బావిలో రక్త పిశాచి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu
అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద బావి .రాత్రివేళలో ఆ బావి నుంచి.
రక్త పిశాచి—ఆహ్ ఓ.. దాహం..దాహం…. ఆకలి..ఆకలి.. దాహం ఆకలి .అంటూ భయంకరమైన వింత శబ్దాలు వస్తుంటాయి . అక్కడ ఏ ఇంట్లో కూడా రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు కాదు. ఎందుకంటే ప్రతి అర్ధరాత్రి రెండు గంటలకి
ఒక దీపం..( రక్త పిశాచి.)— హో హో…( పెద్దగా అరుస్తూ) దాహం… దాహం… ఆకలి… ఆకలి.. హ…హ..హ..( పెద్దగా నవ్వుతూ)నేను వస్తున్నాను నాతో కూడా వచ్చి నా ఆకలి తీర్చుటకు సిద్ధం అవ్వండి …హ..హ (పెద్దగా నవ్వుతూ) భయంకరంగా అరుస్తూ
ఆ దీపం వస్తుంది ఆ దీపం ఎవరి ఇంటి ముందుకు వెళ్లి వెలుగుతుందో ఆ ఇంటిలో నుంచి మగవారఒకరు ఆ దీపం తో కలిసి బావి దగ్గరకు వచ్చి
మనిషి—-ఓ.. రక్త పిశాచి నేను నా ఇష్ట పూర్వకంగా నీ దగ్గరకు వచ్చాను. రా వచ్చి నన్ను .భుజించు. ఆ.. మాట వినగానే
రక్త పిశాచి బయటకు వచ్చి…
హ.. హ ..హ ..హ.( పెద్దగా నవ్వుతూ) ఈ రోజుకి నా భోజనం సిద్ధం నీ రక్తం నా దాహం తీరుస్తుంది .నీ మాంసం నా ఆకలి తీరుస్తుందిహ.. హ ..హ ..హ.( పెద్దగా నవ్వుతూ)
అతని రక్తం తాగిన తర్వాత అతన్ని బావి లోకి తీసుకొని పోతుంది
మరుసటి రోజు
ఊరి ప్రజలు— అయ్యో భగవంతుడా మనకేంటి ఈ కష్టాలు. ఆ రక్తపిశాచి ఊరిలో అందరిమగవాళ్ళను ఒక్కొక్కరిగా చంపుతుంది. రాత్రి అయితే చాలు ఆ దీపం ఎవరి ఇంటికి వస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సివస్తుంది. దాని బారి నుంచి మనం ఎప్పుడు బయట పడతారో అని భయంతో వణికిపోయే వారు.
దీపం (రక్త పిశాచి)—పిశాచి. హో హో…( పెద్దగా అరుస్తూ) దాహం… దాహం… ఆకలి… ఆకలి.. హ…హ..హ..( పెద్దగా నవ్వుతూ) భయంకరంగా నేను వస్తున్నాను నాతో కూడా వచ్చి నా ఆకలి తీర్చుటకు సిద్ధం అవ్వండి …హ..హ (పెద్దగా నవ్వుతూ)
ఒక ఇంటిలోకి వచ్చింది అక్కడ ఆ వెలుగు చూసిన ఆ వ్యక్తి ముఖం పిశాచి రూపంలోకి మారి. అతని జ్ఞానాన్ని మర్చిపోయాడు దాన్ని చూసిన
అతని భార్య— ఏమండీ!?.. ఏమైంది మీకు అయ్యో !మీరు వెళ్ళకండి.. మీరు ఎక్కడికి వెళ్ళకండి !అయ్యో.. ఏమండీ ఇటు చూడండి నేను మీ భార్యను.. అలా అంటుండగా అతను అలా చూస్తూ ఆ దీపం తో పాటు బావి దగ్గరకు బయలుదేరాడు.
అక్కడ జరుగుతుంది అంతా ఊరి ప్రజలు ఇంటి కిటికీ ద్వారా చూస్తున్నారు ఆ వ్యక్తి
బావి దగ్గరకు వెళ్లి–
-మనిషి—-ఓ.. రక్త పిశాచి నేను నా ఇష్ట పూర్వకంగా నీ దగ్గరకు వచ్చాను. రా వచ్చి నన్ను .భుజించు. ఆ.. మాట వినగానే
రక్త పిశాచి బయటకు వచ్చి…
హ.. హ ..హ ..హ.( పెద్దగా నవ్వుతూ) ఈ రోజుకి నా భోజనం సిద్ధం నీ రక్తం నా దాహం తీరుస్తుంది .నీ మాంసం నా ఆకలి తీరుస్తుందిహ.. హ ..హ ..హ.( పెద్దగా నవ్వుతూ)
అతని రక్తం తాగిన తర్వాత అతన్ని బావి లోకి తీసుకొని పోతుంది.
మరుసటి రోజు ఊరిజనం — అయ్యో ఈ రక్త పిశాచి ఎక్కడ ఎక్కడ నుంచి దాపురించింది. రోజురోజుకీ మనకి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దాన్ని ఆటలు బాగాసాగుతున్నది. వాటిని భరించడం కంటే ఈ ఊరిని వదిలి వెళ్ళడం మంచిది.
మరొకరు— సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం వెతకాలి కానీ. భయపడి దానికి దూరంగా పారిపోకూడదు. ఇప్పటికే ఆ రక్తపిశాచి భయపడి చాలా ఆలస్యం చేసాము. ఈ సమస్యకు ఉపాయం ఆలోచించి దాన్ని పీడను వదిలించుకోవాల.
అని అనుకొని పక్క ఊరికి బయల్దేరి వెళ్లారు అక్కడ ఒక పిశాచాల మాంత్రికుని తీసుకొని వచ్చారు. అర్ధరాత్రి రెండు గంటల సమయం అయ్యింది
దీపం (రక్త పిశాచి)— ఆహ్ హ..హ..హ..(పెద్దగా నవ్వుతూ ) దాహం ..దాహం ..ఆకలి ఆకలి ..అంటూ వస్తుండగా..
మాంత్రికుడు— హ..హ..హ ఓయి రక్త పిశాచి ఇంకా నా ముందు నీ ఆటలు చాలవు నీ ఆకలికి పూర్తి పరిష్కారం చూపిస్తా చూడు..
అని ఆ దీపాన్ని పట్టుకున్నాడు
రక్తపిశాచి —వదలరా నన్ను వదులు… వదులు… నన్ను….నన్ను వదలకపోతే ఈ ఊరి మొత్తాన్ని వల్లకాడు చేస్తాను.
మాంత్రికుడు —చాలు మాయాబి నీ మాయ మాటలు.. ఇప్పుడు నీ ప్రాణం నా గుప్పెట్లో ఉన్నాయి.. నీ శక్తులు ఏమీ పనిచేయవు.
రక్త పిశాచి— వద్దు వద్దు నన్ను ఏం చెయ్యొద్దు వదిలేయ్ దయచేసి నన్ను వదిలేయ్..
మాంత్రికుడు– నీ ఆకలి దాహం కోసం ఆ అమాయకుల ప్రాణాలు తీసిన నిన్ను ఎలా వదులుతాను అనుకున్నావు. ఆ బాధ ఏంటో నువ్వు అనుభవించాలి. రా ….వచ్చి సీసాలో బందీఅవ్వు.
అంటూ దాన్ని సీసాలో బంధించి దాన్ని పూడ్చి వేసాడు.
ఆ దృశ్యాన్ని చూస్తున్న జనం అంతా రక్త పిశాచి పీడా వదిలిపోయింది అంటూ ఆ రోజు నుంచి హాయిగా జీవించసాగారు .
నీతి– సమస్య వస్తే దానికి పరిష్కారం వెతకాలి కానీ సమస్యకు దూరంగా వెళ్ళడం అనేది తెలివితక్కువ పని. తెలివిగా ఆలోచించి సమస్య నుండి బయట పడాలి
Related Posts

గర్భవతి ఏనుగు వినాయకుడు 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఊరి పెద్ద కి కడుపు చేసే దెయ్యం 7_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu
