బంగారు మాయా చెట్టు సహాయం 5 Telugu kathalu |Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa

హంసలదీవి అని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు పట్టణానికి గానీ మరో గ్రామానికి వెళ్లాలంటే నదిని దాటి వెళ్ళాలి . మరో మార్గం అంటూ ఏమీ లేదు దాటించడానికి రమణ అనే వ్యక్తి ఉండేవాడు అతను తన పడవలో ప్రజల్ని ఆ ఒడ్డు నుంచి మరో ఓడ్డు కి తీసుకెళ్లి వాళ్ళని దించి డబ్బు తీసుకుంటాడు. అతని భార్య పేరు శారద ఆమె ప్రతిరోజు తన భర్త పడవ లోనే ప్రయాణించి పక్క పట్టణానికి వెళ్ళి అక్కడ అన్నమ్మ అనే ముసలావిడ దగ్గర పని చేస్తూ ఉండేది. అన్నమ్మ చాలా ధనవంతురాలు.
కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో శారదా అక్కడ పని చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఉంటారు పిల్లలు లేరు వాళ్లకి పిల్లలంటే చాలా ఇష్టం కానీ భగవంతుడు వాళ్ళకి పిల్లల్ని ప్రసాదించలేదు అని . చాలా బాధ పడుతూ ఉంటారు. అలా వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది ఒక రోజు
శారద భర్త తో…. ఏమండీ త్వరగా పడవ తీయండి నేను అన్న మా ఇంటికి వెళ్లాలి వాళ్ళ మనవరాలు ఇంటికి వస్తుందట. ఆ పిల్లకి రకరకాల పిండివంటలు చేయమని అడిగింది అందుకే తొందరగా వెళ్ళాలి పదండి వెళదాం. అతను నిద్ర మత్తులో ఉండి…. అబ్బా ఇంత పొద్దున్నే అక్కడికి వెళ్లాలా టైం చూడు ఎంత అయిందో 4:00
శారద…. అక్కడికి వెళ్ళేటప్పటికి 4:30. నేను బట్టలు అంటూలు అవన్నీ శుభ్రం చేసేటప్పటికి. ఆరు అవుతుంది నాకు
సమయం సరిపోదు మనం వెళ్దాం పదండి. అంటూ హడావిడి చేసి అతన్ని నిద్ర లేపుతుంది . తను సరే అని చెప్పి ఆమెను పడవలో తీసుకొని ఒడ్డు చేరుస్తాడు.
ఆ తర్వాత అతను తిరిగి వెళ్ళిపోతాడు ఆమె అన్నమా ఇంటికి వెళ్లి తలుపు కడుతుంది…. అమ్మ తలకు తీస్తారా ఒకసారి .
అంటూ అన్నమ్మ తలుపు తీసి…. శారదా పొద్దున్నే వచ్చినవా చాలా మంచిది. నిన్న పొద్దున్నుంచి కరెంటు లేదు . నీళ్లు రావడం లేదు బట్టలు నువ్వు శుభ్రం చేయాలంటే నది దగ్గరకు వెళ్లి శుభ్రం చేయి ఈ ఒక్క రోజుకి.
అందుకు ఆమె సరే అని చెప్పి బట్టలు తీసుకొని నా దగ్గరకి వెళ్తుంది . నది లో బట్టలు శుభ్రం చేస్తూ ఉండగా ఆమె కాలికి ఏదో తగులుతుంది. ఆమె ఏంటా అది అని చెప్పి దాన్ని తీసుకుంటుంది. అది ఒక పెద్ద నారింజ పండు కానీ అది బంగారం రూపంలో ఉంటుంది దాన్ని చూసిన ఆమె….. ఏంటి ఇది చాలా వింతగా ఉంది. అని అనుకొని దాన్ని తన చీర కొంగు నా ముడి వేసుకొని దాచిపెట్టు ఉంటుంది ఆ తర్వాత తన పని చేసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆమె అన్నమ్మ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది ఆమె రకరకాల పిండివంటలు తయారు చేస్తుంది ఇంతలో మనవరాలు ఆ ఇంటికి రాలే వస్తుంది.
శారద ఆ పాపను చూసి….. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావు శోభ అంటూ ఆమె దగ్గరికి వెళుతుంది. అన్నమ్మ…. శారదా పెట్టుకోమాక . అని అంటుంది ఆ మాటలకి ఆమె చాలా బాధ పడి వెనక్కి వెళ్తుంది.
ఆ తర్వాత ఆ మనవరాలికి రకరకాల పిండి వంటలు అన్నమ్మ అందిస్తుంది . దాన్ని తిని ఆమె… చాలా బాగా చేశావు నాయనమ్మ ఇది ఎవరు చేశారు.
ఆమె…. నేనే చేశాను అని అబద్దం చెబుతుంది
కొంత సమయం తర్వాత శారద…. పని మొత్తం అయిపోయింది అమ్మ నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
ఆమె తన భర్త కోసం నది దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది . తన భర్త జనాల్ని ఎక్కించు కుని ఆ ఓడ్డు దించుతాడు
భార్య ఆ పడవలో ఎక్కి ఆ భార్యభర్తలిద్దరు ఇంటికి వెళ్తారు. శారద
దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని.
భర్త దాన్ని గమనించి…. ఏమైంది దేనిగురించి అలా ఆలోచిస్తూ ఉన్నావు.
శారదా ఏడుస్తూ…. ఏమండీ మనలాంటి పేదవాళ్లు డబ్బు ఉన్న పిల్లల్ని పట్టుకో కూడదా.
భర్త… అసలేం జరిగిందో సరిగ్గా చెప్పు అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెబుతూ ఏడుస్తు….. అయినా నేను పాపను కట్టుకోకూడదు కానీ నేను చేసిన వంట మాత్రం పాపకు తినిపించవచ్చు అంటూ ఏడుస్తుంది.
అతను ఆమెను ఓదారుస్తాడు అప్పుడు ఆమె కొంగుకు ఉన్న దాన్ని చూసి…. ఏంటే ఇది కొంగుముడి వేసావు . ఆమె దాన్ని తెరిచి అతన్ని చూపించి ఏంటో బట్టలు ఉతుకుతుంటే. దొరికింది అని దాన్ని ఇస్తుంది . దాన్ని అతను పరీక్షించి…. ఇది ఏంటో బంగారం లాగ ఉంది బంగారం లాగా కాదు బంగారమే అని అంటాడు.
దాన్ని విన్న ఆమె చాలా సంతోషపడుతూ…. ఏమండీ అయితే దీనిని అమ్మితే మనకు డబ్బులు వస్తాయి . అప్పుడు మనం కొంచెం కష్టాల నుంచి బయట పడవచ్చు . అని అంటుంది అందుకు తను సరే అంటాడు .
దానిని ఆపడం ద్వారా వాళ్ళకి చాలా డబ్బు వస్తుంది దానితో వాళ్ళు ఒక మంచి ఇల్లు ని ఏర్పాటు చేసుకుంటారు.
కానీ వాళ్ళ ఆ బంగారు నారింజ ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు ఆలోచించరు.
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆమె పనికి యధావిధిగా వెళుతుంది . కానీ అక్కడ అన్నమ్మ ఉండదు.
ఎక్కడికి వెళ్ళింది దాని చుట్టుపక్కల వారిని అడిగితే ఎవరు కూడా తెలియదు అని సమాధానం చెబుతారు . శారదా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఆ మరుసటి రోజు కూడా మళ్లీ ఆమె ఇంటికి వెళ్తుంది కానీ ఆరోజు కూడా ఉండదు . అలా వారం రోజులు ఆమె ఉండదు శారదాకు ఆమె ఎక్కడికి వెళ్లిందో అర్థం కాదు.
ఆ వారం రోజుల తర్వాత శారదా మళ్ళీ అన్నమ్మ ఇంటికి వెళ్తుంది .
అన్నమ్మ చాలా దిగులుగా ఉంటుంది మనవరాలు కూడా అక్కడే చాలా ఏడుస్తూ ఉంటుంది.
శారదా ఆమెతో…. ఏమైందమ్మా వారం రోజుల నుంచి మీరు ఇక్కడ లేరు.
చూస్తుంటే ఏదో జరిగింది ఎందుకు అలా ఉన్నారు.
ఆమె ఏడుస్తూ…. నా కొడుకు కోడలు ఆక్సిడెంట్ రైలు ప్రమాదంలో చనిపోయారు. నేను ఏం చేయలేని పరిస్థితి అంటూ ఏడుస్తుంది. ఇంత చిన్న వయసులో ఇది తల్లిదండ్రులు పోగొట్టుకుంది. నా వైస్ అయిపోతే నా తర్వాత దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు.
ఆమె కూడా ఏడుస్తూ …. అమ్మ తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను . మాకు ఎంతో కాలంగా పిల్లలు లేరు . ఈ పాపని నాకు ఇస్తే నేను బంగారంగా పెంచుకుంటాను.
మాకు డబ్బు లేకపోవచ్చు అమ్మ . కానీ ప్రేమ అభిమానాలు లో మాత్రం ఏ మాత్రం తక్కువ కాదు.
అంటూ చాలా బాగా చెప్తుంది. ఆ మాటలు విన్న ఆమె ….. ఆస్తి కోసం చూస్తున్నావా.
శారద…. ఆస్తి ఎందుకమ్మా. పోయేటప్పుడు ఏం తీసుకెళ్లారు నీ కొడుకు కోడలు. చెప్పండి ఆస్తి కోసం అయితే నేను ఇంతగా బాధపడి అడగాల్సిన అవసరం లేదు .
రేపు మీరు పోయిన తర్వాత ఈ పాపం నేను పెంచుకొని. ఈ ఆస్తిని అనుభవించవచ్చు కాదంటారా . ఆ మాటలు విన్న అన్నమ్మ ఆలోచన పడుతుంది.
ఆమె ఏం మాట్లాడకుండా… సరే చూద్దాం అని చిన్నగా చెబుతుంది. ఇక అప్పటి నుంచి శారదా పాపనీ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. దాన్ని చూసిన అన్నమ్మ తన మనసులో ….. పాప శారద దగ్గర పెరగడం చాలా మంచిది. మంచి రోజు చూసుకొని పాపని దత్తత తీసుకోమని చెబుతాను అని అనుకుంటుంది అలా రోజులు గడిచాయి
ఒకరోజు పాప ….. శారదమ్మ శారదమ్మ ఒకసారి నాకు నదిలో ఉన్న పడవ ఎక్కాలని ఉంది . నన్ను తీసుకెళ్తావా.
శారద…. ఓ తప్పకుండా తీసుకెళ్తాను మా ఆయనే పడవ నడుపుతూ ఉంటాడు.
ఇప్పుడే వెళదాం పద అని అంటుంది .
ఇక ఇద్దరూ కలిసి అతని భర్త పడవలో ఎక్కుతారు ముగ్గురు అలా వెళ్తూ ఉంటారు .
పాప… చాలా దూరం. వెళ్దాం పదండి అని అంటుంది అందుకు అతను సరే అంటాడు చాలా దూరం వెళ్లారు . అప్పుడు వాళ్లకు ఎదురుగా ఒక పెద్ద చెట్టు బంగారు . పెద్ద పెద్ద బంగారు ఆకారంలో ఉన్న నారింజ పండ్లు కనబడతాయి . దాన్ని చూసి వాళ్ళిద్దరు చాలా ఆశ్చర్యపోతారు.
అప్పుడు మాయ చెట్టు శారదతో…. ఏంటి శారద అలా చూస్తున్నావు . నేను నీకు సహాయం చేసి నా బంగారు నారింజపండు తీసుకొని ఇల్లు కట్టుకున్నావు కానీ . నన్ను మాత్రం గుర్తుపట్టలేదా.
అని అంటుంది అందుకు ఆమె చాలా ఆశ్చర్య పోతూ….. అంటే ఆ రోజు బంగారు పండు ఇచ్చింది నువ్వేనా.
మాయ చెట్టు… అవును నేనే . కానీ నువ్వు ఇక్కడికి వస్తావు అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను . నీకు ఎన్నోసార్లు సహాయం చేయాలని ప్రయత్నించారు కానీ నువ్వు నాకు సహాయం పొందలేకపోవూ. ఎందుకంటే నీకు గుర్తుందా .
శారద ఆశ్చర్యంగా ….. ఏంటి నాకు ఏమీ గుర్తు లేదు .
మాయ చెట్టు…. ఇదిగో నా చిట్టి మీద కనబడుతున్న పక్షి ని చూడు. ఆ పక్షి నా స్నేహితురాలు . తను బయట లోకాన్ని చూడాలని ఆశగా వెళితే . ఎండలు బాగా తిరిగి అలిసిపోయి నీళ్లు లేక మీ ఇంటి ముందు పడిపోయింది. అప్పుడు నువ్వు దానికి నీటిని అందించావూ. సంతోషంగా అది ఎగిరిపోయింది . అది నా దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పింది . నా స్నేహితులు అని కాపాడినందుకు నీకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఆ భాగ్యం కొంతవరకు తీరినట్లే.
అందుకామె చాలా సంతోష పడుతూ….. నువ్వు నాకు సహాయం చేయాలి అనుకుంటే నాకు ఒక బిడ్డని ప్రసాదించు. మాకు పిల్లలు లేరు అని అంటుంది . అందుకో మాయ చెట్టు ఒక పండును ప్రత్యక్షం చేసి ఆమెకు ఇచ్చి….. ఇదిగో ఈ పండు ని తిను నువ్వు ఖచ్చితంగా తండ్రివి అవుతావు అని అంటుంది . అందుకు వాళ్లు చాలా సంతోష పడతారు ఈ మాయ చెట్టు…. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఇక్కడికి రండి మీరు ఇక్కడికి రావచ్చు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. అందుకు వారు చాల సంతోషపడుతూ చెట్టుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళతారు. శారదా పాపని ఇంటి దగ్గరికి వదిలేసి . భర్తతో కలిసి ఇంటికి వెళ్తుంది.
ఆమె ఇంటి దగ్గర పండు ని తింటుంది.
ఆ రోజు గడిచి పోతుంది ఆ తర్వాత రోజుల్లో ఆమెకు వాంతులు రావడం మొదలవుతాయి ఆమె గర్భవతి అని తెలుస్తుంది. ఆ రోజు నుంచి ఆమె పనికి తక్కువగా వెళుతూ ఉంటుంది. అన్నమ్మ శారదా పనికి రాకపోవడంతో తానే స్వయంగా పాపను తీసుకుని పడవలో ఇంటికి వస్తుంది.
అన్నమ్మ … శారదా నేను దారిలో వచ్చేటప్పుడు మీ ఆయన అంతా చెప్పాడు .
ఆ మాయ చెట్టు నీకు చాలా మంచి పని చేసింది కానీ నా బాధ నా మనవరాలు పైనే ఉంది . నేను మీకు దత్త తి ఇవ్వాలనుకున్నాను. ఇంక నీకు అవసరం లేదు. అందుకే నా బాధ. ఒకవేళ నువ్వు నా మనవరాలిని తీసుకున్నా నీ బిడ్డ తో సమానంగా చూస్తాఓ లేదు అన్న భయం .
అందుకు శారద…. అయ్యో అలాంటి ఉద్దేశం ఏమి పెట్టుకోవద్దు . నాకు ఈ బిడ్డను ఇచ్చినా బంగారం లాగా పెంచుకుంటాను అని అంటుంది. సొంత తల్లి కంటే ఎక్కువగానే చూసుకుంటాను నన్ను నమ్మండి ఉంటుంది అందుకే ఆమె అక్కడే వదిలి పెట్టి ఇంటికి వెళ్లిపోతుంది. ఇక ఆరోజు నుంచి పాప అక్కడే సంతోషంగా వాళ్లనీ తల్లిదండ్రుల గా భావించి
అక్కడే ఉంటుంది. కొన్ని నెలల తరువాత శారద ఒక బిడ్డకు జన్మనిస్తుంది . ఈ కుటుంబం ఆ పిల్లవాడి తో సంతోషంగా గడుపుతూ ఆ మాయ చెట్టుకి కృతజ్ఞతలు చెప్పుకుంటరు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *