మాయా కమ్మలు 4 Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

అది కోదండపురం అనే గ్రామం ఆ గ్రామంలో విష్ణు , శారద అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లది చాలా వాళ్ల కూతురు బేబీ నీ చదివించడం కోసం వాళ్లు ఎంతో కష్టపడుతూ పని చేసుకుంటూ ఉండే వాళ్ళు. ఆ డబ్బుతోనే బేబీనీ చదివిస్తూ ఉంటారు.
ఆ దంపతులిద్దరూ….. ఎలా అయినా మన అమ్మాయిని బాగా చదివించాలి. అమ్మాయి డాక్టర్ కావాలి అందరూ నా కూతుర్ని పొగుడుతూ మేచ్చుకోవాలి.
శారద….. తప్పకుండా అండి మా అమ్మాయి బాగా చదువుకుంటుంది కచ్చితంగా డాక్టర్ అవుతుంది. కానీ ఈ లోపు ఎన్నో ఉంటాయి ఆడపిల్ల అంటే అన్ని ఖర్చులే కదా. వాటి గురించి కూడా ఆలోచించి మరింత డబ్బులు కూడా పెట్టాలి.
అని వాళ్ళిద్దరూ ఆ పాప గురించి ఎంతో శ్రద్ధగా మాట్లాడుకుంటూ ఉంటారు కాని తానొకటి తలిస్తే దైవమొకటి తెలుస్తుంది అని
వాళ్ల నివసిస్తున్న ఇల్లు సరిగ్గా లేదు. అది ఒక్కసారిగా కూలీ అతని మీద పడిపోతుంది .
భార్యకు చిన్నచిన్న స్వల్ప గాయాలు అవుతాయి అతను మాత్రం అక్కడికక్కడే
మరణిస్తాడు. భార్య బోరున విలపిస్తూ ఉంటుంది. చాలా సమయం తర్వాత స్కూల్ కి వెళ్ళిన బేబీ ఇంటికి తిరిగి వస్తుంది.
ఆ దృశ్యాన్ని చూసి ఆమె బోరున విలపిస్తుంది.
ఇక ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతుంది . ఆ తల్లి కూతురు ఇద్దరు చిన్న గుడిసె నిర్మించుకుని ఆ ఇంట్లోనే ఉంటారు . అప్పట్నుంచి తల్లి ఒకటే కష్టపడడం తో ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. దాని కారణంగా పాపా తన చదువుని ఆపేసి తల్లితో పాటు ఉపాధి పనికి వెళ్తే ఉంటుంది.
అలా వాళ్ల జీవితాల్లో దుఃఖంలో కి జారిపోతాయి. ఒకరోజు ఉపాధి పని లేక పోవడంతో తల్లి కూతురు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు పాప బయట ఆడుకుంటూ ఉంటుంది ఇంతలో ఒక బొమ్మలు అనే వ్యక్తి
అటుగా వెళుతూ ఉంటాడు వాటిని చూసి ఆమె…. అబ్బా బొమ్మలు చాలా బాగున్నాయి అని అనుకొని అతని దగ్గరికి వెళుతుంది అతనితో…. ఏవండీ ఆ బొమ్మలు చాలా బాగున్నాయి.
అతను…. ఒక బొమ్మ కేవలం ₹100 ఏ బొమ్మ అయినా 100 రూపాయలే .
పాప… వంద రూపాయల నా దగ్గర డబ్బులు లేవు.
అతను…. డబ్బులు లేవా డబ్బు లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళి పోతాడు పాప చాలా బాధపడుతూ. అయినా ఆ బొమ్మలు లేకపోతే ఏమైంది . ఇసుకతో బొమ్మలు చేసుకొని ఆడుకుంటాను . అని పాపని పాప తమాయించుకుని ఇసుకలో ఆడుకోవడానికి వెళ్తుంది. అక్కడ ఇసుక తో ఇల్లు నిర్మిస్తూ. బొమ్మలు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆమెకు ఒక చిన్న పెట్టె కనబడుతుంది.
పాప చాలా ఆశ్చర్య పోతూ ఇందులో ఏముంది అంటూ దాన్ని తెరిచి చూస్తుంది.
అందులో రెండు కమ్మలు ఉంటాయి.
పాపకు ఆ కమ్మలు చాలా బాగా నచ్చి …. ఇవి బలే గా ఉన్నాయి అని వాటిని దర్స్తుంది
చాలా సమయం వరకు అక్కడే పాప ఆడుకొని తర్వాత ఇంటికి వెళ్తుంది.
ఇంటిదగ్గర తల్లి ఆమె ఒక్క కమ్మలు చూసి…. బేబీ ఈ కమ్మలు ఎక్కడివి. పాపా… నేను
ఆడుకుంటూ ఉండగా నాకు అవి దొరికే అమ్మ అంటూ జరిగిన విషయం చెబుతుంది తల్లి వాటిని చూసి….. ఇవి బంగారు కమ్మలు లాగా ఉన్నాయి అమ్మ ఒకసారి ఇలా ఇవ్వు అంటూ ఆ పాప దగ్గరనుంచి బంగారు కమ్మలు తీసుకుంటే అవి నిజంగానే బంగారు కమ్మలు .
ఆమె…. ఎవరివో ఏమో మన సొమ్ము కాదు అప్పుడు మన దగ్గర ఎందుకమ్మా . ఇవి ఎక్కడ తీసుకొచ్చావు అక్కడే పడేసి చెయ్యి అని అంటుంది అని చెప్పి వాటిని తీసుకొని మళ్ళీ అవి దొరికిన ప్రదేశానికి వెళ్ళి వాటిని దూరంగా విసిరేసింది.
అవి భూమిమీద పడిన వెంటనే అక్కడ ఒక పెద్ద మాయ చెట్టు ప్రత్యక్షమవుతుంది. ఆ చెట్టు నిండా మాయ కమ్మలు.
అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కి కిందికి రాలుతూ ఉన్నాయి.
ఆ పాప చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడు మాయ చెట్టు….. నన్ను బందీ నుంచి భూమ్మీద విసిరేసినoదుకు మీకు చాలా కృతజ్ఞతలు.
అని అంటుంది ఆ మాటలు విన్న పాప చాలా ఆశ్చర్యపోతూ ….. నేను చూస్తుంది నిజమేనా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
మాయ చెట్టు… అవునమ్మా నువ్వు చూస్తుండు నిజమే. నేను మాయ చెట్టు ని ఒక మాంత్రికుడు నన్ను తన స్వార్థం కోసం వాడుకోవడానికి నన్ను ఒక పెట్టెలో బంధించి ఊరికి వచ్చాడు కానీ ఈ ఊరు చేరుకునేలోపే వాడికి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు వాడు చనిపోయాడు. నేను ఈ భూమిలో కొట్టుకుపోయి ఇరుక్కుపోయాను.
మళ్లీ ఈ రోజు నీ పుణ్యమా అంటూ బయటకు వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది . నువ్వు చేసిన మేలు మర్చిపోలేను ఎందుకు ఈ రాలుతున్న అన్ని బంగారు కమ్మలు . వాటిని సొంతం చేసుకో పాపా అని అంటుంది పాపా చాల సంతోషపడుతూ హడావిడిగా వాటన్నిటిని మూటకట్టుకుంది.
మాయ చెట్టు దాన్ని చూసి ఆ పాపను దీవించి అక్కడినుంచి గాల్లో లేచి అలా వెళ్ళి పోతుంది.
పాప పరుగుపరుగున ఆ మూటను తీసుకొని ఇల్లు చేరుకుంటుంది. ఆమె తల్లి దగ్గరికి వెళ్లి వాటిని చూపించి జరిగిన విషయమంతా చెబుతుంది. దానిని విన్న తల్లి…. నిజంగా నా తల్లి నాకేం అసలు అర్థం కావట్లేదు. ఈ బంగారంతో మనం మంచి ఇల్లు కట్టుకుందాం నీకు మంచి చదువుని కూడా చేపిస్తాను ఏమంటావ్ పాపా అందుకు ఆమె సారే ఉంటుంది.
ఇక ఆ బంగారం అమ్మి ఆమె డబ్బు చేసి
మంచి ఇల్లు ని ఆ పాప చదువు చెప్పిస్తూ ఉంటుంది రోజులు గడిచాయి.
ఒకరోజు బొమ్మలు అమ్ముకునే వ్యక్తి కి చాలా ఆకలిగా ఉంది అతను బేబీ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు ఆ ఇల్లు చూసి తనలో…. ఇల్లు చూస్తుంటే బాగా డబ్బున్న ఇల్లు లాగా ఉంది కచ్చితంగా ఏదో ఒకటి తినడానికి పెడతారు అని అనుకుని…. అమ్మ చాలా దూరం నుంచి నడిచాను ఆకలి అవుతుంది ఏమన్నా తినడానికి పెడతారా అమ్మ అని అంటాడు .
ఇంటిలో పాప బయటకు వస్తుంది అతన్ని చూసి….. అంకుల్ బాగున్నారా అంతకు ముందు నీ దగ్గర ఉన్న బొమ్మలు నాకు చాలా బాగా నచ్చాయి ఇప్పుడున్న బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తాను వాటినీ నాకు ఇస్తారా.
అతను చాలా ఆశ్చర్యపోతూ… ఆ ఇస్తాను పాప అంటాడు. పాప చాల సంతోషపడుతూ…. అంకుల్ మీరు అయితే ముందు భోజనం చేయండి. ఆ తర్వాత నేను డబ్బులు ఇచ్చినా తీసుకుంటాను అని అతని లోపలికి తీసుకు వెళుతుంది . పాపే స్వయంగా అతనికి భోజనం వడ్డిస్తుంది అతను భోజనం చేసి … పాపా నీకు చాలా కృతజ్ఞతలు మీ ఇంట్లో ఎవరూ లేరా అమ్మ.
పాప…. మా అమ్మ కి ఒంట్లో బాగోలేదు విశ్రాంతి తీసుకుంటోంది. అంకుల్ ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఈ బొమ్మలు నాకు ఇవ్వండి. అని అంటుంది అతను తన మనసులో….. ఆరోజు నేను డబ్బులు లేవు అని పాపను కసురుకున్నాడు కానీ ఈ రోజు పాప నా ఆకలి తీర్చింది. ఆరోజు పాపా దగ్గర డబ్బు లేదు ఈరోజు చాలా డబ్బు ఉంది.
నేను తిట్టాను అన్నా ద్వేషం కోపం ఆమెను లేదు. నేను ఆమెని తిట్టాను అన్నా పశ్చాత్తాపం నాలో ఉంది మనిషి జీవితం చాలా గుణపాఠాలు నేర్పిస్తుంది.
ఎవరిని తక్కువ ఉద్దేశంతో చూడకూడదు ఎప్పుడూ వాళ్లతో అవసరం వస్తుందో తెలీదు. బహుశా వాళ్ళు మనకి దేవుడు అవుతారేమో అంటూ చాలా బాధపడుతూ . ఉంటాడు పాప…. అతన్ని చూస్తూ ఏమైంది . అని అంటుంది అందుకు అతను ఏమీ లేదమ్మా….. ఇదిగో ఈ బొమ్మలు అన్ని నీకే తీసుకో. నాకు డబ్బులు ఏమి వద్దు అమ్మ అని చెప్పి పాప వద్దు అంటున్నా కూడా డబ్బు తీసుకోకుండా ఆ బొమ్మలు ఆమెకు ఇచ్చి వెళ్ళిపోతాడు.
అతను తన ఇంట్లో చేరుకొని తన కాలి బుట్టను కిందకు దించాడు .
అందులో ఒక పెట్టె ఉంటుంది అతను చాలా ఆశ్చర్యపోతూ ఆ పెట్టెను తెరచి చూస్తున్నాడు
అందులో బంగారు కమ్మలు ఉంటాయి.
అతను వాటిని చూసి….. పాపా చాలా మంచిది నాకు తెలియకుండా దీనిని ఇక్కడ ఉంచింది. చాలా కృతజ్ఞతలు పాపా నీకు నువ్వు ఈ పని చేసి మరోసారి నేను సిగ్గు పడే లాగా చేశావు .
అంటూ చాలా బాధపడతాడు ఇక అతను ఆ బంగారు కమ్మలు అమ్ముకొని ఒక బొమ్మల వ్యాపారం. మొదలు పెడతాడు .
దానిని ఓపెన్ చేయడానికి పాపను పిలుస్తాడు.
పాప దాని ఓపెన్ చేస్తుంది లోపల బొమ్మలు అన్నీ చూసి చాలా బాగున్నాయి అంటూ సంబరపడిపోతుంది.
అతను…. పాపా నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు ఇక్కడున్న బొమ్మలతో ఆడుకోవచ్చు.
ఆ మాటలు విన్న పాప నిజంగానా అంకుల్ అంటూ చాలా సంతోషపడుతుంది అతను అవును అంటాడు . పాప చాలా సంతోష పడుతూ ఉంటుంది ఆమె బడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్లి బొమ్మలతో ఆడుకొని సంతోషంగా మళ్ళీ ఇంటికి చేరుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *