బంగ్లాలో దెయ్యం – 1_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu Kattapa kathalu

అది ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక పెద్ద బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. రాత్రి సమయాల్లో ఆ బంగ్లా నుంచి వింతవింత శబ్దాలు వస్తాయి అని చెప్పి ఆ గ్రామ ప్రజలు చాలా భయపడుతూ ఉండే వాళ్ళు అలా ఉండగా ఒక రోజు ఏదో దూర ప్రాంతం నుంచి వచ్చిన(యమునా , చందు) భార్యాభర్తలిద్దరూ. ఆ బంగ్లా విషయం తెలుసుకొని ఒకరితో ఒకరు…..ఏమండీ ఆ బంగ్లా గురించి అందరూ ఏదో చెప్పుకుంటున్నారు కానీ నాకు తెలిసినంతవరకు అక్కడ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను మీరేమంటారు.

భర్త…. అసలు అక్కడ ఏముందో మనం వెళితే గానీ తెలీదు మనుషులు ఒకటైతే మరొకటి చెప్పుకుంటారు. వాళ్లు అంతగా భయపడుతున్నారు కాబట్టి మనం ఒక రోజు వెళ్ళి అక్కడ బస చేసి అక్కడ ఏమీ లేదు అని నిర్ధారించుకుంటై చిన్నగా బంగ్లా ని మన సొంతం చేసుకోవచ్చు.
అందుకామె….. అబ్బా మీ బుర్ర రే . బుర్ర అండి అని రాత్రి సమయం ఇద్దరూ ఆ బంగ్లాలో కి వెళ్తారు.
భార్య….. అబ్బా బంగ్లా ని చూస్తుంటే నా కళ్ళు జిగేల్ జిగేల్ అంటూ మెరిసిపోతుంది ఏంటి అంత పెద్ద బంగాళా లో. ఇల్లంతా పుకార్లు పుట్టించిన మే కానీ నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఏమీ ఉండదు చిన్నగా దీనిని మీరు చెప్పినట్లు మన సొంతం చేసుకుందాం.
అని అనుకుంటాడు ఆ మంగళ మొత్తం ఇద్దరూ తిరిగి చూసుకుని ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటారు.
సరిగ్గా 12 గంటల సమయం ఆ బంగ్లాలో చిన్న పిల్లల ఏడుపు మొదలవుతుంది.
ఆ ఏడుపు కి ఆమెకి మేలుకో వచ్చి….. ఏమండీ ఏమండీ నిద్ర ఏవండీ ఎవరో చిన్న పిల్లల ఏడుపు వినబడుతుంది
అతను నిద్రమత్తులో….. ఏడుపు లేదు ఏమి లేదు పడుకో వే. అని అంటాడు.
భార్య…. ఛీ ఈ మనిషికి మంచం తగిలిందoటే చాలు నిద్ర ముంచుకు వస్తుంది.
అంటూ పిల్లవాడి ఏడుపు లు వస్తున్న వైపుగా
ఆ వెళ్తుంది అప్పుడు ఆమెకు ఒక చిన్న పిల్లవాడి కనిపిస్తడు.
వెంటనే ఆమె ఆ పిల్లవాడిని తీసుకొని…. ఎవరు … ఎవరు ఈ పిల్లవాడి ని ఇక్కడ ఉంచారు. అంటూ కేకలు వేస్తోంది అప్పుడే ఒకసారి ఒక ఆమె అక్కడికి వచ్చి….. ఈ పిల్లవాడు నా పిల్లవాడే అమ్మ నన్ను చంపడానికి ఎవరో వస్తున్నారు. నన్ను లోపలికి రా నీవు అని అంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి ఆమె లోపలికి తీసుకు వెళుతుంది .ఆమె చాలా భయ పడుతూ ఉండగా యమునా….. బాధ పడకమ్మా
ఇక్కడికి ఎవరు రారు అని ధైర్యం చెబుతుంది.
ఆమె….. నా బిడ్డ ఆకలితో అల్లాడి పోతున్నాడు. అని అంటుంది అందుకు ఆమె…. అయ్యో కానీ ఇక్కడ పాలు లాంటివి ఏమీ లేవు అమ్మ. అని అంటుంది ఇంతలో ఆమె ఒక్కసారిగా మాయమవుతుంది ఆ బిడ్డ అక్కడే ఉంటాడు దానిని చూసిన ఆమె చాలా కంగారు పడుతూ….. ఏమండీ ఎక్కడికి వెళ్లారు. అమ్మ బిడ్డ ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాను అంటూ చాలా భయపడుతూ ఉండగా అక్కడ బిడ్డ కూడా మాయమై పోతాడు దాన్ని చూసిన ఆమె చాలా భయపడుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది.
ఇంతలో ఒక పెద్ద కేక… వద్దు నన్ను వదిలేయండి. అంటూ కేకలు వినబడతాయి.
ఆమె చాలా కంగారుగా ఉండగా ఉండగా ఆమె ఉన్న గదిలో ఒక శవం వేలాడుతూ కనబడుతుంది. దానిని చూసిన ఆమె చాలా కంగారు పడుతూ. భర్త దగ్గరకు పరిగెత్తి…. ఏవండీ ఏమండీ ఒకసారి లేండి శవం అండి అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది.
అతను చాలా కంగారుగా ఆ గదిలోకి వెళ్లి చూస్తాడు అక్కడ ఎవరూ కనిపించరు.
అతను చాలా కోపంగా….. నీకు కనపడిన వాళ్లు నాకు కనపడాలి గా . నాకు కనబడడం లేదు. నీ భ్రమలు పక్కన పడేస్తే మనం వెళ్లి ప్రశాంతంగా పడుకోవచ్చు అంటూ ఆమెను తీసుకొని వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు.
ఆమె చాలా కంగారుగా ఉండగా….కాపాడండి దయచేసి నన్ను కాపాడండి నాకు సహాయం చేయండి అంటూ కేకలు మళ్ళీ వినపడతాయి ఆమె చాలా భయపడుతూ అక్కడినుంచి లోపలికి వెళ్తుంది రోజు ఆమె భయం భయం గానే ఉంటుంది కొంత సమయానికి ఆ అరుపులు కేకలు అన్ని మాయమైపోతాయి.
అప్పుడు ఆమె కాస్త విశ్రాంతి తీసుకుంటుంది.
ఆ రాత్రి అలా గడిచి పోయింది ఆ మరుసటి రోజు ఉదయం ఆమె…. ఏవండీ ఇక్కడ అందరూ చెప్పినట్టుగానే ఏదో ఉంది.
భర్త… నీ మొఖం ఉంది ఏమీ లేదు నీకు మనం ప్రశాంతంగా ఈ బంగళాలోనే ఉండొచ్చు. మనం తినడానికి . ఏమన్నా తీసుకొని వస్తాను. బంగ్లా మొత్తం శుభ్రం చేసి ఉంచు.
ఆమె…. నావల్ల కాదు నేను ఉండలేను నేను కూడా మీతో పాటే వస్తాను.
భర్త…. మర్యాదగా చెప్పింది చెయ్యి అంటూ కోపం గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
ఆమె చాలా భయపడుతూ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక గది నుంచి శబ్దం రావడంతో ఆమె ఆ గది తెరవడానికి ప్రయత్నిస్తుంది కానీ అది తెరవకపోవడం తో అక్కడే ఉన్న కిటికీలు తెరిచి లోపల చూస్తుంది అక్కడ ఒక వ్యక్తి చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు అతన్ని చూసి చాలా
భయపడుతూ అక్కడ నుంచి వస్తుంది ఇంతలో ఆమెకు …. భయపడకు వాడు నిన్ను ఏమీ చేయడు.
ఆమె… ఎవరు నువ్వు రాత్రి బిడ్డను తీసుకుని వచ్చావు. మళ్లీ శవంగా కనిపించావు. అసలు ఎవరు నువ్వు నాకు ఎందుకు కనబడుతున్నావు.
ఆమె….హా..హా హా నేను దెయ్యాన్ని.
అన్యాయంగా నన్ను చంపేశారు వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఇక్కడ తిరుగుతున్నాను.
ఆమె రూపాన్ని చూసిన యమునా….. నాకు చాలా భయంగా ఉంది దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. అంటూ ఉంటుంది ఇంతలో ఆమె భర్త అక్కడికి వస్తాడు.
అతను ఆమెను చూసి…. ఏంటీ పిచ్చి మొహమా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావ్వ.
ఆమె ఆశ్చర్యంగా…… ఏమండీ మీకు దెయ్యం కనిపించడం లేదా. నా ఎదురుగా ఉంది నాతో మాట్లాడుతుంది . నాకు చాలా భయంగా ఉందండి.
అతను… ఒసేయ్ నీకు అంతా బాగానే ఉంది కదా. దెయ్యం లేదు ఏమీ లేదు పిచ్చి పట్టిదానీలాగా ప్రవర్తిస్తున్నావు.
ఇవిగో ఈ సరుకుల నీ లోపల పెట్టు అంటు కసురు గా అంటాడు ఆమె…. అయ్యో నాకు కనిపిస్తుంది దెయ్యం నీకెందుకు కనబడటం లేదు. అంటూ వాటిని తీసుకుంటూ చాలా భయపడితే వెళుతూ ఉంటుంది ఆమె వెనకాలే ఆ దెయ్యం కూడా వెళ్తుంది ఆమె….
నీకు దండం పెడతాను ఎవరు నువ్వు నాకు ఎందుకు కనబడుతున్నావు. అసలు నీకేం కావాలి.
అప్పుడు ఆ దయ్యం…. చిన్న సహాయం ఒక చిన్న సహాయం కావాలి.
ఆమె…. ఏంటి ఆ సహాయం. అది నేను ఎందుకు చేయాలి అసలు నువ్వు ఎవరు. ఎవరు నిన్ను చంపారు ఎందుకు దెయ్యం గా మారి ఇక్కడ తిరుగుతున్నావ్.
అప్పుడు ఆ దయ్యం ఏడుస్తూ… అసలు ఏం జరిగిందో చెప్తారు ఆ తర్వాత నువ్వే నాకు సహాయం చేస్తావు.//ఫ్లాష్ బ్యాక్//
నా పేరు అఖిల మాది ఈ పక్కనే ఉన్న చిన్న గ్రామం చాలా డబ్బున్న కుటుంబం.
నా భర్త పేరు గోవింద్. అతని తమ్ముడు రాజేష్. అతని భార్య విమల మేమందరం ఒకే చోటు ఉమ్మడి కుటుంబం లాగా నివసిస్తున్నాము. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. నాకు పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోతున్నారు. లేదా ఆ మరుసటి రోజే చనిపోతున్నారు.
దానికోసం మొక్కని భగవంతుడు లేడు.
అలా ఉండగా మళ్లీ ఒకరోజు నేను గర్భవతిని తెలిసింది. నేను ఏడుస్తూ…. అయ్యో భగవంతుడా ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నావ్వ. నాకు పిల్లలు ఇవ్వకుండా ఉన్నా పర్వాలేదు. కానీ ఊర్లో బిడ్డని పురిట్లోనే చంపద్దు నీకు పుణ్యం ఉంటుంది.
అంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను నా భర్త అక్కడికి వచ్చాడు…. బాధపడకు ఈసారి దేవుడు మన పై కృప చూపిస్తాడని నమ్మకం ఉంది.అంటూ ధైర్యం చెప్పాడు కానీ నాకు నమ్మకం లేదు ఈసారి పుట్టబోయే బిడ్డ కూడా కచ్చితంగా చనిపోతాడనీ నేను అనుకున్న నెలలు నిండాయి. పురిటి నొప్పులతో నేను బాధపడుతుండగా నా తోటి కోడలు నాకు పురుడు పోసింది. నాకు పండంటి మగబిడ్డ పుట్టాలని చాలా సంతోషంగా ఉన్నాం కానీ నా మనసులో…. భగవంతుడా ఈ బిడ్డకు మాత్రమే కాకుండా చూడు. అంటూ నేను భగవంతుని ప్రార్ధిస్తూ నే ఉన్నాను.
బిడ్డ క్షేమంగానే ఉన్నాడని నా తోటి కోడలు చెప్తుంది. నాకు మాత్రం చాలా భయం గానే ఉంది ఆ రోజు రాత్రి నేను బిడ్డ నీ పక్కన పెట్టుకుని నిద్రిస్తే ఉన్నాను. నాకు కొంచెం దూరం లో నా తోటి కోడలు నిద్రొస్తుంది.
అప్పుడే ఒక వ్యక్తి ముసుకు వేసుకొని నా బిడ్డను చంపడానికి వచ్చాడు.
దాన్ని గమనించిన నా తోటి కోడలు…. దొంగ దొంగ అంటూ అతని మూసుకుని తొలగించింది ఆ కేకలకి నేను నిద్ర లేచాను.
నా బిడ్డ క్యార్ క్యార్ మనీ ఏడుస్తున్నాడు.
వచ్చిన దొంగ ని చూసిన తోటి కోడలు….. ఏవండీ మీరా మీరు బిడ్డని చంపడానికి ఎందుకు వచ్చారు.
అంటూ ఉండగా అతను బిడ్డను బలవంతంగా తీసుకెళ్ళి పోతుండగా నా తోటి కోడలు అతని పక్కకునెట్టి…. అక్క నువ్వు పెట్టిన తీసుకొని పారిపో. నేను ఈయన్ని ఆపుతాను. అంటూ బిడ్డను నా చేతికి ఇచ్చింది తీసుకొని పరిగెడుతున్నా ను.
అక్కడ వాళ్ళిద్దరూ…. ఎంత పని చేసావే. ఇప్పటివరకు పుట్టిన బిడ్డలని నేనే కడ తీర్చాను కేవలం ఈ ఆస్తి కోసమే.
తోటి కోడలు…. ఛీ మీరు ఇంత నీచులు అనుకోలేదు బావగారు ఊరు నుంచి వస్తే మీ గురించి చెప్తాను.
అని అంది అతను కోపంగా ఆమెను కొట్టి చంపేశాడు.
ఆ తరువాత అతను నా వెంట పడ్డాడు నేను చాలా దూరం పరుగు తీసి. ఈ బంగ్లాకు చేరుకున్నాను.
లోపల ఒక వ్యక్తి కనిపించాడు అప్పుడు అతనికి జరిగిన విషయం చెప్పాను అతను నన్ను చేరదీశాడు.
నేను అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాను.
అప్పుడే అక్కడికి రాజేష్ వచ్చాడు.
రాజేష్ అక్కడున్న వ్యక్తితో చాలా చనువుగా మాట్లాడుతున్నాడు అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఇద్దరు స్నేహితులనీ
నాకు ఏం చెయ్యాలో అర్థం.
ఎలా అయినా అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా .
ఇక్కడున్నావ్ వ్యక్తి నన్ను బలవంతంగా అడ్డుకున్నాడు.
నా బిడ్డను రాజేష్ తీసుకున్నాడు నా బిడ్డ పాల కోసం ఎంతగానో ఏడుస్తున్నాడు .
నేను అతన్ని ఎంతగానో ప్రాధేయపడ్డాను…. దయచేసి నా బిడ్డని ఏం చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డకి పాలిచు కుంటాను దయచేసి నా బిడ్డను నాకు ఇవ్వండి.
అయినప్పటికీ రాజేష్ కొంచెం కూడా జాలి లేకుండా నా బిడ్డని దూరంగా విసిరేశాడు.
నేను… బాబు బంగారు తండ్రి నీకు ఏమైంది అంటూ కేకలు వేశారు ఆ వ్యక్తి నన్ను బలవంతం చేసి చంపేశాడు.
నా బిడ్డ పాల కోసం ఎక్కెక్కి ఏడ్చి నా బిడ్డ కన్నుమూశాడు.
ఆ తర్వాత ఆ వ్యక్తి రాజేష్ తో…. రాజేష్ ఈ శవాన్ని ఏం చేద్దాం.
రాజేష్…. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తాం ఈ గదిలోనే ఆమెను వేలాడ కడదాం అని నన్ను ఉరి తీశారు. మరుసటి రోజు
ఆమె ఎవరో తెలీదు ఆశ్రమం కోసం వచ్చింది.విశ్రాంతి తీసుకుంది తెల్లవారు పాటికి ఉరి వేసుకుని చనిపోయింది అంటూ హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించారు.
అని జరిగిన విషయం చెప్తుంది దానిని విన్న ఆమె చాలా బాధపడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *