బొజ్జ గణపయ్య- గర్భవతి కోతి బొజ్జ వినాయకుడు గర్భవతి కోతి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కర్ణ పురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పెద్ద సుమన్. అతని ప్రాణస్నేహితుడు నరేంద్ర. ఒకరోజు సుమన్ నరేంద్ర దగ్గరకు వచ్చి….. ఏంట్రా నరేంద్ర పండగ హడావిడి ఎలా ఉంది.

నరేంద్ర.. కొత్తగా అడుగుతున్నావ్ ఏంట్రా నువ్వు లేకుండా పండుగ అసలు జరుగుతుందా. ఎప్పట్లాగే ఆకాశమంత పందిరి వేసి పెద్ద వినాయకుని తీసుకొచ్చి హడావిడి చేసేయాలి. సుమన్…. అందుకోసమే రా వచ్చింది మరి పండగ పనులు మొదలు పెడదాం పద అంటూ ఇద్దరూ మరొకరితో కలిసి పందిరి వేస్తారు పందిరి వేయడం ముగిస్తుంది. నరేంద్ర… పందిరి పని అయిపోయింది ఇక ఎల్లుండి పండగ. మరి ఆలస్యం చేయకుండా విగ్రహాన్ని తీసుకొద్దాం. అని అనుకొని పట్టణానికి వెళ్ళి విగ్రహాన్ని కూడా తీసుకువచ్చి స్థాపిస్తారు. ఇక పండగ రోజు రానే వచ్చింది. అక్కడ ప్రజలు విగ్నేశ్వరుని ప్రార్థిస్తూ రకరకాల పిండివంటలు అక్కడ ఉంచుతారు. ఇంతలో ఒక అనాధ పిల్లవాడు దేవుని మందిరంలో కి వచ్చి నమస్కరించి …. స్వామి వినాయక నువ్వే నన్ను కాపాడాలి. నాకు అమ్మానాన్న ఎవరు లేరు. ఏ దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు కదా అందుకే నీ శరణుకోరి వచ్చాను. అంటూ ఏడుస్తూ ప్రార్థిస్తాడు.
దాన్ని అంత చూస్తున్నా సుమన్ నరేంద్ర లు ఆ పిల్ల వాడి దగ్గరికి వచ్చి… ఏరా ముస్టోడివా నీ అవతారం బట్టలు చూస్తే అలాగే ఉంది . వెళ్ళు వెళ్ళు బయటికెళ్ళి నుంచో ఇంకా ప్రసాదాలు కాలేదు వెళ్ళు. అంటూ అతన్ని బయటికి లాగేస్తారు. పాపం ఆ పిల్లవాడు…. నేను ప్రసాదం కోసం రాలేదండీ. నన్ను వదిలేయండి నేను స్వామి తో మాట్లాడాలని వచ్చాను. అని మాట్లాడుతున్న అది మాటలు పట్టించుకోలేదు. మా పిల్లవాడు చేసేది ఏమీ లేక ఏడ్చుకుంటూ దగ్గర్లో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. ఆ దృశ్యం మొత్తం చెట్టుపై ఉన్న గర్భవతి కోతి చూసి తనలో…. అయ్యో ఏ కన్న తల్లి బిడ్డ. అనాధగా మిగిలిపోయాడు. ఆ మనుషులు కొంచెం కూడా జాలి లేకుండా పిల్లల్ని నెట్టేశారు. పిల్లవాన్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. అని అనుకొని ఆ చెట్టు దిగి వచ్చి ఒక చోట కి వెళ్తుంది అక్కడ మట్టితో చేసిన చిన్న వినాయకుడు ఉంటాడు. ఆ మట్టి వినాయకుని ఆ కోతి తీసుకుని చిన్నగా నడుచుకుంటూ ఆ పిల్ల వాడి దగ్గరికి వచ్చి … బాబు ఇదిగో తీసుకో మట్టి వినాయకుడు. నువ్వు ఇష్టం వచ్చినంత సేపు . ఆ భగవంతుని ప్రార్థించు కోవచ్చు. నిన్ను ఎవరు అడిగేవారు లేరు అని అని తన మనసులో అనుకుంటూ ఆ పిల్లవాడు చాలా సంతోష పడుతూ ఆ విగ్రహాన్ని తీసుకుని ఆ చెట్టు దగ్గరే ఉంచుతాడు ఇంతలో కోతి ఆ చెట్టు ఈ చెట్టు అన్ని తిరిగి రకరకాల పండ్లు తీసుకొని వస్తుంది. ఆ పండ్ల నీ ఆ వినాయకుని ముందు పెట్టి కోతి మరియు ఆ పిల్లవాడు ఇద్దరూ ఆ గణేశుని ప్రార్ధిస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత పందిరి లో వినాయకుని పూజ పూర్తి అవుతుంది. సుమన్ నరేంద్ర ఒక మైక్ లో…. గణేష్ పందిరి వద్ద. తీర్థప్రసాదాలు పెడుతున్నారు కావున భక్తులు విచ్చేసి. తీర్థప్రసాదాలు స్వీకరించి. స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము.
అని చెప్తారు. వారి మాటలు విన్న ప్రజలు … త్వరగా పదండి ప్రసాదం ఇస్తున్నారట. అని చెప్పి ఆ పందిరి వద్దకు వెళతారు. అప్పుడు ఆక్కడ నరేంద్ర సుమన్ తో…. సుమన్ సుమన్ నేను చెప్పేది ఒకసారి విను ఇక్కడ ప్రసాదం ఒక్కటి కూడా మిగల్లేదు.
దానిని విన్న అతను చాలా ఆశ్చర్యపోతూ…
ఏంట్రా నువ్వు అనేది ఉండక పోవడం ఏంటి.
అని వెళ్లి అక్కడ పాత్రను చూస్తాడు ఆ పాత్రలన్నీ ఖాళీగా ఉంటాయి. వచ్చిన ప్రజలకి ఏం చెప్పాలో అర్థంకాక సతమతమవుతుంటారు. అప్పుడు నరేంద్ర అందరికీ…. క్షమించాలి ఏదో చిన్న పొరపాటు జరిగింది ప్రసాదం ఇప్పుడు పెట్టడం లేదు. కొంత సమయం తర్వాత మేము మళ్ళీ చెప్తాము అని అంటారు వచ్చిన వాళ్లంతా…. ఏంటి ఇలా చేశారు అలాంటప్పుడు పిలవడం ఎందుకు. అంటూ వాళ్లని తిట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే ఆ చిన్నవాడు …. రండి రండి ఇక్కడ విగ్నేశ్వరుని ప్రసాదం పెడుతున్నాము. అంటూ వాళ్లని పిలుస్తాడు అందరూ ఆ చిన్న మట్టి వినాయకుడి దగ్గరికి వెళ్తారు అక్కడ కోతి మరియు ఆ పిల్లవాడు ఇద్దరు వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇస్తూ ఉంటారు. దాన్ని చూసిన నరేంద్ర సుమన్…
ఏంట్రా ఆ బిచ్చగాడి దగ్గరికి ప్రసాదం ఎలా వచ్చింది. వీడేదో మాయల మాంత్రికుడు లా ఉన్నాడు. పద వాడి సంగతి ఏంటో చూద్దాం. అని అనుకుంటూ కోపంగా పిల్ల వాడి దగ్గరికి వస్తారు. ఆ పిల్లవాడు వాళ్లకు కూడా ప్రసాదం ఇవ్వబోతున్న గా వాళ్ళు దానిని కిందపడేసి… ఏరా ఇదంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అసలు నువ్వు ఎవరు. అంటూ కోపంగా గదుముతాడు అక్కడి వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆ గర్భవతి అయిన కోతి…. మీరు పవిత్రమైన ప్రసాదాన్ని కింద పడేశారు పైగా. పిల్లవాణ్ణి తిడుతున్నారు ఎందుకు అలా చేస్తున్నారు మీరు. అంటూ సైకలు చేస్తూ కోపంగా వాళ్ళపై తిరగబడుతుంది. వాళ్లు వెంటనే ఆ కోతిని దూరంగా విసిరి కొడతారు. అప్పుడా కోతి కిందపడి… విగ్నేశా గణపయ్య ఎక్కడున్నావు. నీ కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతుందో చూడు. త్వరగా రా గణపయ్యా అంటూ కోతి గణేషుని ప్రార్థిస్తుంది. వెంటనే అక్కడున్న గణేష్ మట్టి విగ్రహం గణేశుని గా మారి వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. దేవుణ్ణి చూసినవాళ్లంతా గజగజ వణికి పోతారు.
అప్పుడు గణేశుడు…. ఎందుకు మీరు పిల్లవాణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. ఈ పిల్లవాడి కి నేనే ఆహారపదార్థాలు అందజేశాను. ఇప్పుడు చెప్పండి. మీరు ఏం చెప్పదలచుకున్నా రో.
అందుకు నరేంద్ర సుమన్ చాలా భయపడుతూ….. స్వామి మమ్మల్ని క్షమించండి మీరు ఇలాగా చేశారని అనుకోలేదు ఈ పిల్లవాడు ఏదో మాయ చేసాడని అనుకున్నాం.
గణేశుడు…. అసలు మీ ఇద్దరూ నన్ను స్థాపించడానికి కారణమేంటి. ఉదయం అంతా పూజలు చేస్తారు సాయంత్రం భక్తి పాటలు బదులు మీ ఇష్టం వచ్చిన పాటలు పెడతారు. అలాగే నా ముందు కుప్పిగంతులు వేస్తారు. దాని వల్ల ఉపయోగం ఏంటి. అని అని అంటాడు అక్కడున్న ప్రజలు స్వామి మాటలకి ఆశ్చర్యపోతూ…. స్వామి చెప్పిందంతా నిజమే కదా. వీళ్లు పొద్దంతా పూజలు చేస్తారు సాయంత్రం మందు తాగి ఇష్టం వచ్చినట్టు గా ఎగురుతూ ఉంటారు.
రాత్రి సమయం అయినా సరే వాటిని అలాగే మోగిస్తూ ఉంటారు నిద్ర లేకుండా చేస్తారు. అని చెప్పుకుంటూ ఉంటారు గణపయ్య… ఏమైంది ఏం మాట్లాడకుండా ఉన్నారు. నన్ను స్థాపించి నలుగురికి మంచి చేయమని చెప్పాలి గానీ చిన్న పిల్లవాడు అని చూడకుండా బయటకు నెట్టేశారు. అసలు నాకు కావాల్సింది మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థించే వాళ్లే మీలా ఆడంబరాలు చేసేవాళ్లు కాదు. మట్టి విగ్రహానికి మీరు ఏవేవో తయారుచేస్తారు తర్వాత నిమజ్జనం రోజు నీటిలో ఉంచుతారు దానివల్ల ఎంత వాతావరణ కాలుష్యం అవుతుంది. ఆలోచించారా. ఇంతలో ఆ కోతి … స్వామి స్వామి వీళ్ళు ఆ పిల్ల వాడిని కాదు గర్భవతి అని కూడా చూడకుండా నన్ను నేలకేసి కొట్టారు. అంటూ ఏడుస్తూ చెప్తుంది.
గణేశుడు…. మీ కోపాలు చిన్న పిల్లల మీద జంతువుల మీద చూపిస్తే ఏం ప్రయోజనం. మీ కంటే ఈ కోతి వంద రెట్లు మేలు చేసినట్టే ఆ పిల్లవాడికి నన్ను దగ్గర చేసింది. మనస్పూర్తిగా నన్ను స్మరించుకునే అవకాశం కలిగించింది.
జంతువు కున్న తెలివి మీ ఇద్దరికీ లేకుండా పోయింది. అందుకు వాళ్లు… స్వామి మమ్మల్ని క్షమించండి. మేము చేసింది చాలా పొరపాటు ఇకమీదట ఎప్పుడూ కూడా ఇలా చెయ్యను మట్టి విగ్రహాన్ని తీసుకు వచ్చి నిష్టనియమాలతో నిన్ను పూజిస్తాము నీ కథ గురించి అందరికీ చెప్తాము.
గణేశుడు…. చూడండి పెద్ద పెద్ద గా నా విగ్రహాలు స్థాపించి నన్ను పూజించాల్సిన అవసరం లేదు మనస్పూర్తిగా నన్ను తలుచుకుంటే చాలు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను సిద్ధిస్తాను. మీరు నా విగ్రహాన్ని స్థాపించి ఇష్టంగా చేస్తున్నారు. కాబట్టి మీరు ఇంట్లో అయినా ఎక్కడైనా నియమనిష్టలతో ప్రార్థించండి అదే చాలు.
అని అంటారు ఎందుకు వాళ్ళందరూ స్వామికి నమస్కరించి…. అలాగే స్వామి తప్పకుండా మేము అలాగే చేస్తాము. జై గణేశా జై జై గణేశా. అంటూ ఉంటాడు కోతి పిల్లవాడు కూడా స్వామి కి చేతులు జోడించి నమస్కరిస్తూ…. జై గణేశా జై జై గణేశా. అంటూ జేజేలు కొడుతూ ఉంటారు స్వామీజీ వాళ్ళందరిని చూసి చాలా సంతోష పడుతూ…భక్తులారా నేను మీ కోసం కైలాసం దిగి వచ్చాను. మరి మీరు నా కోసం నాకు ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు పెట్టరా. అంటూ అడుగుతాడు అందుకు వాళ్లు….. ఓ బొజ్జ గణపయ్య నీ కాక ఇంకెవరికి ఇవన్నీ అంటూ వాటన్నిటినీ స్వామికి వడ్డిస్తారు. ఆ బొజ్జ గణేశుడు తన కడుపునిండా వాటన్నిటినీ భుజించి. వాళ్లతో నా పట్ల ఇంత ప్రేమను చూపిస్తున్న మీ అందరికీ నేను వరాన్ని ఇస్తున్నాను నా కథని విన్న వాళ్లు చదివిన వాళ్ళు కు వాల్ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్లకి ఎలాంటి లోటు ఉండదు. వీరంతా దీర్ఘాయుష్మంతుడు గా అవుతారు అంటూ వాళ్ళందర్నీ దీవించి అక్కడినుంచి మాయమైపోతారు.వాళ్ళందరూ దేవుడు ప్రత్యక్షమై నందుకు చాలా సంతోష పడుతూ జై గణపయ్య జై జై గణపయ్య. అంటూ దేవుడు నామ స్మరణ చేసుకుంటారు. అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
కోతి… చూశారు కదా గణపయ్య ఏం చెప్పాడో. మట్టి గణపయ్యను తీసుకొద్దాం. ఆయన్ని పూజించి నిమజ్జనం చేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం. అలాగే చవితిరోజు గణపయ్య కథలు వినండి. చంద్రుని చూడకుండా గణపయ్య ని పూజించండి.అది కూడా నిష్టగా మనస్ఫూర్తిగా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *