మాయా ఆక్సిజన్ సిలిండర్ సహాయం | Telugu Stories| Telugu Kathalu| Bedtime Stories| Panchatantra

అది ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక మంచి కుటుంబం ఉంది ఆ కుటుంబం లో శారద రామకృష్ణ అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకి సుందర్ అనే ఒక అబ్బాయి. అతను చదువులో పట్టణంలో చదువుతూ ఉంటాడు. ఈ గ్రామంలో తండ్రి పొలం పని చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా తెలియని వ్యాధి దేశం మీదికి రావడం తో శ్రీధర్ వాళ్ళ కాలేజ్ కి సెలవులు ఇస్తారు. అతను తిరిగి ఇంటికి వస్తాడు. అప్పటికే ఆ గ్రామంలో కూడా లాక్ డౌన్ నీ విధిస్తారు. సుందరికి ఇంట్లో ఉండి ఉండి చాలా విసుగు చెందుతాడు అతను… అమ్మ నేను అలా బయటకి వెళ్లి వస్తాను నా పాత స్నేహితులందరినీ కలిసి వస్తాను.
శారద…. సుందర్ ఈ సమయంలో ఎందుకురా బయట రోజులు అస్సలు బాలేదు నువ్వు బయటికి తెలియదు అంటే ఎందుకు తిరుగుతున్నావు పైగా మాస్కో కూడా పెట్టుకోవూ ఎందుకురా ఇలా చేస్తావు. నువ్వు కుర్రాడివి కాబట్టి బానే ఉంటుంది మేము ఇంట్లో ముసలి వాళ్లము ఉన్న అర్థమైందా.
అందుకు కొడుకు పెద్దగా నవ్వుతూ….హా హా హా అమ్మ మీరు ముసలి వాళ్ళ ఏంటి మరి అమ్మమ్మ తాతయ్య సంగతి ఏంటి.
వాళ్ళు ముసలివాళ్ళు . అని తన తల్లి మాట వినకుండా బయటికి వెళ్తాడు.
అలా ప్రతి రోజు ఇంటి బయట వద్దు అని చెప్పినా కూడా తన స్నేహితుని కలిసి వస్తూ ఉండడం అలవాటుగా మారిపోతుంది అలా రోజులు గడిచాయి ఒకరోజు తన తండ్రి ఆరోగ్యం బాగోదు. అతను దగ్గుతూ ఉంటాడో తల్లి…. ఒరేయ్ మీ నాన్నకి బాగోలేదు కొంచెం మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి మందు లు తీసుకొని రా రా.
అతను…. అమ్మ నేను బయటకు వెళ్తున్నప్పుడు ఎందుకు పనులు చెప్తూ ఉంటావు. నేను తీసుకున్నాను నువ్వు వెళ్లి తెచ్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
తల్లి చేసేదేమీ లేక తానే మందులు షాప్ కి వెళ్లి మందులు తీసుకొని వస్తుంది.
అతనికి అందిస్తుంది కొన్ని రోజులు గడుస్తున్నాయి తల్లికి కూడా ఆరోగ్యం బాగోదు. ఊపిరి సరిగా ఆడదు ఆ ఇద్దరూ భార్యాభర్తలిద్దరూ మంచాన పడుకుంటారు దాన్ని చూసిన కొడుకు చాలా భయపడుతూ . వెంటనే తన పక్క వీధిలో ఉన్న డాక్టర్ రోహిణి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆమెతో….. డాక్టర్ ఒకసారి మా ఇంటికి రండి మా అమ్మ నాన్న పరిస్థితి అస్సలు బాలేదు నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అది కొత్త వ్యాధి అని అనుకుంటున్నాను.
డాక్టర్ …. సరే పద అని చెప్పి అతనితోపాటు ఇంటికి వెళ్తుంది వాళ్ళిద్దర్నీ పరీక్షించింది…. అవును నువ్వు అనుకున్నది నిజమే వీళ్ళిద్దరికీ కొత్త వ్యాధి సోకింది.
దాన్ని విని అతను చాలా భయపడతాడు.
ఆమె…. భయపడాల్సిన పని ఏం లేదు ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇంట్లోనే ఉంటున్నాయి నేను వైద్యం ఇంటికి వచ్చేస్తాను హాస్పిటల్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు.
నువ్వు నాతో పాటు రా మా ఇంట్లో ఆక్సిజన్ ఉంది. దాన్ని మీ మదర్ కి ఉంచాలి మెడిసిన్ రాసిస్తాను అవి టైం టైం వాడాలి.
అని అంటుంది అందుకు అతను సరే అంటాడు ఇక ఇద్దరూ కలిసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండగా అతను ఏడుస్తూ…. డాక్టర్ గారు ఇది అంతా నా వల్లే జరిగింది మా అమ్మ నాన్న అసలు బయటకు కూడా వెళ్లరు. నేనే నా స్నేహితులతో విచ్చలవిడిగా తిరిగి ఇంటికి వస్తూ ఉంటాను.
నేను మాస్క్ కూడా ధరించలేదు.
నా వల్లే ఇదంతా జరిగింది అంటూ ఏడుస్తూ …. డాక్టర్ మా అమ్మ నాన్న కి ఏం కాదు కదా.
డాక్టర్… ఇప్పుడు ఏడ్చి ఏం లాభం తల్లిదండ్రులు చెప్పే మాట అస్సలు పట్టించుకోరు. మీరంటే వయసులో ఉన్నారు యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది నడి వయసులో ఉన్న వాళ్ళకి అండ్ ముసలి వాళ్లకి చాలా తక్కువగా ఉంటుంది.
దానిని దృష్టిలో పెట్టుకోరు. నీ వల్లే ఇదంతా.
అతను మరింత పెద్దగా ఏడుస్తూ ఉంటాడు డాక్టర్…. ఏడవకు వాళ్ళకి ఏమీ కాదు సమయానికి మందులు . అందించు ఏదైనా అవసరం ఉంటే నాకు నెంబర్ ఇస్తాను దానికి కాల్ చెయ్ . నువ్వు బయట తిరగకు ఏదైనా అవసరం ఉంటే మాస్కు శానిటైజర్ తప్పకుండా వాడు.
అని అంటుంది అందుకు అతను సరే అంటాడు ఆమె ఇంటికి వెళ్లి నూతనమైన ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని ఇంటికి వస్తాడు తన తల్లికి దాన్ని అందిస్తాడు ఆమె ఊపిరి పీల్చుకుంది.
ఇక అతను తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటూ ఉంటాడు.
కొన్ని రోజులు గడిచాయి అతను కొంచెం అలిసిపోయి తిండి తినకుండా అలా విశ్రాంతి తీసుకుంటాడు .
అప్పుడే తల్లి…. రేయ్ బాబు ఏమైందమ్మా ఎందుకు అలా పడుకున్నావు ఒంట్లో బాగుందా. అతను…. కొంచెం ఏదోలా ఉందమ్మా బాగా ఆకలి అవుతుంది కానీ నేను ఇప్పుడు చేసే పరిస్థితిలో నేను.
ఆ మాటలు విన్న తల్లి…. సరే నువ్వు పడుకో అని ఆక్సిజన్నీ పెట్టుకొని తన కొడుకు కోసం ఆమెకు ఒంట్లో బాగోక పోయినా అతని కోసం
వంట తయారు చేస్తూ ఉంటుంది.
దాన్ని గమనించిన కొడుకు తన మనసులో…. అమ్మ నేనంటే ఎందుకు అమ్మ నీకు ఎంత ఇష్టం నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నువ్వు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్లి ఈ రోగాన్ని నేనే అంటించాను నన్ను క్షమించమ్మ అంటూ ఏడుస్తూ చాలా బాధపడతాడు అప్పుడే తల్లి వంట పూర్తి చేసుకొని కొడుకు దగ్గరికి వస్తుంది.
అతనితో…. రే బాబు ఇదిగో వంట తయారు చేశాను తిను బాబు అని అక్కడ పెట్టి వెళ్లి పోతుంది.
అతను…. అమ్మ నన్ను క్షమించు అని పెద్దగా అని అంటాడు.
ఆమె…. సరే ముందు నువ్వు తిను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అతను ఆ తల్లిదండ్రులు ఇద్దరూ బాగా చూసుకుంటూ సరైన సమయానికి మందులు అందిస్తూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత వాళ్లకు ఆ వ్యాధి తగ్గిపోతుంది. అలా ఉండగా ఒక రోజు వాళ్ళ కొడుకు కి ఫోన్ వస్తుంది.
ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి…. ఏరా గత 15 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు బయట కూడా రావట్లేదు ఏం జరిగింది.
అతను… ఏం లేదురా మా అమ్మ నాన్నకు ఒంట్లో బాగోలేదు అందుకే నేను బయటికి రావడం లేదు. అతను… ఇప్పుడు ఎలా ఉంది మరి తగ్గిందా .
అతను… ఇప్పుడు అంతా సరిగానే ఉంది.
స్నేహితుడు… సరే అయితే ఇప్పుడు బాగానే ఉంది కదా . నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను . ఊరి బయట చెట్టు దగ్గర మన వాళ్లు అందరూ ఎదురు చూస్తున్నారు నీకు అవసరం. నువ్వు త్వరగా వచ్చేయ్.
అతను… లేదురా నేను ఎక్కడికి రాను మీరు కూడా బయట తిరగకండి . నేను ఇలా బయట తిరగబెట్టే మా అమ్మ నాన్న కి ఆ వ్యాధి అంటుకుంది మనం బాగానే ఉంటాము.
మన వల్ల తల్లిదండ్రులు సఫర్ అవుతారు.
దయచేసి ఈ వ్యాధి తగ్గేంతవరకు మనం ఇంట్లోనే ఉన్నాను నేనైతే ఎక్కడికి రాను అని ఫోన్ కట్ చేస్తాడు.
తల్లి అతని మాటలు విని… ఎవర్రా నీ స్నేహితుడా బయటకు రమ్మని పిలుస్తున్నారా.
అతను…. అవునమ్మా బయటికి రమ్మని పిలుస్తున్నారు కానీ నేను వెళ్ళను నాకు బుద్ధొచ్చింది. మీ ఇద్దరికీ ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను అంటు ఏడుస్తాడు అప్పుడు తండ్రి…. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది రా. కానీ మాకు ఏమైనా పర్వాలేదు నా బాధంతా నీ మీదే నువ్వు బయటకి వెళ్తే ఆ వ్యాధి నీకు అంటుకుంటే మేము ఏమైపోవాలి .
నీకేం అవుతుంది అన్న భయం తప్ప మాకు ఏదో అవుతుందని భయం కాదు.
అందుకు అతను చాలా ఏడుస్తూ…. నాన్న నన్ను క్షమించండి . మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. అంటూ కంటతడి పెట్టుకున్నాడు.
అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది.
ఆమె…. ఇప్పుడు మీకు అంతా బానే ఉంది కదా. అని అంటుంది అందుకు వాళ్లు ఆమె ఒక్కసారిగా ఆమె వైపు చూసి…. రండి డాక్టర్ నీ పుణ్యమా అంటూ మాకు బాగానే ఉంది.
డాక్టర్…. ఇప్పుడు చాలా మంది పిల్లలు చెప్పిన మాట వినకుండా బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఇలాంటివి తీసుకొని వస్తారు భగవంతుని దైవ వల్ల ఇలాంటి చిన్న ఆక్సిజన్ సిలిండర్ అవైలబిలిటీ లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే పరిస్థితి మరోలా ఉండేది ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో బెడ్లు గాని ఆక్సిజన్ సిలిండర్ కానీ దొరకటం లేదు దాని కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ . ఏదో ఒక చోట కొరాతా వస్తూనే ఉంది అందుకే మనం మన జాగ్రత్తలో ఉండాలి అని చెబుతోంది.
అందుకు వాళ్లు సరే అని చెప్తారు.
డాక్టర్…. బాబు నీకు కూడా ఒకసారి నేను పరీక్ష చేస్తాను ఎందుకన్న అంత మంచిది.
అందుకు అతను సరే అంటాడు ఆమె అతన్ని కూడా పరీక్షించి…. భగవంతుని దయ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు.
అని చెబుతుంది అందుకు వాళ్లు చాలా సంతోష పడతారు ఇక డాక్టర్ తను ఇచ్చిన ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
తండ్రి అతని వైపు చూసి…. కానీ మీ అమ్మ నిజంగా దేవత. ఆమెకు ఒంట్లో బాగోకపోయినా మన యోగక్షేమాలు చూసుకుంటుంది ఆమె గురించి అస్సలు పట్టించుకోలేదు ధ్యాస అంతా మన గురించే.
అని అంటాడు.
అతను…. అవునా నాన్న అమ్మ మన కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది.
ఆరోజు కూడా ఆమెకు బాగా పోయినా ఎంతో కష్టం తో పని అంతా చేసి. తన కష్టపడుతూనే మనం సుఖ పెడుతుంది అమ్మా నీకు నిజంగా చాలా వందనాలు అంటూ ఆమెకు వందనాలు చెప్పుకుంటాడు.
ఆమె…. ఏమైంది ఈరోజు మీ ఇద్దరికీ నన్ను పొగుడుతూ ఉన్నారు. మీరిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్లు అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది కదా అని పెద్దగా నవ్వుతుంది అందుకు వాళ్లు ఆమె యొక్క ఆనందాన్ని చూసి చాలా సంతోష పడతారు ఇక అప్పటి నుంచి వాళ్ళ కొడుకు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటాడు ఎప్పుడైనా అవసరం ఉంటే మాస్క్ శానిటైజర్ ని ధరించి తన పని వెంటనే ముగించుకొని వెళ్ళిపోతాడు.
ఇక వాళ్ళు జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉంటారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి అంటే మొదటిది మనం ఈ పరిస్థితిలో బయటికి వెళ్లడం అంత మంచిది కాదు. రెండవది తల్లి ప్రేమ అద్భుతమైనది. ఆమె వెలుగుతున్న కొవ్వొత్తి లాంటిది. కొవ్వొత్తి తను కరిగిపోతూ నే ఇంటికి వెలుగునిస్తుంది అలాగే తల్లి తాను ఎంత కష్టపడినా కుటుంబానికి మంచి జరగాలని ఆశిస్తూ ఉంది. అందుకే మన మాతృ మూర్తికి ఎన్ని జన్మలెత్తినా ఆమె రుణం తీర్చుకోలేము.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *