పేద vs ధనిక యాత్ర Poor vs rich trip | Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu

ఆనంద పురం అనే గ్రామంలో ఒక పేద కుటుంబం మరియు ఒక ధనిక కుంటుంబం పక్క పక్కనే నివసిస్తుండే వారు. పేద వాళ్ళ కుటుంబం లో తండ్రి రామయ్య, తల్లి వీరయ్య కూతురు పద్మ నివసిస్తుండేవాడు, వాళ్ళది చాలా పేద కుటుంబం, వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వారు, అలాగే రాజేష్ అనే వ్యక్తి ధనవంతుడు అయిన వ్యక్తి నివసిస్తుండే వాడు. అతనికి ఒక భార్య ఉండేది ఆమె పేరు వాణి కూతురు పేరు లక్ష్మి. వాళ్ళ రెండు కుటుంబాలు పేరుకి పక్క పక్కనే ఉన్నప్పటుకి ఎప్పుడు కూడా సరిగా మాట్లాడుకునే వారు కాదు, అలా ఉండగా ఒక్కరోజు రామయ్య వీరమ్మ దగ్గరికి వచ్చి

రామ

రామయ్య : వీరమ్మ ఈరోజు నాకు ఎక్కడ పని దొరకలేదు , అంటే ఈరోజు మనం పస్తులు పడుకోవలసిందే, ఇంట్లో ఉన్నదేదో పద్మ కి పెట్టేసి మనం అలా పడుకోవడమే అని చెప్తాడు వీరమ్మతో

వీరమ్మ : అవునండి, మనం ఎలాగోలా బ్రతుకుతున్నాం కానీ పద్మ ఎప్పుడు కూడా మన పక్కన ఉన్న ధనవంతుల రాజేష్ కూతురు అయిన లక్ష్మి ని చూస్తూనే ఉంటుంది. లక్ష్మి ఆడుకుంటుంటే తన బొమ్మల వైపే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.

రామయ్య : అవునా ఇప్పుడు ఎక్కడ ఉంది పద్మ

వీరమ్మ : ఎక్కడ ఉంటది, రాజేష్ వాళ్ళ గేట్ దగ్గర నిలబడి లక్ష్మిని చూస్తూనే ఉంటుంది, నేను ఎన్నో రకాలుగా చెప్పి చూసాను కొట్టి చెప్పాను, బ్రతిమాలి చెప్పాను, ఎన్ని రకాలుగా చెప్పిన లాభం లేకపోయిన్నది, నాకు ఏమి చేయాలో అర్ధం కావడం లేదండి, అని అంటుంది

రామయ్య : సరే లే అది చిన్న పిల్ల, అయినా మనం దానికి ఎప్పుడు ఏమి కొనివ్వలేదు, మన పేదరికం దాని ఎదుగుదలకి అడ్డు పడుతుంది, సరేలే కొన్ని రోజులు పోతే పద్మకి తెలిసి వస్తే అదే అటు వైపుకు వెళ్లడం మానేస్తుంది, ఇప్పుడు మనం చెబితే దానికి మనం శత్రువుల లాగా కనిపిస్తాము,

అలా రోజులు గడిచి పోతు ఉంటాయి.

ఒకరోజు పద్మ హడావిడిగా పరిగెత్తుకుంటూ రామయ్య దగ్గరికి వచ్చి

పద్మ : నాన్న పక్కింటి లక్ష్మికి వాళ్ళ నాన్న కొత్తగా ఒక బొమ్మ కార్ తీసుకు వచ్చాడు, అది చూడడాన్నిఎంతో బాగుంది. నేను లక్ష్మి ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటె వాళ్ళ అమ్మ వచ్చ్హి నన్ను తిట్టి పంపించింది. నాకు అలాంటి కార్ కావలి నాన్న అని అడుగుతుంది.

రామయ్య : ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మాకు ముందే తెలుసమ్మా, అందుకే నీకు ఆమ్మ ఎన్నోసార్లు చెప్పింది. అక్కడికి వేళ్ళకు అని నువ్వు వినకుండా వాళ్ళ గేట్ దగ్గర నిలబడి ఉంటున్నావు. సరే వాళ్ళ స్థోమతకు తగ్గట్టు వాళ్ళు కొనుక్కున్నారు, నేను నీకు కావాలంటే మట్టి తో తాయారు చేసి ఇస్తానమ్మా అని అంటాడు

పద్మ : ఏంటి మట్టి బొమ్మలా? లక్ష్మి కార్ చూసావా ఎలా ఉందొ? దానికి రంగుల రంగుల లైట్లు ఉన్నాయి. పైగా ఆ కార్ రిమోట్ తో నడుస్తుంది, నువ్వు చేసే మట్టి కార్ రిమోట్ తో నడుస్తుందా? అయినా మీరెప్పుడు ఇంతే అడిగినది ఇవ్వరు, మీరేం ఎం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు రెండు రోజుల్లో నాకు లక్ష్మి దగ్గర ఉన్న లాంటీ రిమోట్ కంట్రోల్ కార్ కావలి, అని చెప్పి వెళ్లి పోతున్నది

ఇంతలో అక్కడికి వచ్చిన వీరమ్మ రాజయ్యతో

వీరమ్మ : అవునండి మన పక్కింటి వాణికి డబ్బుందన్న పొగరు చాలా ఉంటుంది, డబ్బులు లేని పేదవాళ్ళు ఎవరు కనిపించినా తాను అవమానించకుండా పంపించేది కాదు, వాళ్లకి డబ్బులు ఉన్నాయని అందరికి తెలిసేలా కూతురికి ఖరీదైన బొమ్మలు కొనివ్వడం, బాగా నగలు వేసుకొని ఊరిలోకి రావడం లాంటి పనులు చేస్తూ ఉండేది. అలా చేయడం వల్ల ఊరిలో జనాలు ఆమెతో ఎదో పెద్ద అవసరం పడితే తప్ప మాట్లాడే వారు కాదు, ఆమెకి ఎవరు పేదవాళ్లు ఆమె కంటికి చిక్కని సమయంలో మన అమ్మాయి పద్మ దొరికే సరికి ఆమె కోపమంతా దీనిపై తీర్చుకొని ఉంటుంది.

రాజయ్య : సరే మనం ఒక పని చేద్దాం, ఎలాగూ పద్మ చెప్పినట్టు అంత ఖరీదైన ఆట వస్తువు కొనిచ్చే డబ్బులు మన దగ్గర లేవు, అందుకోసమే పద్మకి ఆ రిమోట్ కంట్రోల్ కార్ మీద అమంసు మారిపోయేలా ఎదో ఒకటి చేయాలి, ఒక ఆలోచన రేపు మనకి పని ఎలాగూ లేదు కదా, మన ఎడ్లబండి తీసుకొని ఎటైనా బయటకు వెళదాము అని అంటాడు.

వీరమ్మ : ఎటైనా అంటే మన ఊరికి కొంత దూరం లో కొండ దగ్గర ఒక చిన్న జలపాతం లాగా ఉంటుందంట, అక్కడికి వెళదాము, ఉదయం వెళ్తే సాయంత్రం వరకు వచ్చేయొచ్చు అని చెబుతుంది.

రామయ్య : నీ ఆలోచన చాలా బాగుంది, రేపు యాత్రకి అన్ని సిద్ధం చేయి, ఉదయాన్నే వెళదాం అని చెబుతాడు,

అనుకున్నట్టు గానే ముగ్గురు ఉదయాన్నే ఎడ్లబండి కట్టుకొని జలపాతం దగ్గరకి వెళ్ళడానికి సిద్ధం అవుతాఋ,

పద్మ : నాన్న నాకు మీరు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది, హి మేము జలపాతం దగ్గరికి వెళ్ళబోతున్నాము, మేము ఈరోజు ఎంతో ఆనందంగా ఉండబోతున్నాము అని అరుస్తూ ఆనందంగా గెంతులేస్తూ వస్తూ ఉంటుంది.

ఇంతలో అక్కడికి రాజేష్ వాళ్ళ కుటుంబం కారులో వస్తారు, కారులో ఉన్న వాణి పద్మ వైపు చూస్తూ

వాణి : ఏంటమ్మా పద్మ యాత్రకు బయలుదేరారా? ఎడ్లబండి మీద యాత్ర బలే స్పీడ్ గా వెళ్తారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో

పద్మ : మా నాన్న మమ్మల్ని పక్కనే ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు, ఈరోజు మొత్తం అక్కడే ఉండి ఎంతో ఎంజాయ్ చేసి వస్తాము అని చెబుతుంది ఎంతో కోపంగా

వాణి : ఏంటి పక్కన ఉన్న వాటర్ ఫాల్ ఆ? ఆ వాటర్ ఫాల్ కి మేము ఇప్పటి వరకు ఒక పది స్సార్లు పోయి ఉంటాము, అయినా రోజంతా అక్కడ ఎంజాయ్ చేస్తారా? మీరు ఈ ఎడ్ల బండి మీద ఇల్లే వరకే సాయంత్రం అవుతుంది, వెళ్లి వెంటనే తిరిగి రావడమే ఇంకా మీరు ఎంజాయ్ చేసే సమయం ఎక్కడ ఉంటుంది. మాలా కార్ ఉన్నవాళ్లు ఎంజాయ్ చేయగలరు, మీరెలా చేస్తారు ఎంజాయ్ అని పద్మని అవానిచి కార్లూ స్పీడ్ గా వెళ్ళిపోతుంది.

ఆ మాటలు విన్న పద్మకి ఎంతో కోపమ్ వస్తుంది.

పద్మ : నాన్న ఆమె నను అన్నాన్ని మాటలు అంటుంటే మీరిద్దకు చూస్తూ కూర్చున్నారు తప్ప తిరిగి ఒక్క మాట అనలేదు ఎందుకంటే మనం పేదవాళ్లం వాళ్ళు డబ్బున్న వాళ్ళు,  వాలు మనల్ని ఏమైనా అనవచు కానీ మనం వాళ్ళని ఏమి తినకూడదా? ఇప్పుడు నేను మీకు ఒక మాట చెబుతున్నాను నాన్న మీరు వాళ్ళలా ఎప్పుడు డబ్బులు సంపాడిస్తారో నేను అప్పుడే మీతో మాట్లాడతాను అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉన్నప్పటికీ మీతో మాట్లాడను, నాకు ఇప్పుడు ఈ యాత్ర వద్దు ఏమి వద్దు అని ఎడ్ల బండి దిగి ఇంటికి దారిలో వెల్తూ ఉంటుంది, వాళ్ళు అనుకున్న ఆలోచనని  పాడు చేసి, తమ కూతురుని ఎంతలా అవమానించి బాధపడేలా చేసినందుకు వాణి ని తిట్టుకుంటూ ఇంటి దారి పడతారు వీరమ్మ రాజయ్య

Add a Comment

Your email address will not be published. Required fields are marked *