బంగారు ఏనుగు అంబులెన్స్ సర్వీస్ Funny Animals | Telugu Kathalu | Telugu Stories |Best animal stories

ఒక అందమైన అడవిలో చాలా రకాల జంతువులు తమ పిల్లలతో సంతోషంగా నివసిస్తుండేవి. అడవి అంత అందంగా ఉన్నప్పటికీ అందులో ఉన్న పెద్ద సమస్య ఉంది, అది ఏంటంటే అడవి గ్రామానికి చాలా దూరం ఉంది, ఎప్పుడైంనా ఏ జంతువుకైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దానిని ఆసుపత్రికి తీయసుకెళ్లాలంటే చాలా సమయం పడుతూ ఉండేది. ఇంతకు ముందు కూడా ఇలానే ఒకవిషాద కరమైన సంఘటన జరిగింది, ఒక సరి నల్ల ఏనుగు కి నెలలు నిండి ఉండడం తో ఉన్నట్టుండి నొప్పులు రావడం మొదలయ్యింది, దాంతో అడవి జంతువులు అన్ని కలిసి ఎలాగయినా తానేనని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నం చెయ్యడం మొదలు పెట్టాయి కానీ ఆసుపత్రి చాలా దూరం ఉండడం తో అవ్వి ఎంత ప్రయత్నించినా అది సాధ్య పడలేదు, నల్ల ఏనుగు దారి మధ్యలోనే ప్రసవించి తన బిడ్డకి జన్మ ని ఇచ్చి తన ప్రాణాలు కోల్పోయింది, ఆ సంఘటన చూసిన అడవి జంతువులన్నీ ఎంతో బాధపడ్డాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కానీ జంతువులకి ఏమి చెయ్యాలో మాత్రం తెలియలేదు. ఎడ్డీ అడవిలో ఉండే ఒక బంగారు ఏనుగు కి మాత్రం ఇలా ఆసుపత్రి దూరం ఉండడం వల్ల జంతువులు చనిపోవడం తనకి ఏమాత్రం నచ్చలేదు, ఎదో ఒక టి చేసి జంతువుల ప్రాణాలు పోకుండా కాపాడాలి అనుకుంది.

బంగారు ఏనుగు : నేను చూస్తుండగానే మా అడవిలో ఎన్నో జంతువుల ప్రాణాలు సమయానికి వైద్య సేవలు అందాకా పోవద్దం వల్లనే పోయాయి, నేను ఎదో ఒకటి చేసి ఈ అడవిలో ఇంకా ఏ జంతువు పాలు పోకుండా చూసుకోవాలి, దానికి నేను ఎదో ఒక ఆలోచన ఆలోచించ్చాలి అని రాత్రియంబవళ్ళు ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకేరోజు బంగారు ఏనుగు దగ్గరికి ఒక కోతి వస్తుంది,

కోతి బంగారు ఏనుగు తో ఇలా అంటుంది.

కోతి : ఏంటి మిత్రమా ఈ మద్దేల నువ్వు బయట అస్సలు కనిపించడం లేదు, ఒంట్లో బాగోలేదా అన్న్ని అడుగుత్ఉంది.

బంగారు ఏనుగు : ఒంట్లో బాగానే ఉంది మిత్రమా, కానీ నేను గత కొంత కాలంగా మన అడ్డవి లో ఎప్పటి నుంచి ఉన్న సమస్యని పరిష్కరించాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాను అని అంటుంది.

కోతి : నాకొక హెప్పు మిత్రమా నీ ఆలోచన ఏంటో? నా వల్ల ఏదైనా సాధయం అయితే నేను నీకు సహాయం చేస్తాను అని అంటుంది.

బంగారు ఎనుగ్గు : ఏమి లేదు మిత్రమా, మన అడవిలో ఏ జంతువుకైనా అత్యవరంగా ఏదైనా వైద్య సేవలు అవసరం అయితే మనకి చాలా ఇబ్బంది అవ్వుతుంది కదా, ఆ జంతువుని ఆసుపత్రికి తరలించాలంటే చాలా సమయా భావం వల్ల అప్పటికే జరగాల్సిన అనర్హం అంతా జరిగిపోతుంది. అందుకే నేను ఒక్క ఉపాయం ఆలోచించాను అని అంటుంది

కోతి : అపాయమా చెప్పు చెప్పు

బంగారు ఏనుగు : అంబులన్క్స్ సర్వీస్, మన అడవిలో ఒక వాహనం ఉంటుంది ఎప్పటికి, దాంట్లో కొన్న్ని ప్రధమ చికిత్స పరికరాలు కూడా ఉంటాయి, అవ్వి ఉండడం వల్ల కనీసం పట్టణం లో ఉన్న ఆసుపత్రికి పోయే వరకు కొంత ఊరట కలిగించవచ్చు, కానీ వచ్చిన సమస్యల్లా అంబులెన్సు లో ఎవరో ఓక్ డాక్టర్ ఉండాలి ఎప్పటికి, ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే వాళ్లకి కచ్చితమైన ప్రధమ చికిత్స చేయడానికి సిద్ధంగా ఉండాలి, అలాంటి డాక్టర్ కోసం నేను ఎంత గానో ఆలోచిస్తున్నాను కానీ ఎవ్వరు నా ఊహకి దొరకడం లేదు, డాక్టర్ ఒక్కరు దొరికితే మన పని అయిపోయినట్టే అని అంటుంది.

కోతి : మిత్రాయ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, అతని పేరు డాక్టర్ పాండా, అతనికి వైద్య రంగం లో సేవలందించడం అంటే చాలా ఇష్టం, అతనీతో నాకు మంచి పరిచయం ఉంది నేను వెళ్లి కనుక్కుంటాను అని అంటుంది.

కోతి పాండా దగ్గరికి వెళ్లి డాక్టర్ పాండా ని అంబులెన్సు తో పాటు ఉంటూ అడవి జంతువుల సాధారణ జబ్బుల కి ప్రధమ చికిత్స చేయడానికి ఒప్పుకుంటుంది.

ఒక మంచి రోజు చూసి బంగారు ఏనుగు అడవి జంతువులన్నింటి సమక్షం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది, ఆ సమావేశం లో బంగారు లేంగు మాట్లాడుతూ ఇలా అంటుంది.

బంగారు ఏనుగు : చూడండి మిత్రులారా, మన అడవిలో ఇప్పటి వరకు సమయానికి వైద్య సేవలు అందక చనిపోయిన వాళ్ళు ఇక చాలు  అడవిలో సమయానికి వైద్యం అందక ఇకపై ఎవ్వరు ఇబ్బంది పాడడం నాకు ఇష్టం లేదు అందుకే నేను, కోతి కలిసి ఒక ఉపాయం ఆలోచించాము అదే అంబులెన్సు సర్వీస్, ఈ వాహనం ఎప్పుడు మన అడవిలోనే ఉంటుంది, ఇందులో మన డాక్టర్ పాండా ఎప్పుడు ఇందులో మీకోసమే ఉంటుంది, మన కోసం డాక్టర్ పాండా వైద్య సేవలు అందించడానికి వచ్చింది, ప్రమాదం లో ఉన్న జంతువుని పట్టణానికి తీసుకెళ్లే సమయం లో ప్రాణాలకు నష్టం కలగా కుండా ఉండడాన్ని డాక్టర్ పాండా సహాయ పడుతుంది, అని చెప్తుంది. అంబులెన్సు సర్వీస్ అడవి జంతువులకి కూడా ఎంతో నచుతుంది. బంగారు ఏనుగు ఆలోచనకి జంతువులు ఎంతగానో మెచ్చుకుంటాయి. జంతువులు నెల నెలా కొంత డబ్బు చండాలుగా వేసుకొని పాండా కి జీతం గా ఇస్తూ, అంబులెన్సు నిర్విరామంగా సేవలు అందించడానికి సహాయ పడతారు. అలా అంబులెన్సు సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అడవిలో సరై సమయానికి వైద్యం అందాకా చనిపోయే జంతువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది, అన్ని జంతువులకి సారైనా వైద్యం అందడం తో అడవంతా చాలా సంతోషంగా ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *