పేద vs ధనిక జీవితం | Telugu Kathalu | Telugu Moral Stories | Neethi Kathalu | Telugu Comedy Videos

వీరేంద్రపురం అనే గ్రామంలో నీటి కరువు ఉండేది, ఆ ఊరిలో ఊరికే నీటి కరువు వస్తూ ఉండేది, అదే ఊరిలో రాజు అనే ఒక పేద రైతు ఉండేవాడు, అతని భార్య పేరు రాణి, వాళ్లకి ఒక కొడుకు, అతని పేరు అరుణ్, అరుణ్ చాలా చిన్న పిల్లవాడు అవ్వడం వళ్ళ తల్లిదండ్రుల కష్టం ఏది తెలిసేది కాదు, ఊరిలో ఉన్న వేరే ధనవంతుల పిల్లను చూసి వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువులు ఉంటె అల్లాంటివి కావాలని అడిగేవాడు

ఇలా ఉండగా ఊరిలో మళ్ళీ నీటి సమస్య వచ్చింది, ఊరిలో అందరికి నీరు అందక దాహం తో చచ్చిపోఏ పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి సమస్యతో ప్రజలందరూ బాధపడుతూ ఉన్న సమయంలో, రాణి రాజు దగ్గరికి వచ్చి

రాణి :- ఏమండి, మన పరిస్థితి అసలు బాలేదండి, ఒక్కొక్క నీటి బిందె కోసం కొన్ని మైళ్ళ దూరం నడవ వలసి వస్తుంది, ఒక్కో నీటి చుక్క కూడా బంగారంగా మారిందండి ఎం చేద్దాం అండి, అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అరుణ్ అక్కడికి వచ్చి

అరుణ్ :- అమ్మ నాన్న నాకు విపరీతమైన దాహం వేస్తుంది, పొద్దున్న నుంచి నీళ్లు తాగడం అంటే ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా లేదు, పక్కింటి వాళ్ళని అడుగుతే వాళ్ళు నన్ను వాళ్ళ ఇళ్లలోనుండి వెళ్లగొడుతున్నారు, నేను ఎం చేయాలి అమ్మ

రాణి :- ఎం లేదు నాన్న, ఊరిలో చాలా దారుణమైన నీటి కరువు ఉంది, ఎవరి ఇంటిలో కూడా చూసిన ఇదే పరిస్థితి ఉంది అందుకే నీళ్లు ఇవ్వడానికి అలా చేస్తున్నారు, ఇప్పుడే రెండు గంటలు కష్టపడి ఒక్క బిందె నీరు తీసుకు వచ్చాను, ఇదిగో తాగు అని ఒకా గ్లాస్ నీరు అరుణ్ చేతికి ఇస్తుంది రాణి ఆ నీటిని తాగిన తరువాత అరుణ్ రాణితో

అరుణ్ :- ఏంటమ్మా ఊరిలో నీరు లేదు అంటున్నావు, మన ఒర్రిలో ధనవంతుల ఇళ్ల దగ్గర ఉండే ట్యాంక్ నిండా నీరు ఉంది, ఇందాక దాహం తో నేను తిరుగుతున్నప్పుడు నాకు కనిపించింది, అక్కడికి నేను వెళ్లాలని చూస్తే నన్ను గెంటేశారు, అని చెప్తాడు అరుణ్

రాజు :- అవును బాబు నువ్వు అన్నది నిజమే, ఊరిలో మన లాంటి పేదవారు నీటికి ఇంత ఇబ్బంది పడుతుంటే ఆ ధనవంతులు మాత్రం నీటిని కొనుక్కొచ్చుకొని వాళ్ళు చేయవలసిన సరదాలు జల్సాలు చేసుకుంటున్నారు అని అంటాడు

అరుణ్ :- అవును నాన్న మా స్కూల్లో చదివే విజయ్ వాళ్ళనాన్నకి డబ్బులు ఉన్నాయని రోజు నీటితో ఎదో ఒక కొత్త ఆట ఆడుతూ ఉంటాడు

ఇలా ఉండగా ధనవంతులు ఉండే వీధుల్లో అందరు కలిసి వేడుకలు జరుపునుకుంటారు, వేడుకల్లో భాగంగా వాళ్ళు నీటిని ఉపయోగించడం వళ్ళ ఆ నీటి వరద పేద వాళ్ళ ఇళ్ల ముందుకు వస్తుంటాయి. అది చూసిన జనాలు చాలా రోజుల తరువాత నీటిని చూడం తో ఆ మురికి నీటిని ఎత్హుకోని వాడుకోవాలని చూస్తారు

ఇంతలో ధనవంతుల వీది నుండి రమేష్ అనే వ్యక్తి పేదవారి ఇళ్ల దగ్గరికి వచ్చి

రమేష్ :- అందరూ జాగ్రత్తగా వినండి, ఈ నీరు మాకు చెందినవి మేము డబ్బులతో కొనుక్కునవి వీటి మీద పూర్తి హక్కులు మాకు కలవు, మీరు ఈ నీటిని వాడుకోవాలి అనుకుంటే మాకు డబ్బులు ఉంటుంది, మాకు డబ్బులు కట్టకుండా నీటిని వాడుకునే హక్కు మీకు లేదు అని చెప్పి వెళ్తాడు.

ఆ రోజు నుంచి పేదవాళ్లు అందరూ ధనవంతులు వాడిన ఇచ్చే నీటిని వాడుకోవడానికి డబ్బులు కట్టే వారు, డబ్బులు కట్టినప్పటికీ వాళ్ళు ఎదో ఒక మోసం లెక్కలు చేసి తక్కువ నీటినే ఇచ్చేవారు

ఒకరోజు విజయ్ రాజు వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి

విజయ్ :- రేయ్ అరుణ్ ఈ రోజు నా పుట్టిన రోజు, నేను మీకు అందరికి ఒక బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను, మీ అందరికి ఈ ఒక్క రోజు కావలసినన్ని నీటిని ఉచితంగా ఇస్తున్నాను అని చెప్పి వెళ్తాడు

అప్పటికే నీరు లేక అల్లాడుతున్న ప్రజలు ఆ నీటికోసం ఎగబడతారు

అక్కడికి వచ్చిన విజయ్ ప్రజలతో

విజయ్ :- చూసారా మీ లాంటి పేదవాళ్ళు ఎప్పుడైనా మాలాంటి వాళ్ళ దగ్గర అడుక్కొని బ్రతకాల్సి ఉంటుంది, ఈ విషయం గుర్తు పెట్టుకొని మసలుకుంటే మంచిది అని గర్వ0గా  మాట్లాడుతాడు

ఆ మాటలకి  బాధపడినా కూడా ప్రజలు నీరే ముఖ్యం అని అనుకుంటారు ఇంతలో అరుణ వచ్చి

అరుణ్ :- చూడు విజయ్ నువ్వు మాట్లాడేది చాలా తప్పు, ఎప్పుడంటే నీ దగ్గర నీళ్లు ఉన్నాయని మాట్లాడుతున్నావు నీరు లేకపోతే మేము వేరే ఊరు వెళ్లైనా తెచ్చుకోగలం కానీ నువ్వు ఎక్కడికి వెళ్లినా మా లాంటి పేదవాళ్ళు పండించే పంట లేకుంటే నువ్వు ఒక్కరోజు కూడా బ్రతకలేవు, అని చెప్తాడు

అలా కరువుతో ఉన్న ఊరిలో ఒకరోజు అనుకోకుండా భారీ వర్షాలు పడతాయి

ఆ వర్షాల వాళ్ళ పంటలు చాలా బాగా పండుతాయి, పంట కోతకి వచ్చినప్పుడు అరుణ్ వాళ్ళ నాన్న ముందుకు వచ్చి

అరుణ్ :- నాన్న కొన్ని రోజుల క్రితం మన ఊరు కరువులో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కసారి నీళ్లు ఇచ్చి ఎన్ని మాటలు అన్నారో మీకు గుర్తు ఉందా? నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మనం అందరం కలిసి వాళ్లకి పంట మ్మకుంటే వాళ్లకి తెలిసివస్తుంది మం విలువ ఏంటో నువ్వు వెళ్లి మన వాళ్లందరికీ చెప్పి ఈ ఆలోచన అదుపులో పెడితే మన విలువ వాళ్లకి తెలుస్తుంది నాన్న ఈ ఒక్కసారి నా మాట నెమ్మంది నాన్న  అని అంటాడు రాజు కి కూడా ఆ ఆలోచన ఎంతగానో నచ్చుతుంది.

వెంటనే రాజు మరియు ఊరి వాళ్ళందరూ కలిసి ధనవంతులకి ఒక్క గింజ ధాన్యం కూడా అమ్మరు, దాంతో ధనవంతులందరు వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ కోరుకొని ధాన్యం కొనుక్కొని వెళ్తారు, ఇదంతా జరిగిన తరువాత రాజు అరుణ్ దగ్గరికి వచ్చి

రాజు :- బాబు అరుణ్ నువ్వు చెప్పిన ఒక్క ఆలోచన వళ్ళ ఊరి ప్రజలందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటె నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇలానే నువ్వు అందరి ముందు మెప్పు పొందాలి నాన్న అని చెప్తాడు. ఆరోజు నుంచి ఊరి ప్రజలందరూ పేద ధనిక అనే తేడా లేకుండా బ్రతుకుతూ ఉంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *