పేద vs ధనిక పిల్లలు Episode 163 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV

ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఉండేవారు. బాలు కీర్తి చిన్న పిల్లలు అనే కారణం తో ఎవరు పనులు ఇచ్చేవారు కాదు ఎప్పుడో ఎవరు పనికి దొరకక పోతే తప్ప బాలు కీర్తి లను పనులకి తీసుకెళ్లే వారు కాదు, ఎప్పుడో పని దొరికినప్పుడే వచ్చిన డబ్బులతో సర్దుకుంటూ తిని తినక కాలాన్ని ఎల్లదీస్తుండేవారు. ఒకరోజు బాలుతో కీర్తి ఇలా అంటుంది.

కీర్తి : తమ్ముడు ఈరోజుతో మన దగ్గర ఉన్న డబ్బులు అన్ని అయిపోయాయి, కూరగాయలు తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు. కొన్ని బియ్యం మాత్రమే ఉంటె అన్నం వండాను, ఈ పూటకి కారం వేసుకొనే తినాలి అని అంటుంది.

బాలు : అక్క మనకి మాత్రమే ఎందుకక్కా ఇలాంటి పరిస్థితులు, ఎవ్వరూ పని ఇవ్వరు పని వయ్స్సుని బట్టి కాదు కదా అక్క ఎవరు ఎక్కువ పని చేయగలరో వాళ్ళకే కదా పని ఇవ్వాలి మనం ఎంత మంచిగా పని చేసినా కూడా మనకి మాత్రం ఎందుకక్కా పని ఇవ్వడానికి అందరు వెనకాడుతుంటారు అని అడుగుతాడు బాలు ఎంతో బాధగా,

కీర్తి  :తమ్ముడు మనం ఏమి చెయ్యగలం చెప్పు వాళ్ళని ఏదైనా గట్టిగా అడిగితే అప్పుడప్పుడు ఇచ్చే పనులు కూడా ఇవ్వడం మానేస్తారేమో అని భయం తో అడగడం కూడా మానేశాను అని అంటుంది.

ఇంతలో బాలు కీర్తి ఎదురింట్లో ఉండే ధనవంతుల కుటుంబానికి చెందిన రంగ గారి అబ్బాయి వినయ్ వాళ్ళ ఇంటి ముందు కూర్చుని పిజ్జా తింటుండగా కీర్తి చూస్తుంది. ఇంతలో వినయ్ తాను తినే పిజ్జా ఎక్కువ అవ్వడం తో బాలు కీర్తి ఇంటి ముందు ఉన్న చెత్త కుండీలో పారేస్తాడు.

కీర్తి : చూసావా తమ్ముడు వాళ్ళకేమో తిండి ఎక్కువయ్యి పడేస్తున్నారు, మనకేమో తినడానికి ఆహారం లేక అలమటిస్తున్నాము, అందుకే పుడితే ధనవంతులుగానే పుట్టాలి ఎలాంటి పేదరికాన్ని అనుభవింస్తూ అనుక్షణం బాధపడకూడదు, దేవుడు ఎందుకు మనలాంటి వాళ్లకి ఇలాంటి జన్మలు ఇచ్చి ఇలా ఆడుకుంటాడో ఏమో అని అంటుంది.

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి

ఒక రోజు బాలు ఊరిలో తిరుగుతుండగా కమల విమల అనే  ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకోవడం చూస్తాడు.

కమల : వదినా నీకు ఒక విషయం తెలుసా రంగ గారికి కొన్ని రోజుల క్రితం ఎలా బ్రతికేవారో తెలుసా ఒక్కొక్క రూపాయి కోసం రోజుల తరబడి ఎదురుచూసే వాడు,

విమల : అవునా నాకు ఈ విషయఎం తెలియని తెలియదు, నేను పెళ్లి అయ్యి ఈ ఊరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని అంటుంది

కమల : లేదు వదినా, రంగ కొన్ని రోజలు కూలి పనులు చేసుకుంటూ అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి ఊరిలో అమ్ముతూ బ్రతికేవాడు. అతనికి తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు అలా ఉండగా అతను ఒక రోజు అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్లగా ఓక్ చెట్టు కింద అతనికి ఎదో తేడాగా అనిపించడం తో తవ్వి చూడగా లంకె బిండల నిండా బంగారం దొరికిందంటా అప్పటి న్నుంచి అతనికి ఇంత డబ్బు వచ్చింది అని అందరు అంటుంటారు.

విమల : అవునా? ఈ విషయం నాకు ఎవ్వరు చెప్పలేదు వదినా, నిజంగా అతని అంత బంగార ఎం దొరికిందా అతనికి బంగారం దొరికిన చోట మల్లి ఎవరు వెతక లేదా?

కమల : ఏమో వదినా ఆ విషయం నాకు తెలియదు లే కానీ ఆ అడవిలో కొన్ని చోట్లలో ఇప్పటికి ఇంకా చాలా లంకె బింద్రాలు ఉన్నాయని అందరు అనుకుంటున్నారు, అని అంటుంది.

కమల విమల మాట్లాడుకున్న మాటలు విన్న బాలు ఎలాగైనా రంగ అంత డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటాడు వెంటనే ఇంటికి వెళ్లి జరిగిన కమల విమల మాటల గురించి కీర్తికి చెప్తాడు.

బాలు : అక్క మనం కూడా వెళ్లి అడవిలో కొని చోట్ల బంగారం కోసం తవ్వుదాం అక్క మనకి కూడా దొరికితే ఒక్క రాత్రిలో ధనవంతులం అయిపోవచ్చు అక్క అని అంటాడు

కీర్తి : తమ్ముడు మనైశికి ఆష ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు, మనం సంపాదించ్చని ఒక్క రూపాయి కోసం మనం ఆశించినా అది అత్యాశే అవుతుంది, నువ్వు అలంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఎవరైనా పని ఇస్తారేమో కనుక్కొని రాపో అని అంటుంది.

బాలు  : అక్క నువ్వేం అన్నా నాకు అనవసరం. నేను బంగారం వెతకడం కోసం అడవికి వెళ్తున్నాను నువ్వు వస్తే రా లేదంటే ఇలానే పస్తులు ఉండు అని అంటూనే పారా గద్దపారా పట్టుకొని అడవికి వెళ్తాడు. కీర్తి తన తమ్ముడితో పాటే ఆడకవికి వెళ్తుంది .

బాలు అడవంతా కలియ తిరుగుతూ వెతుకుతుంటాడు, కానీ తనకి ఎక్కడ కూడా ఏమి తేడాగా అనిపించలేదు, ఇక చేసేదేమి లేక పెద్ద పెద్ద చెట్లు ఉన్నచ్చోట చూసుకొని తవ్వడం మొదలు పెడతాడు ఎంత లోతు తవ్వినా కూడా ఏమి లాభం లేదు, అలా నిద్రలు మానేసి తిండి మానేసి అనుమానం వచ్చిన చోటల్లా తవ్వుతూనే ఉంటారు, అలా కొన్ని రోజులు అలా చేసిన తరువాత బాలు కీర్తి ఇద్దరు చాలా అలసి పోతారు, కీర్తి చూస్తుండగానే బాలు బాగా అలసిపోవడం తో కళ్ళు తిరిగి ఓపిక లేక పడిపోతాడు. కీర్తి బాలు ని ఇంటికి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. కొంత సేపటికి బాలు కి స్పృహ వస్తుంది.

కీర్తి : నేను నీకు ముందే చెప్పాను కదా తమ్ముడు, ఇలాంటి మూఢ నమ్మకాలని నమ్మవద్దు అని, కానీ నువ్వు నా మాటల వినకుండా ఎవ్వరో తెలిసి తెలియక మాట్లాడుకున్న మాటలను పట్టుకొని ఇలా చేసావు ఇప్పుడు చూడు ఏమైయ్యిందో నీ ఆరోగ్యం చెడిపోయింది, ఓపికలు లేకుండా అయిపోయాము ఇద్దరం అని అంటుంది.

బాలు : అవునక్క నువ్వు ఎంత చెప్పినా వినకుండా చేసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది ఇక పై ఎప్పుడు నీ మాటల కాదని ఎప్పుడు ఏ పని చేయను అక్క అని అంటాడు. ఇంతలో బాలు కీర్తి ఇంటి బయట నుంచి రమేష్ మాట వినిపిస్తుంది.

రమేష్ : ఒరేయ్ బాలు ఏమయ్యారు రా ఇన్ని రోజులు, రెండు మూడు రోజుల నుంచి మీరు పనికి వస్తారా అని అడుగుదామని మీ ఇంటికి వస్తే ఎవ్వరు లేరు, సరే లే మీరిక్కడికి వెళ్తే నాకెందుకు లే గాని రేపట్నుంచి వరుసగా నెల రోజులు పని ఉంది వస్తారా మీరు అని అంటాడు. బాలు కీర్తి వెంటనే లేచి హా బాబాయ్ వస్తాం కచ్చితంగా వస్తాము, అని అంటారు నవ్వుకుంటూ

ఆ రోజు నుంచి బాలు కీర్తి తమకు వచ్చిన పని చేసుకుంటూ బ్రతుకుతుంటారు.

షార్ట్ స్టోరీ

బాలు కీర్తి తిండి తిప్పలు లేకుండా కష్టపడుతుంటారు, డబ్బులు లేకపోవడం తో కారం అన్నం తింటూ ఉంటారు, వాళ్ళ ఎదురింట్లో ఉన్న ధనవణ్ణతులు మాత్రమ్ తమకు తిండి ఎక్కువయ్యి చెత్తలో పడేస్తుంటారు, వాళ్లకి లంకెబింద్రాలు దొరికి వాళ్ళు ధనవంతులు అయ్యారని ఎవరో చెప్తే విన్న బాలు లంకెబిందాల కోసం అడవంతా తవ్వుతాడు కానీ ఎక్కడ ఏమి దొరకకక పోవద్దం తో మూఢ నమ్మకాలను నమ్మకూడదు అని నిర్ణయించుకొని ఎప్పటిలాగానే వాచాహిన పని చేసికుంటూ బ్రతుకుతుంటారు బాలు కీర్తి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *