పేద vs ధనిక పిల్లలు 56| Telugu Stories | Story World Telugu

వాయిస్ : సీతాపూర్ విలేజీలో కిట్టయ్య, రాధమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు.

            వాళ్లకు కీర్తి, బాలు అనే ఇద్దరు పిల్లలున్నారు. కూలీ పనులు చేసుకుంటూ

            పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు

            కలిసి ఎండ వాన అనే తేడా లేకుండా ఎంత కష్టం చేసిన తినడానికి రోజుకు

            ఒక పూటైన తిండిలేక ఆ కుటుంబం అల్లాడి పోయేది. దాంతో విసుకు చెందిన

            కిట్టయ్య…

కిట్టయ్య : రాధమ్మ ఈ కుటుంబాన్ని పోషించడం ఇక నా వల్ల కాదు. నేను సన్యాసం

            తీసుకుంటాను. నువ్వు నీ పిల్లలు చస్తారో బతుకుతారో నీ ఇష్టం.

వాయిస్ : ఆ మాట విని భార్య రాధమ్మ, పిల్లలు కీర్తి, బాలు ఆశ్చర్యపోతారు. అది

            గమనించిన కిట్టయ్య మళ్ళీ ఇలా అంటాడు.

కిట్టయ్య : మీరలా తెల్ల ముఖాలేసుకుని చూసిన నేను ఉండను. చివరకు నా కాళ్ళు

            పట్టుకుని బతిమాలిన ఉండను. ఎవరో ఒక మహానుభావుడు చెప్పినట్టు..

            సముద్రాన్ని ఈదోచ్చు కానీ సంసారాన్ని ఈదలేమన్నది నాకు ఇప్పుడు

            నిజమనిపిస్తుంది.

రాధమ్మ : ఇద్దరం చేస్తేనే ఇంత దారుణంగా ఉందని తెలిసినప్పుడు నన్ను పిల్లల్ని

            వదిలిపెట్టి పోతానని ఎలా అంటున్నావు నువ్వు?

కిట్టయ్య : నేను మనిషిని కాదనుకుంటావా…నాకు మనసు లేదనుకుంటావా…ఏదైనా

            అనుకో…నేనేమీ బాధ పడను. ఇక్కడ మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేను. 

రాధమ్మ : సాధాలేనప్పుడు మరి ఎందుకు ఇద్దరు పిల్లల్ని కన్నావు.

కిట్టయ్య : సరి దిద్దుకోలేని తప్పు చేశాను కాబట్టే, ఇప్పుడు సన్యాసంలో కలిసిపోవాలని

            నిర్ణయించుకున్నాను.

    కీర్తి : వద్దు నాన్న. నన్ను తమ్ముడిని నాన్న లేని పిల్లల్ని చేయొద్దు నాన్న!

 బాలు : అవును నాన్న. కావాలంటే మేము కూడా బడికి పోకుండా ఏదైనా పనికి

           పోతాం. అప్పుడు ఈ ఇబ్బంది ఉండదు.

కిట్టయ్య : మనది పేద కుటుంబం పిల్లలు. ఎంత చేసిన ఏదొక సమస్య వస్తూనే

            ఉంటుంది. ఏది ఏమైనా నా వల్ల కాదు.  

వాయిస్ : అని చెప్పి కట్టు బట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కిట్టయ్య. అలా చూస్తూ,

            రాధమ్మ, పిల్లలు బాధపడుతూ ఉంటారు. రాధమ్మ, గుండెను నిబ్బరం

            చేసుకుని పిల్లలను సాదుకోవాలనే సంకల్ప బలంతో ఇళ్ళల్లో పాచి పనులు

            చేసుకుంటూ, ఆ ఇళ్ళల్లో తెచ్చే వంటలను తీనిపిస్తూ, వాళ్లిచ్చే జీతం

            డబ్బులను తీసుకొచ్చి దేవుడి దగ్గర ఉన్న డబ్బాలో వేస్తుంది. అలా రోజులు

            గడుస్తూ ఉంటాయి.

వాయిస్ : అదే ఊరిలో దామోదర్, పార్వతి అనే ధనిక కుటుంబం ఉండేది. వాళ్ళకు

            మహేశ్ అనే ఒక కొడుకున్నాడు. అతి గారాబంతో పేదరికమంటే ఏమిటో

           తెలియకుండా ఏది అడిగితే అది కొనిస్తూ సంతోషంగా చూసుకుంటూ

            ఉంటారు.

దామోదర్ : చూశావా పార్వతి…ఆ దేవుడికి ఎన్ని ఖరీదైన కానుకలు సమర్పించిన

              మన మీదా జాలి, దయ చూపించలేదు. మనకు ఒక్క కొడుకునే ఇచ్చాడు.

             ఎంత డబ్బు ఉండి ఏమిటి లాభం? అనుభవించడానికి పిల్లలు లేనప్పుడు.

  పార్వతి : అవునండీ. ఆ దేవుడు కూడా…పేదవాళ్ళకు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని

            ఇస్తాడు. మనలాంటి డబ్బున్న వాళ్ళకు ఒక్కరినే ఇచ్చి చేతులు

             దులుపెసుకుంటాడు.

వాయిస్ : అనుకుంటూ మహేశ్ ను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మహేశ్ బనాన

             డ్రీమ్ హై స్కూల్లో చదువుతూ ఉంటాడు. రోజులాగే ఆ రోజు కూడా

            స్కూలుకు వెళ్లడానికి రెడీ హాల్లోకి వస్తాడు. అది చూసిన దామోదర్,

             పార్వతి…ఇద్దరు కలిసి కొడుకును తీసుకుని హల్లో నుంచి డైనింగ్ టేబుల్

            దగ్గరికి వస్తారు. ఆ డైనింగ్ టేబుల్ ఒకేసారి దాని చుట్టుపక్కల ఇరవై మంది

           కూర్చుని తినెంత పెద్దగా ఉంటుంది. అక్కడ మహేశ్ ఒక్కడే కూర్చుంటాడు.

            తల్లి పార్వతి పెద్ద ప్లేట్ పెట్టి…అన్నీ రకాల టిఫిన్స్ వడ్డీస్తుంది.

మహేశ్ : ఎందుకమ్మా? రోజు నాకోసం ఆన్ని రకాల టిఫిన్స్ చేస్తారు.

పార్వతి : మనం డబ్బున్న వాళ్ళం బాబు. డబ్బున్న వాళ్ళంతా ఇలాగే తింటారు.

            నువ్వు ఇలాగే తినాలి.

వాయిస్ : అని నచ్చజెప్పుతుంది. దాంతో మహేశ్ కాదనలేక పార్వతి వడ్డించిన వాటిని

            తినేసి కారులో స్కూలుకు వెళ్లిపోతాడు. అక్కడ బెంచీ మీదా కూర్చుంటాడు.

            ధనిక పిల్లాడు కాబట్టి! ఇక పేద పిల్లలు కీర్తి, బాలు కూడా రోజు లాగే ఆ రోజు

            కూడా బడికి వెళ్లడానికి తయారవుతారు. ఒక ప్లేట్ లో పచ్చడి, గట్టిగా ఉన్న

            చపాతీ రొట్టె ముక్కలను వేస్తుంది రాధమ్మ. ఆ రొట్టె ముక్కలను తినలేక

            పోతారు కీర్తి, బాలు.

   కీర్తి : అమ్మా… ఈ రొట్టె ముక్కలు ఎక్కడివి? ఇంత గట్టిగా ఉన్నాయి.

          తినలేకపోతున్నాం!

బాలు : అవునమ్మ! చాలా గట్టిగా ఉన్నాయి. తినలంటేనే భయంగా ఉంది.

రాధమ్మ : అలా భయపడోద్దు. పళ్ళు గట్టిగానే ఉన్నాయి కాబట్టి మొత్తగా నమిలి

            మింగాలి.

     కీర్తి : ఈ రొట్టె ముక్క ఇంత గట్టిగా ఉన్నదంటే…రెండు మూడు రోజుల కిందట చేసిన

            రొట్టె అయ్యింటుంది.

వాయిస్ : దానికి రాధమ్మ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కీర్తి, బాలు అతి

            కష్టం మీదా ఆ రొట్టె ముక్కలు తినేసి స్కూలుకు బయలుదేరుతారు. అలా

            పేద అక్క తమ్ముడు కలిసి నడుస్తూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ

            ఇద్దరు ప్రభుత్వ స్కూలుకు వెళ్తారు. అక్కడ కిందా కూర్చుని చదువుకుంటూ

            ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.

            ఒక రోజున బోరున వర్షం పడుతూ ఉంటుంది. స్కూలు వదిలిన తరువాత

            వర్షం వెలిసేలా లేదని కీర్తి, బాలు ఇద్దరు వానలో తడుస్తూ ఇంటికి వస్తారు.

            చలికి వణుకుతూ ఉంటారు. మంచంలో పడుకోపెట్టి దుప్పటి కప్పుతుంది

            రాధమ్మ. అదే వానలో కారు వెళ్తున్న మహేశ్ కు కొద్ది దూరం వెళ్ళగానే

            కారు కరవవుతుంది. దాంతో చేసేది ఏమి లేక వానలో తడుస్తూనే ఇంటికి

            వస్తాడు మహేశ్. మరుసటి రోజు ఉదయాన్నే…కీర్తికి,

            బాలుకు జ్వరం వస్తుంది. మంచం మీది నుంచి లేకపోతారు. కంగారూ

            పడుతూ ఆ ఊరిలో ఆర్‌ఎం‌పి డాక్టర్ కు వెళ్తుంది.

రాధమ్మ : సార్…మా పిల్లలకు బాగా ఒళ్ళు కాలుతుంది. కొంచెం ఇంటి వరకు రండి

             మీకు దండం పెడుతా!

   డాక్టర్ : కీర్తి, బాలుకేనమ్మా! నిన్న వర్షంలో తడిసినప్పుడే అనుకున్నాను.

వాయిస్ : అని హాస్పటల్ కిట్ తీసుకుంటుండగా, దామోదర్ ఇంటి నుంచి డ్రైవర్ డాక్టర్

            దగ్గరికి వస్తాడు. మహేష్ కు వచ్చిన జ్వరం గురించి చెబుతాడు. వెంటనే…

   డాక్టర్ : చూడమ్మ…నువ్వేల్లి కీర్తి, బాలును నెమ్మదిగా క్లినిక్ దగ్గరికి తీసుకురా!

వాయిస్ : అని చెప్పి వచ్చిన కారులో వెళ్ళిపోతాడు. అది చూసి రాధమ్మ బాధపడుతూ

           ఇంటికి వచ్చి…కీర్తిని నెమ్మదిగా నడిపించుకుంటూ, బాలుకు ఎత్తుకుంటుంది.

           క్లినిక్ దగ్గరికి తీసుకొస్తుంది. మహేష్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్, మహేష్ ను చెకప్

           చేసి టాబ్లెట్ ఇచ్చి తిరిగి కారులో క్లినిక్ దగ్గరికి వస్తాడు. ఆ తరువాత కీర్తి,

           బాలును చెక్ చేసి తగిన మందులు ఇచ్చి పంపిస్తాడు. రాధమ్మ ఇంటికి

           తీసుకొచ్చి మంచంలో పడుకోబెట్టి సపర్యలు చేస్తూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *