బైక్ పిచ్చి అత్తా కోడళ్ళు Village attha kodalu | తెలుగు కథలు | Telugu stories | Comedy Stories

తోడేళ్ల పురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు అత్తా కోడలు ఉండేవాళ్ళు. అత్తా కోడళ్ళుకి బైక్ మీద తిరగడం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఒక కోతి కూడా పెంచుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఉండగా ఒక రోజు అత్త…. అత్తయ్య ఏంటి మీరు అలాగా ఆలోచించకుండా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పండి. నాకు బైక్ మీద తిరగాలని ఆశగా ఉంది. మీకు ఆ పిచ్చి లేదా ఏంటి. కోతి…. మీ ఇద్దరికీ ఏమో కానీ నాకైతే చాలా ఆశగా ఉంది. నా మాట విని నన్ను ఈ రోజైనా బైక్ మీద తీసుకెళ్తారా లేదా.
అత్త…. అబ్బా మన తాకిడికి తట్టుకోలేక నా మొగుడు నీ మొగుడు బైకు తాళాలు దాచి పెడుతున్నారు ఇంకా ఎక్కడ మనం బైక్ మీద వెళ్ళేది. నేను కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. మీరే ఎదైనా ఉపాయంతో ఉంటే చెప్పండి. అప్పుడు కోతి…. ఇంత మాత్రం దానికి ఇన్ని రోజులు మీరు సతమతమవుతున్నారా. వాళ్లు బైకు తాళాలు ఎక్కడ పెడుతున్నారో. నేను గమనిస్తున్నాను అలాగే వాటిని తీసుకు వస్తాను. అని కోతి చెప్పడంతో వాళ్ళు చాలా సంతోష పడతారు. ఆ రోజు రాత్రి వాళ్ళ భర్త ఇద్దరూ భోజనం చేసారు. కోడలి భర్త వరుణ్ బండి తాళం తన గదిలో ఉన్న మంచం కింద పెడతాడు. దాన్ని చూసిన కోతి ….. ఒక తాళం ఎక్కడుందో తెలిసిపోయింది. ఆ పెద్దాయన ఎక్కడ పడుతున్నాడో చూడాలి . అని అనుకొని అత్త భర్త అయినా రామయ్య దగ్గరికి వెళుతుంది. అతను కూడా అతని గదిలో మంచం కింద తాళాన్ని పెడతాడు.
దాన్ని చూసిన కోతి….. ఓహో ఈయన కూడా తాళం ఇక్కడ పెడుతున్నారు అన్నమాట .
అని అనుకుంటుంది వాళ్లంతా విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు కోతి చిన్నగా రామయ్య గదిలోకి వెళ్లి అక్కడున్న తాళం తీసుకుని బయటకు వస్తుంది. ఆ తర్వాత వరుణ్ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న తాళం కూడా తీసుకొని బయటికి వస్తుంది.
ఆ కోతి రెండు తాళాలు తీసుకుని బండి దగ్గర ఆ అత్తాకోడళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.చాలా సమయం పడుతుంది అత్తా కోడలు ఇద్దరూ బయటికి రాకపోవడంతో కోతి….. వీళ్ళ మొహాలు మండ వీళ్ళకి దొంగతనం చేయడం రాదు . మొగుడ్ని మాబ్బ పరచడం రాదు. ఎంతసేపు ఎదురు చూడాలి.
అబ్బా త్వరగా రండి అనుకుంటా ఉంటుంది . ఇంతలో అత్త కోడలి ఇద్దరూ బయటికి వస్తారు . కోతి కోపంగా…. ఎంతసేపని నేను ఇలా ఎదురు చూడాలి. అత్త…. మరి తప్పదు వాళ్ళు నిద్ర పోయారు లేదో. తెలుసుకోవాలి రావాలి కదా. ఇంతకీ తాళాలు దొరకాయి కదా. కోతి…. తాళాలు ఉన్నాయి కానీ త్వరగా మీరు రండి . కోడలు…. అది సరే కానీ ఇంతకీ నువ్వు ఎవరి బండి ఎక్కుతావు.
కోతి…. ఇంకెవరి బండి ఎక్కుతాను. నీ బండి ఎక్కుతాను.
అత్త…. అంటే రోజు నీకు నేను తిండి పెడుతున్నాను. కానీ నువ్వు నా కోడలు బండి ఎక్కుతా అంటున్నావా నేను అలిగాను నీతో మాట్లాడను. అని అంటుంది కోడలు…. చూడు నువ్వు కనుక నా బండి ఎక్కకపోతే నేను కూడా అలుగుతాను. అని ఇద్దరూ అలిగి కూర్చుంటారు. అప్పుడు కోతి…. అబ్బా మళ్లీ మొదటికే వచ్చారా. సరే అయితే నేను ఇద్దరు బండి ఎక్కుతాను ఆగండి అంటూ . ఇంటి లోపలికి వెళ్లి ఒక పెద్ద కర్రపుల్ల. రెండు తాళ్లు తీసుకొని వచ్చి ఆ బండికి ఈ బండికి వెనక అడ్డంగా కడుతుంది. దానిని చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్య పోతారు కోతి… ఇప్పుడు సరిపోతుంది నేను ఈ పుల్ల మీద పడుకుంటాను. నన్ను మీరు తీసుకు వెళ్ళండి అంటూ తాళాలు ఇస్తుంది వాళ్ళిద్దరూ తాళాలు తీసుకొని బండి మీరు కూర్చుని స్టార్ట్ చేస్తారు. కోతి ఆ పెద్ద కర్ర మీద పడుకొంటుంది . వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు . కోడలు… అబ్బా నా మొగుడు నన్ను బండి మీద తీసుకు వెళ్ళమంటే . తీసుకు వెళ్ళను అని అంటాడు. అందుకే కోపం వచ్చి మొన్న టైం కి పంచర్ చేశాను.
అత్త….. అందుకేనా మొన్న కోతిని పెడుతున్నాడు. పాపం టైర్ పంచర్ చేసింది కోతి అనుకున్నాడు.
కోతి… అనుకోవడం కాదు నేనే టైర్ పంచర్ చేశాను అని చెప్పింది. అందుకే వరుణ్ నన్ను తెగ తిట్టాడు.
కోడలు పెద్దగా నవ్వుతూ….. మరి ఏం చేయమంటావు నాకు భయం వేసింది. టైర్ పంచర్ చేయడం మా ఆయన చూశాడు అనుకొని నీ మీద తోసేసాను.
కోతి…. మీకంటే మీ అత్తయ్య వందరెట్లు నయం.
కోడలు…. మీరేం చేశారు అత్తయ్య.
అత్త…. ఒకే ఒక్కసారి బండి . ఇవ్వండి అన్ని మీ మామయ్య ని అడిగాను. నేను చెప్పను నీకు బండి ఇస్తే ఊరు మొత్తం తిరిగి వస్తున్నావు. అందుకే నీకు బండి ఇవ్వను.
అని తేల్చి చెప్పాడు నాకు భాగా కోపం వచ్చి .
బండి సీటు చించను . ముందు నైటు పగలు కొట్టాను. ఎవరో కావాలని పగలగొట్టారు అనుకున్నాడు. నేను మాత్రం కోతి మీద అసలు నింద వెయ్యలేదు.
కోతి…. అవును ఆ రోజు తిట్టు లన్ని ఎవర్నో తిట్టుకున్నాడు.
కోడలు…. అయినా అత్తయ్య ఈరోజు కోతి ఉంది కాబట్టి వాటిని తీసుకు వచ్చింది . రేపు కోతి లేకపోతే పరిస్థితి ఏంటి.
అత్త…. ఇంకేముంది నువ్వు మీ రూమ్ లో నేను మా రూమ్లో దుప్పటి కప్పుకొని పడుకుంటాము.
కోతి…. అంటే మీ ఉద్దేశం ఏంటి .నన్ను అప్పుడే పైకి పంపించాలనుకుంటున్నారా .
అందుకు అత్త కోడలు ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్లకి ఎదురుగా ఒక లారీ వస్తుంది దాన్ని చూసిన కోతి …. జాగ్రత్త నా ప్రాణం తీసే లాగా ఉన్నారు.
కోడలు… అయ్యో ఆ లారీ పక్కకు వెళ్లిపోయింది లే. నువ్వేమీ కంగారు పడకు.
కోతి…. కంగారు పడకుండా ఎలా ఉంటాను. అసలు కే.ఇప్పుడు నాకు కొత్త బాయ్ ఫ్రెండ్ పరిచయమయ్యాడు. వాడు రోజు నాకు ఆపిల్ పళ్ళు మామిడి పళ్ళు తీసుకుని వస్తాడు. అత్త…. ఒసేయ్ నీ మొహానికి మళ్ళీ బాయ్ ఫ్రెండ్ కూడా నా.
కోతి….. ఏంటి అలా అంటున్నావు మరి ఇద్దరం పక్క పక్క నిలబడి రోడ్డుమీద ఎవరిని పిలిచినా . నాకే గుద్దుతారు ఓట్లు .
అత్త…. ఓట్లు కాదే గిట్టేది నీ మొఖం మీద గుద్దుతారు. నీ కోతి చేష్టలు నా దగ్గర కాదు.
కోతి…. అయినా నేను నిన్ను ఎందుకు కదిలించాను. నువ్వే నన్ను కదిలించాను.ఎక్కువ మాట్లాడావంటే రేపు నా బాయ్ ఫ్రెండ్ కి చెప్తాను ఎక్కడపడితే అక్కడ
కొరికి పెడతాడు.
అత్త…. ఒసేయ్ ఎందుకొచ్చిన గొడవ లే కానీ ఆ పని మాత్రం చెయ్యకు. కావాలంటే ఈ సారి మా మొగుడులు మా మాట వినకపోతే
అప్పుడు నీకు చెప్తాను. మీ బాయ్ ఫ్రెండ్ కి చెప్పి వాళ్ల పిక్క పీక మని చెప్పు.
కోతి…. తప్పకుండా అలాగే చెప్తాను.అని అంటుంది అలా వాళ్ళు సరదాగా మాటలు చెప్పుకుంటూ చాలా దూరం వెళ్లి ఒక చోట ఆగుతారు. కోడలు… అత్తయ్య ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్లు నిద్రలేచి చూశారంటే మన పని గోవిందా. దీనికంటూ ఏదైనా పరిష్కారం వెతకడి అత్తయ్య.
కోతి…. ఎందుకంత భయపడుతున్నారు నేనొక ఉపాయం చెబుతాను వినండి మీ మొగుళ్ళు నిద్రలేచారు అంటే ఖచ్చితంగా మంచం కింద ఉన్న బండి తాళం చూస్తారు. అంతేకానీ మీరు ఎక్కడున్నారు అనేది చూడరు.
అత్త…. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావ్వు.
కోతి… ఎందుకంటే వాళ్ళకి వళ్లు బద్ధకం కాబట్టి. వాళ్ళు నిద్ర నుంచి లేచి బండి తాళం చూసి బండి తాళం లేకపోతే మీరు ఎక్కడున్నారు చూసి మీరు కూడా కనపడకపోతే బయట పెట్టిన బండ్లు ఉన్నాయా లేవా అని చూసే అంతా ఓపిక ఉండదు.
కోడలు.. అయితే ఇప్పుడు ఏమంటావు.
కోతి…. ఏమంటాను అచ్చం అలాగే ఉన్న డూప్లికేట్ తాలాలూ చేయిస్తే సరిపోతుంది అంటాను. కోడలు…. అబ్బా నీ బుర్ర నిండా ఎన్ని తెలివితేటలు ఉన్నాయా . అత్తయ్య ఇంకెందుకు ఆ సుబ్బయ్య ఇంటికి వెళ్లి డూప్లికేట్ తాళాలు చూపిద్దాం పదండి.
అందుకు ఆమె సరే అంటుంది ఇక ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కోడలు… సుబ్బయ్య గారు తలుపు తీయండి . సుబ్బయ్యగారు తలుపు తీయండి అంటూ కేకలు వేస్తోంది.
లోపల ఉన్న సుబ్బయ్య… ఈ అడుక్కునే వాళ్ళ కి వేలా పాల లేదు . ఏ టైం పడితే ఆ టైం లో వచ్చే ఆడుకుంటున్నారు . మా దగ్గర తినడానికి ఏమీ లేదు అటు వెళ్ళి రండి అంటూ పెద్దగా అరచి చెబుతాడు ఆ మాటలు విన్నా అత్త….హా హా హా ఒసేయ్ నీ గొంతు విని సుబ్బయ్య నిన్ను ఆడుక్కునేది అనుకున్నాడు .
కోడలు…. సరే అయితే మీరు పిలవండి.
అత్త…. ఒరేయ్ సుబ్బయ్య బయటికి రా రా నేను రామయ్య పెళ్ళాన్ని వచ్చాను .
అని పెద్దగా పిలుస్తుంది . ఆ మాటలు విన్న అతను బయటకు వచ్చి….. ఏంటి అమ్మ ఈ సమయంలో వచ్చారు . కొంపదీసి బండి తాళలు డూప్లికేట్ చేయించు కోవడం కోసమా.
ఆ మాటలకి అత్త కోడలి ఇద్దరు ఆశ్చర్యంగా నోరెళ్లబెడతారు.
దానిని చూసిన కోతి …. మీరిద్దరూ ఆశ్చర్యంగా నోరు తెరచింది చాలు కానీ.
నోరు మూయండి . ఆ నోట్లోకి ఈగలు దోమలే
కాదు. కప్పలు పాములు కూడా వెళ్లే ఎంత పెద్దగా ఉన్నాయి.
ఆ మాటలకి వాళ్లు తేరుకొని …. అది సరేగాని సుబ్బయ్య నీకు ఆ విషయం తెలిసింది . మేము ఖచ్చితంగా తాళలు కోసమే వచ్చాము అని.
అతను నవ్వుతూ… మీ మొగుళ్ళు కు మీ మీద నమ్మకం చాలా ఎక్కువ . అందుకే ముందు జాగ్రత్త కోసం నాకు ఈ విషయం చెప్పాడు. తాళాలు చెయ్యకుండా ఉండటం కోసం 10,000 రూపాయలు ఇచ్చాడు .
కోడలు…. వాళ్లు చూశారా అత్తయ్య. అన్ని చావు తెలివితేటలు.
అత్త…. చూస్తున్నా చూస్తున్నా.
కోతి…. మీరు ఇలా చూస్తూనే ఉంటారు కానీ సుబ్బయ్య పది వేలు కాదు . మా అత్త మెడలో ఉన్న గొలుసు 50000 ఖరీదు .
అది నీకు ఇస్తుంది . దాన్ని తీసుకొని తాళాలు తయారు చేసి ఇవ్వు.
అత్త… ఒసేయ్ కుదురుగా ఉండకుండా నన్ను ఇచ్చావ్ ఏంటి . నేను ఎప్పుడు చెప్పాను నీకు నా గొలుసు ఇస్తున్నాను అని .
కోతి… అయితే ఇవ్వ మాకు . అప్పుడు సుబ్బయ్య నీకు బండి తాళం కూడా చేసి ఇవ్వడు.
సుబ్బయ్య…. అవును కోతి సరిగ్గా చెప్పింది. ఇంక మీరు దయ చేయవచ్చు.
కోడలు…. ఏంటి అత్తయ్య మీరు ఇంకా ఆలోచిస్తున్నారు. నా మాట విని దాన్ని అతనికి ఇవ్వండి. మీరు ఇప్పుడు దాన్ని అతనికి ఇవ్వలేదు అంటే . మా చేతిలో రేపట్నుంచి బైక్ లు ఉండవు ఆ తర్వాత మీ ఇష్టం.
కోతి…. అవును ఇంక మనం జాలీగా బయట కూడా తిరగలేము.
ఆ మాటలు ఆమె… సరే అయితే ఇదిగో మాకు ఉన్న బైకు పిచ్చి కారణంగా 60 వేల రూపాయలు లాభం పొందావు.
అంటూ గొలుసు తీసి పిస్తుంది.
వెంటనే అతను దాన్ని తీసుకొని…. ఒక్క నిమిషం ఆగండి లోపలికి వెళ్లి తాళాలు తీసుకొన్ వస్తాను. అని లోపలికి వెళ్లి తాళాలు తీసుకుని వాళ్లకి ఇస్తాడు.
కోతి…. ఏంటి మీరు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇందులో ఆశ్చర్య పోవడానికి ఏమి లేదు . ఇలాంటిది ఏదో
జరుగుతుందని సుబ్బయ్య ముందు గానే.
తాళాలు ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాడు.
తెలివైన వాడు అని అంటుంది అందుకు అతను …. నాకంటే నువ్వు బలే నువ్వే తెలివైన దానివి. అన్నీ ముందే చెప్పేస్తున్నావ్వు. అని అంటాడు అందుకు వాళ్ళు … సరే ఇక వెళ్దాం పదండి. అని అంటుంది ఇక వాళ్ళు ఆ తాళాలు తీసుకుని అక్కడి నుంచి బైక్పై వెళ్ళిపోతారు.
ఇక ఇంటికి వెళ్లి ఏం తెలియనట్టు గా .
తాళాలు మంచం కింద పెట్టేస్తుంది ఆ కోతి.
ఆ మరుసటి రోజు అయిపోతుంది . ఇక మరుసటి రోజు రాత్రి నుంచి వాళ్ల డూప్లికేట్ తాళాలతో . ముగ్గురు బైక్ మీద జాలీగా తిరుగుతూ హాయిగా కేరింతలు వేస్తూ ఉంటారు. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం లాగా . ఈ అత్తా కోడళ్ళ తో పాటు ఆ కోతి కూడా బైక్ ల పిచ్చి అనుకుంటా . అందుకే ఒక గూటి పక్షులం ఈ ఒక్కచోటే చేరాయి.
మరి మీకు ఏ వస్తువు మీద పిచ్చి ఉందో కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *