బీదల రాఖీ పండుగ POOR vs Rich Telugu Story- Telugu Kathalu-Stories inTelugu -Kattapa Kathalu
కోదండాపురం అనే గ్రామంలో రవి, చిన్ని అనే ఇద్దరు అనాధ అన్నా చెల్లెలు ఉన్నారు. తల్లి దండ్రులు చనిపోవడంతో చెల్లెల్ని చూసుకునే బాద్యత రవి పై పడింది.
తనకి తెలిసిన పని చేసుకుంటూ చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.
ఒకరోజు చిన్ని అన్న రవితో మాట్లాడుతూ
చిన్ని :- అన్నయ్య మన తో ఉన్న అందరు పిల్లలని అమ్మా నాన్న ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, కానీ మన అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు. ఇప్పటివరకు వాళ్ళని నేను ఒక్కసారి కూడా చూడలేదు. మన అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో చెప్పు అన్నయ్య, వాళ్ళని చూడాలని నాకు ఎంతో ఆశగా ఉంది.
ఆ మాటలు విన్న రవి ఎంతో బాధపడుతూ
రవి :- చెల్లి మన అమ్మా నాన్న మనకోసం ఎంతో కష్టపడుతున్నారు, నీకోసం ఎన్నో బహుమతులు తేవడం కోసం పట్నం వెళ్లి కష్టపడి పనిచేస్తున్నారు. వస్తారు చెల్లి అని చెప్పి చెల్లిని ఓదారుస్తాడు.
చిన్ని :- అన్నయ్య , నాకు ఏది కావాలన్నా నువ్వే కొణిస్తున్నావు, అమ్మానాన్న కనీసం నన్ను చూడడానికి కూడా రావట్లేదు, వేరే వాళ్ళ అమ్మానాన్నను చూస్తే నాకు ఎంతో బాధేస్తుంది అన్నయ్య అని ఏడుస్తుంది చిన్ని
దానికి ఏమి సమాధానం చెప్పాలో రవికి అర్ధం కాక
రవి :- వస్తారమ్మా అమ్మానాన్న మనకోసం తప్పకుండా వస్తారు అని చెప్పి హిల్లిని ఓదారుస్తాడు
ఇలా రోజు రవి ఏదో ఒక సమాధానం చెప్తూ చెల్లిని ఓదారుస్తుంటాడు.
రవి ఒకరోజు ఏ పని దొరక్క ఇంట్లోనే ఉంటాడు, చిన్ని రవి ని చూస్తూ
చిన్ని :- అన్నయ్య నువ్వు నాకోసం రోజు ఎంతో కష్టపడుతున్నావు, ఎక్కడెక్కడో పని చేసి అలిసిపోయి వచ్చి కూడా నాకు వంట చేసి కడుపు నింపుతున్నావు, కానీ నువ్వు ఏరోజు కూడా కడుపు నిండా పడుకోలేదు. మన అమ్మానాన్న మనతో పాటే ఉంటె మనకి ఇన్ని కష్టాలు వచ్చేవి కావు కదా అన్నయ్య అని అంటుంది
అప్పడు రవి ఆలోచిస్తహూ
రవి :- లేదమ్మా మన అమ్మానాన్న మనకోసం ఎంతో కష్టపడుతున్నారు. కానీ వాళ్ళు మనకి కనిపించరు అంతే ఈ సరి వచ్చే పండగకి వాలు తప్పకుండ మన దగ్గరికి వస్తారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు
రవి సరాసరి వాళ్ళ గుడిసెలో ఉన్న దేవుడి పఠం దగ్గరికి వెళ్లి
రవి :- అయ్యో దేవుడా! ఏంటయ్యా నాకి కర్మ మా అమ్మానాన్నా చనిపోయారని ఈ చిన్న పిల్లకి ఎలా చెప్పగలను, నా చెల్లి ఎదో ఒకరోజు అమ్మ నాన్నని తీసుకురమ్మంటే నేను ఎలా తీసుకు రాగలను. పూటా పూటకి ఏదో ఒక అబద్దం చెప్పి నా చెల్లిని మోసం చేస్తున్నాను. మా తల్లిదండ్రులతో పాటు మమ్మల్ని కూడా తీసుకుపోతే నాకు ఈ కర్మ ఏర్పడేది కాదు కాదు కదా! ఎందుకయ్యా నాకు ఇలాంటి దుస్థితి తీసుకొచ్చావు అని ఎంతో ఏడుస్తాడు
ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే పడిపోతాడు రవి
ఇంతలో అక్కడ ఎవరో పిలిచినట్టు వినిపించడం తో హఠాతున్నా లేచి గుమ్మం దగ్గరికి వెళ్తాడు
అక్క రవికి ఒక స్వామిజి కనిపిస్తాడు
రవి :- అయ్యా ఎవరు మీరు? మీరు ఏమి లేని ఈ పేదవారి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? అని అడుగుతాడు
స్వామిజి :- రవి, నీవు నా బిడ్డవి నిన్ను నీ దగ్గరికి కాక నేను ఇంకా ఎక్కడికి వస్తాను
ఆ మాటలకి రవి ఆశ్చర్యపోతూ
రవి :- స్వామి మీరెవరో నాకు తెలీదు కానీ నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతాడు
ఆ మాటలకూ స్వామిజి
స్వామిజి :- బిడ్డా రవి నీ గురించి నాకు మొత్తం తెలూసు, నీ కష్టాలు నువ్వు అనుభవించే బాధలు అన్ని నాకు తెలుసు, నీ చెల్లి అంటే నీకు ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసు, నీ చెల్లికి ఏ కష్టం రాకుండా నువ్వు చూసుకోవాలి అనుకుంటున్నావు. అందుకే నీకోసం నేను ఇంత దూరం వచ్చాను, నేను చెప్పే మాటలు నువ్వు చాలా జాగ్రత్తగా విని నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ముందుగా నేను చెప్పేది విను . ఈ ఊరి చివరన ఉన్న అడవిలోకి వేళ్తే దూరం లో ఉన్న నది మధ్యలో ఒక దివ్యమైన శక్తులు ఉన్న ఒక మాయ చెట్టు నీకు కనిపిస్తుంది. ఇప్పుడు నీకు చెప్పే మంత్రం చేపి ఆ చెట్టు దగ్గర ఏమి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి స్వామిజి అక్కడ నుంచి మాయం అవుతాడు
స్వామిజి చెప్పిన ఆ మంత్రం గుర్తు పెట్టుకొని రవి అక్కడ నుంచి చిన్ని దగ్గరకు వెళ్తాడు,
చిన్ని పడుకొని ఉంటుంది
రవి:- పాపం చిన్ని అమ్మానాన్న గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ అలానే పడుకోని ఉంటుంది అనుకుంటాడు.
తెల్లారి ఉదయం చిన్ని రవితో మాట్లాడుతూ
చిన్ని :- అన్నయ్య పండుగ రోజు అమ్మా నాన్న మన దగ్గరికి వస్తారని చెప్పావుగా ఈ రోజు రాఖి పండుగా అంటే అన్న చెల్లెలి పండుగా అని నువ్వే చెప్పావు కనీసం ఈరోజైనా అమ్మానాన్న మనని చూడడానికి వస్తారా అన్నయ్య అని అడుగుతూ ఏడుస్తుంది చిన్ని
రవి :- చిన్ని నీకు అమ్మానాన్న మీద ఎంత ప్రేమ ఉందొ నాకు తెలుసు, ఈ రోజు అమ్మానాన్న తప్పకుండా మనని కలుస్తారు, అమ్మానాన్న అక్కడ ఉన్నారో నేను నీకు చూపిస్తాను పదా అని చెప్పి స్వామిజి చెప్పిన అడవి మార్గం గుండా చిన్ని ని తీసుకెళ్తాడు రవి
దారి మధ్యలో చిన్ని మాట్లాడుతూ
చిన్ని :- అన్నయ్య మనం నడుచుకుంటూ చాలా దూరం, వచ్చాం నాకు కాళ్ళు ఎంతో నొప్పి వస్తున్నాయి అల్లాగే భరించలేనంతగా ఆకలి వేస్తూ ఉంది, ఇలా మనం ఇంకెంత దూరం వెళ్ళాలి అన్నయ ఈ రోజు రాఖి పండగా నీకు రాఖి కడదాం అంటే మన దగ్గరకనీసం రాఖీకొనేంత డబ్బులు లేవు. అమ్మ నాన్నలకి మనమంటే ఎంతో ఇష్టం ఉంటె మనని ఇంత కష్టాలో ఎందుకు పడేస్తారు అన్నయ నాయి అడుగుతుంది
ఇంతలో స్వామిజి చెప్పిన నది కనిపిస్తుంది రవికి
రవి :- అదిగో అమ్మ ఆ నది మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తే మన అమ్మ నాన్న ఉంట్టారు అని చెప్పి నది దగ్గరికి వెళ్తారు
చిన్ని :- అన్నయ్య ఈ నది ఎంతో వేగంగా ప్రవహిస్తుంది, మనం ఆ చెట్టు దగ్గరికి ఎలా చేరుకోగలం అని అడుగుతుంది
రవి చెల్లెలి మాట కోసం అడవంతా తిరిగి ఒక దుంగ ని వెతుకుతాడు. ఆ దుంగ సహాయం తో ఇద్దరు ఆ చుట్టూ దగ్గరకు చేరుకుంటారు
ఆ చెట్టు దగ్గరకు చేరుకున్న తర్వాత రవి స్వామిజి చెప్పిన మంత్రాన్ని చదవగానే ఆ చెట్టు ఒక మాయ చెట్టులా మరి ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది
ఆ చెట్టుని చూస్తూ రవి చిన్ని తో
రవి :- అమ్మ చిన్ని నువ్వు ఈ మాయ చెట్టు ని ఏమి అడిగితే అది నీకు ఇస్తుంది కోరుకో అమ్మ అని అంటాడు
చిన్ని :- ఓ మాయ చెట్టు నేను ఇప్పటి వరకు అమ్మా అమ్మ నాన్న తో మాట్లాడలేదు నీ శక్తితో మా మా నాన్నను నాతో మాట్లడించు అలాగే ఈ రోజు రాఖి పండగ మా అన్నయ్యకు రాఖి కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అని అడుగుతుంది
వెంటనే మయా చెట్టు నుంచి కొన్ని మాటలు వినిపిస్తాయి
మాయ చెట్టు :- అమ్మ చిన్ని నేను నీ నాన్నని మాట్లాడుతున్నాను, నిన్ను అన్నయ్య చాలా బాగా చూసుకుంటున్నాడు, మీ ఇద్దరి ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఇక్కడ మీకు కొన్ని రాఖీలు ప్రత్యక్షం చేస్తున్నాను, నీకు నచ్చిన రాఖి నీ అన్నయ్యకు కట్టు అల్లాగే మీకు ఏ అవసరం వచ్చినా ఈ నాన్న ఉన్నాడని మరచిపోకు, మీకు ఏ అవసరం వచ్చినా ఈ చెట్టు దగ్గరకి వచ్చి చెబితే కచ్చితంగా నేను తీర్చగలను అని చెప్పి ఆ చెట్టు కొన్ని రాఖీలను ప్రత్యక్ష్యం చేస్తుంది. ఆ రాఖీలను చూసిన చిన్ని ఎంతో సంబరపడుతూ అన్నయ్య కు కడుతుంది. ఆ మాయ రాఖి చెట్టు సహాయంతో ఆ పిల్లలు ఏ కష్టం లేకుండా బ్రతుకుతారు
Related Posts

యక్షిణి దెయ్యం Telugu Kathalu | Telugu Stories | Stories in Telugu | Horror Stories | Fairy Tales

పాప బ్రతుకుతుందా? | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu
