మాయా చెట్టు మాయా కమ్మలు 3 Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

ప్రియా ఒక ఇంటి ముందు శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆమెకు ఒక కమ్మ కనబడుతుంది. ప్రియా దాన్ని చూసి… అరే చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా చూడ్డానికి భలే వింతగా ఉంది బంగారమా పాపం ఎవరు పడేస్తున్నారు ఏమో. అని దాన్ని తీసుకుంటుంది. పాప దాని తీసుకున్న వెంటనే మరొకటి కనబడుతుంది. పాప దానిని కూడా తీసుకుంటుంది. అలా పాపకి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కనబడుతూ ఉంటాయి. పాప ఒక్కొక్కటి దాని తీసుకుంటూ అలా కనబడిన దూరం అంత ప్రయాణిస్తుంది పాప చాలా దూరం నడిచి ఒక అడివి చేరుకుంటుంది. పాప చేతిలో చాలా బంగారు కమ్మలు ఉంటాయి.
పాప ఆటో ఇటు చూసి….. ఇక్కడ వరకూ కమ్మలు అన్ని వేశాను కానీ నేను ఈ కమ్మల పిచ్చిలో పడి దారితప్పి పోయాను. అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడే ఆమెకు ఒక ముసలావిడ కనబడుతుంది ఆమె ఏడుస్తూ…. ఆకలి అమ్మా. ఆకలి అమ్మా అంటూ అరుస్తూ ఉంటుంది. పాప తన ఏడుపు ఆపేసి తన దగ్గరికి వెళ్లి….. అమ్మ నీకు ఆకలి గా ఉందా ఇవ్వు ఇవ్వు బంగారమ లేదా ఒకసారి చూడు.
అని తన చేతిలో ఉన్న కమ్మలని ఆమెకు ఇస్తుంది. ఆమె చాలా ఆతృతగా తీసుకొని వాటిని చూసి….. అమ్మ ఇది బంగారమే స్వచ్ఛమైన మేలిమి బంగారం. ఎక్కడివి అమ్మా నీకు .
అందుకో పాపా జరిగిన విషయం చెబుతుంది ఆమె దానిని విని చాలా ఆశ్చర్యపోతుంది. పాప…. అమ్మ ఇవన్నీ మీరే తీసుకోండి కానీ నాకు ఒక సహాయం చేయండి . నేను దారి మర్చిపోయాను నన్ను ఊరు దాక విడిచిపెట్టండి. అని అంటుంది అందుకు ఆమె…. చాలా కృతజ్ఞతలమ్మ నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోలేను ఈ పుణ్య ఊరికే పోదు నా భరత్ అనే నేను ఆకలితో అల్లాడి పోతున్నాం. అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. పాప ఆమెను ఓదారుస్తుంది
ఆ తర్వాత ఆమె పాపం ఊరిలో విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
పాప సరాసరి ఇంట్లోకి వెళ్లి మంచం పై ఉన్న తన తల్లితో….. అమ్మ క్షమించు ఆలస్యమైంది అమ్మ అంటూ జరిగిన విషయం. చెబుతుంది కానీ తన తల్లి కదలదు మెదలదు ఎందుకంటే ఆమె బతికి ఉన్న శవం లాంటిది. ఆమె బేల్దారి పని కి వెళుతూ ఉండేది అక్కడ ప్రమాదవశాత్తూ డాబా పైనుంచి కింద పడి.
లోపల నరాలు దెబ్బతిన్నయి. ఎన్ని హాస్పిటల్ లో చూపించిన ఆమె మామూలు స్థితికి మాత్రం రాలేదు అలా కదలకుండానే ఉంటుంది ఆమెకు సర్వం మంచంలోనే. పాప తల్లిని ఒక చిన్న బిడ్డ లాగ చూసుకుంటూ ఉంటుంది. ప్రియా తండ్రి ఈ మధ్యనే మరణించాడు. అప్పట్నుంచి పాప తన చదువును కూడా ఆపేసి. తల్లిని చూసుకుంటూ . ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. పాప ఏ విషయం అయినా తన తల్లికి చెబుతుంది ఎందుకంటే ఇప్పటికైనా పాప మాటలు విని తన తల్లి పైకి
లెగ్స్తుంది అని ఆశ.
ఇక రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం పాప ఇంటి ముందు శుభ్రం చేస్తుండగా మళ్లీ ఆమెకు ఒక కమ్మ కనబడుతుంది. దాన్ని చూసి మళ్ళీ ఆమె చాలా ఆశ్చర్యపోతూ దాన్ని తీసుకుంటుంది ఇక దాని తర్వాత మరొకటి. దాని తర్వాత మరొకటి అలా పాప ఒకదాని తర్వాత తీసుకుంటూ ఒకచోట కి వెళ్తుంది.
ఆమె తన లో….. ఇది ఏంటి నిన్న ఎలా అయితే జరిగిందో ఈరోజు కూడా అలాగే జరిగింది నాకు ఏమీ అర్థం కావడం లేదు.
అని చాలా కంగారు పడుతూ ఉంటుంది.
ఇంతలో అక్కడ ఒక బిచ్చగాడు కనబడతాడు. అతనికి కళ్లు కనపడవు.
…. అమ్మ కళ్ళు లేని వాణ్ని తల్లి దానం చేయండి అమ్మ అమ్మ అంటూ అడుక్కుంటూ ఉంటాడు.
పాప వెంటనే తన దగ్గర ఉన్న బంగారు కమ్మలు తీసుకొని అతను ఇచ్చి…. ఇది బంగారు కమ్మలు తీసుకోండి. జాగ్రత్త ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ గుడి వ్యక్తి….. చాలా కృతజ్ఞతలు తల్లి నువ్వు ఎవరో నాకు తెలియదు నేను నేను చూడలేను చాలా కృతజ్ఞతలు. ఉన్నావా తల్లి ఉన్నావా అమ్మా అంటూ అరుస్తూ ఉంటాడు కానీ అప్పటికే పాప వెళ్ళిపోతుంది.
పాప దాని గురించి ఆలోచిస్తూ తన ఇల్లు చేరుకుంటుంది.
ఇంటి ముందు శుభ్రం చేసి తర్వాత ఇంట్లో కి వెళ్తుంది తన తల్లి దగ్గర కూర్చుని….. అమ్మ నీకు నిన్న జరిగిన విషయం చెప్పాను కదా ఈ రోజు కూడా అచ్చం బంగారు కమ్మలు నాకు కనపడ్డాయి అమ్మ. అంటూ అంత చెబుతూ ఉంటుంది తల్లి ఏ మాత్రం మాట్లాడవు కదా పాప ఏడుస్తూ….. అమ్మ ఒక్కసారి నాకు సమాధానం చెప్పమ్మా. ఒక్కసారి నన్ను ప్రియా అని పేరు పెట్టి పిలువ్ అమ్మ. ఎందుకమ్మా నేనంటే నీకు ఇష్టం లేదా ఒక్కసారి లేమ్మా . ఒక్కసారి నిన్ను పిలువ అమ్మ ప్రేమ ఒక్కసారి పిల్వామ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఇంతలో ఆమెకు ఒక కమ్మ అక్కడ కనబడుతుంది. పాప దాన్ని చూసి… ఇది ఇక్కడికి ఎలా వచ్చింది నేను అన్ని ఆ గుడ్డి తాతయ్య కి ఇచ్చేశాను కదా.
అని అనుకుంటుంది ఇంతలో ఆమె బట్టలు కి ఒక ఖమ్మ ఉంటుంది ఆమె…. ఓ నా దుస్తులకు పట్టుకొని వచ్చాయా . ఏదేమైనా ఇది చాలా బాగున్నాయి మా అమ్మకి చాలా అందంగా ఉంటాయి . అని ఆ రెండు కమలను తన తల్లికి పెడుతుంది.
వెంటనే తన తల్లి లేచి కూర్చుంటుంది.
దాన్ని చూసి పాప ఆశ్చర్యమేస్తుంది .
పాపా తల్లిని పట్టుకొని….. అమ్మ అమ్మ అంటూ కౌగిలించుకుంది తల్లి ఏడుస్తూ…. నా బంగారు తల్లి ఎలా ఉన్నావమ్మా . ఇన్ని రోజులు నువ్వు ఎంత కష్టపడుతున్నారో నేను వింటూనే ఉన్నాను. నా బంగారు తల్లి అంటూ ఏడుస్తూ హత్తుకుంటుంది .
పాప జరిగిన విషయం చెప్పి తను కూడా చాలా బాధపడుతుంది ఇంతలో
వాళ్లకి ఒక స్వరం వినపడుతుంది.
వాళ్లు ఆ స్వరం వినపడుతున్న వైపుగా వెళ్తారు. అది ఎక్కడో కాదు అది వాళ్ళ ఊర్లో ఉన్నది. ఆ నదిలో పడవ లో ప్రయాణిస్తారు ఆ స్వరం ఒకచోట నిలిచి పోతుంది అక్కడ ఒక పెద్ద చెట్టు . ఆ చెట్టుకి అన్ని కమ్మ లే ఉంటాయి.
అదంతా చూసి వాళ్ళు ఆశ్చర్య పోతారు చెట్టు…. కంగారు పడకండి నేను మాయ కమ్మలు ఇచ్చే చెట్టు ని. చనిపోయిన మీ భర్త ఆత్మ నాకు మొర పెట్టుకుంటుంది మిమ్మల్ని చూసుకోమని చెప్పి. నేను పాపం ఇక్కడికి తీసుకు రావడానికి ఎంతో ప్రయత్నం చేశాను కానీ రెండు సార్లు కూడా ఆమె మరొకరికి ఆ మాయ కమ్మలు దానం చేసింది. అప్పుడు ఆమె గుణం నాకు చాలా బాగా నచ్చింది.
పాప సాయం చేసిన గుడ్డి వ్యక్తి కి కళ్ళు వచ్చాయి. అతను వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు.
అలాగే మొదటిగా సాయం చేసిన ముసలావిడ కూడా మంచి ఇల్లు ఏర్పాటు చేసుకొని తన భర్తతో సంతోషంగా ఉంది.
ఇప్పుడు మీ వంతు కూడా వచ్చేసింది నా ద్వారా మీ అమ్మగారు కళ్ళు వచ్చాయి మీకు ఇప్పుడు డబ్బు కూడా వస్తుంది అంటూ మాయ కమ్మలను వాళ్లకు ఇస్తుంది.
వాళ్ళు వాటిని తీసుకొని …. చనిపోయిన నా భర్త మాకోసం చాలా ఆలోచిస్తున్నా డా అంటూ ఏడుస్తూ ఉంటుంది పాప కూడా ఏడుస్తూ ఉంటుంది.
మాయ చెట్టు…. బాధపడకండి ఈ రోజుతో ఆయన ఆత్మకు శాంతి కలిగింది అతను ఈ లోకాన్ని విడిచి భగవంతుని చేరుకున్నాడు అని అంట అందుకు వాళ్లు చాలా సంతోష పడతారు ఇక అక్కడినుంచి వాళ్లు మాయ చెట్టు కి కృతజ్ఞత చెప్పుకునే అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.
వాళ్లకి దారిలో ఆ గుడ్డి వ్యక్తి వ్యాపారం కనబడుతుంది దాన్ని చూసి సంతోష పడుతూ. ముందుకు వెళ్తారు. మార్గమధ్యలో ముసలావిడ ఆమె తన ఇల్లు చూసి మురిసిపోతూ సంతోషంగా ఉంటుంది దాన్ని కూడా చూసి వాళ్ళు సంతోషంగా అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా మాయా కమ్మలు పాపకి ఇస్తూనే ఉంటుంది . పాప వాటిని ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *