పొగరుబోతు కోడలు | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

ఆమె పేరు శిరీష . డబ్బు అందం ఉన్నదన్న ఒకరు చాలా ఉంది అందుకే వాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. శిరీష అత్త పేరు శారద చాలా మంచిది. శిరీష ఏం అన్న కూడా ఆమె పట్టించుకునేది కాదు. అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు శారద పొలం పని చేసుకుని చాలా హడావిడిగా ఆకలితో ఇంటికి వస్తుంది. ఆమె కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని భోజనం ముందు కూర్చుని తింటే ఉంటుంది అప్పుడే శిరీష అక్కడకు వచ్చి
ప్లేట్ నీ దూరంగా విసిరి కొడుతుంది.
అత్త చాలా కోపంగా…. శిరీష నీకు రోజురోజుకీ గర్వం ఎక్కువ అయిపోతుంది . ఎందుకు ఇలా చేస్తున్నావ్ పిడికెడు అన్నం లేక ఎంతమంది అల్లాడుతున్నారు అన్నంత నేలపాలు చేశావు అంటూ ఆ భోజనం ఈ ప్లేట్ లో పెట్టుకుంటే ఉంటుంది ఆమె…. నీకు ఎన్ని సార్లు చెప్పాను నేను తిన్న ప్లేట్లు తినకూడదు అని . అది నాకు సొంతం . చూడండి నా వస్తువులు నాకంటూ వేరు గా పెట్టుకున్నాను నా వస్తువులు మీరు ముట్టుకోవడానికి అస్సలు లేదు పైగా ఈ భోజనం నా కోసం తయారు చేసుకున్నాను. మీకు కావాలంటే మళ్ళీ వండుకోండి.
అత్త…. శిరీష నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ ఈ ఒక్క రోజుకి తింటాను . అని అంటుంది అందుకు ఆమె ఏ మాత్రం అస్సలు ఒప్పుకోదు…. ఒక్కసారి చెబితే సిగ్గుండాలి మీకు అర్థం కావడం లేదా నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోండి అంటూ చేతిలో ఉన్న ప్లేట్లు లాక్కొని వెళ్తుంది.
అత్త చాలా బాధపడుతూ స్వయంగా వంట చేసుకుంటుంది.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం భర్త ఊరు నుంచి తిరిగి వస్తాడు.
భార్య అతనితో…. మనం ఎప్పుడూ ఇల్లు మారుతున్నాం. నాకసలు ఇక్కడ ఉండాలని లేదు .
భర్త కిరణ్…. ఎందుకు శిరీష అలా మాట్లాడుతున్నావ్.
శిరీష చాలా కోపంగా….. నాకు ఇక్కడ ఉండాలని లేదని చెప్తున్నాను కదా ఇక్కడ ఈ మనుషులు అంతా వింతగా ఉంది.
అని అంటుంది అందుకు అతను ఏం మాట్లాడకుండా. లోపలికి వెళ్ళాడు శిరీష… చాలా కోపంగా ఏం మాట్లాడకుండా లోపలికి ఎందుకు వెళ్తున్నారు.
అంటూ కోపగించు కుంటుంది .
అతను ఆమె అరుపులు వినలేక మళ్లీ పెట్టు తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు శిరీష చాలా కోపంగా తన మనసులో…. ఒరేయ్ నా మొగుడా నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఇక్కడి నుంచి తీసుకెళ్లక పోతే మాత్రం. ఏం జరుగుతుందో చూడు నీ అమ్మ నా హింస భరించలేక ఎక్కడి నుంచి ఆమె వెళ్ళి పోవడం లేదా మమ్మల్ని వేరే కాపురం పెట్టుకో అనడమో చేస్తుంది.
అని అనుకుంటుంది ఆరోజు గడిచిపోతున్నా మరుసటి రోజు ఉదయం అత్త అలసిపోయి కూర్చుంటుంది. కోడలు శిరీష అక్కడికి వచ్చి ఆమె మీద కాలు పెట్టి….. నా కాళ్ళకి గోల్ రంగు వేయండి అత్తయ్య . అని అంటుంది అందుకు అత్త సరే అమ్మా అని చెప్పి గోళ్లరంగు వేస్తుంది . ఆమె కాలితో
అత్తగారి నీ కొట్టి….. చి చి గోల్ అన్ని పాడు చేశావు కాళ్ళు అందంగా ఉంటే . ఎంత బాగుంటుంది దాన్ని కాస్త చెడగొట్టారు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది.
అత్త గారు చాలా బాధపడుతూ…. చిన్న పెద్ద లేకుండా ఇలా ప్రవర్తించటం అస్సలు బాలేదు. నేను చెప్పినా అర్థం. కావడం లేదు భగవంతుడా ఈ అమ్మాయికి పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్పించు. అని అనుకొని బాధపడుతుంది అత్తగారు.
ఆ రోజు నుంచి కోడలు అత్త గారికి ఏదోరకంగా హింస పెడుతూనే ఉంటుంది.
కానీ అత్తగారు మాత్రం ఏమి మాట్లాడద్దు ఒకరోజు శిరీష ఎక్కడకు వెళ్లాలని రెడీ అవుతూ….. ఎలా ఉన్నాను అత్తయ్య చాలా బాగున్నారు కదా ఇంత అందమైన డబ్బున్న అమ్మాయిని మీ ఇంటి కోడలు అయినందుకు.
మీరు ఎంతో గర్వ పడాలి. కానీ ఇక్కడ మోకాలు ఉన్నాయి . అందరివి జిడ్డు మోకాలు. ఈ ఏరియాలో ఒక్కరికి కూడా డబ్బు లేదు. వాళ్ళు వేసే బట్టలు వాళ్ళు పద్ధతులు ఇచ్చి చిరాగ్గా ఉంటుంది.
అన్నట్టు వాళ్ళని కాదు ముందు మిమ్మల్ని అనాలి మీరు కూడా అలాగే ఉంటారు కదా.
అత్తగారు…. దేవుడిచ్చిన రూపాన్ని నేను మార్చలేము కదా అమ్మ శిరీష . ఈ జన్మకి ఇలాగే ఉంటుంది. నేనేం చేయలేను అని బాధతో అక్కడి నుంచి వెళ్తుంది.
శిరీష ఆమె వెళ్తూ ఉండగా….. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు . అన్ని సక్రమంగా అమలు చేయాలి అంటే పూర్వ జన్మలో ఏ పాపం చెయ్యకుండా ఉండాలి . ఏం పాపం చేసావు ఏమో ఇలా వికారంగా పుట్టావు. అని పెద్దగా నవ్వుకుంటూ అవమానపరుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది.
అత్త గారు చాలా బాధపడుతూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు ఇంతలో అత్త గారికి ఫోన్ వస్తుంది. ఆమె చాలా కంగారు పడుతూ…. ఏ హాస్పిటల్ ఇప్పుడే వస్తున్నా రండి అంటూ హాస్పిటల్ కి వెళ్తుంది.
అక్కడ డాక్టర్ తో…. మేడం మీరు నాకు కాల్ చేశారు . నా కొడకా యాక్సిడెంట్ అన్నారు ఎలా ఉంది . ఏం జరిగింది అంటూ కంగారుపడుతూ అడుగుతుంది.
డాక్టర్…. మొఖానికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తుందేమో. చాలా డబ్బు ఖర్చు అవుతుంది.
అత్త….. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు నా కోడలు మంచిగా తిరిగి వస్తే అంతే చాలు అన్ని డబ్బులు ఏర్పాటు చేస్తుంది. ఇక తన కొడుకు కి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది కిరణ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. ఆ తల్లీ కొడుకులిద్దరూ కంగారు పడుతూ ఉంటారు ఇక ఆపరేషన్ పూర్తి అవుతుంది కొన్ని రోజులకి ఆమె ఇంటికి తిరిగి వస్తుంది.
కోడలు అద్దం ముందు తన వికారమైన ముఖాన్ని చూసుకొని….. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను అంటూ తన అందాన్ని గుర్తుతెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది.
అత్తగారు ఆమెను చూసి…. అమ్మ శిరీష ఏంటమ్మా అలా కూర్చున్నావ్. ఏంటి ఇలాంటి బట్టలు వేసుకున్నావు . నువ్వు మంచి బట్టలు వేసుకుంటావ్వు కదా. అందుకు శిరీష ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పోతుంది రోజులు గడిచాయి శిరీష బయటకు వెళ్ళినప్పుడు మనుషులు ఆమెను చూసి…. అందం డబ్బు ఉందని పొగరు ఉంది దీనికి ఇప్పుడు అందం పొయింది గా చూడు ఎలా ఉందో . దాని ముఖం చూస్తేనే వాంతి వచ్చే లాగా ఉంది. అని ఆమెను అవమాన పరుస్తూ ఉంటారు శిరీషా దాన్ని విని చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి ఏడుస్తూ ….. ఎందుకు నన్ను బ్రతికించవ్వు దేవుడా
నన్ను చంపేయి ఈ అవమానాన్ని భరించలేక పోతున్నాను.
అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అత్త అక్కడకు వచ్చి….. శిరీష ఎందుకమ్మా బాధ పడుతున్నావు. అంటూ ధైర్యం చెబుతూ నాతో మాట్లాడుతుంది.
రోజులు గడిచాయి శిరీష తన ప్రవర్తన మార్చుకొని అత్తగారితో చాలా ప్రేమగా మాట్లాడితే ఉంటుంది ఒకరోజు ఆమె పని చేస్తూ ఉండగా…. అత్తయ్య నన్ను క్షమించండి అంటూ ఆమె కాళ్ల మీద పడుతుంది.
అత్తగారు… ఏమైందమ్మా ఏంటి.
ఇదంతా శిరీష…. అత్తయ్య మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అందం డబ్బు ఉందని పొగరు ఇప్పుడు నాకు లేదు ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది అందం లేదు. కానీ అందం అశాశ్వతం అని తెలుసుకున్నాను.
అత్తయ్…. అయ్యో శిరీష ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావ్ చెప్పు.
శిరీష…. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి అత్తయ్య. ఇన్ని రోజులు నా స్నేహితులు బయట వాళ్ళందరూ నా డబ్బు, అందం చూసి నన్ను ఇష్టపడి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకు అందం లేదు నన్ను చాలా అసహ్యించుకుంటున్నారు కానీ మీరు మాత్రం నన్ను అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు. మీ మనసును ఇప్పటికీ అర్థం చేసుకున్నాను అంటూ ఏడుస్తుంది.
అత్తగారు… చూడమ్మా శిరీష నాకు ఎప్పుడు నువ్వు కోడలి కాదు కూతురివి. తల్లికి వాళ్ల బిడ్డల ప్రపంచంలో అందమైన వాళ్ళ కనబడతారు. అప్పుడు ఎప్పుడు ఎప్పటికి నువ్వు నాకు అందంగానే ఉంటావు . అయినా అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. అంత సౌందర్యం అని చెప్తుంది.
శిరీష…. అవును అత్తయ్య అందం మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు అంటూ ఏడుస్తూ క్షమాపణ కోరుకుంటుంది ఆ రోజు నుంచి. కోడలు అత్త తో ఎంతో ప్రేమగా ఉంటుంది దాన్ని చూసి ఎంతో సంతోషపడుతుంది వాళ్ళ కుటుంబంలో మళ్లీ కొత్త ప్రేమలు చిగురిస్తాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *