బొంగులో చికెన్ 2 Bamboo Chicken |Telugu Kathalu| Telugu Story |Bedtime Stories| Panchatantra kathalu

అది సామర్లకోట అనే గ్రామం. అక్కడ రాధా అని అమ్మాయి ఉండేది. రాధా వాళ్ల నాన్న రమేష్ కి చికెన్ దుకాణం ఉండేది. రోజు రాధా ఇంకా రమేష్ లు నాని కి వెళ్లి చికెన్ విక్రయిస్తూ ఉండేవారు. వారి వ్యాపారం బాగా సాగుతుంది. వారికి చిన్న కోళ్ల ఫారం కూడా ఉండేది. రాధా ఆ కోళ్లను చూసుకుంటూ రమేష్ కి సహాయంగా ఉండేది.
రమేష్…….. అమ్మాయి రాదా నేను షాప్ కి వెళ్తున్నాను. నువ్వు కోళ్ళకి నీళ్లు పెట్టేసి వచ్చేసేయ్.
రాధా…….. అలాగే నాన్నా.
రమేష్………. తొందరగా రా తల్లి ఆలస్యం చేయకు.
అంటూ రమేష్ చికెన్ దుకాణం కి వెళ్తాడు.
రమేష్ వాళ్ళ తమ్ముడు సురేష్,, రమేష్ కి వ్యాపారంలో బాగా లాభాలు రావడంతో ఎలాగైనా రమేష్ వ్యాపారం దెబ్బ తీయాలనే ఉద్దేశంతో రమేష్ దుకాణానికి ఎదురుగానే తన కూడా చికెన్ దుకాణం పెడతాడు.
సురేష్………. రండమ్మా రండి తాజా తాజా చికెన్ కిలో వంద రూపాయలు మాత్రమే. కేజీ చికెన్ తీసుకున్న వాళ్లకి అర డజను గుడ్లు ఉచితం.
అంటూ సురేష్ గట్టి గట్టిగా అరుస్తూ వ్యాపారం చేస్తూ ఉంటాడు. దాంతో ప్రజలంతా సురేష్ దుకాణం వైపు పరుగులు తీస్తారు. రమేష్ ఇదంతా చూస్తూ ఉండిపోతాడు. రాధా ఈ విషయాన్ని అంత గమనిస్తూ ఉంటుంది.
రమేష్…… అమ్మాయి రాధా ఇవాళ గిరాకి ఏమీ లేదు. షాప్ కట్టేసి ఇంటికి వెళ్దాం.
అంటూ దిగాలుగా రమేష్ రాధా ఇంటికి చేరుకుంటారు. రమేష్ అదే ఆలోచిస్తూ పడుకుంటాడు. అలా మూడు నాలుగు రోజులు గడిచాయి. రమేష్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అలా వారం రోజులు గడిచాక. సురేష్ పూర్తిగా గిరాకీ పెరిగిపోతుంది.
రాధ…….. ఏమైంది నానా దిగాలుగా ఉన్నావు.
రమేష్…… వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాను. ఆ సురేష్ కావాలని మనకు పోటీగా దుకాణాన్ని పెట్టి నష్టానికి అయినా చికెన్ అమ్ముతున్నాడు. ఇదంతా నన్ను నష్ట పరచడానికి చేస్తున్నాడు.
రాధ….. అలాగే అయితే అతనికి కూడా నష్టం వస్తుంది కదా అంతా తక్కువ ధరకు చికెన్ నమ్మితే.
రమేష్…….. వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. వాడు ధనవంతుడు కావటంవల్ల వాడికి నష్టం తో పనిలేదు కేవలం నా వ్యాపారాన్ని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో వాడు వ్యాపారం ప్రారంభించాడు.
రాధా……. అలా అయితే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న. కొత్త వ్యాపారం ఏదైనా ప్రారంభిద్దాం.
రమేష్…… చూద్దాం చిట్టి తల్లి మెల్లిగా ఆలోచిద్దాం.
అలా కొన్ని రోజులు గడిచాక రమేష్ ఆనారోగ్యం పాలై మంచాన పడతాడు. దాంతో రాదా చేసేదేమీలేక ఇంట్లో ఉండి నాన్నగారిని చూసుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ కోళ్లు కూడా చనిపోతూ ఉంటాయి.
ఇదిలా ఉండగా ఒక రోజు ఒక సాధువు రాధా ఇంటి వైపు గా వస్తాడు. అమ్మ ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా పెట్టండి అన్నం తిని మూడు రోజులు అయింది.
రాధా…… రండి కాళ్ళు చేతులు కడుక్కోండి. భోజనం వడ్డిస్తాను.
అంటూ సాధువుని ఇంట్లోకి తీసుకెళ్తుంది. భోజనం వడ్డించి సాధువు ఆకలి తీరుస్తుంది. దానికి సంతోష పడిన సాధువు అన్నదాత సుఖీభవ. ఏ కన్న బిడ్డఓ ఈ పూట నా ఆకలి తీర్చావు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.
రాధా…….. ఇంకెక్కడి సంతోషం సాధువుగారు అనారోగ్యం కారణంగా మంచాన పడ్డారు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. మా బాబాయి మా నాన్న మీద కోపంతో ఆయన వ్యాపారాన్ని దెబ్బతీశాడు.
సాధువు….. నువ్వేం దిగులుపడకు మంచి వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది.నా ఆకలి తీర్చినందుకు ప్రతిఫలంగా నీకు ఈ వెదురు మొక్కలను ఇస్తాను. ఇవి చాలా మహిమాన్వితమైనది. వీటిలో ఎటువంటి పదార్థం వండిన ఆ రుచి ఆమోగంగా ఉంటుంది. అంటూ వెదురు మొక్కలను రాధా చేతిలో పెట్టి వాళ్ళ నాన్న గారికి అనారోగ్యం నయం అయ్యేలా చేస్తాడు.
రాధా…… మీరు నాకు ఏమి అవుతారని ఒక పూట భోజనం పెట్టినందుకు నాకు ప్రత్యుపకారంగా ఈ సహాయాన్ని చేసి పెట్టారు. సొంత బాబాయ్ మాత్రం మమ్మల్ని దెబ్బతీశాడు.
అంటూ రాధ బాధ పడుతూ ఉంటుంది. ఇంక వెళ్ళొస్తా నువ్వేం దిగులుపడకు అంతా మంచి జరుగుతుంది. ఆ రోజు నుంచి రాధా బొంగులో చికెన్ ను తయారు చేసి షాప్ లో అమ్ముతూ ఉంటుంది. అది తిన్న వారంతా అమోఘంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తారు. దాంతో రాధ వల్ల వ్యాపారం బాగా వృద్ధిలోకి వస్తుంది. ఆ చూసి సురేష్ మళ్లీ వారి వ్యాపారం దెబ్బ తీయాలనే ఉద్దేశంతో తను కూడా బొంగులో చికెన్ తయారు చేసి తక్కువ ధరకే అమ్ముకుంటాడు.
రాధా…….. వీడు మనల్ని వదిలేలా లేడు నాన్న. మనం ఏ వ్యాపారం ప్రారంభిస్తే దానికి పోటీగా వాడు వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.
రమేష్…….. నువ్వేం బాధపడకు. వాడికి తగిన శాస్తి జరుగుతుంది చూస్తూ ఉండు.
సురేష్ తక్కువ ధరకే ఈ బొంగులో చికెన్ అమ్మే నా అది రుచిగా ఉండకపోవడం తో రాధా ఆమె బొంగులో చికెన్ ని ఎక్కువగా కొనుక్కుని తింటూ ఉంటారు. దాంతో
సురేష్…… ఫ్రీగా బొంగులో చికెన్ ఫ్రీగా బొంగులో చికెన్. అంటూ అరుస్తూ ఉన్న ఆస్తంతా అమ్మి చికెన్ అందరికీ పంచి పెడుతూ ఉంటాడు.
చివరికి ఉన్న ఆస్తి అంతా పోయి బికారి గా మారిపోతాడు.
తండ్రి కూతురు ఇద్దరు వ్యాపారాన్ని వృద్ధి చేస్తూ మరికొన్ని చోట్ల పని వాళ్ళని ఏర్పాటుచేసి బొంగులో చికెన్ ని అమ్ముతూ ధనవంతులుగా మారిపోతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *