మాయా అరటి చెట్టు 6 Telugu kathalu |Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

ఆమె పేరు కరుణ. పేరుకు తగ్గట్టే మనుషుల మీద ఎంత కరుణ చూపిస్తుందో. ఆమె వయస్సు చాలా చిన్నది. కానీ ఆలోచన మనసు మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి. సమాజంలోని ప్రజలను తల్లిదండ్రులు గా భావిస్తూ పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె బతకడం కోసం అరటి పళ్ళ వ్యాపారం చేసుకుంటూ . వచ్చిన డబ్బుతోనే నాలుగు మెతుకులు తింటూ ఉంటుంది. అలా ఉండగా ఒక రోజు ఆమె అరటి పండ్లు అమ్ముకుంటూ …. అరటి పళ్ళ ఆమ్మ అరటి పళ్ళు . తాజా తాజా అరటిపళ్ళ. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు . నా దగ్గర రకరకాల రకరకాల అరటిపళ్ళు ఉన్నాయి. చక్కెరకేళి, అమృతపాణి , నాన్ జీడి రకరకాలు ఉన్నావమ్మా. రావాలమ్మా రావాలి బాబు అంటూ కేకలు వేస్తూ తన బండిని తోసుకుంటూ అమ్ముతూ ఉంటుంది ఆమె అలా అమ్ముతూ బాగా అలిసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుంటుంది.
ఆ చెట్టు దగ్గర ఒక ముసలావిడ ….. అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ కొంచెం అరటిపళ్ళు ఇస్తావా. అని జాలిగా అడుగుతుంది. అందుకు పాప ఆమె పైన జాలిపడి …. అయ్యో బామ్మ ఇదిగో తీసుకో తిను అని అరటిపండ్లు ఇస్తోంది.
ఆమె చాల సంతోషపడుతూ వాటిని తీసుకొని తిని…. నా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. పని జీవిస్తుంది అందుకో కరుణ…. బామ్మ నిన్ను ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు ఎవరు నువ్వు.
ఆ ముసలావిడ…. మాది ఈ నది ఒడ్డున ఒక చిన్న పల్లెటూరు 50 కుటుంబాలు ఉంటాయి అక్కడ. మొన్న ఎవరో దొంగలు పడి అందరి ఇళ్ళల్లో దోచుకుపోయారు. పాపం అక్కడి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు నాకు తెలీదు . అక్కడ నా కంటూ ఎవరూ లేరు . నా భర్త పిల్లలు చేపల వేటకు వెళ్లి సునామీ కారణంగా అందులో కొట్టుకుపోయి మరణించారు నేను ఎన్నో సంవత్సరాలుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
నేను కష్టపడి సంపాదించిన నాలుగు డబ్బులు కూడా దొంగలు తీసుకెళ్లిపోయారు అంటూ ఏడవడం మొదలు పెట్టింది.
ఎందుకు కరుణ చాలా బాధ పడుతూ….. అయ్యో బాధ పడకమ్మా. నీ బాధ నాకు అర్థమైంది ఇక్కడ ఏదైనా పని చేసుకుందామని వచ్చారు కదా.
అందుకు ముసలావిడ…. అవును అమ్మ ఎక్కడికి వెళ్ళినా నువ్వు ముసలి దానివి ఎక్కడ ఏం పని చేస్తావు అని నన్ను పనిలో పెట్టుకోవడం లేదు . ఏం చేయాలో అర్థం కావట్లేదు . పో నీ అడుక్కు తిందామంటే మనసు రావటం లేదు. ఇక నా బిక్షాటన నీతోనే మొదలైంది అంటూ ఏడుస్తుంది.
అందుకు ఆమె మరోసారి ధైర్యం చెబుతుంది కొంత సమయం తర్వాత ఆ ముసలావిడ….. చూడు తల్లి ఇప్పుడు అక్కడ కుటుంబాల పరిస్థితి అస్సలు బాలేదు చాలామంది తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు ఇంతదూరం రావాలంటే రెండు రోజుల ప్రయాణం అవుతుంది. ఇక్కడ పని దొరకక పోతే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలవా నువ్వు అని అంటుంది. అందుకు ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాదు.
తన మనసులో…. నేను చిన్న పిల్లని నేను అంతమందికి ఎలా సహాయం చేయగలను.
అని అనుకొని ఆమెతో…. చూడు బామ్మ నా తల్లిదండ్రులు చనిపోయారు. నేను ఒక్కదాన్నే కష్టపడుతూ నాలుగు రాళ్లు సంపాదించుకొని బతుకుతున్నాను. నేను ఎంత మందికి ఆ సహాయం చేయగలను.
అందుకు ఆ ముసలావిడ….. మనసుంటే మార్గం ఉండదు కదా అమ్మ . నీ సహాయం కోసం అక్కడ ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అని అంటుంది ఇంతలో దూరంగా నది దగ్గరకు పడవ రావడం ముసలావిడ గమనిస్తుంది.
ఆమెని…. తల్లి పడవ వచ్చింది మళ్లీ అది పోయిందంటే రెండు రోజుల వరకు నేను ఇక్కడే పస్తులు ఉండాల్సి వస్తుంది . అక్కడికి వెళ్తే ఎవరో ఒకళ్ళు కొంచెం ఒక ముద్దు అయినా ముష్టి వేస్తారు . ఇక్కడ ఉంటే ఆ పని ఎవరు చేయరు నా మీద జాలి పడటం లేదు అని ఆమెకు చెప్పి అక్కడి నుంచి పడవలో వెళ్ళిపోతుంది. ఆ మాటలకు కరుణ చలించిపోతుంది తన మనసులో పదేపదే ఆమె చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అలా చాలా సమయానికి ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమె నిద్ర పోతున్నప్పటికీ పదేపదే ఆ ముసలావిడ చెప్పిన మాటలు ఆమె వినబడుతూ ఉంటాయి. ఆమె నిద్ర నుంచి ఒక్కసారిగా లేచి ….. భగవంతుడా ఒకళ్ళు ఇద్దరికీ అయితే నేను సహాయం చేయగలను కానీ 50 కుటుంబాలకు నేను ఏ రకంగా సహాయం చేయాలి. నువ్వే ఏదైనా దారి చూపించు అని అనుకుంటుంది. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది…… నేను రేపటి నుంచి అరటిపండు అమ్ముతూనే నాకు బాగా పరిచయమున్న ధనవంతుల తో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ సంగతి చెప్పి ఎంతో కొంత డబ్బుని . బియ్యమును సేకరిస్తాను . అది వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది అని . అనుకుంటుంది ఆ మరుసటి రోజు తాను అనుకున్న విధంగానే . అరటిపళ్ళు అమ్ముతూ తనకు తెలిసిన ధనవంతుల ఇంటికి వెళ్లి ఆ ఊరి యొక్క పరిస్థితి చెప్పి వాళ్ల దగ్గర బియ్యం లేదా డబ్బుని సేకరిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి ఆమెకు చాలా బియ్యం , డబ్బుని సేకరిస్తుంది.
వాటిని తన బండి మీద పెట్టుకుని నది దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఆ పడవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా సమయం అయినప్పటికీ కూడా ఒక పడవ కూడా రాదు చాలా సమయం ఎదురు చూస్తూ …. బహుశా ఈ రోజు ఒక పడవ కూడా రాదు అనుకుంటా
ఇంకా ఇంటికి వెళ్ళడం మంచిది . రేపు వచ్చి చూస్తాను అని అనుకొని అక్కడినుంచి వెళ్లబోతుండగా . ఇద్దరు వ్యక్తులు ఒక పడవలో ఓడ్డికి వస్తారు వెంటనే పాప అక్కడికి వెళ్లి ….. అయ్యా మీరు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ ఊరికి వెళ్తున్నారా.
వాళ్లు…. ఇక ఇప్పుడు అల్లా వెళ్ళాము.
వాళ్ళ మాటలకి కరుణ… అయ్యా ఆ ఊరి ప్రజలకు సహాయం చేయడానికి డబ్బు బియము సేకరించాను వాళ్లకి ఇప్పుడు ఇది చాలా అవసరం సహాయం చేయడు.
అని అంటుంది అందుకు వాళ్లు సరే అని చెప్పి వాటన్నిటినీ పడవలో పెట్టుకుంటారు.
ఆ తర్వాత ముగ్గురు పడవలో ప్రయాణం అవుతారు. అప్పుడు వాళ్లలో ఒకడు…. పాపా ఇవన్నీ నువ్వు ఎలా సేకరించాను అని అడుగుతారు అందుకు ఆమె జరిగిన విషయం అంతా చెప్పింది .
దాన్ని వెళ్ళిన వాళ్ళు చాలా ఆశ్చర్యంగా …. మొత్తం ఎంత డబ్బు సేకరించావు ఏంటి.
పాప…. ఓ లక్షకుపైగా సంపాదించాను అందరూ ఊరి గురించి చెప్పగానే జాలిపడి డబ్బులు బియ్యం ఇచ్చారు. పాపం ఆ దొంగ లు ప్రతిసారి వాళ్ల ఇంటి మీద పడి దోచుక పోతే కష్టపడి పని చేసుకోవచ్చు కదా. అని అంటుంది అందుకు వాళ్లు …. మాకు కష్టపడి పనిచేసే అంత అవసరం లేదు నీలాంటి అమాయకులు చాలామంది మ చేతులలో బలి అవుతారు. అని అంటారు అందుకు పాప భయపడుతూ…. అంటే మీరు ఎవరు . ఆ ఊరిని దోచుకున్న దొంగలు మీరేనా.
అందుకు వాళ్ళిద్దరు పెద్దగా నవ్వుతూ…. అవును మేమే ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఇవ్వు అంటూ ఆమెను బెదిరిస్తారు .
ఆమె… అయ్యా మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఎంతో కష్టపడి వీటిని సంపాదించాను . దయచేసి వాళ్ల నోటి కాడ కూటిని తియ్యొద్దు. మీ కాళ్లు పట్టుకుంటాను అని ఎంతగా ఏడుస్తూ ప్రాధేయ పడుతోంది. అయినప్పటికీ వాళ్ళు బలవంతంగా ఆమె గురించి డబ్బులు తీసుకొని ఆమెను నదిలోకి నెట్టి వేస్తారు.
కరుణ పెద్దపెద్దగా కేకలు వేస్తూ…. కాపాడండి నన్ను కాపాడండి అంటూ ఉంటుంది వాళ్ళు కనికరం లేకుండా అక్కడ్నుంచి పడవ తో సహా వాటిని తీసుకొని వెళ్ళిపోతారు.
ఆ రోజు ఉదయం అవుతుంది ఆమె ఒక పెద్ద అరటి చెట్టు నీడలో ఉంటుంది. ఆమె కళ్ళు తెరిచి చూసి చాలా ఆశ్చర్య పోతూ….. అయ్య బాబోయ్ నేను ఎక్కడున్నాను.
నేను పచ్చగా ఉండే అరటి పళ్ళు చూశాను . పసుపు గా ఉండే అరటిపండు చూశాను కానీ ఈ అరటి పండు మాత్రం చాలా రంగులలో ఉన్నాయి . ఏంటి ఇదంతా అని ఆశ్చర్య పోతూ ఉంటుంది. ఇంతలో ఆ మాయా అరటి చెట్టు…..అరే కరుణ నువ్వు ఎందుకు ఈ విధంగా ఆశ్చర్యపోతున్నారు నేను ఒక మాయా అరటి పండు చెట్టు ని అని ఉంటుంది ఆ మాటలు విన్న ఆమె ….. అయ్యబాబోయ్ ఇదంతా కలా నిజమా నాకు ఏమీ అర్థం కావడం లేదు. అందుకు అరటి చెట్టు….. ఇదంతా నిజంగా నిజమే కరుణ .
అని ఉంటుంది అప్పుడు పాప ఏడుస్తు…. ఓ మాయా అరటి చెట్టు నేను ఈ నది ఒడ్డున ఉన్న పేదవాళ్లకు సహాయం చేయాలి అనుకుంటే అది జరగలేదు ఇద్దరు దొంగలు నా నుంచి డబ్బు మొత్తాన్ని తీసుకువెళ్లారు అంటూ అమాయకంగా చెట్టు ఏమి అడగకపోయినా తానేడుస్తు జరిగిన విషయం అంతా వివరిస్తుంది అప్పుడు చెట్టు …. నువ్వేం బాధపడకు అసలు ఏం జరిగిందో నాకు అర్థమైంది. వాళ్లు నీ దగ్గర డబ్బు బియ్యం దొంగిలించారు కదా వాళ్లకి మంచి శాస్త్రి జరుగుతుంది. నువ్వేం బాధపడకు అని అంటుంది ఇది ఇలా ఉంది గా ఆ ఇద్దరు వ్యక్తులు పడవని ఒడ్డున నిలిపివేసిన మొత్తాన్ని పంచుకోవాలని సిద్ధపడతారు.
వాళ్ళిద్దరూ అలా పంచుకుంటూ ఉండగా అవి మొత్తం అరటిపండు రూపంలోకి మారుతాయి వాటిని చూసి…. ఏంట్రా ఇది ఇలా మారిపోయాయి . అని వాటిని పట్టుకొని చూస్తారు. అవి మొత్తం పెద్ద పెద్ద పాములు గా మారి వాళ్ల వెంబడి పడతాయి వాళ్ళు భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీస్తారు ఇక వాళ్లు వాళ్ల తప్పును తెలుసుకొని క్షమాపణ పాముని కోరుకుంటారు వెంటనే పాములన్నీ మాయం అయిపోతాయి. వాళ్లు అక్కడి నుంచి ఊరిని విడిచి పెట్టి తప్పు తెలుసుకొని భయంతో అక్కడినుంచి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అక్కడ మాయ చెట్టు పాపతో … చూడు కరుణ నేను ఒక ఆ అరటి కాలనీ తీసుకొని ఊరికి వెళ్లి అక్కడ వాళ్ళకి ఒక్కొక్క అరటిపళ్ళు అని ఒక కుటుంబానికి పంచు .
వాటిని తినడానికి కాదు ఆ అరటి పండునీ ఏం కోరుకున్న వాళ్లకి అది లభిస్తుంది.
ఆ విషయం అర్థమయ్యేలాగ చెప్పు అని అంటుంది అందుకు ఆమె సరే అంటుంది ఆ తర్వాత మాయ చెట్టు అరటిపండ్లు గెలని ఇస్తుంది . దాన్ని తీసుకుని వెంటనే కరుణ అక్కడినుంచి మాయమైపోయి . ఆ ముసలావిడ దగ్గర ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఆమెకు జరిగిన విషయమంతా చెబుతుంది. ఇక అరటి పండ్లను వాళ్ళు ఇంటింటికి తిరిగి మంచి దాని మాయ శక్తి గురించి చెప్తారు అందరూ వాటిని తీసుకొని సంతోషపడుతూ వాళ్లకు కావలసినవి అడిగి ఆ అరటి పండు ద్వారా ప్రత్యక్షం చేయించుకుంటారు. దాన్ని చూసిన పాప వాళ్లు చాలా సంతోష పడతారు. ఇక ఆ విధంగా మాయా అరటిపండు చేసిన సాయం వల్ల కొన్ని కుటుంబాలకు మంచి జరుగుతుంది అందరూ ఈ దీనంతటికి కారణం పాప అని అందరూ కరుణ ని మెచ్చుకుంటారు ఇంకా ఆ పాప ఆ ముసలి ఆవిడ ఇంటి దగ్గరే సంతోషంగా ఉంటుంది. ఆమె పాపని తన సొంత మనవరాలు చూసుకుంటూ సంతోషపడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *