భూమి లోపల వెదురు బొంగుల స్విమ్మింగ్ పూల్ | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

విలాస్పూర్ అనే గ్రామం లో సురేష్ అనే ఒక మేస్త్రి ఉండేవాడు, ఊరిలో మేస్త్రిగా అతనికి చాలా మంచి పేరు ఉంది. అతని భార్య పేరు విమల, వాళ్లకి ఒక కూతురు ఉండేది ఆమె పేరు మమత, మమతా చాలా తెలివైన అమ్మాయి, ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉండేది, అలా వాళ్ళ జీవితం సంతోషంగా సాగుతూ ఉండేది.

అలా ఉండగా ఒకరోజు సురేష్ విమల తో ఇలా అంటాడు

సురేష్ : విమల, మన అమ్మాయి మమత చాలా చక్కగా చదువుకుంటుందంటా నిన్ననే వాళ్ళ టీచర్ చెప్పింది, మమత ని వాళ్ళ టీచర్ పొగుడుతుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది, ఇక మనకి ఎలాంటి కష్టాలు లేవు విమల ఇన్నిరోజులు మనం చాలానే డబ్బులు సంపాదించాం కదా, అదంతా ఊరి వాళ్లకి మన మీద ఉన్న నమ్మకం వల్లనే సాధ్యమయ్యింది, ఇక మనం కూడా ఊరి కోసం ఎదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను నువ్వ్వేమంటావు

విమల : నేనేమంటాను ఒకరికి మన వల్ల లాభం జరుగుతుంది అంటే గొప్ప విషయమే కదా, మీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యండి, ఏ రకమైన సహాయం అయినా నేను చేయడానికి సిద్దమే అని అంటుంది విమల మాటలకు సురేష్ ఎంతో సంతోష పడతాడు,

సురేష్ ఊరికి ఏ రకమైన సహాయం చేయాలనీ ఆలోచిస్తుండగా అతని ఫ్రెండ్ గణేష్ అనే డబ్బున్న వ్యాపారి ఊరిలోకి వస్తాడు, గణేష్ చాలా మోసగాడు ఎప్పటి నుండో విలాస్పూర్ లో వ్యాపారం పెట్టాలని చూస్తూ ఉంటాడు, కానీ ఆ ఊరి జనం అతను మోసగాడని తెలిసి ఎవరు అతనికి సహకరించలేదు, ఇప్పుడు సురేష్ ని ఒప్పించి ఎదో ఒకటి పెట్టి డబ్బులు సంపాదించాలని ఆశిస్తాడు, అది సురేష్ కి తెలియదు. అప్పుడు సురేష్ దగ్గరికి వచ్చిన గణేష్

గణేష్ : ఏరా సురేష్ బాగున్నావా? ఎంతో కాలం అయ్యింది రా నిన్ను చూసి, నీకు ఊరికి ఏదైనా సహాయం చేయాలని ఉందని నాకు తెలిసింది, నా దగ్గర ఒక ఆలోచ్చన ఉంది ఇద్దరం కలిసి చేద్దామా అంటాడు

సురేష్ : అలాగేరా నీకు ఇంత మంచి ఆలోచనలు ఉన్నాయని నాకు తెలియదు ఇంతకీ ఏమి ఆలోచించావు అని అడుగుతాడు

గణేష్ : ఊరిలో ఒక మంచి స్థలం చూసి ఒక పెద్ద స్విమ్మింన్గ్ పూల్ నిర్మించుదాం, చాలా తక్కువ డబ్బులు తీసుకొని ప్రజలని లోపలి పంపిద్దాం అప్పుడు, ప్రజలు స్విమ్మింగ్ పూల్ లో ఆనందంగా గడిపి వాళ్ళ కష్టాలను కొంత సేపైనా మరిచిపోతారు, అలా వాళ్లకి మనం సహాయపడిన వాళ్ళము అవుతాము, అదే నా ఆలోచన అని అంటాడు

సురేష్ : నీ ఆలోచన చాలా బాగుంది రా, ఇప్పుడే నేను ఆ స్విమ్మింగ్ పూల్ ని నిర్మిస్తాను అంటాడు,

గణేష్ : సరే రా నువ్వు దానిని నిర్మించే పనిలో ఉండు నీకు వేరే ఊరిలో పని ఉంది వెళ్లి వస్తాను అంటాడు

అలా చాలా కొద్దీ రోజుల్లోనే సురేష్ స్విమ్మింగ్ పూల్ ని నిర్మిస్తాడు, నిర్మాణం అంతా పూర్తయిన తరువాత అక్కడికి వస్తాడు గణేష్

గణేష్ ని చూస్తోసిన సురేష్ ఎంతో సంబరంగా గణేష్ దగ్గరికివచ్చి

సురేష్ : అరేయ్ గణేష్ మనం అనుకున్నట్టు గానే స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది ఊరి ప్రజలందరికి కూడా ఎంతో బాగా నచ్చింది అని అంటాడు

గణేష్ : బాబు సురేష్ మన స్వమ్మింగ్ పూల్ ఏంటి? అది నా స్విమ్మింగ్ పూల్ నేను నిన్ను మేస్త్రిగా పెట్టించి కట్టించినంత మాత్రాన అది నీదైపోతుందా? ఇదిగో ఈ డబ్బులు కూలి లెక్కలో తీసుకో అని కొన్ని డబ్బులు చేస్తిలో పెడతాడు

ఇంటికెళ్లి సురేష్ జరిగిన  విషయమంతా భార్యకి చెబుతాడు,

విమల : మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ మీరు ఆ స్విమ్మింగ్ పూల్ కె పెట్టారు కదా అండి ఇప్ప్పుడు మన పరిస్థితి ఏందీ తినడానికి కూడా డబ్బులు లేవు, ఆ గణేష్ ని పోలీస్ లకి పట్టిద్దామా అంది అని అడుగుతుంది

సురేష్ : లేదు విమల వాడు అన్నిటికి దొంగ పత్రాలు తయారు చేయించి ఉంచాడు మనం కేసు పెట్టినా వాడే గెలుస్తాడు, వాడికి తగిన బుద్ధి నేనేం చెబుతాను అని అంటాడు ఆ మాటలు చాటుగా వింటుంది మమత

అలా కొన్ని రోజులు గడుస్తాయి ఊరిలో ఉండే రంగయ్య అనే ఒక వ్యక్తి సురేష్ దగ్గరికి వచ్చి

రంగయ్య : ఏదయ్యా ఇలా చేసావు మీ స్నేహితుడు అని వాడిని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టావు, వాడు ఒక పది నిమిషాలు స్విమ్మింగ్ ఫుల్ లోకి పోతే 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు, చిన్న పిల్ల్లలను బలవంతంగా తీసుకెళ్లి ఇళ్లకు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాడు, నువ్వే ఎలాగైనా వాడి బారి నుంచ్చి మమ్మల్ని కాపాడు అని అంటాడు,

సురేష్ : నేను దాని గురించే ఆలోచిస్తున్నాను, కానీ నాకు ఎలాంటి ఆలోచన రావట్లేదు అని అంటాడు

ఇంతలో మమత అక్కడికి వస్తుంది

మమత : నాన్న నాదగ్గర ఒక ఆలోచన ఉంది వినండి.

చెప్పమంటాడు సురేష్

మమత : నాన్న ఆ గణేష్ స్విమ్మింగ్ పూల్ కిందనే ఒక అండర్గ్రౌండ్ వెదురుబొంగుల స్విమ్మింగ్ పూల్ నిర్మించుదాం అందులో వాటర్ స్లయిడింగ్ లు వాటర్ జంపింగ్స్ పెడదాము అప్పుడు అందరు మన దగ్గరికే వస్తారు, అప్పుడు గణేష్ స్విమ్మింగ్ పూల్ శాశ్వతంగా మూత పడిపోతుంది అని చెబుతుంది,

సురేష్ : చిన్న పిల్లవి అయినా చాలా పెద్ద సలహా ఇచ్చావు తల్లి, రేపటి నుండే ఆ పని మొదలుపెడతాను అని అంటాడు

సురేష్ అతని స్నేహితులతో కలిసి అండర్ గ్రౌండ్ స్వమ్మింగ్ పూల్ నిర్మాణానికి పనులు మొదలు పెడతాడు, వారితో పాటు మమత కూడా నిర్మాణం పనులలో పాలు పంచుకుంటుంది.

అలా అందరు చాలా రోజులు కష్టపడి అండర్ గ్రౌండ్ లో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు, పైగా దాన్నీ వెదురుబొంగులతో నిర్మించారు, దానిని చూడడానికి వచ్చిన ప్రజలందరికి ఏంత్తో నచ్చింది, ఇక ప్రజలకి స్వమ్మింగ్ పూల్ కోసం గణేష్ దగ్గరికి పోవలసిన పని తప్పిందని ఎంతో  సంబరపడ్డారు, ఇక ఎవ్వరు గణేష్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, అలా రెండు మూడు రోజుల్లోనే గణేష్ కి చాలా నష్టం రావడం ప్రారంభం అయ్యింది. అప్పుడు సురేష్ గణేష్ దగ్గరికి వెళ్తాడు

సురేష్ : చూసావా గణేష్ నువ్వు నన్ను మోసం చేసి డబ్బులు సంపాదించాలని చూసావు, కేవలం డబ్బుల కోసం స్నేహాన్ని కూడా లెక్క చేయలేదు నువ్వు, నీకు తగిన శాస్తి చెప్పాలనే నేను ఈ అండర్గ్రౌండ్ బ్యాంబూ స్విమ్మింగ్ పూల్ నిర్మించాను, నువ్వు నన్ను మోసం చేస్తే నేను నీతో వ్యాపారం చేసాను, ఒక్కటి గుర్తు పెట్టుకో ప్రజలతో ప్రేమగా వ్యాపారం చేస్తే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు, నీలా అందరు నీ దగ్గరికే రావాలి అని అత్యాశతో వ్యాపారం చేస్తే ఇలానే జరుగుతుంది, ఇక నైనా మంచిగా బ్రతుకు అని చెప్తాడు

గణేష్ సిగ్గుతో తలవంచుకొని స్విమ్మింగ్ పూల్ ని వదిలి పెట్టి, ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోతాడు

మమత తెలివిని ఊరందరు ఎంతో మెచ్చుకుంటారు, అది చూసిన సురేష్ ఎంతో ఆనందపడతారు..  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *