన. పద్ధతి బాగోలేదు అని చెప్తున్నాను. అంత మంది పేదవాళ్ళు అలాగా ఒకరినొకరు తోసుకుంటూ ఆ టబ్బు లో ఉన్న బంగారు కాసులు తీసుకుంటున్నారు . వాళ్లు అలా కొట్టుకుంటున్నారు ఎంతో మందికి గాయాలు కూడా అయ్యాయి . దాన్ని చూసి అక్కడ డబ్బు ఉన్న వాళ్ళందరూ వినోదం చూసి నవ్వుతున్నారు. ఎవరైనా చనిపోతే పరిస్థితి ఏంటి . నాకు ఆ పద్ధతి నచ్చ లేదమ్మా డబ్బు సహాయం చేయాలనుకుంటే ఎన్నో విధాలుగా సహాయం చెయ్యొచ్చు కానీ ఇలా కాదు అది బాగోలేదు అని చెప్తున్నాను.
అని అంటాడు అందుకు తల్లి….. బాబు చిన్నవాడివి అయినా చాలా పెద్దరికం తో మాట్లాడుతున్నావ్. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి పేద వాళ్ళ అందరి ఆకలి తీర్చాలంటే ఈ తల్లి ఎక్కడున్నా సరే నిన్ను చూసి సంతోషపడుతుంది. అని అంటుంది అందుకు అతను తప్పకుండా అమ్మ అని అంటాడు . కొన్ని రోజులు దేవి అక్కడే పని చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటది తర్వాత డబ్బులతో పిల్లవాడిని చదివిస్తూ ఉంటుంది పిల్లవాడు అన్నిట్లో మొదటి స్థానంలో ఉండటం తో దాన్ని చూసి తల్లి మురిసిపోతుంది . ఇప్పటికైనా పిల్లవాడు మంచి ఉద్యోగం చేసి పేదలకు సహాయం చేయాలని ఆమె కోరిక.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *