పేద vs ధనిక వ్యవసాయం | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Comedy Videos

అది పెద్దాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో శేషు అనే ఒక పేదవాడు. అతని భార్య కుమారి కూతురు బేబీ నివసిస్తూ ఉండేవారు . అదే ఊర్లో బాగా ధనవంతుడైన శేఖర్ అతని భార్య శాంతి నివసిస్తూ ఉండేవాళ్లు. వాళ్లకు సొంతంగా పొలాలు ఉన్నాయి కానీ అవి పెద్దగా సాగులో ఉండేవి కావు ఎందుకంటే అక్కడ నేలంతా చాలా కఠినంగా ఉంటుంది. పంట వేసిన చాలా తక్కువ మొత్తంలో పండుతుంది. అందుకోసమే నాగలితో పొలాన్ని సాగు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఆ ఊరి ప్రజలు అందరూ కూడా ఉపయోగం లేని భూమి ఎందుకు అని చెప్పి జమీందారు గారి అమ్మేశారు. శేషం కూడా అదే చేయమని చాలామంది సలహా ఇస్తారు కానీ శేషు దానిని అమ్మడానికి అసలు ఒప్పుకోడు . తరతరాల నుంచి వస్తున్న ఆస్తి అదొక్కటే మాకు మేము దానిని ఇవ్వము పస్తువులైన ఉంటాము కానీ . దానిని అమ్మడానికి మేము ఇష్టపడను కానీ సమాధానం చెప్తాడు అదే విషయం ఎవరో జమీందారు చెవిన పడేస్తారు . ఆ విషయం ఆ జమీందారు అతని పట్ల చాలా కోపంగా ఉంటాడు అయితే రోజులు గడిచాయి . ఒకరోజు శేషు అతని భార్య పొలం దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు.
శేషు….. కుమారి మనం ఇప్పుడు చాలా పెద్దరికం లో కి జారిపోయాము. పొలం సాగు చేసుకుంటే మరింత లాభం రాకపోయినా మనం బ్రతకడానికి ఏదో కొంత డబ్బు మన చేతిలో ఉంటాయి . అని చెప్పడం కోసమే ఇక్కడికి తీసుకు వచ్చాను .
భార్య…. ఏంటండీ మీరు అనేది మన దగ్గర డబ్బులు కూడా లేవు సాగు చేయడానికి కొనాలంటే డబ్బులు కావాలి కదా. ఎలాగా సాగు చేద్దాం .
శేషు ….. నేనే నాగలి పట్టుకొని సాగు చేస్తాను నువ్వు వెనకాల ఉండు. కానీ అంటాడు అందుకామె సరే అంటుంది ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా నాగలితో ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ ఉంటారు చాలా సమయం తర్వాత జమీందారు తన పొలం దగ్గరికి వస్తాడు పక్కన ఆ భార్యభర్తలిద్దరు ని చూసి నవ్వుతూ…… మిమ్మల్ని చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది మీరు చేస్తున్నది తెలివితక్కువ పని అని మీకన్నా అర్థమవుతుందా.
అందుకు వాళ్ళిద్దరూ చాలా ఇది గా అతని వైపు చూస్తూ ఉంటారు.
జమీందారు…. మీరు అంత అమాయకంగా ముఖం పెట్టి చూడాల్సిన అవసరం ఏమీ లేదు నేను చెబుతుంది నిజమే. ఇలా దుక్కి దున్ని సాగు చేసిన తర్వాత కూడా పంట పండకపోతే ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నేను మంచి ధరకి ఈ పొలం తీసుకుంటాను . నాకు ఇవ్వండి అని అడుగుతాడు అందుకు వాళ్లు…… మేము పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. మా తంటాలు ఏవో మేమే పడతాము.
అని అంటారు అందుకు తను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం డాక్టర్ తీసుకొనివచ్చి వాళ్లు సాగుచేస్తున్న పొలం పక్కనే తన పొలంలో ట్రాక్టర్ తో పొలన్ని దున్నుతూ ఉంటాడు.
దాన్ని చూసి భార్యాభర్తలిద్దరూ…. జమీందారు మనకి కావాలనే పోటీగా ఇలా చేస్తున్నాడు . మనకంటే ముందు పంట వేస్తే నీళ్లు మొత్తం మనకి రావడం కష్టమైపోతుంది. కొంచెం త్వరగా సాగు చేద్దాం అని భార్య భర్తల మాట్లాడుకొని వాళ్ళ పని మరింత తొందర చేస్తాడు కానీ అతను తొందరపాటు వల్ల ఒక్కసారిగా నీరసంతో పడిపోతాడు .
భార్య కంగారుపడుతూ…… ఏమండీ ఏమైంది అంటూ కేకలు వేస్తోంది జమీందారు తన డాక్టర్ ని పక్కన నిలిపి వేసి అతన్ని చెట్టు కిందకి సాయం పడతాడు .
ముఖం మీద నీళ్లు చల్లడం తో అతను పైకి లేస్తాడు జమీందారు ….. మీ మొండి పట్టు మీ పక్కన పడేసి ఎప్పటికైనా నేను చెప్పిన మాట వినండి . నేను మంచి దరకి ఆ పొలం తీసుకుంటాను . అని అంటాడు అందుకు వాళ్లు ఇవ్వము అని సమాధానం చెప్తారు రోజులు గడిచాయి. ఈ పేద వాళ్ళు దుక్కి దున్నే సమయానికి అక్కడ జమీందారు నారు మడి కూడా వేస్తారు.
చాలా రోజుల తర్వాత పేదవాళ్లు నారులోకి దిగుతారు .
అదే సమయానికి అక్కడ జమీందారు మనుషుల చేత నాట్లు వేయించడం కూడా అయిపోతుంది.
పేదవాళ్లు నాట్లు వేసుకునే సమయానికి అక్కడ మొక్క కాస్త పెరుగుతుంది. పేదవాళ్లకు నీళ్ళు చాలా తక్కువగా వస్తాయి. మరి కొన్ని రోజులు గడిచాయి అక్కడ పంట బాగా పండితే వాళ్ల చేతికి వస్తుంది . పేదవాళ్లు అంత కష్టపడి చేసినా కూడా అక్కడక్కడా కొన్ని మొక్కలు మాత్రమే బ్రతికి పురుడు పోసుకుంటాయి. దాన్ని చూసి భార్యాభర్తలు చాలా బాధ పడతారు ఏడుస్తూ…. భగవంతుడు కూడా మనకు సహాయం చేయడం లేదు వర్షాలు కురిపించడం లేదు. ఏంటో మన బ్రతుకులు అంటూ చాలా బాధ పడతారు. భార్య…. ఏమండీ ఇలా ఆకలితో చస్తూ బతకడం కంటే జమీందారుకి పొలాన్ని అమ్మి డబ్బు తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని అమ్మాయిని చదివించు కొంటుం . మిగిలిన డబ్బు తో ఏదైనా వ్యాపారం చేసుకోవడం మంచిది. ఎంతకాలమని ఇలా పేదరికంలో బ్రతుకుతాను చెప్పండి. ఇక్కడ ఉపయోగం లేదు అన్నప్పుడు . అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని సలహా ఇస్తుంది. అక్కడే ఉండి వింటున్న ఆ జమీందారు …. నేను ఎప్పుడో చెప్పాను నేను అందరి కంటే ఎక్కువ డబ్బులు మీకు ఇస్తాను. మీరు సంతోషంగా బ్రతకావచ్చు కావాలంటే మళ్లీ ఈ పొలం మీకు అమ్ముతాను. అని అంటాడు అందుకు శేషు ఆలోచనలో పడతాడు కొన్ని రోజుల తర్వాత జమీందారు ఆ పొలాన్ని అమ్మేస్తాడు. జమీందారు ఇచ్చిన డబ్బులతో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకొని . బేబీ ని చదివిస్తూ మిగిలిన డబ్బు తో వ్యాపారం మొదలు పెడతాడు. వాళ్ల వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది వాళ్ళ కష్టాలు తీరిపోతాయి .
ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళ పొలం నీ సొంతం చేసుకోవాలని వాళ్ళు కష్టపడతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *