మాయా చెట్టు మాయా కమ్మలు Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

అంతపురం అనే గ్రామంలో శిరీష హేమ అనే తల్లి కూతుర్లు ఉండేవాళ్ళు. శిరీష భర్త చనిపోవడంతో ఆమె తన కుటుంబాన్ని గడపడం కోసం. ఒక డబ్బున్న కుటుంబం లో పని చేసుకుంటూ . తన కూతుర్ని బాగా చూసుకుంటూ ఉంటుంది రోజులు గడిచాయి.
ఒక రోజు ఎప్పటిలాగే శిరీష పనికి వెళ్తుంది. అక్కడ పని చేస్తూ ఉండగా పొరపాటున ఆమె కాలు జారి కింద పడిపోతుంది ఆమె కాలికి బాగా దెబ్బ తాకడంతో….. అమ్మా నొప్పి అమ్మా నొప్పి అంటూ అరుస్తూ ఉంటుంది శిరీష. తన యజమానురాలు రజిని ….. ఏమైంది శిరీష అంటూ ఆమె దగ్గరకి వెళ్తుంది.
ఆమె కాలికి తీవ్రమైన నొప్పి కలగడంతో ఆమెను హాస్పిటల్కి తీసుకు వెళుతుంది రజిని.
అక్కడ డాక్టర్ ఆమె కారును పరీక్షించి రజనీతో….. చిన్న ఎముక విరిగింది కాబట్టి ఆపరేషన్ చేయాలి. అని అంటుంది రజిని…. సరే చెయ్యండి డబ్బులు నేను ఇస్తాను అంటుంది.
ఇక డాక్టర్ ఆమెకు వైద్యం చేసి కాలుకి కట్టు కడతారు. పాప ఆ విషయం తెలుసుకుని హాస్పిటల్ కి వస్తుంది. బెడ్ పై ఉన్న తల్లిని చూసి చాలా బాధపడుతుంది.
రెండు రోజులు వస్తాయి రెండు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తారు .
పాపా తల్లిని చూసుకుంటూ ఇంటి దగ్గర ఉంటుంది . కానీ వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు . ఆ తల్లి కూతురు.
తల్లి చాలా బాధపడుతు…. భగవంతుడా నన్ను ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చావు ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చూడు తినడానికి తిండి కూడా లేదు నా బిడ్డ ఆకలితో అల్లాడి పోతుంది.
అంటూ ఎంతగానో బాధ పడుతూ ఉంటుంది.
దానిని చూసిన పాప… అమ్మ బాధపడకు. నేను రజిని గారి ఇంటికి వెళ్తాను అక్కడ పని చేస్తాను అమ్మ. అని అంటుంది అందుకు తల్లి…. అమ్మో మా ఇంట్లో పని నేను చేయలేను అమ్మా నువ్వు ఎలా చేయగలవు చాలా ఎక్కువ పని . ఉంటుంది ఏదైనా పొరపాటు జరిగితే ఆమె అస్సలు ఊరుకోదు. ఎంత మంచిదో అంతే కోపిష్టి కూడా.
ఓట్టమ్మ నువ్వు పనికి వెళ్ళద్దు.
పాప…. అమ్మ నేను పనికి వెళ్లకపోతే ఎలాగా చెప్పు. మన ఇల్లు కావాలి నీకు మందులకి డబ్బులు కావాలి . నేను వెళ్లక తప్పదమ్మ.
అని సమాధానం చెబుతుంది పాప తల్లితో.
పాపా తప్పనిసరై అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది . తన తల్లి కూడా అడ్డు చెప్పదు.
పాప సరాసరి రజనీ దగ్గరకు వెళ్లి ఆమెతో….. రజిని అమ్మగారు నేను ఈరోజు నుంచి మీ దగ్గరికి వస్తాను. నాకు మా అమ్మ లాగే రోజు డబ్బులు ఇవ్వండి.
రజిని…. సరే ఇస్తా లే కానీ నువ్వు మాత్రం రోజు రావాలి. చెప్పింది చెప్పినట్లు చేయాలి.
సరేనా ఉంటుంది అందుకు ఆమె సారే ఉంటుంది. పాప ఆ రోజు నుంచి ఆయన ఇంట్లో పనులు మాత్రం చేస్తూ ఉంటుంది.
రజనీ ఆమెకు ఇంటికి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తుంది.
పాప డబ్బులు తీసుకొని ఇంటికి కావలసిన సరుకులు తన తల్లి కి కావాల్సిన మందులు . అలాగే పండ్లు తీసుకొని ఇంటికి వెళ్తుంది.
అలా రోజులు గడిచాయి . ఒకరోజు పాప రజనీ ఇంట్లో వస్తువులు తోముతూ ఉండడా. ఆమె చేజారి ఒక వస్తువు కింద పడి పగిలిపోయింది. దాన్ని చూసిన రజిని చాలా కోపంగా….. ఒసేయ్ నీకు ఇచ్చే జీతం ఏమో కానీ నువ్వైతే . ఇంట్లో ఉన్న వస్తువులను రోజుకు ఒకటి చొప్పున పగల కొడుతున్నావు.
అయినా నువ్వు పగలగొట్టిన బొమ్మ నా కూతురు ప్రేమకి చాలా ఇష్టమైనది.
అది గనుక చూసిందో నీ పని అయిపోయింది.
అని అంటుంది ఇంతలో ప్రేమ రానే వస్తుంది .
ప్రేమ పగిలిపోయిన వస్తువుని చూసి…. అమ్మ ఈ బొమ్మ ఎవరు పగలగొట్టారు నాకు అర్థం కావడం లేదు. నాకు నా బొమ్మ కావాలి. అమ్మా నాకు నా బొమ్మ కావాలి. అంటూ ఏడుస్తూ బాధపడుతుంది.
రజిని…. ఒసేయ్ చూసావంటే. ఇప్పుడు ఆ బొమ్మ నేను ఎక్కడనుంచి తీసుకురావాలి ఆ బొమ్మ ఇక్కడ దొరకని కూడా దొరకదు . అంటూ తిడుతుంది. అలా రోజు పాప ఏదైనా తప్పు చేస్తే తిట్టడం లాంటివి చేస్తుంది రజిని.
ఆమె నీ మాటలో కొంచెం బాధగా ఉన్నా పాప మాత్రం పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ ఉంటుంది . తన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు డబ్బు తీసుకెళ్లి ఉంటుంది .
అలా రోజులు గడిచాయి. ఒకరోజు రజనీ తన కూతురు ఇద్దరూ బయటకు వెళుతూ…. ఒసేయ్ మేము బయటికి వెళ్తున్నాము నువ్వు కొంచెం ఇంటినీ జాగ్రత్తగా చూసుకో.
పాప…. సరే అమ్మ మీరు తిరిగి వచ్చేంత వరకు నేను జాగ్రత్తగా చూసుకుంటాను.
అని అంటుంది అందుకు రజనీ సరే అని చెప్పి పాపను తీసుకుని బయటకు వెళుతుంది.
హేమ ఇంట్లో పని చేస్తూ ఉండగా బీరువా తలుపులు తెరచి ఉండడం గమనిస్తుంది.
హేమ ఆ బీరువా తలుపులు వెయ్యడానికి ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న బంగారు గాజులు పెట్టి కింద పడిపోతుంది.
అందులో ఉన్న గాజులు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఆ గాజులు చూసి పాప…. అబ్బా
ఇవి చూడటానికి ఎంతో చక్కగా ఉన్నాయి. అంటూ వాటిని తీసుకొని పెట్టెలో సర్దుతూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా రజనీ తన మనసులో….. అయ్యో బీరువా తాళం వేయడం మరిచిపోయాను. అసలుకి బంగారు నగదు మొత్తం అందులోని ఉన్నాయి. ఈ హేమ ఏం చేస్తుందో ఏమో అని అనుకొని తన కూతురుతో….. ప్రేమ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పి. అక్కడనుండి తిరిగి ఇంటికి వస్తుంది పాప ఆ గాజులను అందులో సర్దటం చూసి తప్పుగా అర్థం చేసుకున్న రజిని…. ఒసేయ్ హేమ నేను అనుకున్నట్టుగానే చేస్తున్నావ్ నువ్వు. నేను లేని సమయంలో బంగారు గాజులు తీసుకొని వెళ్ళిపోదాము అని చూస్తున్నావా నువ్వు ఇలాంటి దానివి అని అస్సలు అనుకోలేదు .
నువ్వు ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు. రాకు నువ్వు ఈ వైపుగా ఎప్పుడైనా కనిపించావో నీ గురించి మీ అమ్మకు చెప్తాను.
హేమ…. అమ్మగారు నేను ఏ తప్పు చేయలేదు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
రజిని…. కళ్ళతో చూసిన తర్వాత కూడా నీ మాటలు నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు.
అని బయటకు పంపిస్తుంది పాప ఏడుస్తూ.
బయటికి వెళ్లి ఒక చోట కూర్చుని
చాలా బాధ పడుతూ….. ఇప్పుడు డబ్బులు లేకపోతే. మా అమ్మ తినడానికి నేను ఏం తీసుకెళ్లాలి. నేను ఏ తప్పు చేయకుండా నన్ను బయటకి పంపించింది అమ్మ గారు అంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఇంతలో ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది.
పాప ఏడవడం చూసి…. ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు .
పాపా… అమ్మ నా పేరు హేమ. మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు. మా అమ్మ ఒక జమీందారు ఇంట్లో పని చేస్తుంది. అక్కడ ఈరోజు నేను చేయని తప్పుకి నింద వేసి బయటకు పంపించారు.
నిజానికి నేను దొంగతనం చేయలేదు.
ఆమె డబ్బు ఇస్తే కానీ మాకు పూట గడవదు ఈరోజు నేను డబ్బు తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్తే . మా అమ్మ నేను ఫస్టులు ఉండాల్సి ఉంటుంది ఒక వేళ నేను అక్కడ జరిగిన విషయం చెప్పినా మా అమ్మ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది ఏమో భయంగా ఉంది అంటూ ఏడుస్తూ. జరిగిన విషయం అంతా చెబుతుంది.
ఆ మాటలు విన్న ఆమె…. మరేం పర్వాలేదు. నువ్వు నిజం చెప్పావు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. అయినా నువ్వు ఎప్పుడూ బాధపడకు. ధైర్యంగా ఉండండి మీ అమ్మకు ధైర్యం చెప్పు . ఇప్పుడైతే నేను నీకు ఒక పెట్టి ని ఇస్తాను. దానిని మార్గమధ్యంలో ఎక్కడ తెరవకుండా ఇంటి దగ్గర చెరువు అని చెప్పి తన చేతిలో ఉన్న మాయ దండంతో. ఒక పెట్టినీ ప్రత్యక్షం
చేసి ఆమె అక్కడ నుంచి మాయమైపోతుంది.
ఆ తరువాత హేమ దానిని తీసుకొని సరాసరి ఇంటికి వెళ్తుంది.
అక్కడ హేమ తల్లితో జరిగిన విషయం చెప్పి. ఆ పెట్టెను తెరచి చూస్తుంది.
అందులో రకరకాల బంగారు గాజులు ఉంటాయి. వాటిని చూసి వాళ్ళు ఆశ్చర్య పోతారు ఇంతలో ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమవుతుంది . ఆ వెలుగు శారదా కాలుని నయం చేస్తుంది.
దానిని చూసి ఆ తల్లి కూతుర్లు ఇద్దరు ఎంతగానో సంతోష పడతారు. అలా ఉండగా మళ్ళీ ఒక వెలుగు ప్రత్యక్షం అవుతుంది ఆ వెలుగు ఇంటి నిండా రకరకాల బంగారు గాజుల తో నింపేస్తుంది.
దానిని చూసి తల్లి…. భగవంతుడా నువ్వు మాకు దారి చూపించు నందుకు చాలా కృతజ్ఞతలు. ఆమె ఎవరో కానీ మాకు చాలా సాయం చేసింది. ఆమెకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. జన్మజన్మలకు మీకు రుణపడి ఉంటాము.
అని అనుకొని కూతురుతో… అమ్మ హేమ ఇంక మనం ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. ఈ నగలన్నీటితో వ్యాపారం మొదలు పెడితే మనం డబ్బు ఉన్నవాళ్లు అయిపోతాము. ఇంకా ఎవరు మనల్ని కించపరచరు . అని ఆమెకు ధైర్యం చెబుతుంది ఇక ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళు బంగారం వ్యాపారం మొదలు పెడతారు. వచ్చిన డబ్బుతో ఎంతో సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *