మంచి సవతి తల్లి | Telugu kathalu | Telugu Stories |Bedtime Dreams Telugu | Kattapa kathalu

కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలోని ప్రజలు అందరూ చేపల వేటకు వెళుతూ ఉండేవాళ్ళు. ఆ గ్రామంలో ఉంటున్న వాసు కూడా చేపల వేటకు వెళ్లి చేపలు పట్టి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేవాడు. అతని భార్య పేరు సునీత.వాళ్లు ఎంతో అనూన్నగా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. రోజులు గడిచాయి వాళ్ళకి ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆ అమ్మాయి పేరు నందిని. సంతోషంగా జీవిస్తూ ఉంటాయి కొన్ని సంవత్సరాలకు పాప పెద్దది అవుతుంది. తల్లికి తెలియని జబ్బు చేసి మంచనా పడుతుంది. అలా రోజు తండ్రి …. అమ్మ నందిని నేను చేపల వేటకు వెళుతున్నాను మీ అమ్మ ని జాగ్రత్తగా చూసుకో . భోజనం నీళ్లు కావాలి అంటే అందించు. జాగ్రత్తగా చూసుకో అని అంటాడు అందుకు ఆమె…. సరే నాన్నా నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి.
అనీ చెబుతుంది అందుకు తను సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోత్చాడు. అతను అలా వెళ్ళిన కాసేపటికి తల్లి దగ్గుతూ…. అమ్మ నా బంగారు తల్లి నందిని. నీళ్లు ఇవ్వు తల్లి. అని పిలుస్తుంది నందిని ఆమెకు నీళ్లు అందిస్తుంది . దాని తాగిన తర్వాత ఆమె ఏడుస్తూ…. అమ్మా నందిని నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు నాన్నని బాగా చూసుకో సరేనా . నన్ను ఏడుస్తూ ఉంటుంది తల్లిగా పెద్ద పెద్దగా దగ్గుతూ ……. భగవంతుడా మీకు ఇది న్యాయంగా ఉందా . నాకు మంచి జీవితాన్ని ప్రసాదించినటే ప్రసాదించి . మళ్లీ అందరికీ దూరం చేయడం నీకు న్యాయంగా ఉందా. అంటూ చాలా బాధ పడుతూ ఉంటుంది. ఆమె కొంత సమయానికి అలా దగ్గుతూ ఒక్కసారి గుండె ఆగిపోయి చనిపోతుంది.
తల్లి పోయినందుకు పాప నందిని ఏడుస్తూ…. అమ్మ ఒక్కసారి నేను నాన్న వస్తే ఏం సమాధానం చెప్పాలి అమ్మ. నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాను కదా నాన్నకి జాగ్రత్తగా చూసుకోవడం అంటే నిన్ను దూరం చేసుకోవడంమ.అమ్మ. అంటూ ఏడుస్తూ ఉంటుంది సాయంత్ర సమయం కావడం తో తండ్రి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే ఏడుస్తున్న నందిని చూసి అక్కడికి వెళతాడు . భార్య చనిపోయిందని తెలుసుకున్న అతను…. అయ్యో భగవంతుడా నా భార్య ని తీసుకెళ్లి నా కూతుర్ని నన్ను ఒంటరి వాడిని చేశావా. అంటూ చాలా బాధపడతాడు. ఇక దుఃఖంతో నీ వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉంటాయి . నందిని స్కూల్ కి వెళ్ళలేదు తిరిగి వస్తూ ఉండగా . ఆమె కింద పడి కాలికి గాయం అవుతుంది. పాపా ఏడుస్తూ చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడ అయ గా పని చేస్తున్నా తిరుమల దానిని గమనించి అక్కడికి వెళుతుంది…. అయ్యో పైకి లేమ్మా నందిని. అసలు ఏం జరిగింది కాలికి. గాయం అయింది . పరిగెత్తడం ఎందుకు చేస్తావ్వు. చూడు ఎంత గాయం అయ్యిందో ఆంటు చీరనీ చించి కట్టు కడుతుంది.
ఆ తర్వాత తిరుమల ఆమె తో…. అయ్యో నందిని నేను కూడా నీతో పాటు వస్తాను పదా . అంటూ ఆమెను ఇంటికి తీసుకు వెళ్తుంది ఇంటి దగ్గర ఎవరు ఉండరు.
తిరుమల ఆమెతో….. నందిని మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు.
తిరుమల అలా అడగడంతో నందిని ఏడుస్తు…. మ ఆమ్మ చనిపోయింది మమ్మల్ని వదిలి పెట్టి వెళ్ళిపోయింది. అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. తిరుమల…. అయ్యో నందిని ఏడవకు తల్లి మీ నాన్న ఎక్కడికి వెళ్లారు. అందుకు ఆమె…. మా నాన్న చేపల వేటకు వెళ్ళాడు. తిరిగి వస్తాడు అని అంటుంది అందుకు తిరుమల… సరే అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. నేను వెళ్తాను అని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కొంత సమయం తర్వాత తండ్రి ఇంటికి తిరిగి వస్తాడో నందిని కాలికి ఉన్న కట్టు నీ చూసి……. ఏమైందమ్మా నందిని అని అడుగుతాడు అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెప్పింది.
దాన్ని విన్న అతను…. ఆమె మీ ఆయ నా చాలా మంచిది లాగా ఉంది రేపు ఆమెను కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి . ఆమె దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ అని అడుగుతాడు. అందుకు ఆమె సరే అని అంటుంది ఆ రోజు గడిచి పోతుంది . ఆ మరుసటి రోజు ఉదయం
నందిని ఆయ దగ్గరికి తీసుకెళ్తుంది…
అక్కడ అతను ఆమెతో…. మీకు చాలా కృతజ్ఞతలు నుండి నా కూతురు కాలికి గాయం అయితే మీ చీర చించి మరీ కట్టు కట్టారు . చాలా చాలా కృతజ్ఞతలు. అని అంటాడు అందుకు ఆమె… మరేం పర్వాలేదండి . నందిని చాలా మంచి అమ్మాయి చెప్పిన మాట వింటుంది అందరూ అమ్మాయిలాగా అసలు ఉండదు అందరితో కలిసిమెలిసి ఉంటుంది చదువుల్లోనూ ఆటపాటల్లో అన్నిటిలోనూ ఫస్ట్ ప్రైజ్ ఆమెకి. అసలు ఎవ్వరితో గొడవ పడుతూ అందుకే నందిని అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది ఆ మాటలకు అతను చాలా సంతోషపడ్డాడు. రోజులు గడిచాయి తిరుమల వాసు కి చాలా దగ్గర ఉంటుంది.
వాళ్లిద్దరూ ఒకరి నొకరు అర్థం చేసుకుంటారు . కొన్ని రోజులకి వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది.
తిరుమల తల్లిగా అయినందుకు నందిని చాలా సంతోషపడుతుంది . తిరుమల నందిని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది.
రోజు బడికి రెడీ చేసి ఆమెను పంపిస్తూ ఉండండి. అలా వాళ్ళ జీవితం చాలా సంతోషంగా నడుస్తూ ఉంటుంది ఒక రోజు భార్య…. ఏమండీ ఈ రోజు ఆదివారం అమ్మాయికి బడి లేదు నాకు నీతో పాటు పడవలో చేపల వేటకు రావాలని ఉంది మా ఇద్దరినీ కూడా తీసుకు వెళ్ళండి . అందుకు తను సరే అంటాడు. ముగ్గురూ కలిసి నది కి వెళ్తారు అక్కడ తన పడవలో వాళ్ళు ఉండగా అతని చేపలు పడుతూ ఉంటాడు దానిని వారిద్దరూ చాలా ఆసక్తిగా చూస్తూ ఆశ్చర్య పోతూ ఉంటారు. ఆలా ప్రతి ఆదివారం అతనితోపాటు భార్య పిల్లలు ఇద్దరు కూడా చేపల వేటకు వెళుతూ ఉంటారు.
అలా ఉండగా ఒకరోజు అతనికి ఒంట్లో నలతగా ఉండి విశ్రాంతి తీసు కుంటూ ఉంటాడు భార్య దానిని గమనించి…. ఏమండీ మీరు రెండు రోజుల నుంచి సరిగా లేరు.
హాస్పిటల్ కి వెళ్దాం అంటే మీరు రావడం లేదు ఎందుకు అలాగా.
అతను… నాకు ఏమీ కాదులే నువ్వు ఏమి కంగారు పడకు అని అంటాడు. కానీ ఆ మనసులో భయం గానే ఉంటుంది. రోజులు వచ్చాయి అతను డాక్టర్ కి చూపించుకో కుండా అతనికి తెలిసిన వైద్యం చేసుకుంటూ ఉంటాడు అలా రోజులు గడిచాయి . అతను ఒక్కసారిగా గుండెపోటుతో చనిపోయాడు. మళ్లీ వాళ్ళ పరిస్థితి చాలా తీవ్రంగా మారిపోతుంది తండ్రి చనిపోయినప్పుడు .
నందిని… నాన్న నాన అంటూ ఏడుస్తుంది.
భార్య కన్నీరు కారుస్తు….. ఏమండీ ఒకసారి లే అండి అంతూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది
ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగి పోతుంది. రోజులు గడిచాయి ఆmayఏం చేయాలో అర్థం కావడంలేదు.
అంటూ …. నేను ఆలోచిస్తూ కూర్చుంటే నాకు ఒక్క రూపాయి కూడా రాదు. మళ్లీ నందిని ప్లీజ్ కట్టాలి . నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను . దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ చాలా ఏడుస్తూ
ఉంటుంది అప్పుడు ఒక ఆలోచన వస్తుంది ….. నా భర్త చేసిన పనిని నేను చేస్తాను. నేను కూడా చేపల వేటకు వెళ్తాను అని నిర్ణయించుకుంది . అనుకోని చేపలు పట్టడానికి వెతుకుబయలుదేరుతుంది .
అలా నంది నీకి తెలియకుండా చేపల వేటకు వెళ్లి చేపలు పట్టుకుని వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఆ విషయం నంది నీకు తెలుస్తుంది. ఆమె… అమ్మ నువ్వు అంత కష్టమైన పని ఎలా చేస్తున్నావు. మగవాళ్లతో సమానంగా చేపలు పట్టడం అంటే చాలా కష్టమైన పని ఎందుకమ్మా నీకు అంత శ్రమ.
ఆమె… ఇందులో శ్రమ ఏముంటుంది తల్లి నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే మన జీవితాన్ని పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు మనం బతకాలి కదా అందుకే ఇలా చేస్తున్నాను.
అందుకు ఆమె ఏడుస్తూ…. నాన్న ఉంటే ఎంతటి కష్టం నీకు వచ్చేది కాదమ్మ. అంటూ ఏడుస్తుంది. రోజులు గడిచాయి. ఆదివారం కావడంతో నందిని తల్లితో….. అమ్మ ఈరోజు నేను కూడా నీతో పాటు చేపల వేటకు వస్తాను. అందుకు ఆమె….. సరే తల్లి వెళ్దాం పదా అని ఆమెనీ వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తుంది. వాళ్ళు నదిలో చేపలుకు పడవ సహాయంతో వెళ్తుండగా సుడిగుండం రావడం మొదలవుతుంది. దాన్ని చూసి తల్లి చాలా కంగారు పడుతూ…. అమ్మ నందిని పడవ ని గట్టిగా పట్టుకో . జాగ్రత్త అమ్మ. అనీ అముకు ధైర్యం చెబుతూ ఉంటుంది నందిని…. అమ్మ నాకు భయమేస్తుంది అమ్మ అంటూ కేకలు వేస్తోంది నందిని . సుడిగుండ లా తాకిడి ఎక్కువ కావడంతో. తిరుమల ఆమెను ఆమె నిలదొక్కుకోలేక నదిలో పడి పోతుంది.
ఆమె నదిలో పడి పోయిన అప్పటికీ. ఆమె బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె చనిపోతున్నాను అన్న సంగతి కూడా మర్చిపోయి…. అమ్మ నందిని గట్టిగా పట్టుకో. జాగ్రత్తగా పట్టుకో తల్లి. అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా అక్కడి ప్రశాంత వాతావరణం నెలకొల్పుతుంది. తల్లి ఆ నీటిలో మునిగిపోతూ ప్రవాహంలో కొద్దికొద్దిగా కొట్టుకుపోతూ ఉంటుంది. నందిని.., అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను కాపాడుతుంది అమ్మ అంటూ కేకలు వేస్తూ పడమని చాలా వేగంగా ఆమె దగ్గరికి తీసుకెళ్తుంది.
ఆమె ఎలాగోలా కష్టపడి పడవలోకి ఎక్కుతుంది. తల్లి నీ చూసి ఆమె చాలా సంతోషపడ్తు…. అమ్మ నీకు ఏం కాలేదు కదా భగవంతుడు నిన్ను కాపాడడు అమ్మ అంటుంది. తల్లి… భగవంతుడు కాదమ్మా కాపాడింది . నువ్వే నన్ను కాపాడిన నా బంగారు తల్లి వి. అంటూ సమాధానం చెప్తే వస్తుంది. నందిని అమేను ఓదారుస్తుంది .
ఆ తర్వాత వాళ్లు అక్కడి నుంచి ఒడ్డుకు వచ్చేస్తారు. ఇంటికి తిరిగి వెళ్తారు. నందిని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన తల్లి…. నందిని ఇంక నువ్వు పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా .అది మర్చిపో అమ్మ అది ఒక పీడకల అనుకుని మర్చిపో . నందిని…. అమ్మ నేను ఈరోజు ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి అమ్మ. నువ్వు కూడా నాకు దూరం అయితే నేను అనాధను అయిపోతాను. నన్ను అనాధగా చేయడం నీకు ఇష్టమా. అమ్మ అంటూ చాలా జాలిగా ఏడుస్తూ అడుగుతుంది.
ఆ మాటలకి ఆమె… అమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్న ఇప్పుడు ఏం జరిగిందనీ
ఆమె… ఇంకా ఏం జరగాలి అమ్మ. ఇది చాలా కష్టమైన వ్యాపారము. దానికంటే ఇంకోటి ఏమన్నా ఆలోచించు చేయడం చాలా ఉత్తమమైనది.నువ్వు పనికి వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు.
ఆమె…. ఇష్టం లేకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు తల్లి .
నందిని… ఇది కాకపోతే బతకాలి అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. అంటూ ఆలోచిస్తూ.,. అమ్మ ఇప్పుడు దాక నువ్వు సంపాదించిన డబ్బుతో . చిన్న కూరగాయల వ్యాపారం పెట్టు. నాలో ఎంతో కొంత లాభం వస్తుంది నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు.
నీకు ఏమైందనీ నేను కంగారు పడుతూ ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.
ఆ చేపల వేట అనేది ఆపివేసి. కూరగాయల వ్యాపారం మొదలు పెట్టు. అందుకు ఆమె సరే అంటుంది. ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు తను సంపాదించిన డబ్బుతో కూరగాయలు తీసుకువచ్చి తన ఇంటి ముందు వ్యాపారం మొదలు పెడుతుంది .
దానిని చూసి నందిని చాలా సంతోష పడుతూ……. అమ్మ ఇప్పుడు నీకు అంత కష్టం ఉండదు నేను బడికి వెళ్లి తిరిగి వచ్చి నీకు సహాయం గా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. అలా ఆమె ఉదయం బడికి వెళ్లి సాయంత్రం తనకు సహాయం చేస్తూ . చిన్న కూరగాయల వ్యాపారం కాస్త పెద్ద కూరగాయలు వ్యాపారంగా మారి . ఆ తల్లి కూతురు ఇద్దరూ సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *