మాయా ఆక్సిజన్ సిలిండర్ | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

దేవరకొండ అనే గ్రామంలో పార్వతి శంకరని భార్య భర్తలు ఉండే వాళ్ళు . వాళ్ల కూతురు పేరు మీనా. మీనా ప్రతి రోజు చక్కగా బడికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చి శ్రద్ధగా చదువు కుంటూ ఉండేది.
ఆ భార్యభర్తలిద్దరు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా కుటుంబాన్ని గడిపేవాళ్ళ. అలా వాళ్ళ కుటుంబం సాగిపోతుంది. ఒకరోజు ఒక భార్యాభర్తలిద్దరూ కూరగాయలు అమ్ముకుంటూ తలోదారి వెళ్ళిపోతారు.
శంకర్ అలా వెళ్తూ ఉండగా ఒక కారు ఢీ కొని తన రెండు కాళ్ళు విరిగి పోతాయి.
అక్కడ ఉన్న ప్రజలంతా గుమికూడి విచిత్రంగా చూస్తూ ఉంటారు అప్పుడే అటుగా వస్తున్న భార్య ఏంటా అని ఆశ్చర్యంగా అక్కడికి వెళుతుంది. అక్కడ
భర్తను చూసి… అయ్యో మీరందరూ ఎంతో చూస్తున్నారా ఎవరైనా సహాయం చేయండి .
దయచేసి ఎవరైనా సహాయం చేయండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది డాక్టరమ్మ అక్కడికి వచ్చి వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేస్తుంది. ఆన్లైన్ అతని తీసుకొని హాస్పిటల్ కి చేరుకుంది అక్కడ డాక్టర్ అతనికి వైద్యం చేసి 2 కాళ్లను తీసివేస్తుంది.
ఇక అప్పట్నుంచి అతను మంచం మీదే ఉంటాడు ఆమె ఒక్కటే కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది రోజులు గడిచాయి. ఆ గ్రామంలో ప్రజలంతా కొత్త వ్యాధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దానిని విన్న పాప…. అవును అందుకే మా బడికి కూడా సెలవు ఇచ్చారు. అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే తల్లి అక్కడికి వస్తుంది ఆ మాటలన్నీ విని … అన్నీ బంద్ చేస్తే మరి మా లాంటి వాళ్ళు ఎలా బ్రతకాలి. వాళ్లు… కొంత సమయం వరకు మన వ్యాపారాలు చేసుకోవచ్చు అని అని చెప్పారు. కాబట్టి దాని గురించి కొంత వరకు అయితే దిగులు లేదు. ఆ మాటలు విన్న ఆమె సరే అని చెప్పి పాపనీ తీసుకొని. అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఆ రోజు పాప… అమ్మ ఏంటి దేనిగురించి ఆలోచిస్తున్నావు.
ఆమె ఏ సమాధానం చెప్పలేదు.
పాప…. అమ్మా నువ్వు నన్ను గురించి ఆలోచిస్తే దయచేసి ఆలోచన పక్కన పెట్టి జరిగిందేదో జరిగిపోయింది నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు నన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నారో మన సంతోషమంతా ఆయనే కదా.
ఆయన సంతోషం అంతా మనమే కదా . అని అంటుంది అందుకు తల్లి… నేను ఆలోచిస్తూ ఉంది మీ నాన్న గురించి అమ్మ . రేపటి నుంచి అంతా లార్డ్ అంటున్నారు కదా. ఈ రోజు మొత్తం తిరిగితే అంతంత మాత్రం సంపాదన వస్తుంది. అలాంటిది రేపటి నుంచి సగం సగం అంటే చాలా కష్టం గా అయిపోతుంది.
ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు అని బాధపడుతుంది కూతురు … అమ్మ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా అవసరమైతే మన ఇంటికే సరాసరి వచ్చి తీసుకు వెళ్తారు కదా ఇంకా ఎందుకు బాధ పడుతున్నావు . దాని గురించి వదిలేయ్ అని అంటుంది అందుకు ఆమె సరేలే అని అంటుంది నీకు ఆ తర్వాత రోజు నుంచి లాక్ డౌన్ కొంత సమయం వరకు ఆమె కూరగాయలు అమ్ముకొని. ఇంటికి తిరిగి వస్తుంది ఇక ఆ తర్వాత ఆ కూరగాయలు కావలసిన వాళ్లు ఆమె ఇంటికి వచ్చి కూరగాయలు తీసుకు వెళుతూ ఉంటారు .
అలా ఆమె వ్యాపారం సాగిపోతూ ఉంటుంది.
కొన్ని రోజులు గడచాయి ఆమె ఆరోగ్యం బాగోదు. అలాగే ఆమె భర్త ఆరోగ్యం కూడా క్షీణించింది. చూస్తూ చూస్తుండగానే నీ పాప ఆరోగ్యం కూడా క్షీణించింది.
వాళ్లకి ఏం జరిగిందో అసలు అర్థం కాదు.
ఒకరోజు పక్కింటి శారద కూరగాయల కోసం ఆ ఇంటికి వస్తుంది.
ఆమె పార్వతిని పిలుస్తూ…. పార్వతి వదిన పార్వతి వదిన కూరగాయలు ఉన్నాయా.
అని అంటుంది కానీ ఎవరూ పడకపోవడంతో లోపలికి వెళ్తుంది ముగ్గురు అనారోగ్యంతో బాధ పడటం చూసి ఆమె తన మనసులో …… అయ్యో మీ ముగ్గురికి ఏదో అయ్యింది కొంపదీసి కొత్త వ్యాధి ఏమో ఎందుకైనా మంచిది పాపం డాక్టర్ ని తీసుకొని వస్తాను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబుతుంది.
వెంటనే డాక్టర్ అక్కడికి వచ్చి వాళ్లకు వైద్యం చేస్తుంది ఆక్సిజన్ సిలిండర్ అందిస్తోంది .
అప్పుడప్పుడు ఆ డాక్టర్ వచ్చి వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది రోజులు గడిచాయి.
ఒకరోజు తల్లి చాలా నీరసపడి ఆకలి ఆకలి అంటూ కలవరిస్తూ ఉంటుంది దానిని విన్న పాపా… అమ్మ ఆకలి గా ఉందా ఒక్క నిమిషం అమ్మా నీ కోసం నేను ఏమైనా తయారు చేస్తాను. అని వంటగదిలోకి తన పెట్టుకున్న ఆక్సిజన్ సిలిండర్ తో పాటు వెళ్తుంది .
ఆమె ఆ సిలిండర్ తోనే పని చేస్తూ ఉంటుంది ఇక తాను స్వయంగా వంట చేసి తల్లికి అందిస్తుంది తల్లి చిన్నగాదాని తిని …. భగవంతుడ మాకెందుకు ఇంత కష్టం తీసుకొచ్చావు. నేను అస్సలు ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అని ఏడుస్తూ.
ఆ పాప ఆ తరువాత తండ్రికి కూడా కావలసిన ఆహారాన్ని అందించి మందులు వస్తుంది. ఇక ఆ పాప ఆరోగ్యం కొన్ని రోజులు పడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కుదిరితే పడకపోవడంతో ఆమె అన్ని తానై వాళ్లకి సేవలు చేస్తూ ఉంటుంది అంత చిన్న వయసులో ఎంతో కష్ట పడుతూ ఉండడం చూసిన పొరిగింటి వాళ్లు…. అయ్యో పాపం ఇంత చిన్న వయసులో పాపకి ఎంత కష్టం వచ్చింది. ఇంటి పని వంట పని చేస్తూనే తల్లిదండ్రులు చూసుకుంటుంది మనం పోవడానికి కూడా లేకపోయింది ఈ మాయదారి వ్యాధి ఏమిటో కానీ. సహాయం చేయాలని కూడా భయం వేస్తుంది.
అంటూ చెప్పుకుంటూ ఉంటారు.
పాపా వాళ్ళ మాటలు విని విన్నట్టుగా వదిలేస్తుంది అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి వాళ్లకి కావాల్సిన మందులు అందించి.
అక్కడి నుంచి వెళ్లబోతుండగా పాపా డాక్టర్ తో…. డాక్టర్ గారు అందరూ ఈ వ్యాధి అంటు వ్యాధి అని దూరం దూరం గా ఉంటున్నారు మరి మీరు ఎందుకు ధైర్యంగా ఇక్కడికి వస్తున్నారు మీకు ఆ వ్యాధి అంటదా.
అందుకు ఆమె…. చుడు పాప ఈ వ్యాధి అంటువ్యాధి కానీ దీనికంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎవరికీ సోకుతూ అలాగే నేను ఒక డాక్టర్ని నేను వీటికి భయపడితే ఎలా చెప్పు. చాలా మంది మృత్యువాత పడ్డాతారు. అందుకోసమే. మా డాక్టర్లు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని వైద్యం అందిస్తున్నారు.
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అప్పుడు పాప బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో…. నిజంగా మీకు మనసులో సహాయం చేయాలని అనుకుంటే ఇదంతా ఆలోచించరు. డాక్టర్ కూడా మనలాగే మనిషి కదా ఆమె జాగ్రత్తలు తీసుకొని మా దగ్గరికి వస్తుంది కదా. నేను మిమ్మల్ని రమ్మని చెప్పడం లేదు. కానీ అసలు దిక్కు లేకుండా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్లకు సహాయం చేయండి అంటే చాలు అని లోపలికి వెళ్లి పోతుంది ఆ మాటలు విన్న వాళ్లు…. ఇంత లేదు ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఆయనమనకెందుకు . అని చెప్పి వాళ్లు లోపలికి వెళ్ళి పోతారు.
పాపం ఆ పాప ఒక్కటే వంట తయారు చేస్తూ. తల్లికి తండ్రికి అందిస్తూ . ఇల్లు శుభ్రం చేయడం బట్టలు ఉతకడం అంట్లు కడగటం ఇల్లు ఊడవడం అన్నిటినీ తానే స్వయంగా చేస్తూ ఎంతో కష్ట పడుతూ ఉంటుంది.
ఆ తల్లి తండ్రి ఇద్దరూ పాప కష్టాన్ని చూసి…. చూడండి మన కోసం పాప ఎంత కష్టపడుతుందో. ఇప్పుడు మనం తల్లిదండ్రులము కాదు . పాపే మనకి తల్లి తండ్రి. అంటూ కంటతడి పెట్టుకుంది.
అతను కూడా చాలా బాధపడుతు…. అవును భగవంతుడు నన్ను ఇలాగా చేసేస్తాడు అనుకోలేదు దానికితోడు మన అందరిని ఇలా మంచానపడేస్తాడు అనుకోలేదు . ఏం చేద్దాం మన కర్మ అలాగే రాసిపెట్టడు. నా కూతురు తలరాతను కష్టపడ్డామని రాసి పెట్టాడు ఏమో. ఇంత చిన్న వయసులో ఇలా కష్టపడుతుంది. అంటూ అతను కూడా చాలా బాధ పడతాడు.
మరి కొన్ని రోజులు గడిచాయి ఆ పాప అలాగే కష్టపడుతూ తల్లి తండ్రి ని బాగా చూసుకుంటుంది వాళ్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక తల్లి…. అమ్మ మీనా నువ్వు ఇంకా కష్టపడింది చాలు తల్లి. మా కోసం ఎంతో కష్టపడ్డాం ఇంత చిన్న వయసులో ఇంత కష్టం వచ్చినందుకు చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు ఆరోగ్యం కుదుట పడింది కదా లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అన్ని నేను చూసుకుంటాను .
పాపా…. అమ్మ నీకు ఇప్పుడే కదా ఆరోగ్యం కుదుటపడింది అప్పుడే పనులు చేస్తాను అంటే ఎలా చెప్పు . నా మాట విని నువ్వే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అమ్మ. లేదంటే పనిచేసి నీరసపడిపోతావూ.
అని అంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి విశ్రాంతి తీసుకుంటుంది.
అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది.
డాక్టర్ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని .
వాళ్లకి మందులు రాసి ఇచ్చి…. మీరు చాలా అదృష్టవంతులు. చాలా తొందరగా కోలుకున్నారు. భగవంతుడు మీ పట్ల ఉన్నాడు కాబట్టి మీకు మంచి జరిగింది.
అని అంటుంది అందుకు ఆమె…. అవును డాక్టర్ గారు కానీ ఆ భగవంతుడు ఎక్కడో లేడు నా కూతురు రూపంలోనే ఉన్నాడు . ఎంతో కష్టపడి మిమ్మల్ని చూసింది సమయానికి తన చిన్న చేతులతో ఆహారాన్ని అందించి మందులు అందించేది . ఇంత చిన్న వయసులో మా కోసం కష్టపడి . మమ్మల్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకు వచ్చింది . ఇలాంటి కూతురు ఎంతమందికి దొరుకుతుంది అని కూతుర్ని హత్తుకొని ఏడుస్తుంది . డాక్టర్…. నిజంగా ఇలాంటి కూతురు ఉన్నందుకు వాళ్లు చాలా గర్వపడుతున్నారు. అని అంటుంది పాప ఏడుస్తూ…. అమ్మా నువ్వు ఏమి బాధ పడకమ్మా. మన పని మనం చేసుకున్న అంతే కదా . అయినా నేను కూడా బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అయ్యి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తానమ్మ. అంటుంది ఆ మాటలకి తల్లి చాల సంతోషపడుతూ…. తప్పకుండా అమ్మ నేను ఎంత కష్టమైనా సరే నిన్ను బాగా చదివించి డాక్టర్ని చేస్తారు అని అంటుంది ఎందుకు పాపా సరే అంటుంది డాక్టర్… నిజంగా పాప చాలా తెలివైనది. కొంచెం కష్టమైనా సరే బాగా చదివించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆ మాటలు విన్న తండ్రి…. నా బంగారు తల్లి కోసం నేను ఏదైనా చేస్తాను ఆఖరికి నా ప్రాణాలైనా ఇస్తాను. నా బంగారు తల్లి పై చదువుల కోసం మనం ఉండే ఇల్లు అయినా అమ్మేస్తున్నాను . కానీ నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యా మాకు మంచి పేరు తీసుకు రావాలి అందరు పాపా సరే అంటుంది.
ఇక పాప తల్లికి ఇంటి పనుల్లో సేవచేస్తూ పని అయిపోయిన తర్వాత చదువుకుంటూ అలా కాలాన్ని గడుపుతూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *