బంగారం ఇచ్చే మాయా ఆవు | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

వాయిస్ : అదొక మారుమూల గ్రామం. పేరు అడవిమల్లి. రాత్రి సమయం.. ఎన్నడూ

            లేని విధంగా ఆ రోజు జోరుగా వర్షం పడుతుంది. ఉరుములు..మెరుపులు.

            అప్పుడప్పుడు అక్కడెక్కడో దూరంగా పిడుగు పడుతున్న శబ్దాలు కూడా

            వస్తున్నాయి.

           తమకున్న చిన్నపాటి ఇంట్లో తలదాచుకున్నారు కీర్తి, బాలు అనే పేద పిల్లలు.

           ఉరుములకు. మెరుపులకు, పిడుగు పడుతున్న శబ్దాలకు ఇద్దరు

           భయపడుతున్నారు.

బాలు : అక్క..నాకు చాలా భయంగా ఉంది. పక్కింటి సూరమ్మ ఇంటికి వెళ్ధామా?

   కీర్తి : అయ్యో తమ్ముడు..సూరమ్మ వాళ్ళు లేరురా! చీకటి పడుతున్నప్పుడు

         వచ్చిన చివరి బస్సుకు ఏదో ఊరు వెళ్లింది.

బాలు : అవును కాదు.. అప్పుడు మనం బయట వాకిట్లో కూర్చిని, మనకు ఎదురుగా

         మైదానంలో ఆడుకుంటున్న పిల్లలను చూస్తున్నాం కదాక్క!

  కీర్తి : అవును తమ్ముడు. నేనున్నాను కదా! నీకేమి భయం లేదు. అమ్మలా అన్నం

        పెడుతా! నాన్నలా దైర్యం చెబుతా! అక్కలా నిన్ను నిత్యం కనిపెట్టుకుని

        ఉంటాను తమ్ముడు.

బాలు : నేనెంతో పుణ్యం చేసుకుంటే నువ్వు నాకు అక్కగా పుట్టావు. ఇప్పుడు కాదు..

         ఎప్పుడు నాకు అమ్మానాన్న గుర్తుకు రాలేదక్క! అందుకు కారణం..నువ్వే

        అక్క! నువ్వు పంచుతున్న ప్రేమ. చూపిస్తున్న ఆదరణ. నడిపిస్తున్న దైర్యం.  

వాయిస్ : అని వర్షానికి వస్తున్న శబ్దాలకు భయపడకుండా, ఆ అక్కాతమ్ముడు

          ఒకరంటే ఒకరీకి ఉన్న ప్రేమను మాటల్లో చెప్పుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే

          ఒక ఆవు తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వచ్చింది. ఆ అవును చూసి

          కంగారూ పడ్డారు. ఇంట్లోకి వచ్చిన ఆవు, తనని చూసి భయపడుతున్న పేద

          పిల్లలైన కీర్తి, బాలు దగ్గరికి వచ్చింది. బాధగా, బతిమాలుతూ…కనీళ్లు  

          కారుస్తూ…

ఆవు : నన్ను చూసి భయపడకండి.. నేను మిమ్ముల్ని ఏమి చేయను. ముందుగా

         నన్ను కాపాడండి. వెళ్ళి ఆ తలుపు వేయండి. మీకు దండం పెడతాను. నేను

        ఇక్కడ దాక్కున్న విషయం వాళ్ళకు చెప్పకండి. ముందుగా వెళ్ళి ఆ తలుపు

        వేయండి.

వాయిస్ : మరొక మాట ఆలోచన చేయకుండా.. కీర్తి, బాలు నిలబడిన చోటు నుంచి

           గుమ్మం వరకు వచ్చి తలుపు వేసుకుంటారు. తిరిగి ఆవు దగ్గరికి వస్తారు. ఆ

           పేద పిల్లల ఇంటి బయట రుద్రయ్య అనే రైతు, చేతిలో కర్ర పట్టుకుని, బయట

           దిక్కులు చూస్తూ, అతని మనుష్యులను ఉద్దేశించి..

రుద్రయ్య : అది ఇక్కడికి వచ్చి మాయమయింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఇళ్ళల్లో

             ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కుని ఉంటుంది. వెళ్ళండి..ఒక్కొక్కడు ఒక్కొక్క

            ఇంటికి వెళ్ళి..వాళ్ళను అడగండి..ఎక్కడ ఆవు కనిపిస్తే అక్కడే చంపండి…ఆ

            ఆవు కడుపులో ఉన్న బంగారు మొత్తం బయటికి తీయండి. మొత్తం

            తీసుకొచ్చి నాకివ్వండి. నేను వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తాను.

వాయిస్ : ఇంట్లో ఉండి రుద్రయ్య మాటలు వింటున్న కీర్తి, బాలు…తమకు ఎదురుగా

            ఆవును చూస్తూ ఇలా అనుకుంటారు.

   కీర్తి : బాలు…బయట ఉన్నవాడు ఈ ఆవును కొస్తే బంగారం ఉంటుందని

         అంటున్నాడు. పైగా లక్ష రూపాయలు ఇస్తాని కూడా అంటున్నాడు. ఈ ఆవు

         మాయా బంగారు ఆవా?

బాలు : కాదక్క.. అయిన మాయా బంగారు ఆవంటే..ఎప్పుడు బంగారంతో ఉండాలి.

         మరి ఈ ఆవును చూశావా…మామూలు ఆవులా ఉంది. నాకు తెలిసి ఈ ఆవు

        మాయా బంగారు ఆవు కాదు.

   కీర్తి : బయట ఉన్న అతను..బంగారం అంటున్నాడు..

బాలు : నాకు తెలిసి…ఈ ఆవు ఆ ఇంట్లో బంగారం మింగసి ఉంటుంది. వాళ్ళకు దొరికితే

         చంపేస్తారని ఇలా తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. పైగా ఈ వర్షం కూడా

        ఆవుకు రక్షణగా నిలిచింది.

   కీర్తి : ఎలా తమ్ముడు ?

బాలు : అయ్యో అక్క…ఎలా ఏమిటి? నీకు ఇంకా అర్థం కాలేదా! వర్షంలో అయితే

         ఎక్కువ సెవు వెతకరు కదా! వాళ్ళు అన్నట్టుగా ఇంటికి వెళ్ళి అడిగితే…ఆవు

         విషయం పక్కన పెడితే..ఈ వర్షంలో ఇంటికి వచ్చి అడిగితే ఎవరైనా

         ఉరుకుంటారా.. కొట్టిన కొడతారు. తిట్టిన తిడతారు కూడా! అప్పుడు వాళ్ళు

        ఎక్కడో ఒక చోట వెతకడం ఆపేస్తారు. అప్పుడు ఆ ఆవు తప్పించుకుని

        పోతుంది.

వాయిస్ : కీర్తి, బాలు మాట్లాడుకుంటున్న మాటలు వింటున్న ఆవు, ఏమి

            మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఇంతలో బయట ఉన్న రుద్రయ్య, తలుపు

          కొడుతూ ఉంటాడు.

రుద్రయ్య : ఎవరైనా ఉన్నారా లోపల? ఉంటే దయచేసి తలుపు తీయండి.

వాయిస్ : అది విని లోపల ఉన్న కీర్తి, బాలు కంగారూ పడతారు. ఆవుకు కూడా

            కంగారూ, భయం మొదలయింది. ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం

           లేదు. నాలుగు దిక్కుల నాలుగు గోడలు ఉన్నాయి. బాధగా ఆవు కన్నీళ్లు

            కారుస్తుంది.

రుద్రయ్య : అయ్యా..నేను పశువుల కాపరి రుద్రయ్యను. మరెవరో అనుకుని

             భయపదొడ్డు. నేను దొంగను కాదు..ఈ ఊరికి బాగా తెలిసిన వాడిని.

             కావల్సిన వాడిని. తలుపు తెరవండి.

వాయిస్ : అని అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ రుద్రయ్య దగ్గరికి పనివాడు కిట్టుగాడు             

             వస్తాడు. ఆ ఇంటిని చూసి..

కిట్టుగాడు : అయ్యా ఈ ఇల్లు ఆ పేద పిల్లలు కీర్తి, బాలుది. మీ అరుపులు విని

             బయపడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి

             నెమ్మదిఊగా అడగండి.

వాయిస్ : రుద్రయ్య ఆ ఇంటి కిటికీ దగ్గరికి, లోపల చూస్తూ…

రుద్రయ్య : కీర్తి, బాలు…భయపడకండి. మీరు నా ఆవును చూశారా… ?

      కీర్తి : ఏదో పరుగెడుతున్న శబ్దం వినిపిస్తే కిటికీ నుంచి చూశాను. తెల్లగా ఉంది.

            చెరువు వైపు వెళ్లింది.

వాయిస్ : రుద్రయ్య ఆ మాటలు నమ్మి అక్కడి నుంచి తనవాళ్ళతో అక్కడి నుంచి

           వెళ్ళిపోతాడు. తనను కాపాడినందుకు ఆవు వాళ్ళ దగ్గరికి, పూర్తిగా బంగారం

           ఆవులా మారిపోతుంది. అది చూసి షాక్ అవుతారు.

   ఆవు : నేనొక మాయా బంగారు ఆవును..ఒకప్పుడు ఆవును కాసుకుంటే బతికే

           రుద్రయ్య..నేడు ధనవంతుడు అవ్వడానికి కారణం నేనే! ముళ్ళ పొదలో

          చిక్కుకున్న నన్ను కాపాడాడు. కృతజ్ఞతగా బంగారం ఇచ్చాను. కొన్నాళ్లు

          బాగున్నాడు. అతనిలో అత్యాశ పుట్టింది. రోజు కొంచెం కొంచెం కాకుండా నన్ను

         చంపేసి ఒకేసారి నాలో ఉన్న బంగారాన్ని తీసుకుందామని నన్ను చంపడానికి!

        అందుకే తప్పించుకుని ఇలా వచ్చాను. ఇకా చెప్పడం, చెప్పకపోవడం మీ ఇష్టం.

వాయిస్ : ఆవు చెప్పింది విని బాధనిపించింది. తన గురించి చెప్పమని మాట ఇస్తారు

            కీర్తి, బాలు ఆ మాయ బంగారు ఆవుకు ! అప్పుడు ఆవు కీర్తి, బాలుకు

            కృతజ్ఞతగా..

మాయా ఆవు : మీరు నన్ను తలదాచూకొనిచ్చారు..మాట కూడా ఇచ్చారు. నేను

                  మీకు కృతజ్ఞతగా బంగారం యివ్వగలను. ఆ బంగారాన్ని అమ్ముకుని

                  సంతోషంగా దీవించండి.

వాయిస్ : అని చెప్పి మాయా బంగారు ఆవు, తన నోటి నుంచి బంగారాన్ని ఇస్తుంది.

           అది చూసి కీర్తి, బాలు సంతోష పడతారు. ఇక ఆ రోజు నుంచి ముగ్గురు కలిసే 

          ఉంటారు.   

-0-

సింగిల్ లైన్ స్టోరీ

మారుమూల పల్లెటూరిలోని ఒక చిన్న ఇంట్లో కీర్తి, బాలు అనే పేద పిల్లలు ఉంటూ, చేతనైన పని చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఒక రోజు రాత్రి కుండపోతగా వర్షం పడటం మొదలయింది. తమ ఇంట్లో భయపడుతూ తలచుకుంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి మాయా బంగారం ఇచ్చే ఆవు వస్తుంది. ఆ ఆవును పట్టుకుని ముక్కలు ముక్కలుగా కోసి ఆ ఆవులో ఉన్న బంగారాన్ని తీసుకోవాలని రుద్రయ్య అనే రైతు ప్రయత్నం చేస్తుంటాడు. అతని నుంచి కాపాడమని ఆవు కీర్తి, బాలును వేడు కుంటుంది. వాళ్ళు మాయా బంగారు ఆవును కాపాడుతారు. దాంతో ఆ ఆవు వాళ్ళతో ఉంటూ రోజు వాళ్ళకు బంగారం ఇస్తూ ఉంటుంది. దాంతో కీర్తి, బాలు సంతోషంగా జీవిస్తూ ఉంటారు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *