పేద vs రిచ్ అమ్మాయి జీవితం | Telugu Kathalu | Telugu Moral Stories | Neethi Kathalu | Comedy Videos

రాజమహేంద్రవరం అనే ఒక ఊరు ఉండేది, ఆ ఊరు చుట్టూ పక్కల 8 ఊర్లకు కేంద్రంగా ఉండేది, ఆ ఊరిలో ఒక పెద్ద పాఠశాల ఉండేది, చుట్టూ ఎనిమిది ఊర్లకు అది ఒక్కటే పాఠశాల కావడం వాళ్ళ చాలా మంది పిల్లలు అక్కడికి  చదువుకోవడానికి వచ్చేవారు. చాలా మంది పిల్లలు రావడం గమనించిన ఆ పాఠశాల యాజమాన్య స్కూల్ ఫీసులు విపరీతంగా పెంచింది. దాంతో పేద పిల్లలకి చదువు కరువయిపోయింది. పేద పిల్లలను కనీసం స్కూల్ లోకి కూడా రానిచ్చేవారు కాదు,

అదే ఊరిలో రవి అనే వ్యక్తి ఉండేవాడు, అతని భార్య పేరు రవళి, అతని ఒక కొడుకు కూతురు ఉండేవారు, కొడుకు పేరు మురళి, కూతురు పేరు సీత వాళ్ళది చాలా పేద కుటుంబం, ఒర్రిలో ఉన్న కొంచం పొలం చేసుకుంటూ బ్రతికే వారు, పిల్లలిద్దరినీ కూడా ఊరిలో ఉన్న స్కూల్లోనే చదివించే వాడు , మురళి, సీత కూడా చాలా బాగా చదివేవారు, వాళ్ళ స్కూల్లో వాళ్ళు చదివే తరగతుల్లో వీళ్ళిద్దరిదే మొదటి రాంక్, యాజమాన్యం ఉన్నపలంగా స్కూల్ ఫీజులు పెంచడం తో రవి దగ్గర డబ్బులు లేక పిల్లలిద్దరినీ చదువు మాన్పించేసాడు. చదువు మాన్పించేసినప్పటినుండి మురళి వాళ్ళ నాన్న రవికి సాయంగా పొలం పనులు చేస్తుండేవాడు, సీత ఇంట్లో వాళ్ళ అమ్మకి సహాయం చేస్తుండేది, కానీ మురళికి, సీతకి చదువుకోవాలని ఎంతో కోరిక ఉండేది

ఒక రోజు ఇంటి ముందు ఒంటరిగా కూర్చున్న మురళి దగ్గరికి సీత వచ్చి

సీత :- అన్నయ్య మనం చదువుకుంటున్నాం కదా మనని అమ్మ నాన్న స్కూల్ ఎందుకు మాన్పించేసారో కూడా తెలీదు, నాకు ఇంకా చదువుకోవాలని ఉందన్నయ్యా నువ్వు ఎదో ఒకటి చేసి నాన్నని ఒప్పించి మనం తిరిగి చదువుకోనేలా చెయ్యి అన్నయ్య అని అంటుంది సీత

సీత మాటలు విని ఎంతో బాధ పడిన మురళి ఎలాగైనా వాళ్ళ నాన్నని అడగాలని రవి దగ్గరికి వెళ్తాడు

మురళి :- నాన్న సీత నేను మల్లి స్కూల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము నాన్న, మా ఫ్రెండ్స్ అయిన రాజేష్ మరియు వాళ్ళ చెల్లి అనూష స్కూల్ కి వెళ్తున్నారు నాన్న, మేము కూడా వాళ్ళ లాగా స్కూల్ కి వెళ్తాము నాన్న అంటాడు మురళి

రవి :- చూడు మురళి మీరు చదువుతూ ఉంటె నాకు సంతోషంగా ఉండదా చెప్పు, కానీ ఏమి చేస్తాం చెప్పు మన లాంటి పేదవారికి చదువుకునే అవకాశం ఇవ్వట్లేదురా, స్కూల్లో ఫీజులు ఎంతో దారుణంగా పెంచేశారు, నాలాంటి కటిక పేదవాడి వద్ద అంత డబ్బులేదు రా అందుకే మిమ్మల్ని బడి మాన్పించేసాను, ఇక మనకి ఏ మార్గం లేదు రా మీరు మాలా పొలం పనులు ఇంటి పనులు చేసుకోవలసిందే, మీరు చేసిన తప్పు  అల్లా మా కడుపున పుట్టడమే రా మరొక జన్మ అనేది ఉంటె ధనవంతుని కడుపునా పుట్టండిరా అని ఏడుస్తూ చెప్పుతాడు

ఇక మురళి సీతా కూడా చేసేదేమి లేక దిగులుగా ఉంటారు

ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు మురళి సీతా దగ్గరికి వచ్చి

మురళి :- సీతా సీతా మనం చదువుకోవడానికి డబ్బులు ఒక్కటే అడ్డు అని చెబుతున్నారు కదా అమ్మ నాన్న, నాకొక ఆలోచన వచ్చింది మనం  లోకి వెళ్తేనే కదా డబ్బులు కట్టాలి ఒకవేళ మనం స్కూల్ లోకి వెళ్లకుండా చదువుకుంటే ఎటువంటి సమస్య ఉండదు కదా, మనం స్కూల్ గోడల దగ్గర నించొని క్లాస్ విందాం వచ్చిన తరువాత మనం ఫ్రెండ్స్ అయిన రాజేష్ మరియు అనూష దగ్గర నోట్స్ తీసుకొని చదువుకోవచ్చు అని చెబుతాడు

మురళి ఆలోచన సీతకి కూడా ఎంతగానో నచ్చుతుంది ఇద్దరు కలిసి అనుకున్నట్టు గానే స్కూల్ గోడల దగ్గర క్లాసులు వింటూ ఉంటారు. సాయంత్రంమ్ రాజేష్, అనూష బయటకు రాగానే మురళి  వాళ్ళ దగ్గరికి వెళ్లి

మురళి :- రాజేష్, మేము స్కూల్లోకి రావాలంటే చాలా డబ్బులు కట్టాలంటే రా, మా నాన్న దగ్గర అంత డబ్బులు లేవు అందుకే మేము ఈ గోడల దగ్గర నుంచొని పాఠాలు వింటున్నాము, నువ్వు నోట్స్ ఇస్తే చదువుకుంటాము మల్లి నీకు తిరిగి రేపు ఉదయానికల్లా ఇచ్చేస్తాము అని చెప్తాడు

రాజేష్ :- ఏంటి ఈ గోడ చాటుకు ఉండి పాఠాలు వింటున్నారా? అయినా డబ్బులు లేని మీకు చదువులు ఎందుకురా? పోయి గేదెలను మేపుతూ బ్రతుకు పొండి అని వాళ్ళను అవమానిస్తాడు

ఆ మాటలకి సీత మురళి ఎంతో బాధపడతారు వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలకు జరిగిన విషయం చెప్తారు

రవళి :- మీకు నాన్న చెప్తూనే ఉన్నాడు, డబ్బులతో ముడి పది ఉన్న విషయాలు మనకి కుదరవని, అయినా డబ్బున్న వాళ్ళకి మనలాంటి వాళ్లంటే ఎప్పుడూ లోకువేరా, మన లాంటి పేద వాళ్ళని ఎప్పుడు కుదిరితే అప్పుడు అవమానించాలనే చూస్తూ ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్లి అవమాన పాడడం కంటే మనకి వచ్చిన పని కూలో నాలో చేసుకుంటూ బ్రతకడం నయం, అయినా ఏముంది రా చదువులో మీ నాన్నా నేను బ్రతడం లేదా చదువులేకుండా అని అడుగితుంది

మురళి :- అమ్మ మా చదువులకి కావలసిన డబ్బులు లేకపోవడం వల్లనే కదా మీరు మమ్మల్ని చదివించడం లేదు, అయితే నేను చెప్పే మాట వినండి నేను కష్టపడి డబ్బులు సంపాదిస్తాను, మన అందరం కలిసి సీతని పట్నం లో ఉన్న హాస్టల్ లో చదివించుకుందాం, తాను ఇంటికి వచ్చినప్పుడు నాకు కూడా నేర్పిస్తూ ఉంటుంది, ఇలా మా ఇద్దరికీ చదువుకోవాలన్న కోరిక తీరుతుంది, అని చెప్పి సీత వైపు తిరిగి

మురళి :- చూడు సీత నీ కోసం నేను ఎంతైనా కష్టపడుతాను కానీ నుంవ్వు నాకోసం ఒక మాట ఇవ్వాలి, నువ్వు బాగా చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉంది ఊరిలో మనకి అవమానం చేసిన అందరికి సరైన బుధ్హ్హ్య్ చెప్పాలి అని అంటాడు

సరే అని చెప్పి సీత హాస్టల్ కి వెళ్తుంది

మురళి, రవి మరియు రవళి రాత్రి పగలు తేడా లేకుండా శాయశక్తులా కష్టపడి డబ్బులు సంపాదించి సీతకి పంపిస్తూ ఉంటారు సీత చాలా గొప్పగా చదువుకొని ఒక పెద్ద కంపెనీలో గొప్ప జీతాన్ని పని చేస్త్వ్ ఉంటుంది బాగా డబ్బులు సంపాదించినా తరువాత సీత ఊరిలో ఒక పెద్ద స్కూల్ కట్టించి అందరు పిల్లలకి ఉచితంగా చదువు చెబుతూ ఉంటుంది. అది చూసిన ఊరి ప్రజలందఋ ఎంతో సంతోషపడతారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *