మనుషుల కష్టాలు_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

ఒక రోజు ఉదయం సమయంలో ఇద్దరు ఆడవాళ్లు కూర్చుని ఈ విధంగా మాట్లాడుతున్నారు. సరోజ వదిన నీకీ విషయం తెలుసా మన పక్క ఇంటి లో అద్దెకు దిగిన వాళ్ళ ఆయన అస్సలు మంచివాడు కాదు. ఆమె నీ ఎప్పుడూ కొడుతూ ,తిడుతూనే ఉంటాడు. అయినా ఎవరు ఎలా పోతే నాకెందుకు లేమ్మా.

ఆ మాటలు విన్న సరోజ తన మనసులో…. అబ్బా ఈ లక్ష్మి కి ఏం పనిపాట ఉండదు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఏదో ఒక వార్త చెబుతూనే ఉంటుంది.
లక్ష్మి…. ఏంటి వదినా ఆలోచిస్తున్నావు.
సరోజ…. ఏం లేదు వదినా చెప్పు.
లక్ష్మి… అవును వదిన నిన్న మీ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి అన్నయ్య నీమీద అరుస్తున్నాడు ఏమన్నా సమస్య వచ్చిందా. అయినా నాకెందుకు లేమ్మా ఎవరు ఎలా ఉంటే.ఆ మాటలు విన్న సరోజ కి బాగా కోపం వచ్చి లక్ష్మితో….. లక్ష్మీ మీకు ఎప్పుడూ ఎదుటి వాళ్ల గురించి ఆలోచిస్తూనే ఉంటావు. వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని. కొంచెం కూడా సమాజం గురించి ఆలోచించవు. అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి.
బయట కొత్త వ్యాధితో ఎంత మంది బాధపడుతున్నారు తెలుసు కదా వాటి గురించి ఏమైనా చెప్పచ్చు కదా.
లక్ష్మి…. వాటి గురించి ఎందుకు. మనం బాగానే ఉన్నాము కదా. హాయ్ రా తింటున్న o పడుకుంటున్నాము. జీవితానికి ఇవి ఒక్కడుంటే చాలు.
ఆమె అలా మాట్లాడుతుండగా అప్పుడే రజనీ అనే ఒక ఆమె అక్కడికి వచ్చి….. అవును లక్ష్మి నువ్వు బాగా చెప్పావు. ఎవరు ఎలాగ పోతే నీకు ఎందుకులే బయట ప్రజలు ఎంతగా ఆకలితో అలమటించి ఉన్నారో తెలుసా. ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది జీవితాలు తెల్లవారి పోతున్నాయి. అలాంటి వాళ్ల గురించి నీకు అవసరమే లేదు. నువ్వు నీ కుటుంబం బాగుంటే చాలు అంతేగా.
లక్ష్మి… నేనేమీ అలా అనలేదు. లాక్డౌన్ పొడిగించాలని నాకు తెలుసు. అయితే ఏమవుతుంది మంచిదే కదా.
సరోజ….. పొడిగించిన అందుకు సంతోషమే ఎందుకంటే వ్యాధి రోజురోజుకీ ఎక్కువవుతుంది. కానీ పూటగడవని వాళ్ల సంగతి ఆలోచిస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. ఎక్కడ దాక ఎందుకు నా భర్త ఎన్నో రోజులు నుంచి పనికి వెళ్లకుండా ఉన్నాడు. ఏదో నాలుగురాళ్లు వెనకాల వేసుకున్నాను కాబట్టి తినడానికి ఇబ్బంది లేదు.
రజిని…. మీ పరిస్థితి కాదు వదిన మా పరిస్థితి కూడా అలాగే ఉంది. బయట కూరగాయల ధరలు పెరిగిపోయాయి. చాలామంది ఏం పని చేయలేక కూరగాయల వ్యాపారం పెట్టుకుంటున్నారు. కటిక పేదరికం లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. లాక్ డోన్ మొదటి రోజుల్లో చాలా చక్కగా అనిపించింది. మన భర్తలు పిల్లలతో ఆడుకోవడం మనతో హాయిగా కబుర్లు చెప్పడం. చాలా బాగా అనిపించింది కానీ రోజులు గడిచే కొద్ది దిన దిన గండంగా మారింది. ఊరికే కూర్చుని తింటే కొండంత ఆస్తులపైనా తరిగిపోతాయి. ఈ వ్యాధి ఎప్పుడు ముగుస్తుందో మళ్లీ మనకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో భగవంతుడా.
అని బాధపడుతూ ఉంటారు.
ఆ మాటలు విన్న లక్ష్మి …. సరే నేను వెళ్తున్నాను వదిన మీరు కబుర్లు చెప్పుకోండి.
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
వాళ్లిద్దరూ ఒకరి మొఖం ఒకరు చూసుకొని… ఛీ ఈ లక్ష్మి కి మంచి అస్సలు పడదు అనుకుంటా. సమాజం గురించి మనం మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోయిం దొ చూడండి. అని అనుకొని వాళ్లు కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు.
లక్ష్మీ మాత్రం వాళ్ళ మాటలు విని కొంచెం బాధ పడి ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ తనలో…. నిజమే నేను ఇన్ని రోజుల నుంచి నా స్వార్థం గురించి నేను ఆలోచిస్తున్నాను బయట సమాజం గురించి ఏం జరుగుతుందో ఏంటో అనేది నేను పట్టించుకోలేదు. వాళ్ళ అన్న ఇది చాలా నిజం బయట ప్రజలు తిండి లేకుండా ఎంతో బాధ పడుతున్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది కష్టాల పాలవుతున్నారు.డాక్టర్ లో మున్సిపల్ వర్కర్లు పోలీసులు కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మరి ఒక మనిషిగా నేనేం చేశాను. అని తనలో తాను ప్రశ్నించు కుంటుంది.
నేను లేచిన దగ్గర్నుంచి టీవీ చూడడం తినడం పడుకోవడం పనులు చూసుకోవడం. ఇవి మాత్రమే చేస్తున్నాను కానీ నా వంతు నేను కృషి చేయాల్సిన సమయం ఉంది అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను.
అని అనుకొని పేదవాళ్లకు అలాగే విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులకు భోజనాన్ని అందించాలని నిర్ణయించుకుంది. అలా అనుకున్న వెంటనే తాను స్వయంగా భోజనాన్ని తయారు చేయడం మొదలు పెట్టింది. అలా భోజనం తయారు చేసి ఆ విషయం గురించి రోజా కి రజనీకి దగ్గరకు వెళ్లి…… వదిన మీరు ఇందాక చెప్పిన దాని గురించి నేను బాగా ఆలోచించాను మీరు చెప్పింది వాస్తవం అందుకే నా వంతుగా నేను కూడా సహాయం చేయాలనుకుంటున్నాను.లేని వాళ్ళకి పేదవాళ్ళకి అలాగే విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులకు భోజనాన్ని సరఫరా చేద్దామనుకుంటున్నాను అందుకే ఈ రోజు భోజనం కూడా సిద్ధం చేశాను మీరు కూడా నాతో పాటు కలిసి వస్తే వాటిని అందరం కలిసి పని చేద్దాం. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయి ఆమెతో…. చాలా మంచి పని చేస్తున్నావు లక్ష్మి . నీ మంచి మనసు మేము అర్థం చేసుకోలేక ఇందాక అలా మాట్లాడటం..
లక్ష్మి…. మీరు ఆ విధంగా మాట్లాడి బట్టే నాలో ఇంత మార్పు వచ్చింది వదిన మరి ఏం పర్వాలేదు. పదండి వెళ్లి అందరికీ భోజనాన్ని దీన్ని పంచుదాం. అని అనుకొని మాస్కులు ధరించి పోలీస్ అధికారులకు అలాగే రోడ్లపై ఉన్న బిచ్చగాళ్లకు భోజనాన్ని సరఫరా చేశారు. అప్పుడు ఒక బిచ్చగాడు …. అమ్మ మీరు చల్లగా ఉండాలి తిని తిని మూడు రోజులు నా ఆకలి తీర్చిన త్రిమూర్తులు మీరు. నేను ఆకలికి ఉండలేక ఈ మట్టి తిని బతుకుతున్నాను. అంటూ కన్నీరు కార్చాడు. ఆ మాటలు విన్న వాళ్ల మనసు అయ్యో మీరు బాధపడకండి మీరు ఇక్కడే ఉంటారు కదా ఇక నుంచి మీకు భోజనం ప్రతిరోజు మేమే తీసుకొస్తాం. బాధపడకండి .
బిచ్చగాడు….మీకు చాలా కృతజ్ఞతలు తల్లి మీకు జన్మజన్మలకు ఋణపడి ఉంటాను అంటూ కన్నీరు కారుస్తాడు.
వాళ్లు సరే మీరు బాధపడకండి అని అతనితో చెప్పి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆ పోలీస్ అధికారి…. మీరు చేస్తున్న పని చాలా గొప్ప పని. నలుగురికి ఆకలి తీరుస్తున్నారు. నాలాంటి ఉద్యోగం చేస్తున్న అధికారులకు సహాయం చేస్తున్నారు. మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మీకు చాలా హ్యాట్సాఫ్. కానీ బయటికి వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎప్పుడు మా స్కూల్ కట్టుకొనే ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అని చెప్పాడు అందుకే వాళ్ళు సరే సార్ అని చెప్పి అందరూ కలిసి ఇంటికి తిరిగి వచ్చారు అప్పుడు సరోజా ఇలా అంటుంది….చూశారుగా వదిన ఎంత మంది ఆకలితో అలమటిస్తున్నారు పాపం ఆ పెద్దాయన చెప్పిన మాటలు వింటే నా గుండె తరుక్కుపోయింది. ఈరోజు లక్ష్మీ ద్వారా మనం మంచి పని చేశాo. ఈరోజు లక్ష్మి తన వంతు సేవ చేసింది. ఇక రేపు ఆ బాధ్యత నేను తీసుకుంటాను. రేపు నేను భోజనం తయారు చేసి ముగ్గురం కలిసి ఈ విధంగానే సరఫరా చేద్దాం. ఆకలితో ఉన్న వాళ్ల ఆకలి తిరుగుదాం అధికారులకి సహకరిద్దాం.
రజిని… మంచి ఆలోచన అలాంటి వాళ్లకు సహాయం చేయడం వల్ల మనకి మంచే జరుగుతుంది. దేవుడు త్వరగా దయ చూపించి. ఈ వ్యాధిని తొలగిస్తే బాగుండు. అందరం ఎప్పటిలాగే సంతోషంగా ఉంటా మొ . మళ్లీ అందరి జీవితాల్లో భయం పోయి సంతోషంగా బయట తిరిగే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే వదినా రేపు నువ్వు భోజనాన్ని తయారు చెయ్యి అందరం కలిసి వాటిని సరఫరా చేద్దాం. అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు అన్నీ వింటున్నా సరోజ భర్త రామయ్య వాళ్ల దగ్గరకు వచ్చి….. మీరు చాలా మంచి పని చేస్తున్నారు . మీరు చేస్తున్న పనికి నా జోహార్లు మిమ్మల్ని చూసి మరికొందరు అలాగే సమాజానికి సేవ చేస్తే ఆకలితో ప్రాణాలు విడుస్తున్న పేదవాళ్ల సంఖ్య తగ్గుతుంది. మన వంతు కృషి చేసినట్టుగా మనకి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మీరు ఇలాగే చేయండి కానీ జాగ్రత్తగా ఉండండి . అని సంతోషంగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అతని మాటలు విన్న వాళ్ళు చాలా సంతోష పడతారు.
అప్పుడు సరోజా వాళ్లతో…… ఇంకేమి ఆయన దగ్గరుండి కూడా మనకి పచ్చజెండా వచ్చేసింది ఇంకా మరి ఎవరు ఆపలేరు
అన్నీ చాలా సంతోష పడి నవ్వుకుంటూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అదేవిధంగా ఆ తర్వాత రోజు నేను నా వంతు సేవని అందిస్తాను. అని అనుకొని ఆ తర్వాత రోజు వాళ్ళు అనుకున్న విధంగానే భోజనం తయారు చేసి లేని వాళ్ళకి అదేవిధంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అధికారులకి ఆ ఆహారాన్ని పంచడం ప్రారంభించారు.
అలా వాళ్ళ ముగ్గురు తగినంత సేవలను సమాజానికి అందించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే మనం లాక్ డౌన్లోడ్ ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే మనకంటూ ఎంతో కొంత డబ్బు ఉంది కాబట్టి ఎలాగోలా రోజులు ముందుకు సాగుతున్నయి. కానీ చాలా మంది పేద వాళ్లకు ఆకలి దప్పికతో బాధ పడి మరణిస్తున్నారు అలాంటి వాళ్లకి మన వంతు సహాయం చేద్దాం. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి. మంచి పనులు చేయడానికి బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *