మాయా చెట్టు సహాయం 2 | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

కేతన్తపురం అనే ఒక గ్రామంలో
చిన్నారి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె తల్లి పేరు క్రిష్ణమ్మ. తండ్రి కృష్ణయ్య. కృష్ణయ్య ఒక సోమరిపోతు ఏ పని చేసేవాడు కాదు. మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లుగా ఇంట్లో వీరంగం చేసేవాడు. కృష్ణమ్మ పూలు వ్యాపారం చేసుకుంటూ ఆ డబ్బుతో కుటుంబాన్ని గడిపేది. అలా ఉండగా ఒకరోజు అతను భార్యతో చాలా పెద్ద గొడవ పడతాడు. ఆ గొడవలో కర్రతో ఆమె కాళ్లు రెండిటిని విరగ కొడతాడు. తల్లిని చూసి చిన్నారి ఎంతగానో రోధిస్తూ ఉంటుంది. ఇక ఆమె కాళ్లు లేని కారణంగా మంచంలోనే ఉంటుంది.
ఆ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది చిన్నారి చాలా ఏడుస్తూ ఉంటుంది దానిని చూసిన తల్లి…. అమ్మా నీకు ఆకలి వేస్తుంది కదా . నేను ఏం చేయలేని పరిస్థితి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి భగవంతుడా ఏం చేయాలి ఇలాంటి భర్తని ఇచ్చినందుకు . మమ్మల్ని ఇలాగా చేస్తావ్ అని అస్సలు అనుకోలేదు. అంటూ ఏడుస్తూ ఉంటుంది దాన్ని చూసిన పాప…… అమ్మ నేను ఏడుస్తుంది నా ఆకలి గురించి కాదమ్మా . నీ గురించి ఆలోచిస్తున్నాను నీ ఆరోగ్యం
అస్సలు బాగుండదు. ఇప్పుడు నువ్వు తిండి సరిగ్గా తినకపోతే నువ్వేం అవుతావని నాకు భయంగా ఉందమ్మా అంటూ ఏడుస్తుంది.
ఆమె పాపకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తోంది కానీ పాప మాత్రం అలా ఏడుస్తూనే ఉంటుంది.
కొంత సమయం తర్వాత పాప తల్లితో….. అమ్మ నువ్వు పువ్వులు కట్టావు అంటే నేను వాటిని అమ్మి డబ్బులు తెస్తాను అమ్మ అప్పుడు మన కడుపు నిండుతుంది అని అంటుంది ఎందుకు తల్లి తప్పనిసరి ఒప్పుకోవాల్సి వస్తుంది ఇక ఆమె మంచం మీద ఉండి పువ్వులను మాల పడుతూ ఉంటుంది పాప దాన్ని చూస్తూ ఆమె కూడా నేర్చుకుంటుంది. పువ్వులు కట్టడం పూర్తయిన తర్వాత పాప బయటికి వెళ్లి…. తాజా పువ్వులు . కమ్మని వాసన వచ్చే తాజా పువ్వులు మూరా పది రూపాయలు మాత్రమే. అంటూ కేకలు వేస్తూ ఊరు మొత్తం తిరిగి పువ్వులు అమ్ముకొని. డబ్బులు తీసుకు వస్తుంది అలా ఆ డబ్బుతో కుటుంబం గడుస్తూ ఉంటుంది. అలా వుండగా ఒక రోజు తండ్రి…. ఒసేయ్ బుడ్డ దాన పువ్వులు అమ్మి డబ్బు సంపాదిస్తున్నావు అంట. డబ్బులు ఎక్కడ దాచి పెడుతున్నావు. చిన్నారి తండ్రి వైపు కోపంగా చూస్తూ… డబ్బులు లేవు నాన్న . నన్ను అడగొద్దు . అమ్మ మందులకి భోజనానికి సరిపోతుంది మా దగ్గర డబ్బులు ఏమీ లేవు . అందుకు అతను చాలా కోపంగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ ఆమె చాటుగా దాచిపెట్టుకున్న డబ్బుల సంచిని చూస్తాడు. వెంటనే ఆమె దగ్గర డబ్బు సంచిని లాక్కుంటాడు.
ఆమె ఏడుస్తూ….. నాన్న అవి అమ్మ కోసం దాచి పెట్టినవి అమ్మ మందులకి కావాలి. అమ్మ ఇప్పుడు కొంచెం బలమైన ఆహారం తీసుకోవాలి . నువ్వు అమ్మ కాళ్లు విరగ కొట్టకపోతే ఇదంతా ఉండేది కాదు. అవి ఇవ్వండి అంటూ సంచి తీసుకొని అక్కడి నుంచి బయటకు పరుగులు తీస్తుంది.
అతను కూడా ఆమె వెంట పరుగులు తీస్తాడు ఆమె ఒక చోట దాక్కుంటుంది చాలా సమయం వరకు బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ అలాగే ఉంటుంది.
రాత్రి సమయం అవుతుంది ఆమె భయంతో చిన్నగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే తండ్రి …. నా నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే అంటూ మళ్ళీ ఆమె వెంట పడతాడు . ఆమె సరాసరి నది వైపు గా పరుగులు తీస్తుంది. అతను కూడా ఆమె వెంట పరుగులు తీసి ఆమెను పట్టుకొని డబ్బు సంచిని లాక్కుంటాడు .
పాప ఏడుస్తూ….. నాన్న దయచేసి నా మాట వినండి . కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది నాన్న అమ్మ ప్రాణాలు ఉండాలి అంటే మందులు కావాలి బలమైన ఆహారం కావాలి. దయచేసి డబ్బునీ మద్యం కోసం వాడొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటుంది అంటూ కాళ్లావేళ్లా పడుతూ తండ్రినీ బ్రతిమాలుకుంటుంది.
అతను చాలా కోపంగా అటూ ఇటూ చూసి ఆ పాపని అక్కడే ఉన్న పడవలో విసిరేస్తాడు.
ఆ పడవ ని లోపలికి నెట్టాడు.
ఆ పడవ లోపలికి వెళ్ళి పోతూ ఉంటుంది ఆ పాప ఏడుస్తూ….. నాన్న నన్ను కాపాడు నాన్న నన్ను కాపాడు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది.
అతను…. నాన్న లేడు ఏమీ లేదు.పో పో అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
పాప ఏడుస్తూ అలా పడవ లోనే ఉంటుంది.
ఆ పడవలో ప్రయాణిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా. తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు .
ఇంటి దగ్గర తల్లి….. నా కూతురు ఎక్కడ. పొద్దుననగా ఆమె వెంట తరుముకుంటూ వెళ్లారు నా బిడ్డ ఎక్కడండి.
అంటూ ఏడుస్తూ అడుగుతుంది అతను…. ఒసేయ్ కుంటి దాన నీ కూతురు ఆ నదిలో
కొట్టుకుపోయింది. అదే ఏదో ఒక పెద్ద చేప నోట్లో పడితే చచ్చిపోతుంది. ఒక పీడా వదిలిపోతుంది అంటాడు అందుకే ఆమె ఏడుస్తూ….. అయ్యో భగవంతుడా ఎంతపని చేశావు. ఏవండీ మీకు అసలు నా కూతురు ఏమి అన్యాయం చేసింది . నిండు నూరేళ్లు బతకాల్సిన పసికందుని. మీ చేతులతో నుమిలేస్తున్నారా . అయ్యో చిన్నారి బంగారుతల్లి . నీకు నూరేళ్ళు నిండిపోయాయ అంటూ ఏడుస్తూ ఉంటుంది .
అతను…. ఒసేయ్ నోరు మూసుకొని కుదురుగా ఉండు లేకపోతే నిన్ను కూడా దాని దగ్గరకు పంపించేస్తాను.
ఆమె…. అయితే త్వరగా ఆ పని చెయ్యండి అంటూ ఏడుస్తుంది. అతను మద్యం మత్తులో ఉండి అక్కడే పడిపోతాడు.
ఆ రోజు ఆ తల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఆ రోజు గడిచి పోతుంది ఇది ఇలా ఉండగా ఆ నదిలో పాప ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ ఉంటుంది. ఇంతలో ఆ పడవ ఒకచోట ఎటూ కదలకుండా ఆగిపోతుంది. ఆ పాపకి మరింత భయం వేస్తుంది ఇంతలో పెద్ద శబ్దం తో
నదిలో నుంచి ఒక చెట్టు ప్రత్యక్షమవుతుంది.
దానిని చేసిన పాప చాలా భయపడుతూ …..
వద్దు చేయొద్దు చేయొద్దు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఆ చెట్టు … పాపా భయపడకు అమ్మా నేను నిన్ను ఏం చేయను ఎవరు నువ్వు . అసలు ఒక్క దానివి పడవలో ఇక్కడికి ఎలా వచ్చావు.
అప్పుడు పాప ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెబుతోంది.
అప్పుడు ఆ మాయ చెట్టు….. అయ్యో బాధపడకు . నువ్వు చాలా ఆకలితో ఉన్నావ్ కదా ముందు ఈ చెట్టుకు ఉన్న పళ్ళు తిను అని తన మాయ శక్తితో పళ్ళను ప్రత్యక్షం చేసి ఆ పండ్లను ఆ పడవలో విసిరేస్తుంది పాప చాలా ఆకలి మీద ఉండడంతో ఆ పళ్ళు తింటుంది. ఆ తర్వాత ఆమె మాయ చెట్టు తో…. మాయ చెట్టు నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావ్ కదా . మా అమ్మ కాళ్లు రెండూ సరిగ్గా అయ్యేలాగా చేస్తావా. అని జాలిగా అడుగుతుంది.
అందుకు ఆ మాయ చెట్టు…. తప్పకుండా చేస్తాను తల్లి అంటూ తన కాయలు అన్నిటినీ పువ్వులుగా మార్చేస్తుంది.
దాన్ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది మాయా చెట్టు….. ఇదిగో ఈ పువ్వు ని తీసుకొని ఇంటికి వెళ్లావు . ఆ పువ్వుని మీ అమ్మ పాదాల మీద ఉంచు. ఆ తర్వాత జరిగేది చూడు అని అంటుంది. అందుకామె చాలా సంతోష పడుతూ ఆ పెద్ద పువ్వుని తీసుకుంటుంది.
ఆ తర్వాత ఆమె చెట్టుతో….. ఓ మాయ చెట్టు మరి నేను ఎక్కడ నుంచి ఎలా వెళ్లాలి.
అని అంటుంది ఎందుకు మాయ చెట్టు…. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకున్నాను అంటే సరాసరి నువ్వు పడవ తో పాటుగా నది ఒడ్డున ఉంటావు. అని అంటుంది అందుకు ఆమె సరే అని కళ్లు మూసుకుంటుంది.
అలా కళ్లు మూసుకుని వెంటనే పడవ తో సహా ఆమె ఒడ్డున ఉంటుంది.
ఆమె చాలా సంతోష పడుతూ తన చేతిలో ఉన్న పువ్వు ని తీసుకొని ఇంటికి పరుగులు తీస్తుంది. ఇంటిదగ్గర తల్లి తిండి నీళ్లు లేక …. అమ్మ చిన్నారి నన్ను వదిలి వెళ్ళిపోయావా అంటూ ఏడుస్తూ ఉంటుంది. చిన్నరీ తల్లి దగ్గరకు వేళ్లి….. అమ్మ నాకు ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను. తల్లి బిడ్డను చూసి సంతోష పడుతూ… ఏమైపోయావ్ అమ్మ అంటూ ఏడుస్తుంది అప్పుడు పాప జరిగిన విషయమంతా చెబుతుంది . అందుకు ఆమె చాలా ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత పాపా ఆ పువ్వుని ఆమె కాళ్ల మీద పెడుతుంది అలా పెట్టిన కొంత సమయానికి ఆమె రెండు కాళ్ళు పనిచేస్తాయి. ఆమె లేచి నిలబడుతుంది.
దాన్ని చూసి పాప తల్లి ఇద్దరు ఎంతో సంతోష పడతారు ఇంతలో ఆ పువ్వు అక్కడినుంచి మాయమైపోతుంది.
దాన్ని చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటారు తర్వాత తల్లి….. అమ్మ చెట్టు నిజంగానే చాలా మాయ గలది . నువ్వు మీ నాన్న పరిస్థితిని కూడా మార్చమని అడగాల్సింది. దానికి కూడా మాయ చెట్టు ఏదో ఒక పరిష్కారం చూపించేది.
అందుకు ఆమె… అమ్మ నన్ను క్షమించాలి నిజానికి నాన్న గురించి నాకు ఆలోచన అసలు రాలేదు నా ధ్యాసంతా నీ మీదే ఉంది అందుకే నీ గురించి మాత్రమే వరాన్ని కోరుకున్నాను కానీ మాయ చెట్టు చాలా మంచిదమ్మా మనం ఇద్దరం అక్కడికి వెళ్లి ఆ మాయ చెట్టు కి కృతజ్ఞతలు చెప్పుకొని నాన్న నీ కూడా మార్చమని చెబుదాం.
అందుకు తల్లి….. సరే తల్లి వెళ్దాం పద.
అని ఆ తల్లి కూతురు ఇద్దరూ పడవలో ప్రయాణిస్తారు. అలా చాలా దూరం వెళ్ళిన తరువాత సాయంత్ర సమయం అవుతుంది. అప్పుడు ఒక చోట ఒక్కసారిగా పెద్ద శబ్దం తో మాయ చెట్టు ప్రత్యక్షమవుతుంది.
దాన్ని చూసిన వాళ్లు ఇద్దరూ….. ఓ మాయ చెట్టు నువ్వు మాకు చాలా సహాయం చేశావు నీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం వచ్చాను అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
అందుకు మాయ చెట్టు చాలా సంతోషపడుతుంది తల్లి ….. నువ్వు నన్ను బాగు పరిచిన విధంగానే నా భర్తను కూడా బాగు పరిస్తే. చాలా రుణపడి ఉంటాము నీకు అని ఏడుస్తుంది అందుకు మాయ చెట్టు…. మీరేమీ కంగారు పడొద్దు నేను మీకు సహాయం చేస్తాను అంటూ ఒక పువ్వుని వాళ్ళకు ఇచ్చి…. ఈ పువ్వు రసాన్ని తీసి నీ భర్తకు తగ్గించండి లేదా అతని మీద చల్లండి. ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది.
అందుకు వాళ్లు చాలా సంతోష పడితే దాన్ని తీసుకుంటారు . ఆ మాయ చెట్టు….. మీరు పదే పదే ఇక్కడికి రావలసిన అవసరం లేదు నన్ను మీరు మనసులో తలుచుకుంటే చాలు మీకు నేను సహాయం చేస్తాను మీ మాట నేను వింటాను అంటుంది అందుకు వాళ్లు చాలా సంతోష పడతారు.
ఆ తర్వాత దాన్ని తీసుకొని తిరిగి బొడ్డు చేరుకుంటారు. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు అక్కడ చిన్నారి తండ్రి నిద్ర పోతూ ఉంటాడు తల్లి వెంటనే ఆ పువ్వు నూరి రసం తీసి అతని మీద చల్లుతుంది.
ఆ తరువాత వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు . ఆశ్చర్యంగా అతను ఆ తర్వాత రోజు నుంచి మందు జోలికి వెళ్లడు. అతను జరిగిన గతాన్ని మర్చి పోతాడు. కేవలం భార్య బిడ్డలు మాత్రమే బంధువులు స్నేహితులు మాత్రమే గుర్తుంటారు అతను చేసిన చెడు సావాసాలు ఏమి గుర్తుండవు. ఇంకా అతను పొలం పని చేసుకుంటూ ఉంటాడు దాన్ని చూసిన భార్య బిడ్డలు సంతోష పడతారు. ఇక వాళ్ళిద్దరూ ఆ మాయ చెట్టు కి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక అప్పటినుంచి ఆ కుటుంబంలో సంతోషాల విరాజిల్లు కురుస్తుంది ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా వాళ్ల కొత్త జీవితాలు మొదలవుతాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *