భయంకరమైన పెద్ద చేప | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

కేంద్ర పూడి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం నది ఒడ్డున ఉండేది . అక్కడి ప్రజలందరూ ఆ నది మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు. అదే ఊర్లో విష్ణు అనిత అనే దంపతులు ఉండేవాళ్ళు. విష్ణు ప్రతిరోజు చేపలు పట్టి ఆ చేపల మీ బ్రతికే వాళ్ళు వాళ్ళకి ఒక కూతురు.మీనా మీనా ప్రతి రోజు బడికి వెళ్లి చక్కగా చదువుకుంటుంది .
అలా ఉండగా ఒకరోజు మీ నా పుట్టిన రోజు వస్తుంది తల్లిదండ్రులిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
భార్య…. ఏమండీ రేపు మా అమ్మాయి పుట్టినరోజు కదా . పట్టణ వెళ్లి కొత్త బట్టలు తీసుకొని వద్దాము. అందుకు అతను… సరే ఈరోజు పని మానుకొని ఇంటి దగ్గరే ఉంటాను నీ పనులు త్వరగా ముగించుకుoటే పట్టణం వెళ్దాము. అందుకు ఆమె సరే అంటుంది ఇక ఇద్దరూ కలిసి పాపకు బట్టలు కొనడం కోసం
పట్టణానికి బయలుదేరి వెళ్తారు. మార్గ మధ్యలో ఒక కారు యాక్సిడెంట్ జరిగి వాళ్ళు అక్కడికక్కడే మరణిస్తారు.
ఇది ఇలా ఉండగా సాయంత్ర సమయం మీనా స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు లేకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఎప్పటికీ రారు . ఆమె మనసులో భయం మొదలవుతుంది. అలాగే భయపడుతూ ఉంటుంది చాలా సమయం అవుతుంది చీకటి పడడంతో. ఆ పాప చాలా బాధపడుతూ…. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ చాలా బాధపడుతు. ఏడుస్తూ అక్కడి నిద్రపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళ మామయ్య తల్లిదండ్రుల సవాలుగా తీసుకొని అక్కడికి వస్తాడు. అక్కడ అంతా గందరగోళంగా ఉండటంతో ఒక్కసారిగా పాప నిద్ర నుంచి మేల్కొంటుంది. ఆమెకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక తల్లిదండ్రుల శవాలను చూసి బోరున ఏడుస్తుంది…… అమ్మ నాన్న ఒకసారి లేవండి. అమ్మ నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ల మామయ్య తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా ముగించేస్తాడు.
పాప అక్కడే ఒంటరిగా ఉంటుంది వాళ్ళ మామయ్య….మీనా ఇంటికి వెళ్దాం పద. నువ్వు తిండి తిని ఎన్ని రోజులు అవుతుంది.
ఆమె…. వద్దు మావయ్య నాకు తిండి తిప్పలు ఏమి వద్దు నేను కూడా మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి పోతాను నన్ను వదిలేయ్ . ఆంటీ ఏడుస్తుంది అతను …. మీనా పిచ్చి పిచ్చి గా మాట్లాడకు ఇంటికి వెళ్దాం పద అంటూ ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకు వెళ్తాడు. వాళ్ళ అత్త ఆమెకు భోజనం తినిపిస్తుంది.
ఇక పాప అక్కడే ఉంటుంది. కొన్ని రోజులు బాగానే గడిచాయి కానీ వాళ్ళ అత్త ఆ పాప ని
సరిగ్గ చూసుకోదు దాన్ని అర్థం చేసుకున్నాను మీనా తన మనసులో…. ఎంతకాలం అని చెప్పి ఒకటి మీదనే ఆధారపడి బ్రతకాలి. అందరూ పుట్టుకతోనే అన్ని ఇద్దరు నేర్చుకోలేదు కదా. నేను నా కాళ్ళ మీద నిలబడి గలను. పట్టుదల ఉంటే వయసుతో ఎలాంటి సంబంధం ఉండదు. కష్టాలను జయించగలను. ఇక్కడ నేను ఉండడం మా అత్తకి ఉండడం అస్సలు ఇష్టం లేదు . ఎప్పటికైనా మా మధ్య ఏదో ఒక గొడవ వస్తుంది అదేదో ఇప్పుడే వాళ్ల దగ్గర నుంచి తప్పుకుంటే. సరిపోతుంది . అని అనుకొని అక్కడి నుంచి చెప్పా చేయకుండా పక్క ఊరికి వెళ్ళిపోతుంది. వాళ్ళ మావయ్య మీ నా కోసం చాలా వెతుకుతాడు కానీ ఆమె ఎక్కడా కనిపించదు.
అతను చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక కొన్ని రోజులు గడిచాయి . ఆమె ఆ పక్క ఊరు నుంచి కూడా వెళ్ళిపోయి సింహాచలం అనే గ్రామానికి చేరుకుంటుంది.
ఆమె ఒక చోట కూర్చొని …. అమ్మ ఆకలి చాలా ఆకలి వేస్తుంది నాకు . అంటూ చాలా బాధపడుతుంది అప్పుడే ఒక ముసలి వ్యక్తి .
అక్కడికి వస్తాడు ఆ పాపను చూసి…. ఎవరు నువ్వు అని అడుగుతాడు పాప…. తాత నాకు ముందు వెనక ఎవరూ లేరు . ఎటు వెళ్లాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను . నాకు ఇక్కడ తెలిసి వాళ్ళు ఎవరూ లేరు. అంటూ సమాధానం చెప్పింది . అతను ఆమె మీద జాలిపడి …. అయ్యో పాపం చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు అమ్మ . మాది ఆ పక్క గ్రామం ఈ నది దాటి వెళ్లాము అంటే మా ఇల్లు
వస్తుంది నాతోపాటు వస్తావా అని అంటాడు అందుకు పాపా సరే అంటుంది . ఆ తర్వాత అతను పడవలో ఆమెను తీసుకొని. పక్క ఊరికి వెళ్తాడు అక్కడ ఆమెను తన ఇంటికి తీసుకు వెల్తాడు అక్కడ ఆమె తినడానికి భోజనం ఇస్తాడు పాప. భోజనం చేసి అతనితో…. పాప నీకు ముందు వెనక ఎవరూ లేరా. అని అడుగుతుంది అతను…. లేరమ్మ నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి ఏదో పని చేసుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పడవ నడుపుతూ డబ్బులు సంపాదించుకున్నాను. నాకు పెళ్లి కాలేదు పెళ్ళాం పిల్లలు లేరు. అది అంటాడు అందుకు ఆమె…. పాపం నాలాగే తాతకి కూడా తల్లిదండ్రులు చనిపోయారు. పాపం అంటూ జాలి పడుతూ తన మనసులో అనుకుంటుంది.
అతను… సరే అమ్మ. నేను పడవ ని తీసుకుని వెళ్లాలి . ఈ సమయంలో పని కి వెళ్ళిన వాళ్ళు. తిరిగి వస్తారు. ఆమె సరే అంటుంది నువ్వు పడవ ని తీసుకొని వెళ్ళి పోతాడు.
అతను వెళ్లిన వెంటనే ఆమె శుభ్రంగా ఆ ఇంటిని కడిగి ఇంటి ముందు ముగ్గు పెడుతుంది. ఆ ఇంటిని చాలా అద్భుతంగా మార్చేస్తుంది. చాలా సమయం తర్వాత అతను ఇంటికి తిరిగి వస్తాడు . ఇంటిని చూసిన అతను చాలా ఆశ్చర్యపోతాడు అతను పాపతో….. పాప ఇది అంతా నువ్వే చేశావా చాలా అద్భుతంగా ఉంది.
అందుకే అంటారు ఇంటికి ఆడపిల్ల ఉండాలి అని. నువ్వు వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి కళ వచ్చిపడింది. చాలా కృతజ్ఞతలు తల్లి అంటాడు ఆమె…. నేను కూడా మీతోపాటే ఇక్కడ ఉండొచ్చా. అని అడుగుతుంది అందుకు అతను చాలా సంతోష పడుతూ…. అయ్యో అదేం భాగ్యం తల్లి. నువ్వు కూడా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు.
అని అంటాడు పాప….. తాత ఒక విషయం చెప్పు . ఆ ఊరికి వెళ్లడానికి మీకు బస్సు సౌకర్యం ఏమీ లేదా.
అతను…. అలాంటి సౌకర్యం ఏమీ లేదమ్మా అందుకే కదా పడవలో వెళ్లి పడవలో వస్తూ ఉంటము. దానిని విన్న ఆమె…. నాక్కూడా పడవ నడపడం నేర్పించు అలాగే నీటిలో ఈదటం కూడా నేర్పిస్తావా అని అడుగుతుంది
అందుకు అతను బ్రహ్మాండంగా నేర్పిస్తాను అంటూ సమాధానం చెప్తాడు. అతను తాను మాట ఇచ్చినట్టుగానే ఆమెకు పడవ నడపడం అలాగే నీటిలో ఈదడం నేర్పిస్తాడు.
ఆ కొన్ని రోజులు గడిచాయి ఆమె ఈత నేర్చుకుంటుంది ఆలగే పడవ నడపడం కూడా నేర్చుకుంది. ఇక ఆమె ఒకరోజు తాతయ్య నిద్రపోతుండగా పడవ తీసుకొని నడుపుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద చేప ఒక్కసారిగా ఆ నీటిలో నుంచి నోరు తెరిచి ఆమెనీ మింగడానికి వస్తుంది . పాప భయంతో దాని నుంచి తప్పించుకొని నీటిలోకి దూకుతుంది. ఆమె ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది . చేప కూడా ఆమెను పట్టుకోడానికి ఎంతో ప్రయత్నిస్తుంది కానీ అది సాధ్యపడదు.
పాప ఏడుస్తూ….. అనవసరంగా ఇక్కడికి వచ్చాను. అయ్యో పడవ అక్కడే ఉండిపోయింది. అందుకు ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలో ఆమెకు అర్థం కాదు. ఇది ఇలా ఉండగా అక్కడ తాత నిద్ర లేస్తాడు …. పాపా ఎక్కడికి వెళ్ళిపోయావు పాప అంటూ ఆమెని పిలుస్తూ ఉంటాడు. కానీ పాప ఎక్కడ కనపడదు . అలా వెళ్తూ ఉండగా అతను పడవ కోసం చూస్తాడు కానీ పడవ కూడా అక్కడ ఉండకపోవడంతో అతను చాలా కంగారు పడుతూ మీన ను వెతుక్కొంటూ వెళ్తాడు.
ఇంతలో పాప ఏడుస్తూ ఒకచోట కనబడుతుంది. పాపను చూసి తాతయ్య… పాప ఎక్కడున్నావ్ రా ఏం జరిగింది అని అడుగుతాడు పాప ఏడుస్తూ జరిగిన విషయం చెబుతుంది.
అతను…. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు . ఆ చేప చాలా ప్రమాదకరమైంది . నీకేం కాలేదుగా . ఆ పడవ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు . ఆమె ఏడుస్తూనే ఇంటికి వెళ్తుంది ఆ తర్వాత అతను ఒక పెద్ద కర్ర సహాయంతో పడవని బొడ్డుకు లాగుతాడు.
ఆ తర్వాత అతను పడవని తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు .
కొన్ని రోజులు గడిచాయి అతనికి ఆరోగ్యం సరిగా ఉండదు. అతని దగ్గుతూ మంచం మీద పడుకుని ఉంటాడు . ఏంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
అప్పుడు పాప….. తాత మీరు దేని గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ విధంగా మీరు నా గురించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టు కొంటారు. ఎందుకు తాతయ్య అంటుంది అతను…. అమ్మ మినా ఇన్ని రోజులనుంచి నాకు ఒంటరితనం లేనందుకు చాలా సంతోషంగా ఉంది . నీలో నా మనవరాలిని చూస్తున్నాను ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు . ఎప్పుడు ఆ భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు అని భయంగా ఉంది నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి . ఆ పడవ ని తిప్పు కొన్నావు అంటే అంటే రోజుకి 1000 నుంచి 1500 రూపాయలు వస్తాయి .
జాగ్రత్తగా డబ్బు దాచి పెట్టుకో అని జాగ్రత్త చెప్తాడు ఆమె వాటిని విని…. ఎందుకు అలా మాట్లాడుతున్నారు. తాతయ్య మీకు ఏమీ కాదు మీరు భయపడకండి నేను పడవ నడిపి
వచ్చిన డబ్బుతో మిమ్మల్ని మంచి హాస్పిటల్ కి తీసుకు వెళతాను అని అంటుంది.
అలా చెప్పి అక్కడ నుంచి ఆమె పడవలు నడపడానికి వెళ్తుంది . అందరూ పాప పడవ నడపడం చూసి చాలా ఆశ్చర్య పోతారు. ఆమె పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడి 2000 రూపాయలు సంపాదిస్తుంది.
అదే విషయాన్ని ఆమె ఆ తాతయ్య తో చెబుతుంది అతను చాలా సంతోష పడ్డాడు. ఆ తర్వాత ఆమె ఏ డాక్టర్ను తీసుకుని అక్కడికి వస్తుంది . డాక్టర్ అమ్మ అతన్ని చూసి పరీక్షించి మందులు ఇంజక్షన్లు రాస్తుంది. వాటిని జాగ్రత్తగా వాడమని చెప్తుంది అందుకు ఆమె సరే అంటుంది.
ఆ తర్వాత ఆమె ఆ పడవ నడుపుకుంటూ. చాలా డబ్బు సంపాదిస్తుంది.
ఆమె అలాగే పడవ నడుపుతూ వచ్చిన డబ్బులు వాళ్ళిద్దరూ ఖర్చులకి పోగా అతని నీకు మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
కొన్ని రోజుల తర్వాత అతను కోలుకుంటాడు.
అతను పాపతో….. నువ్వు మా ఇంటికి నిజంగా దేవతవి. ఎప్పుడో చచ్చిపోవాలిసిన నన్ను నీ కష్టంతో బతికించావ్వు. అంటూ ఏడుస్తూ సమాధానం చెప్తాడు అందుకు ఆమె చాలా బాధ పడుతూ…. అయ్యో తాతయ్య ఎందుకు అలా బాధ పడుతున్నావు . నేను మనవరాలిగా ఈ పని చేశాను. అంతే కానీ ఇంకా నాకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్పించిన విద్యా నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది . ఇంక నేను రేపట్నుంచి పడవిలో చేపలు పట్టడానికి వెళ్తాను అని అంటుంది అందుకు అతను…. సరే ఏం పర్వాలేదు నేను నీకు మంచి పడవని కొనిపెడతాను అని అంటాడు అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత అతను ఒక పడవ ని బహుమతిగా ఇచ్చాడు ఆమె దానికి చాల సంతోషపడుతూ అందులో చేపలవేటకు వెళుతుంది. అక్కడ చేపలను వల వేసి లాగి వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తుంది. అలా వారిద్దరూ సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు ని ఏర్పాటు చేసుకుని సంతోషంగా. తాత మనవరాలు లాగా సంతోషం గడుపుతూ ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *