మనిషి కష్టం విలువ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఆ రోజు ఉదయం పూట ఇద్దరు ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు..

ఈ విషయం తెలుసా అక్క అక్కడ గుంపులు గుంపులుగా మనుషులందరూ ఎందుకు ఉన్నారో.
2….. నాకు తెలియదు పద్మ ఏం జరుగుతుంది అక్కడ.
1… ఏముంది మందు దుకాణం తెరిచారు. అందుకే అక్కడ గుంపులుగుంపులుగా మనుషులు ఉన్నారు.

 1. అయ్యో ఇంకా ఈ మందు బాబులందరికీ పండగే గ .
 2. మామూలు పండుగనా ఈ బాబు అందరికీ సంక్రాంతి దీపావళి అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్టుంది. పాపం ఎన్ని రోజులనుంచి కాసుకొని కూర్చున్నారో ఎప్పుడెప్పుడు మద్యం షాపులు తెరుస్తారని. ఇదిగో ఈ రోజు తెరిచేటప్పటికి ఇలా గుంపులుగుంపులుగా. ఎగబడుతున్నారు.
 3. అమ్మో ఇప్పుడు కొత్త వ్యాధి ఏదో వచ్చింది కదా . పొరపాటున వాళ్ళలో ఎవరికైనా ఉండి ఉంటే ఏంటి పరిస్థితి.
 4. ఇంకేముంటుంది వాడితో పాటు మరో పదిమందికి దానిని అంటిస్తాడు.
 5. కానీ జరగబోయే దాన్ని ఎవరూ ఆపలేరు కదా. పాపం ఎన్ని రోజుల్లో ఇంట్లో కూడా పెట్టిన డబ్బులు అంతా ఈ మధ్యానికి పోస్తున్నారు. ఆ నాలుగు రూపాయలు ఉంటే నాలుగు రోజులు ఇల్లు గడుపు కోవచ్చు.
 6. నిజమే కానీ మన చేతుల్లో ఏముంది ఆ బుద్ధి వాళ్లకు ఉండాలి. మన భర్తలకు తాగుడు అలవాటు లేనoదుకు మనం చాలా సంతోషించాలి.
 7. అందరూ మన భర్త లు లాగే ఉంటే ఎంత బాగుండో కదా.
  1.అవును నిజమే సరే అక్క నేను వెళ్తున్నాను అంటూ పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
  పద్మ అలా వెళ్లి పోయిన వెంటనే సునీత కూడా తన ఇంటి లోపలికి వెళ్తుంది అప్పుడు ఆమె భర్త….. ఏంటి పద్మా వచ్చి వెళ్తుంది.
  సునీత… ఏం లేదండి ఊరికే సరదాగా అలా వచ్చి కూర్చొని వెళ్తుంది. అవును మీరు ఎక్కడికి బయలుదేరారు.
  భర్త…. ఏం లేదే అలా బయటికి వెళ్లి వద్దామని. అనుకుంటున్నా.
  భార్య…. వద్దండి బయటికి ఇప్పుడు అస్సలు వెళ్ళద్దు బయట షాపు ముందు ఎంత మంది జనం ఉన్నారో చూశారా. మద్యం కోసం విచ్చలవిడిగా కొట్టుకుంటున్నారు. పొరపాటున వాళ్లలో ఎవరికైనా వ్యాధి ఉందనుకోండి. అమ్మో ఇంకేమైనా ఉందా మీరు పొరపాటున కూడా అస్సలు బయటకు వెళ్ళదు.
  భర్త… నేను అటుగా వెళ్లాను లేవే నేను మరో దారిలో వెళ్తాను.
  భార్య….. ఏం అవసరం లేదు మీరు ఇంట్లోనే కూర్చోండి. మీరు కనుక బయటికి వెళ్లారు అంటే నేను ఇంట్లో కూడా రానివ్వను.
  ఆ మాటలు విన్న అతను తన మనసులో..
  అమ్మో ఇది అన్నంత పనిచేస్తుంది ఎందుకొచ్చిన గొడవ లే. నోరు మూసుకొని ఇంట్లో కూర్చోడం మేలుఅనుకుంటా.
  అని అనుకొని ఇంట్లోనే కూర్చుంటాడు.
  అప్పుడే తన మిత్రుడైన నా నరేష్ అక్కడికి వచ్చి అతనితో….. అరవిందు అరేయ్ నాకు ఒక 500 ఉంటే అప్పుగా ఇవ్వరా. నాకు చాలా అవసరం ఉంది.
  అరవింద్…. ఎందుకురా 500 అంత అవసరం ఏంటి.
  నరేష్… ఏముంది మామ మందు షాపులు తెరిచారు గా ఇక ఈ రోజు నుంచి పండగే. మీ ఇంటికి కూడా వెళ్లేది లేదు…. తాగుతా నీయబ్బ తాగుతా ఈ రోజు మొత్తం తాగేసి
  వుగుత.
  ఆ మాటలు వింటున్న అరవింద్ భార్య… ఏంటి అన్నయ్య మీరు కూడా. తాగడం వల్ల మీకు ఏమి ఉపయోగం ఏం లాభం ఉంటుంది. ఆ నాలుగు రూపాయలు ఉంటే ఇంట్లో ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. తాగడం కోసం అప్పు మరీ చేయాలా. ఇవ్వడానికి మాకు యలాంటి అభ్యంతరం లేదు. కానీ మేము ఇచ్చి నిన్ను అడగడం మాకు అసలు ఇష్టం లేదు. అదే 500 రూపాయలతో బయట ఎంత మంది కడుపు నింప చొ మీకు అర్థమవుతుందా.
  అరవిందు…. నిజమే కదరా అ ఆ నాలుగు రూపాయలు ఉంటే మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం అని మాకు తెలుసు. నీకు కావాలంటే ఇంటి ఖర్చులు నిమిత్తం ఎంత కావాలన్నా ఇస్తాను. నువ్వు వాటిని నాకు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు. అంతేగాని ఇలా మద్యం పేరుతో డబ్బులు వృధా చేయొద్దు.
  నరేష్…. అరే నేనేమీ ఎప్పుడు తాగటం లేదు కదరా ఎప్పుడో ఒకసారి. అది కూడా మద్యం షాపులు మూసేసి ఇన్ని రోజుల తర్వాత తెరిచారు. ఆ ఆనందంలో తాగాలి అనిపిస్తుంది అంతే.
  అరవింద్…. ఆనందంలో తాగాలనిపిస్తుంది రేపు కూడా అలాగే అనిపిస్తుంది . ఇక పూర్తిగా మందుకు బానిసైన అయిపోతావు.ఇన్ని రోజులు ఎలా ఉన్నావు మందు లేకుండా ఇప్పుడు కూడా అలాగే ఉండు.
  అప్పుడు అరవింద్ భార్య నరేష్తో…
  చూడండి అన్నయ్య మీ భార్య నిన్నే మా ఇంటికి వచ్చి నాతో ఈ విషయం చెప్పింది. నా భర్త తాగుడు మానేసాడు అని. ఇప్పుడు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అని. ఈ లాక్ డోన్ పుణ్యమా అని నా భర్త లో చాలా మార్పు వచ్చిందనీ ఆమె సంతోషపడుతుంది.
  మీరు ఆమె సంతోషం కోసమైనా తాగడం మానేయండి. అలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు.తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని మీరు తెలిసి కూడా ఎందుకు తాగాలి అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు.ఇప్పుడు మీ భార్య పిల్లలు మీతో చాలా సంతోషంగా ఉంటున్నారు. మీరు గనుక తాగి ఇంటికి వెళితే ఆ సంతోషం మళ్ళీ మొదటికి వస్తుంది. ఒకసారి ఆలోచించండి అన్నయ్య.
  ఆ మాటలు విన్న నరేష్…. నిజమే అమ్మ సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్తున్నా మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. అంతకు ముందు నేను తాగి నా భార్య పిల్లలు ఇద్దరు ని చిత్ర హింసలు పెట్టేవాడిని. నా కొడుకు అయితే కనీసం నను నాన్న అని కూడా పిలిచేవారు కాదు. ఈ లాక్ డౌన్ కారణంగా మాలో చాలా సంతోషం ,మార్పు వచ్చింది.
  నా కొడుకు నన్ను ఒక్క క్షణం కూడా విడిచి ఉండటం లేదు.నా భార్య కూడా నన్ను అంతే ప్రేమతో చూసుకుంటుంది.వాటన్నిటినీ మరిచి నేను మళ్ళీ నరకం లోకి వెళ్లి అనుకోవడం నా మూర్ఖత్వమే. నా బాధ్యతలు ఏమిటో గుర్తుకు తెచ్చినందుకు మీ భార్య భర్తలు ఇద్దరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు తెలిసి వచ్చింది. అరే ఇప్పుడు చెబుతున్నాను వినండి. ఇప్పుడే కాదు నేను ఎప్పుడు మద్యం జోలికి వెళ్లను.ఒకవేళ నేను గనుక దాని దగ్గరికి వెళితే ఎడంకాలు చెప్పుతో నన్ను కొట్టు.
  అరవింద్….చా చా అంత మాట ఎందుకు లేరా నువ్వు మాట మీద నిలబడే వ్యక్తి అని నాకు తెలుసు కదా.
  అరవింద్ భార్య….నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎప్పుడూ సంతోషంగా మీ కుటుంబంతో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
  అని అంటుంది నరేష్ వాళ్లతో సరే ఇక నేను వెళ్తాను రా అని అంటాడు అప్పుడు సునీత… అన్నయ్య ఒకేసారి భోజనం చేసి వెళ్ళండి.
  నరేష్… ఇల్లు ఇక్కడే కదా అమ్మ నేను వెళ్తాను. నా భార్య పిల్లలు నాకోసం భోజనం చేయకుండా ఎదురుచూస్తూ ఉంటారు.
  ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ చాలా సంతోషపదటరు సరే అన్నయ్య వెళ్ళండి అని ఆమె అంటుంది.
  నరేష్ చాలా సంతోషంగా వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు.
  అక్కడ అరవింద్ అరవింద్ భార్య..
  నరేష్ అన్నయ్య లో ఒక్క చిన్న మాటతో ఎంత మార్పు కలిగిందో. ఇలాగే ఒక్క మంచి మాటతో మనుషులందరూ మారితే ఎంత బాగుండు. అందుకే పెద్దలు ఊరికే అనలేదు గొడ్డుకో దెబ్బ మనిషికొక మాట అని.
  అరవింద్…. అవును సరే నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు నాకు తినడానికి ఏమైనా తీసుకురా.
  ఆమె… అయ్యో సరే అండి. తినడానికి నా తాగడానికి మీకు కూడా ఏమైనా తీసుకురావాలా హా…హా..హా.. అని తన భర్త తో సరదాగా అంటుంది.
  ఆ మాటలు విన్న అరవింద్ కూడా హా..హా..హా.. తీసుకురా తీసుకురా మద్యం కాదు మంచి నీళ్లు తీసుకురా. అని అతను కూడా సరదాగా మాట్లాడతా డు. అలా వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతారు. అక్కడ ఇంటికి వెళ్లిన నరేష్ కానీ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అతని భార్య తో…. అమృత నువ్వు నన్ను క్షమించాలి.
  భార్య…. ఏమైందండీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు.
  భర్త… ఏం లేదు ఈరోజు నేను మద్యం తాగడానికి వెళ్లి అనుకున్నాను. కానీ నీ అరవింద్ వాళ్ళ భార్య నీ గురించి చెప్పిన తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చింది నన్ను క్షమించు ఇక నుంచి నేను ఎప్పటికీ మద్యం జోలికి వెళ్లను అసలు ఆ ఆలోచనే నా మెదడు లోకి రానివ్వను
  నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి.ఈ రోజు మద్యం దుకాణాలు తెరిచారు మీరు ఖచ్చితంగా తాగి ఇంటికి వస్తారు అనుకున్నాను. కానీ మీలో వచ్చిన ఈ మంచి మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆ దంపతులిద్దరికీ నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నీలో ఇంత మార్పు రావడానికి కారణం వాళ్లే.
  నరేష్…. అవును ఆ లో మార్పు రావడానికి ఆ కుటుంబమే ఒక్క మంచి మాటతో అలాగే మనుషులు మారిపోతే సమాజంలో ఎంతో మంది కుటుంబాలు బాగుపడతాయిఒక్క మంచి మాటతో అలాగే మనుషులు మారిపోతే సమాజంలో ఎంతో మంది కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటా. అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మాటల్లో మునిగిపోయి
  సంతోష్గా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు.
  ఈ కథలో మనం తెలుసుకుని నీతి ఏంటంటే.
  ఒక చిన్నమాట తో నరేష్ లో ఎంతో మార్పు కలిగింది. అతను అను తన తప్పేంటో తెలుసుకుంటాడు.అనవసరంగా మద్యం మత్తులో పడి ఈ రోజుల్లో ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. భార్య పిల్లలకి భారంగా అవుతున్నారు. మద్యానికి బానిస అయ్యి అనారోగ్యం పాలవుతున్నారు.మద్యం తాగడం వల్ల నష్టమే కానీ లాభం ఏమీ లేదు అని తెలుసుకునే టప్పటికి. వాళ్ళ బ్రతుకులు తెల్లవారి పోతున్నాయి. అందుకే చెడుని ఎప్పుడూ మన దరిదాపుల్లోకి కూడా తీసుకు రాకూడదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *