బాధ్యత గల కొడుకు | Telugu kathalu | Telugu Stories |Bedtime Dreams Telugu | Kattapa kathalu

కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కృష్ణ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు శివాని. వాళ్లకి రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళు సంతోషంగా వాళ్ల జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కృష్ణ ఎప్పట్లాగే తన పనికి వెళ్తుండగా ఒక కారు అతన్ని వేగంగా ఢీకొని
అతను దూరంగా వెళ్ళి పడ్డాడు.చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో పాపం అంటూ అతన్ని చూస్తూ ఉంటారు కానీ ఎవరు సహాయం చేయకపోగా. అందరూ విచిత్రంగా చూస్తూ….. అమ్మో మనం పట్టుకుంటే కేసు మనమీదకి వస్తుందేమో . అని భయంతో అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఎవరో శివానీకి తన భర్త గురించి చెప్తారు.ఆమె చాలా కంగారుపడుతూ అక్కడికి వస్తుంది.
ఆమె అతని హాస్పిటల్కి తీసుకు వెళ్తుంది.
అక్కడ వైద్యురాలు వైద్యం చేస్తుంది కొంత సమయానికి ఆమె బయటకు వచ్చి ఆమె శివా నీతో…… నడుం భాగం బాగా దెబ్బ తినడంతో నీ భర్త నడవలేడు. అయినా అతనికి దెబ్బతగిలి చాలా సమయం అయిపోయింది . అయినా మీరు పట్టించుకోకుండా ఎందుకు ఉన్నారు.
భార్య ఏడుస్తూ….. మేడం యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి కదా అది ఎవరు కూడా నా భర్త దగ్గరికి రాలేదు . వాళ్ల మీదకు కేసు వస్తుంది అన్న భయంతో. ఎవరు కూడా పట్టించుకోలేదు అమ్మా అని జరిగిన విషయమంతా చెప్తుంది డాక్టర్….. అయ్యో ఈ రోజుల్లో అలా చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా .ప్రమాదంలో ఉంటే ఇవ్వాలని హాస్పిటల్కి తీసుకు రావచ్చు ఎలాంటి సమస్య ఉండదు అని గవర్నమెంట్ రూల్ .
ఆ విషయం ప్రజలకి పూర్తిగా అవగాహన లేకపోవడంతో ఇలాంటి అమాయకులు చాలా మంది బలి అవుతున్నారు.
అలా వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు.
భార్య ఏడుస్తూ…. ఏదేమైనా నా నా భర్త ప్రాణాలు తో ఉన్నాడు ఆ ఒక్కటి చాలు. ఏదో కూలీనాలీ చేసుకుని నా కుటుంబాన్ని పోషిస్తాను. అని తన భాదను చెప్పుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా . ఇంటిదగ్గర రాజు స్కూల్ నుంచి తిరిగి వచ్చి ….. అమ్మ నాన్న నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు. అంటూ విచారంగా అక్కడే ఉంటాడు అతనికి ఆకలి మండిపోతూ ఉంటుంది. అతను…. అబ్బా నాకేమో చాలా ఆకలిగా ఉంది. ఎక్కడికి వెళ్లారు అమ్మానాన్న అంటూ ఏడుస్తూ అక్కడే పడుకుంటాడు. కొంచెం సమయం తర్వాత తల్లి అక్కడికి వస్తుంది. బిడ్డ ఇంటి బయట పడుకోవడం చూసి…. రాజు ఇక్కడ పడుకున్నావా.
లే బాబు నీకు అన్నం పెడతాను అని ఇంట్లోకి తీసుకు వెళ్లి భోజనం తినిపిస్తుంది.
రాజు….. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఎక్కడ అని అడుగుతాడు అందుకామె జరిగిన విషయమంతా చెప్పి ఏడుస్తుంది.
రాజు కూడా ఏడవడం మొదలు పెడతాడు.
రోజులు గడిచాయి అతన్ని ఇంటికి తిరిగి తీసుకొని వస్తారు. అతను మంచం పక్కనే ఉంటాడు. భర్త భార్యతో…. శివాని భగవంతుడు మనల్ని చిన్నచూపు చూశాడు. అందుకే నా కాళ్ళు పడిపోయాయి.
ఇక మరో కుటుంబాన్ని ఎలా పోషించాలో నాకు అర్థం కావడం లేదు. అంటూ చాలా బాధపడతాడు భార్య….. మీరేమి బాధపడకండి నేనున్నా కదా . నేను కుటుంబాన్ని పోషిస్తాను. అని చెబుతుంది.
అలాగే రోజులు గడుస్తున్నాయి.
ఆమె కూలిపని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడుపుతూ ఉంటుంది.
అలా ఉండగా ఆమె ఇటుకుల మోయడానికి ఒక పనికి వెళ్తుంది. ఆ రోజు విపరీతమైన ఎండ. చాలా తీవ్రంగా ఉంది ఆమె ఇటుకలు మోస్తూ వాటిని చేరవేస్తూ ఉంది కొంత సమయం. అకస్మాత్తుగా నీరసం రావడంతో ఎత్తు నుంచి కింద పడిపోతుంది.
వెంటనే ఆమెను హాస్పిటల్కి చేరుస్తారు.
ఆమెకు కూడా నడుం విరిగి పోవడంతో ఆమె కూడా మంచాన పడుతుంది.
ఆ భార్యాభర్తలు ఇద్దరూ మంచం లోనే ఉన్నారు. తల్లి తండ్రి ఇద్దరు మంచం పడ్డం చూసి రాజు…… అమ్మానాన్న ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు ఏమీ అర్థం కావట్లేదు.
అని చాలా ఏడుస్తూ ఉంటాడు తల్లి వాడిని చూసి…. బాధపడకు రాజు. మన కర్మ ఇలా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. భర్త… బాధపడకు శివాని అంతా మన తలరాత అంటూ ఏడుస్తాడు.
రాజు ఆ రోజు నుంచి ఇంటి పని మొత్తం చేస్తూ.తర్వాత బడికి వెళ్లే వాడు అలా రోజులు గడిచాయి . ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. అతనికి ఏం చేయాలో అర్థం కాక తల్లితో…. అమ్మ డబ్బులు అన్నీ అయిపోయాయా ఇమ్మ. డబ్బులు ఎక్కడనుంచి తీసుకురావాలి మీకు మందులు తేవాలి . పండ్లు తేవాలి.
కుటుంబం ఎలా గడుస్తుంది అమ్మా.
ఆమె ఏడుస్తూ….. ఏం చేయాలి బాబు. నాకు ఏమీ అర్థం కావడం లేదు . అని ఏడుస్తూ ఉంటుంది రాజు అక్కడి నుంచి బయటికి
వస్తాడు. అతను ఏడుస్తూ తన మనసులో… నేనేం చేయాలి మా అమ్మ నాన్నకి నిన్ను సహాయం చేయకపోతే . వాళ్లు చనిపోతారు నాకు భయం వేస్తుంది. అంటూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఒక బిచ్చగాడు ….. బాబు ధర్మం చేయండి మీకు పుణ్యం ఉంటుంది. బాబు ధర్మం చేయండి . అయ్యా బాబు ధర్మం చెయ్ బాబు . అయ్యా బాబు ధర్మం చెయ్యి . అంటూ అడుక్కుంటూ కనపడతాడు వెంటనే రాజు…. నేను కూడా ఇలాగే ఆడుకుంటాను .
ఎంతో కొంత డబ్బులు వస్తాయి. వాటితో మా అమ్మ నాన్న కి కావాల్సిన మందులు ఆహారం తీసుకొస్తాను. అని అనుకొని తన చొక్కా చించుకొని బయటికి వెళ్లి అడుక్కోవడం మొదలు పెడతాడు.
…… తిండి తిని రెండు రోజులు అవుతుంది. మా అమ్మానాన్న పరిస్థితి బాగోలేదు దయచేసి నాకు ఏదైనా దానం చేయండి బాబు. అమ్మ ఆకలి అవుతుంది అమ్మ మా నాన్న అమ్మకి బాగోలేదు. ఆమ్మ డబ్బులు ఇవ్వండి. అంటూ వచ్చిన వాళ్లందర్నీ అడుక్కుంటూ ఉంటాడు. సాయంత్ర సమయం అవుతుంది నువ్వు వచ్చిన డబ్బుతో తల్లిదండ్రుల కి కావాల్సిన మందులు పండ్లు తీసుకుంటాడు.
వాటిని ఇంటికి తీసుకువెళతాడు.
అక్కడ తల్లిదండ్రులిద్దరూ వాటిని చూసి ఆశ్చర్యంగా….. బాబు రాజు ఇవన్నీ ఎక్కడినుంచి వచ్చాయి బాబు . నీకు అని అడుగుతారు.
రాజు తన మనసులో….. నేను అడుక్కు తింటున్నాను అని తెలిస్తే. మా అమ్మ నాన్న ఇద్దరు బాధపడతారు. అని అనుకొని వాళ్ళతో…… అమ్మ ఒక చిన్న పని దొరికింద అమ్మ నేను బడికి వెళ్తూనే సాయంత్రం ఆ పని చూసుకుంటున్నాను వాళ్ళు డబ్బులు ఇస్తే. ఇవన్నీ తీసుకు వచ్చాను అని అంటాడు.
దాన్ని విన్న వాళ్లు…. ఇంత చిన్న వయసులో నీకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో . ఏం చేస్తాము మా ఖర్మ అంటూ బాధపడతారు.
అలా రోజులు గడిచాయి అతను ప్రతి రోజు బడికి వెళ్తున్నాను అని చెప్పి డబ్బులు సంపాదించడం కోసం అడుక్కుంటూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అలా ఉండగా ఒకరోజు రాజు ఒక గుడి దగ్గర నిలబడి….. బాబు ధర్మం చేయండి అమ్మ ధర్మం చేయండి. అమ్మ ధర్మం చేయండి అమ్మ అంటూ ఉండగా ఒక ఆమె అక్కడికి వస్తుంది. ఆమె రాజు ని చూసి…. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు కృష్ణ వాళ్ళ అబ్బాయివి కదా.
రాజు…. లేదమ్మా నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. అని అబద్ధం చెప్తాడు ఆమె… లేదు లేదు నువ్వు ఖచ్చితంగా కృష్ణ వాళ్ళ అబ్బాయి వి మీ అమ్మా నాన్న ఇద్దరూ మంచనా ఉన్నారు కదా .
నిజం చెప్పు అని అంటుంది. అందుకు అతను ఏం మాట్లాడకుండా భయంతో అక్కడినుంచి పరుగులు తీస్తాడు.
ఆమె…. ఏంటి వీడు ఇలా పరుగులు తీసాడు అని అనుకొని ఇంటికి తిరిగి వెళ్తుంది.
ఆమె సరాసరి తన ఇంటికి వెళ్లకుండా కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ మంచనా ఉన్న భార్య భర్తలు ఇద్దరితో…… కృష్ణ అన్నయ్య. శివాని వదిన మీ అబ్బాయి రాజు గుడి దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు ఏంటి పని అంటే సమాధానం చెప్పకుండా పరుగుతీశాడు అంటూ జరిగిన విషయం చెప్తుంది.
దాన్ని విన్న తల్లి…. నువ్వు ఎవరిని చూసి ఎవరు అని అనుకున్నాఓ వదిన. వాడు బడికి వెళ్ళాడు.
ఆమె…. అయ్యో వదిన నేను కచ్చితంగా నేను చూసాను వాడు మీ అబ్బాయే. నిజంగా . నాకు మీ వాడు ఎలా ఉంటాడో తెలియదా.
దాన్ని విన్న ఆమె చాలా బాధపడుతుంది.
ఆ తర్వాత ఆ వచ్చిన ఆమె …. మీరు గట్టిగా మందలించoడి వాడు నిజం చెప్తాడు.
అయినా మీరు మంచాన ఉన్నారు కదా.డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే పిల్లల్ని అడుక్కో డానికి పంపించారు ఏమో అనుకున్నాను. పాపం ఈ విషయం మీకు కూడా తెలియదు అనుకుంటా.అయినా ఇప్పుడు వాడు చేసే సరేలే . ఆడుకో పోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. వాడు చేస్తుంది మంచి పని. ఆయన ఇలాంటి విషయాలు నాకు ఎందుకులే. అంటూ అనరాని మాటలు అని కూడా ఏమీ తెలియనట్లుగా….. సరే ఇక నేను వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోతుంది ఆమె ఒక మాటలు విన్న భార్యాభర్తలిద్దరూ మనసులో ఎంతో బాధ పడతాయి.
కొంచెం సమయం తర్వాత రాజు తల్లిదండ్రి కి కావాల్సిన మందులు పండ్లు తీసుకుని ఇంటికి వస్తాడు. తల్లి…. రాజు నిజం చెప్పు. నువ్వు బడికి వెళ్ళావా ఎక్కడికి వెళ్లావు చెప్పు లేదంటే నా మీద ఒట్టే.
రాజు చాలా భయపడుతూ…. ఏంటమ్మా నువ్వనేది నేను బడికి వెళ్ళి. తర్వాత పనికి వెళ్లి ఇక్కడికి వచ్చాను. అని అబద్ధం చెప్తాడు.
తల్లి ఏడుస్తూ…. నా మీద ఒట్టు వేసిన తర్వాత కూడా నువ్వు అబద్ధం చెప్తున్నావా .
అంటే నేను చనిపోయినా నీకు ఇష్టం అనుకుంటా కదా.
ఆ మాటలకి అతను ఏడుస్తూ…. అమ్మ అంత మాట అనకొండ అమ్మ ఎందుకంటే నేను నలుగురు దగ్గర చేయి చాపింది కేవలం మిమ్మల్ని బ్రతికించు కోవటం కోసమే. ఇందులో ఎలాంటి స్వార్థం లేదమ్మా. మీరు నాకు కావాలి నాకు తల్లిదండ్రులు ఉన్నారు నాకు తోడు ఉంది . అని సమాజంలో చెప్పుకోవడం కోసం. నేను ఒంటరిగా బ్రతకలేను అమ్మ నాకు నీ ప్రేమ కావాలి. అందుకోసం నేను ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఆడుకుంటున్నాను అన్న బాధ లేదు . నా తల్లిదండ్రులనీ బతికించు కుంటున్నాను అన్నా . ఒక్క మాట మాత్రమే నాకు తెలుసు.
అంటూ ఏడుస్తాడు ఆ మాటలు విన్న తల్లిదండ్రులిద్దరూ ఏడుస్తూ…. ఇంత చిన్న వయసులో మా కోసం అడుక్కుంటూ. బ్రతికిస్తున్న మమ్మల్ని ఇలాంటి కొడుకు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ మా వల్ల మీ జీవితం నాశనం అయ్యిందని.
చాలా బాధపడుతున్నాము. మమ్మల్ని క్షమించు బాబు. అంటూ ముగ్గురు కూర్చుని ఎంతో బాధపడుతూ …. భగవంతుడా మా జీవితాన్ని ఎందుకిలా చేశావు. నా బిడ్డ భవిష్యత్తు కూడా నాశనం అయింది ఒక్కసారి
కళ్ళు తెరిచి చూడు. మా జీవితాలు ఎలాగా తెల్లబడిపోతున్నాయా. భగవంతుడా ఒక్కసారి మమ్మల్ని కరుణించు అంటూ ఎంతో పెద్దగా ఏడుస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నారు.
వాళ్లకి ఎప్పటికైనా భగవంతుడు చల్లని చూపు చూసి మంచి చేయాలి అని మనం కూడా కోరుకుందాం. రాజు ఎప్పటిలాగే బడికి వెళ్లి చదువుకోవాలి. వాళ్లకి ఆపరేషన్లు జరిగి మళ్లీ తిరిగి నడవాలి. మనిషిలో దేవుళ్ళు ఉంటారనీ అంటారు అలాంటి దేవుడు వాళ్లని చూసి కరుణించాలి అని మనస్పూర్తిగా కోరుకుందాం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *