భూగర్భం లో మాయా బంగారం Funny Animals | Telugu Kathalu | Telugu Stories | Best animal stories Telugu
ఒక అడవిలో జంతువులన్నీ కలిసి ఒకచోట సమావేశం ఏర్పాటు చేస్తాయి
అందులో పులి మాట్లాడుతూ ఇలా అంటుంది
పులి : చూడండి మిత్రులారా మనం అడవిలో తిరుగుతున్నప్పుడు రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి, ఒక్కోసారి అయితే భూమి లోపల ఎవరో తిరుగుతున్నట్టు, లోపల ఎవరో పొట్లాడుకుంటున్నట్టు వినిపిస్తున్నాయి అని అంటుంది. పులి మాటలకు జంతువులన్నీ నవ్వుతారు.
పాండా : ఏంటి భూమి లోపల ఎవరో కొట్టుకుంటున్నారు అంటున్నవా? నీ మతి గానీ ఏమన్నా పోయిందా భూమి లోపల నుంచి శబ్దాలు రావడం ఏంటి ఎవరికైనా చెబితే నవ్వుతారు అని అంటుంది.
ఇంతలో అక్కడే ఉన్న పాండా లేచి నిల్చొని ఇలా అంటుంది.
పాండా ; లేదు మిత్రులారా ఈ విషయాన్ని గురించి ఇలా చులకనగా చూడడం మంచిది కాదు., ఎందుకంటే మొన్న నేను కుందేలు కలిసి అడవిలో తిరుగుతున్నప్పుడు మాకు కూడా అలానే భూమి లోపల నుంచి గుల్ల గుల్ల గా ఉన్న శబ్దాలు వినిపించాయి కొంత దూరంలో ఒక సొరంగం లాంటిది కూడా కనిపించింది. ఒక అక్కడ నుంచి భయం తో పరుగులు తీసాను అని అంటుంది.
జంతువులన్నీ కలిసి ఈ సమస్యకి పరిష్కారం కోసం నల్ల ఏనుగు మరియు బంగారు ఏనుగు దగ్గరికి వెళతాయి.
పులి : మిత్రమా ఈ సమస్య నుంచి మీరే మమ్మల్ని బయట పడెయ్యలు అని అంటుంది.
బంగారు ఏనుగు : హా నాకు తెలిసింది, పాండా ఆ శబ్దాలు ఏవో విని భయపడి అడవంతా పరుగులు తీసిందని చెప్పింది పాపం, సరే మేము ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేస్తాం లే మీరు వెళ్లి భయపడకుండా ఇళ్లలో కూర్చోండి అని అంటుంది. జంతువులన్నీ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోయాయి
కొంతసేపటి తర్వాత నల్ల ఏనుగు బంగారు ఏనుగు కలిసి ఇ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది అని తెలుసుకుందామని అడవంతా తిరుగుతూ ఉంటాయి అలా కొంత సేపు తర్వాత వాటికి ఒక సొరంగం లాంటి మార్గం కనిపిస్తుంది
నల్ల ఏనుగు : మిత్రమా సొరంగ మార్గంలా ఉంది. బహుశా మన జంతువులు చెప్పినట్టుగా ఆ వింత వింత శబ్దాలు అని ఇక్కడి నుంచి వస్తున్న ఏమో నాకు ఏదో తేడా కనిపిస్తుంది నేను లోపలికి వెళ్లి చూసి వస్తాను అని అంటుంది
బంగారు ఏనుగు : వద్దు మిత్రమా నువ్వు ఒక్కదానివే లోపలికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇద్దరం కలిసి వెళ్దాం అంటుంది
నల్ల ఏనుగు ; తమ లోపల నాకు ఏదైనా జరగరానిది జరిగితే మిగతా జంతువులను కాపాడడానికి నువ్వు ఉన్నావు అదే కలిసి ఇద్దరం లోపలికి వెళ్తే, లోపల జరగడానికి ఏదైనా జరిగితే మిగతా జంతువులు దిక్కులేని వాటిలా అయిపోతాయి, నువ్వు నువ్వు బయటనే ఉండు లోపల ఏదైనా కనిపిస్తే నీకు చెబుతాను అని లోపలికి వెళుతుంది నల్ల ఏనుగు
లోపలికి వెళ్ళిన నల్ల ఏనుగు కొన్ని బంగారు నాణాలు తీసుకుని బయటకు వస్తుంది
నల్ల ఏనుగు: మిత్రమా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే లోపల చాలా బంగారు నాణాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.
వాటన్నింటినీ మనం బయటకు తీసుకురాగలిగితే ఇక మన అడవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అంటుంది
బంగారు ఏనుగు : సరే మిత్రమా నువ్వ ఇప్పటివరకు nv తీసొచ్చినంత పైన పెట్టేయ్, నేను లోపలికి వెళ్లి ఇంకా కొన్ని తీసుకొని వస్తాను. ఇంతలో నువ్వు వెళ్లి మిగతా జంతువులని తీసుకొని ఇక్కడ కు రా అని అంటుంది.
నల్ల ఏనుగు సరే అని చెప్పి మిగతా జంతువులని తీసుకు రావడానికి అడవిలోకి వెళ్తుంది. అదే సమయం లో బంగారు ఏనుగు ఇంకా భూగర్భం లో దాగి ఉన్న మరింత బంగారాన్ని వజ్రాలను తీసుకు రావడానికి భూగర్భం లోకి వెళ్తుంది..
లోపలికి వెల్లినతరువాత బంగారు ఏనుగు కళ్ళు చెదిరి పోతాయి..
బంగారు ఏనుగు ; వామ్మో ఇంత బంగరమా నల్ల ఏనుగు చెబితే నేనేదో తక్కువగా అంచనా ఎసాను కానీ ఇంత బంగారం నేను చూడడం నా జీవితం లో ఇదే మొదటి సారి అని అనుకుంటుంది. కొంతసేపటి తరువాత బంగారు ఏనుగు లోపల ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి బయట పెట్టేస్తుంది. కొంత సేపటి తరువాత మిగతా జంతువులన్నీ అక్కడకు చేరుకుంటాయి.
అంత బంగారాన్ని ఒకే సారి చూసే సరికి మిగతా జంతువులకు. ఈత మాట రాలేదు.
పంది : వామ్మో ఎంత బంగారం ఇన్ని రోజులు మనం బంగారం మీద నడుస్తూ అదేంటో అని భయపడుతున్నమా నిజంగా మీ ఇద్దరి ధైర్యానికి దన్నం పెట్టాలి. అని అంటూ ఉంటుంది పంది
నల్ల ఏనుగు : ఈ మాటలకెం తక్కువ లే కానీ, మనం ఇప్పుడు దొరికిన ఈ బంగారాన్నంత అన్ని జంతువులకు వాటి కుటుంబ పరిస్థితులనీ పరిగణలోకి తీసుకొని ఎవరికీ ఎంత ఇవ్వాలో అంత తీసుకుందాం ఇక నుంచి మన అందరి జీవితాలలో ఆకలి బాధలే ఉండవు, పిల్లలు మాకు అది కావాలి ఇది కావాలి అనే ఎదుపే ఉండదు. అందరి జీవితాలలో ఈ బంగారం వెలుగును నింపబోతుంది అని అంటుంది.
నల్ల ఏనుగు చెప్పిన మాటలకు మిగతా జంతువులు ఎంతో సంబర పడతాయి……
Related Posts

బో_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathaluరింగ్ కొట్టే గర్భవతి ఏనుగు 2

పేద పిల్ల మాయ డబ్బు చెట్టు New Latest story | Telugu Kathalu | Telugu Stories | Telugu Fairy Tales
