ప్రమాదంలో ఊరు | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

కృష్ణాపురం ఊరి చివర ఒక ఉండేది ప్రజలంతా ఆ నది మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు. అక్కడే మధు అనే ఒక బాలుడు ఉండేవాడు. వాళ్ళ అక్క పేరు లలిత.
లలిత పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి. బాలు చిన్నపిల్లోడు కావడంతో అతని చాలా బాగా చూసుకుంటూ ఉండేది. వాళ్ళిద్దరు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నప్పటి నుంచి అతని బాగోగులు మొత్తం లలిత చూసుకుంటూ వుండేది. ఒక రోజు లలిత ఇంటికి వాళ్ళ బావా శ్యాం వస్తాడు.
అతను లలిత తో…. లలిత బాగున్నావా మీ తమ్ముడు ఎక్కడ. లలిత… చేపల వేట కి వెళ్ళాడు అని సమాధానం చెబుతుంది.
అతను…. ఏంటి లలితను మాట్లాడుతుంది చదువుకోవాల్సిన వయస్సులో చేపలవేట పంపించడం ఏంటి.
లలిత…. వాడు నా మాటలు వినడం లేదు బావ అయినా చదివించడానికి నా దగ్గర డబ్బు ఉండాలి కదా వాడు పట్టుకొచ్చిన చేపలు అమ్మి. ఆ వచ్చిన డబ్బుతో కుటుంబం గడుస్తూ ఉంది. అందుకు నేను కూడా ఏం మాట్లాడకుండా ఉన్నాను . మరి ఏం చేయాలి బావ. అంతకంటే మాకు మరొక మార్గం అంటూ ఏమీ కనపడలేదు. అతను…. సరే అయితే నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను.
లలిత….. చెప్పు బావ ఏమిటో.
అతను…. మా అమ్మ చనిపోయిన దగ్గర్నుంచి మా నాన్న మనిషి మనిషి గా లేడు. ఇంట్లో దీపం పెట్టి ఆడ దిక్కు లేనందుకు అతను చాలా బాధపడుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని మా ఇంట్లో దీపం పెట్టాలి మా నాన్న తల్లి లాగా చూసుకోవాలి. మా అమ్మ చనిపోయిన దగ్గర్నుంచి ఆరోగ్యం బాగోక మంచాన పడ్డాడు. మా నాన్న.
అంటూ బాధగా విషయాన్ని చెప్పాడు ఆ మాటలు విన్న ఆమె …. అయ్యో బావ ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు కనీసం అతని చివరి చూపు కూడా చూసుకోడానికి అవకాశం లేకుండా చేశారు మేము ఇంకా బ్రతికే ఉన్నాము . నా తల్లిదండ్రులు చనిపోయారు కానీ. నా తమ్ముడు నేను ఇంకా మిగిలి ఉన్నాము. అంటుంది అందుకు అతను…. అయ్యో లలిత అసలు ఎవరికీ చెప్పకు ఎవరికీ చెప్పలేదు కూడా తెలియదు . అమ్మ చనిపోయింది అన్న బాధ లోనే ఉన్నాము.
అంటూ చాలా బాధపడతాడు.
అనిత పెళ్లికి ఒప్పుకుంటుంది.
అతను చాల సంతోషపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు . కొంచెం సమయం తర్వాత వాళ్ళ తమ్ముడు చేపలు తీసుకొని ఇంటికి వస్తాడు. ఆమె వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తుంది ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తమ్ముడితో వాళ్ళ బావ వచ్చిన సంగతి జరిగిన విషయం అంతా చెప్పింది.
అతను కూడా చాలా బాధ పడతాడు . కానీ అక్క కి ఒక మంచి తోడు దొరుకుతుంది అని చాలా సంతోష పడ్డాడు. కొన్ని రోజులు గడిచాయి. శ్యామ్ కి లలితకు పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత వాళ్లు బాలుని తీసుకొని. పడవలో నది అవతల ఒడ్డున కి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఇంట్లో నలుగురు చాలా సంతోషంగా ఉంటారు.
అలా ఉండగా ఒక రోజు బాలు….. బావ ఇంక నేను ఊరికి వెళ్ళాను అక్కడ చేపలు పట్టుకుని అక్కడే ఉంటాను.
ఆ మాటలు అతను చాలా కోపంగా…. ఏరా చేపల పట్టుకుంటారా ఈరోజు నుంచి నువ్వు బడికి వెళ్లాలి. లేదంటే నీ కాళ్లు చేతులు విరగ కొడతా జాగ్రత్త. అని అంటాడు అందుకు అతను ఏం మాట్లాడతావ్ ఆ తర్వాత రోజు నుంచి అతన్ని బడికి పంపిస్తారు అతను చాలా సంతోషం బడికి వెళ్లి బాగా చదువుకుంటూ ఉంటాడు.
అలా ఉండగా ఒక రోజున లలిత భర్త తో… ఏమండీ ఒకసారి మా పుట్టింటికి వెళ్లారు అని ఉంది ఆ వాతావరణం మా ఇల్లు అవన్నీ చూడాలని అనిపిస్తుంది.
అతను …. సరే అయితే మీ తమ్ముని తీసుకొని వెళ్ళు అని అంటాడు.
ఆమె చాలా సంతోష పడుతూ ఆ తర్వాతి రోజు వాళ్ళ తమ్ముని తీసుకొని ఇంటికి వెళ్తుంది . అక్కడ ఆమె అన్నిటినీ చూస్తూ…. చాలా రోజులు అయిపోయింది మీ ఊరు మన ఇల్లు ని చూసి. అని తమ్ముడు తో మాట్లాడుతూ ఉండగా ఆమెకు వాంతులు మొదలవుతాయి. బాలు చాలా కంగారు పడుతూ ఉంటాడు. బాలు వెళ్లి వైద్యురాలు తీసుకొస్తాను అని అంటాడు ఆమె వద్దు అని సమాధానం చెబుతుంది కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. బాలు డాక్టర్ ని తీసుకొని వస్తాడు. ఆమె లలితను పరీక్షించి గర్భవతి అని చెప్తుంది. ఆ మాటలకి బాలు లలిత ఇద్దరు సంతోష పడతారు.
ఆ విషయం వాళ్ళ బావ కి చెప్పాలని అనుకుంటారు. అయితే ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకుంటాయి. చల్లగాలి మొదలవుతుంది వాతావరణం ఒక్కసారిగా చల్లబడి డంతో అందరూ చాలా ఆశ్చర్య పోతూ ఉంటారు. జోరున వర్షం మొదలవుతుంది. లలిత…. అయ్యో ఉన్నట్టుండి వర్షం ఎలా మొదలైంది.
అనుకుంటూ ఉంటారు ఇంతలో వర్షం మరింత పెద్దదవుతుంది. అక్కడే ఉన్న డాక్టర్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది వర్షం బాగా పెరిగిపోయి గాలివాన తీవ్రంగా వస్తుంది. ఆ కారణంగానే నది పొంగుతుంది.
నది పొంగి నీళ్లు ఊర్లోకి వచ్చేస్తాయి. ఇక ఊరిలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. అందరూ పెద్ద పెద్దగా ఏడుస్తూ
ఉంటారు. అ నీళ్లు లలిత ఇంట్లోకి కూడా వచ్చేస్తాయి. వాళ్లంతా చాలా భయపడుతూ ఉంటారు. ఆ నీటిలో వస్తువులు మనుషులందరూ కొట్టుకు పోతూ ఉంటారు.
దాన్ని చూసి లలిత చాలా భయపడుతూ ఉంటుంది.
నీలో చాలా లోతు వచ్చేస్తాయి. ఇంట్లో ఉన్న డాక్టర్ అమ్మ లలిత ఇద్దరూ కొట్టుకుపోతారు.
వాళ్ళిద్దరు కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ ఉంటారు . అప్పుడు బాలు ఈదుకుంటూ వాళ్ల ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే అటుగా ఓ పడవ కొట్టుకు రావడం గమనిస్తాడు. వెంటనే తన పడవలో ఎక్కి కూర్చుంటాడు అతను చాలా వేగంగా వాళ్ళిద్దర్నీ ఆ పడవలో ఎక్కించుకున్నాడు .
వాళ్లు…. వర్షం చాలా పెద్దగా పడుతుంది నీళ్లు పడవ లోకి వచ్చేస్తాయి. పడవ మునిగి పోతుంది అంటూ భయపడుతూ ఉంటారు .
ఇంతలో వర్షం తగ్గుముఖం పడుతుంది.
నీళ్లన్నీ బాగా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి.
అప్పటికే నీటిలో చాలామంది కొట్టుకుపోతారు. వాళ్లు కూడా ఆ పడవలో వాళ్ళ కొట్టుకుపోతుంటరు. రెండు గంటల తర్వాత వీళ్ళంతా ఛాల నీళ్లు పోతాయి.
అప్పుడు ఉన్న కొంతమంది ప్రజలంతా ఆ నీటిలో వాళ్ల దగ్గర ఉన్న చిన్న చితక సామాన్లు తీసుకొని నీటిలో నడుచుకుంటూ పక్క గ్రామానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆ పడవలో వాళ్ళ ముగ్గురు పక్క గ్రామానికి వెళ్ళిపోతారు. అక్కడ ఒక్క చుక్క కూడా వర్షం ఉండదు. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు డాక్టర్ వాళ్ళతో….. ఇదెక్కడి విడ్డూరం నేను ఎక్కడా చూడలేదు. ఉన్నట్టుండి వర్షం ఒక్కసారిగా రావడం ఏంటి. ఊరు మొత్తం మునగడం ఏంటి ఏమీ అర్థం కావడం లేదు.
లలిత. ….. అది నాకు అర్థం కావడం లేదు. అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత బాలు…. సరే జరిగింది ఎంత మా బావకి చెప్పాలి. అలాగే మా అక్క శుభవార్త గురించి కూడా చెప్పాలి .
వెళ్దాం రండి డాక్టర్ అని ఆమెతో అక్క త్తో
కూడా చెప్తాడు ఇక ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడ అ డాక్టర్ వాళ్ళ బావతో జరిగిన విషయం అంతా చెప్తుంది అతను చాలా ఆశ్చర్య పోతాడు.
…… డాక్టర్ నాకు అంత ఆశ్చర్యంగా ఉంది కొంత సమయం లోనే వర్షం రావడం ఏంటి ఊరు మొత్తం మునిగిపోవడం ఏంటి చాలా అయోమయంగా ఉంది. కానీ నీ నా కుటుంబానికి ఏం కా నందుకు సంతోషంగా ఉంది కానీ పాపం ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోయాయి అంటూ బాధపడతాడు.
డాక్టర్…. అవును చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాం అది సరే కానీ. మీ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నాడు కదా అతని సంగతి పూర్తిగా మర్చిపోయావా. అని అంటుంది అందుకు అతను ఆశ్చర్య….. ఏంటి మేడం మీరు అంటుంది నాకు ఏమి అర్థం కావడం లేదు మా ఇంటికి మరో వ్యక్తి ఎవరు వస్తున్నారు. డాక్టర్…. ఇంకా ఎవరో ఒక పాప బాబు వస్తారు అని అంటుంది. ఆ మాటలకు అతను చాలా సంతోష పడతాడు.
అప్పుడే ఇంట్లో ఉన్న లలిత మామయ్య వస్తారు. వాళ్ళ మాటలు విని చాలా సంతోష పడుతూ….. అయితే నాతో ఆడుకోడానికి మనవరాలో మనవడో వస్తుందన్నరానామాట .
అంటూ చాలా సంతోష పడతాడు అతను కూడా.
కొన్నిరోజులు గడుస్తాయి. డాక్టర్ అక్కడే ఉండి ఆమెకు తోడుగా ఉంటుంది. కొన్ని నెలలు గడుస్తాయి ఆ తర్వాత లలిత పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డను చూసి వాళ్ళంతా చాలా సంతోష పడుతూ ఉంటారు.
దగ్గరుండి డాక్టర్ లలిత నువ్వు చూసుకో నందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
అప్పుడు భర్త మామయ్య అక్కడికి వచ్చి….. డాక్టర్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
అన్నట్టు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ ఊరికి ఒక్కసారి నీ వర్షం వరదలు రావడానికి కారణం ఎవరు ఒక ఆమె విచిత్రమైన పూజలు చేసి ఊరినీ నాశనం చేయడానికి ప్రయత్నించింది అట .
ఆమె చేసిన పూజ సామాగ్రి అంతా ఇంకా ఏవేవో తీసుకెళ్లి ఊర్లో ఉన్న నది పక్కన చెరువులో వేసిందట. అప్పుడు అక్కడి వాళ్ళు ఎవరో దాన్ని గమనించారు కానీ ఆమెను నిలదీయగా ఆమె పెద్ద పెద్దగా నవ్వడం మొదలు పెట్టిందట. ఇంకా అప్పుడే ఉన్నట్టుండి వర్షం మొదలైంది వరదలు వచ్చేసాయి ఆ ఊరు మొత్తం కొట్టుకుపోయింది. అని చెప్తాడు ఆ మాటలు విన్న లలిత… అది ఎవరో అయి ఉండరు నాకు తెలిసి వీరమ్మ అయ్యుంటుంది.
డాక్టర్….. అవును వీరమా అయి ఉంటుంది .
ఎందుకంటే వాళ్ళ కొడుకు పూజలు చేస్తున్నాడు అని చెప్పి మన ఊరి వాళ్ళు అతన్ని నిజం చెప్పమని కొట్టారు అతనికి దెబ్బ గట్టిగా తగిలింది చనిపోయాడు .
వీరమ్మ అప్పుడు ఏడుస్తూ శబధం చేసింది….
నా కొడుకు చేస్తుంది శుద్ధ పూజలు కాదు ఊరికి పట్టిన దరిద్రం పోవడానికి దాన్ని మీరు అర్థం చేసుకోకుండా మరోలా గా తప్పుగా భావించి. అన్యాయంగా నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు. నేను ఎవ్వరినీ వదలను ఊరు మొత్తం ఏ నాశనం చేస్తాను
అని పగబట్టింది అందుకే ఇదంతా చేసింది.
ఆ మాటలు విన్న వాళ్లు చాలా ఆశ్చర్యపోతారు..
వాళ్ల మామయ్య… ఏదేమైనా మీ ఊరి వాళ్ళు ఒక్క నిమిషము ఆలోచించాల్సిందే. నిజ నిజాలు తెలుసుకోవాల్సింది . తొందరపడి నందుకు ఆమె ఎంత పని చేసిందో. ఏ విషయంలో అయినా తొందరపాటు పనికిరాదు. అని వాళ్లంతా మాట్లాడుకుంటారు అప్పుడు బాలు…. ఇంక చాలు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం అందరం సంతోషంగా ఉన్నాము కదా.
అలాంటప్పుడు జరిగిపోయి దుఃఖంలో ఉన్న సంగతులు గుర్తు తెచ్చుకోవడం బాగాలేదు ఆపేయండి. అసలు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం పట్టించుకోవడం లేదు అని అంటాడు .
అందుకు వాళ్లు పెద్దగా నవ్వుతరు.
ఇంక రోజులు గడిచాయి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వాళ్లు కూడా జరిగిందంతా మర్చిపోయి ఆ పిల్ల వాడితో సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *