బొంగులో చికెన్ | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

పద్మ పూర్ గ్రామంలో బేబీ అనే ఒక పాప ఉండేది. వాళ్ళ తండ్రి శ్యామ్ కి ఆ ఊరిలో ఓ పెద్ద చికెన్ షాప్ ఉంది అది చాలా బాగా సాగి పోతూ ఉండేది. అయితే తన శత్రువు అయినా కిరణ్ తన షాపుని ఎలా నాశనం చేయాలని అనుకుంటాడు. అందుకోసం అతను పోటీగా ఒక షాపును శ్యామ్ షాపుకి ఎదురుగా ఏర్పాటు చేస్తాడు.
అతను వచ్చేపోయే వ్యక్తులతో…… రావాలి బాబు రావాలి రావాలి రావాలి తాజా తాజా చికెన్. 24 గంటలు సౌకర్యం కలదు. మీ కళ్ళ ముందే తాజా చికెన్ మీకు అందించబడును. ధర చాలా తక్కువ. రావాలమ్మా రావాలి రావాలి బాబు రావాలి. ధర తక్కువ కేజీ కేవలం 50 రూపాయలు మాత్రమే. అని కేకలు వేస్తూ ఉంటాడు.
ఆ మాటలు విన్న జనం కిరణ్ దగ్గరికి క్యూలు కడతారు. దానంత చూసిన శ్యామ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో బేబీ తన తండ్రికి భోజనం తీసుకొని వస్తుంది. తండ్రి కున్నదా కూర్చుంటాడు షాపు ఎదురు జనాలను చూసి….. నాన్న ఏంటిది నాన్న షాపు అంత మంది జనాలు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటుంది అతను…. కిరణ్ మనకు పోటీగా ఒక షాపు ని పెట్టాడు అమ్మ. అక్కడ కేజీ 50 రూపాయలు చికెన్ అంట అందుకే జనాలందరూ అక్కడికి వెళ్లారు .
ఆ మాటలు విన్న బేబీ….. అదేంటి నాన్న చికెన్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఆయన 50 రూపాయలకు అమ్మితే ఆయనకు
నష్టం రాదా అని అంటుంది .
శ్యామ్…. కచ్చితంగా వస్తుంది అమ్మ కానీ వాడు నా మీద కోపంతో కావాలనే ఇదంతా చేస్తున్నాడు వాడి దగ్గర చాలా డబ్బు ఉంది కదా. అంత మంది జనం వస్తున్నారు కాబట్టి నష్టం ఉండదు . అలా అని లాభం కూడా ఉండదు. అని బాధగా చెబుతాడు.
బేబీ…. కానీ ఇలా ఎందుకు నాన్న. అని అంటుంది అతను ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్దాం పద అన్నీ షాపు మూసివేసి ఇంటికి వెళ్తాడు రోజు గడిచి పోతుంది . ఆ మరుసటి రోజు కూడా అదే తంతు అలా వారం పైగా జరిగిపోతూ ఉంటుంది ఒక్కరు కూడా శ్యామ్ దగ్గరికి రారు. అతను చాలా బాధగా ఇల్లు చేరుకొని ఉంటాడు బేబీ…. నాన్న మనం మరో వ్యాపారం ఏమన్నా చేద్దాం. ఆయన మనకు పోటీగా వచ్చాడు కదా మీరు అసలు కొన్ని రోజుల నుంచి మనిషి మనిషిగా లేరు . నాకు అర్థం అవుతుంది. అతను చాలా బాధపడుతూ….. అమ్మ వారం రోజుల నుంచి నేను కోళ్ల గురించి పట్టించుకోవడం లేదు చాలా కోళ్లు చనిపోయాయి. నువ్వైనా వాటి గురించి పట్టించుకోవాల్సిన అమ్మా. వ్యాపారంలో మనకు చాలా నష్టం వచ్చింది.
అని చాలా బాధగా చెబుతాడు ఎందుకు బేబీ…. నాన్న నేను కోళ్లను చూసుకోవడానికి నాకు ఏం తెలుసు అని. ఇదంతా కిరణ్ బాబాయ్ చేసిన పని. జరిగిందేదో జరిగిపోయింది నాన్న మనం మరో వ్యాపారం మొదలు పెడదాం. అని అంటుంది అందుకు అతను సరేలే అన్నట్టుగా. వెళ్ళిపోతాడు.
అతను దాని గురించి ఆలోచిస్తూ మంచాన పడ్డాడు.
బేబీ తన తండ్రిని చూసి చాలా బాధపడుతుంది. ఆమెకు ఏం చేయాలో అసలు అర్థం కాదు. ఆమె చాలా బాధ పడుతూ ఉంటుంది తన తండ్రికి ఏమన్నా అవుతుందేమో అని .
అప్పుడే అనుకోని అతిధి అక్కడికి వస్తాడు.
అతను బేబీ వాళ్ళ ఇంటికి వస్తాడు .
అక్కడ బేబీతో ….. పాపా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను చాలా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా.
బేబీ సరే అని చెప్పి…. లోపలికి రండి అని పిలుస్తుంది రా రా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. మంచం పై పడుకున్న అతన్ని చూసి….. ఎవరు అతను ఏం జరిగింది అమ్మ.
బేబీ ఏడుస్తూ…. ఆయన నా తండ్రి. ఆయనకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. మాకు చికెన్ వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో నష్టం రావడంతో మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. అది కాకపోతే మరో వ్యాపారం మనం చేద్దాం అన్న మా నాన్నకి మనసులో బలంగా ఆ విషయం నాటుకుపోయింది . కిరణ్ అనే వ్యక్తి మాకు పోటీగా పెట్టి మమ్మల్ని ఇలా నష్ట పరిచాడు అంటూ ఈ బాధ పడుతూ చెబుతుంది . అందుకు అతను సరే అని చెప్పి అక్కడ కూర్చుంటాడు ఆమె భోజనం వడ్డిస్తుంది అతను భోజనం చేసిన తరువాత.
….. అమ్మ నా ఆకలి తీర్చావు ఇప్పుడు నీకు నేను సహాయం చేసి నా రుణాన్ని తీర్చుకుంటాను. అని చెప్పి తనతో పాటు తెచ్చుకున్న సంచి లో నుంచి రెండు ఎదురు పొంగులని తీసి ఆమెకు ఇస్తాడు.
ఆమెకు ఏమీ అర్థం కాదు అతను…. పాపా ఇవి చాలా మహిమగల ఎదురు బొంగులు దీనిని మీరు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. దీనిలో చికెన్ వండితే ఎంతో రుచిగా ఉంటుందో. అలాంటి రుచి ఎక్కడా దొరకదు. ఈ మహిమ గల బొంగులు కూడా మీకు ఎవరూ ఇవ్వలేరు. భగవంతుని దయవల్ల నాకు వచ్చాయి నా ద్వారా మీకు ఇస్తున్నాను జాగ్రత్తగా వాడుకోండి అమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అప్పుడే బేబీకి బాంబు చికెన్ తయారు చేయాలని నిర్ణయించుకుంది ఆమె అనుకున్న విధంగానే మరుసటి రోజు వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్లి బొంగులో చికెన్ తయారుచేసి….. రావాలి రావాలి అందరూ రావాలి రుచికరమైన బొంగులో చికెన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు మళ్లీ మళ్లీ కావాలి అంటారు అని పిలుస్తూ ఉంటుంది.
కానీ ఎవరూ అక్కడికి రారు దాన్ని చూసి కిరణ్ నవ్వుకుంటూ ఉంటాడు .
తర్వాత ఒక డబ్బున్న వ్యక్తి బాగా ఆకలి వేయడంతో అక్కడికి వస్తాడు అతనికి తినడానికి చుట్టుపక్కల బేబీ తయారు చేసిన బొంగులో చికెన్ తప్ప ఏమీ దొరకదు. చేసేది ఏమీ లేక అక్కడికి వెళతాడు. ఆమెను చికెన్ అడుగుతాడు. ఆమె చికెన్ ఇస్తుంది దాని తీనీ అతను చాలా బాగుంది. అని చెప్పి వాటిని తిని పార్సెల్ కూడా తీసుకొని. ఆమెకు చాలా డబ్బు ఇచ్చి…. ఆకలి తీర్చడమే కాదు అద్భుతంగా ఉంది ఈ బొంగులో చికెన్. అంటూ అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. చాలా ఆశ్చర్య పోతాడు. ఒక్కరోజే కదా అన్నట్టుగా వదిలేస్తాడు. పాప జరిగిన విషయమంతా తండ్రికి చెబుతుంది. అతను కొంత పడతాడు అలా ప్రతిరోజూ పాపా బొంగులో చికెన్ తయారు చేస్తుంది కొద్దికాలంలోనే అది చాలా చాలా మంచి పేరు తెచ్చుకుంది అందరూ దాన్ని తినడానికి ఇష్టపడతారు. తను చూసి తండ్రి ఆరోగ్యం కూడా చాలా కుదుటపడుతుంది అతను కూడా పాప తో కలిసి చికెన్ చేస్తాడు.
వాళ్లు పోగొట్టుకుంది అంతా కేవలం నెల రోజుల్లోనే సంపాదించుకుంటారు.
దాన్ని చూసి కిరణ్ పోటీగా బొంగులో చికెన్ పెడతాడు. తక్కువ రేట్ కావడంతో మళ్లీ అందరూ ఆక్కడికి . కానీ బేబీ చేసే అంత రుచిగా ఉండకపోవడం తో . తనకి నష్టం వస్తుంది. అయినా కూడా అతను స్వార్థంతో ఇంకా ఫ్రీగా బొంగులో చికెన్ అమ్ముతాడు.
జనాలు ఫ్రీగా తీసుకెళ్తుంటే ఉంటారు . కానీ రుచి బాగోక పడేస్తారు. అతను వాటిని ఫ్రీగా ఇవ్వడంతో అతను తీవ్రంగా నష్టపోయి లబోదిబో అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తాడు .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *