మాయా చెట్టు సహాయం 4 | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

కోదండపురం అనే గ్రామంలో జమిందార్ కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబంలో శారదా ఆమె కొడుకు శ్యాము కోడలు జమున . మనవరాలు అక్షర నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లకి చాలా డబ్బు ఉంది ఊర్లోనే మంచి పేరు గల కుటుంబం. మా ఊరి ప్రజలు ప్రతి అవసరానికి వాళ్లనీ
ఆశ్రయం కోరుకుంటారు. వాళ్లు వాళ్ల అవసరాలు తీరుస్తూ ఉంటారు. అలా రోజులు గడిచాయి ఒకరోజు శారదకి ఒక పిడుగు లాంటి వార్త తెలుస్తుంది ఆ రామయ్య అనే ఒక పడవ నడిపే వ్యక్తి అక్కడికి వచ్చి…. శారదమ్మ శారదమ్మ నీ కొడుకు కోడలు ఇద్దరు నదిలో కోట్టుకుపోయారు .
దానిని విన్న ఆమె చాలా కంగారుపడుతూ….. ఏంటి నువ్వు అంటుంది . వాళ్లు ఎందుకు నది వైపు వెళ్లారు. అంటూ ఏడుస్తూ అతనితోపాటు వెళ్లడానికి సిద్ధపడుతుంది ఇంతలో కొడుకు కోడలు ఇద్దరూ అక్కడికి వస్తారు. శారద వాళ్లను చూసి ఆశ్చర్యపోతూ…. రామయ్య ఎందుకు అలా చెప్పావు ఎవరు నీన్ను ఇక్కడకి పంపించింది.
అందుకు రామయ్య చాలా కంగారు పడుతూ…. ఎవరు డబ్బు ఉన్న వ్యక్తి అలా కంగారుగా నాతో చెప్పాడు అమ్మా నేను అందుకే చాలా కంగారు పడుతూ ఇక్కడికి వచ్చాను . అని అంటాడు అందుకు ఆమె చాలా ఆశ్చర్యపోతూ….. అలా చెప్పడం వల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏమిటో నాకు అర్థం కావడం లేదు . కొంచెం డబ్బు సంపాదించిన వాళ్లు అంటే ఎందుకు అంత ఈర్ష అనుకుంటుంది కొన్నిరోజులు గడుస్తాయి.
డబ్బు కోసం ఆ భార్యభర్తలిద్దరు ని ఎవరో చంపేస్తారు. శారదా ఆ విషయం తెలుసుకొని ఎంతగానో కుమిలిపోతుంది….. బాబు మిమ్మల్ని చంపిన వాళ్ళు ఎవరైనా ఈ తల్లి కడుపుకోత అర్థమవుతుంది. అన్యాయంగా నా బిడ్డని పొట్టన పెట్టుకున్నారు . నా కోడలు ని హతమార్చారు. ఇప్పుడు నా మనవరాలు తల్లి తండ్రి లేని ఒంటరి అయిపోయింది . భగవంతుడా ఇలాంటి రోజు వస్తుందని అసలు అనుకోలేదు దీన్ని చూడడం కోసమా నేను బ్రతికింది. అంటూ ఏడుస్తుంది మనవరాలు తల్లిదండ్రులు ముందు పెద్ద పెద్దగా రోదిస్తూ…. అమ్మ నాన్న ఒకసారి లేవండి అమ్మ నాన్న ఒకసారి లేవండి అంటూ ఏడుస్తుంది . రామయ్య తర్వాత కార్యక్రమం అంతా జరిపిస్తాడు. ఆ రోజు సాయంత్రం అతను శారదతో…. అమ్మ ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం వస్తుందో నాకు తెలియదు కానీ. వాళ్లు ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు కానీ వాళ్లు మిమ్మల్ని కూడా చంపేస్తారు జాగ్రత్తగా ఉండండి అమ్మ.
శారదా అతని మాటలకి చాలా బాధపడుతు….. రామయ్య మాకు చాలా. వ్యాపారాలు ఉన్నాయి . మాకు మంచి పేరుంది ఎంత మంచి పేరు ఉందో అంతే మంది శత్రువులు వున్నారు . ఎవరో వాళ్ల వ్యాపారానికి అడ్డు రాకూడదని ఇదంతా చేశారు. ఇంత చేసిన వాళ్ళు మా ఆస్తులు కోసం కూడా మా ప్రాణాలు తీయవచ్చు .
అందుకే రేపటి నుంచి నేను లేని వాళ్ళకి నా ఆస్తిని దానధర్మం చేస్తాను . ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసేలా గా చెప్పు అని ఉంటాడు. అందుకు తను సరే అంటాడు ఆ విషయాన్ని ఊరి ప్రజలు మొత్తానికి చెప్తాడు ఆ మరుసటి రోజు ఉదయం ఆమె ఎంతోమంది పేద వాళ్లకు ఊరి ప్రజలకు డబ్బు దానం చేస్తుంది. అందరూ ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు .
ఆ రోజు రాత్రి సమయం శారదా మనవరాలు ఇద్దరు నిద్ర పోతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి
పాపను చంపడానికి వస్తారు.
దానిని గమనించిన ఆమె వెంటనే పాప ని తీసుకొని అక్కడి నుంచి రామయ్య ఇంటికి పరుగులు తీస్తుంది.
రామయ్య నిద్రపోతుండగా తలుపు కొట్టి….. రామయ్య రామయ్య ఒక్కసారి తలుపు తియ్యి
అటు కేకలు వేస్తోంది . ఇంట్లో నిద్ర పోతున్న రామయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి హడావిడిగా తలుపులు తెరుస్తాడు.
ఎదురుగా శారదను చూసి ఏమైందమ్మా…. ఏమైందమ్మా ఇంత రాత్రివేళ ఇక్కడికి వచ్చారు అప్పుడు ఆమె జరిగిన విషయం చెబుతుంది . అతను… త్వరగా లోపలికి రండమ్మా. అంటూ ఉండగానే ఆ వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను ముసుగులో ఉండటంతో అతను ఎవరో ఎవరికీ అర్థం కాదు శారద….. ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావ్వు. నీకు కావాల్సింది ఆస్తి డబ్బు అయితే వాటిని నేను నీకు ఇస్తాను మమ్మల్ని వదిలేయ్. అంటూ ఉంటుంది. కానీ అతను మాత్రం వారిని చంపడానికి వస్తూ ఉండగా రామయ్య ఆ ముసుగులో ఉన్న వ్యక్తిని పట్టుకుని….. శారదమ్మ మీరు పాపను తీసుకుని నది దాటి వెళ్లిపోండి . అక్కడ పడవలు ఏమీ లేవు . ఒక్క నా పడవ తప్ప త్వరగా వెళ్లిపోండి నేను ఈ వ్యక్తిని అడ్డుకుంటాను. అని అంటాడు వెంటనే ఆమె చాలా కంగారుగా పాపను తీసుకుని నది వైపు పరుగులు తీస్తారు అక్కడ ఉన్న పడవలో పాప ఆమె ఇద్దరు ఎక్కి నదిలో కి ప్రయాణమవుతారు . ఆ వ్యక్తి కూడా కొంత సమయానికి ఇక్కడకు చేరుకుంటాడు కానీ వాళ్లు నదిలోకి వెళ్లడంతో కోపంగా తన చేతిలో ఉన్న కట్టెను విసిరేస్తాడు అది సరాసరి పాపకు తల్లి పాప పడిపోతుంది . శారదా పాపను చూసి….. అమ్మ అక్షర అంటూ ఆమె కూడా నదిలోకి దూకుతుంది. ఆ ముసుగులో ఉన్న వ్యక్తి దాన్ని చూసి అక్కడి నుంచి వెళ్లి పోతారు.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం శారదా కళ్ళు తెరుస్తుంది. ఆమె…. నేను ఎక్కడున్నాను . పాప అక్షర ఎక్కడ అమ్మ నువ్వు అంటూ కేకలు వేస్తోంది ఇంతలో ఆ నది నుంచి చెట్టు వస్తుంది ఆ చెట్టు పైన పాప ఉంటుంది.
దాన్ని చూసిన శారదా చాలా ఆశ్చర్యపోతుంది. ఆమె…. భగవంతుడా ఏంటి మాయ నాకు ఏమీ అర్థం కావడం లేదు . అప్పుడు మాయ చెట్టు…. భయపడకండి అమ్మ . నేను ఒక మాయ చెట్టు ని రాత్రి మీ ఇద్దరూ ఈ నదిలో పడి పోయారు కదా నేను మిమ్మల్ని కాపాడాను. ఇక్కడ మీరు ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చు ఈ నది మొత్తం నాదే ఎక్కడ కనబడుతున్న స్థలం కూడా నాదే . అని అంటుంది చెట్టు మాట్లాడటం చూసిన ఆమె చాలా ఆశ్చర్య పోతూ ఉంటుంది అక్షర…. ఓ మాయ చెట్టు అక్కడ కనపడుతున్న పెద్ద ఇల్లు కూడా నీదేనా.
చెట్టు. …. అవును పాప
ఇన్ని రోజులు నాదే ఇక ఈ రోజు నుంచి ఆ ఇల్లు కూడా మీకే సొంతం. మీరు సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు. అని అంటుంది ఆ మాటలు విన్న శారద…. మా పట్ల నువ్వు చూపించిన ప్రేమకు చాలా కృతజ్ఞతలు కానీ నేను తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి.
నువ్వు మాయ చెట్టు కాబట్టి నీకు తెలుసు అని అడుగుతున్నాను. నా కోడలు అల్లుడు ని చంపింది ఎవరు . నిన్న రాత్రి మా వెంట పడిన వ్యక్తి ఎవరు. అసలు వాళ్ల ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు నిజం తెలియాలి . ఆని చెట్టుని ప్రశ్నిస్తుంది మాయ చెట్టు …. అసలు ఏం జరిగిందో నేను అంతా చెప్తాను.
అని ఆమెతో….. ఇదిగోండి నేను నా మాయ సిగ్గుతో ఏం జరిగిందో మీకు తెలిసేలా చేస్తాను అంటూ చెట్టు నిండా పువ్వులు కాపిస్తుంది .
దాన్ని చూసి వాళ్ళిద్దరు చాలా ఆశ్చర్య పోతారు.
మాయ చెట్టు…. ఇక్కడ కనబడుతున్న పువ్వులో చూడండి మీకు అన్యాయం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది . అని సమాధానం చెబుతుంది వెంటనే ఆమె సరే అని చెప్పి ఆ పువ్వుల్లో చూస్తుంది అక్కడ ఆమెకి నిజంగానే ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ ముసుగు వ్యక్తి ఎవరో తెలుస్తుంది.
శారద…. ఈమె ఎవరో కాదు. రామయ్య భార్య విమల. ఈమె ఇలా ఎందుకు చేసింది అంటూ ఏడుస్తుంది.
మాయ చెట్టు ఆమెతో….. ఈమె కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసింది. కానీ పాపం రామయ్యకు ఈ విషయం తెలియదు. రామయ్యకి మీరు తెలియ చెప్పండి.
శారద…. కానీ రామయ్య చాలా మంచివాడు అతని భార్య ఇలాంటి అతనికి తెలిస్తే అతను ఏమైపోతాడో. నేను ఆ విధంగా చేయలేను కానీ ఆమె మనసు మారేలా గా నువ్వే చేయాలి . అని అంటుంది అందుకు ఆ మాయ చెట్టు….. సరే తప్పకుండా చేస్తాను కానీ మీరు అనుకున్నట్టు ఆమె ఒక్కటే కాదు. మీ ఆస్తి కోసం ఎంతోమంది మీ ప్రాణాలు తీయడం కోసం చూస్తున్నారు.
దాన్ని విన్న ఆమె మరింత బాధపడుతూ… అయ్యో భగవంతుడా అయితే మేము ఏం చేయాలి
మాయ చెట్టు…. భయపడకండి నా చెట్టుకున్న పువ్వులను తీసుకువెళ్లి మీ ఇంటి ముందు నాటండి ఈ పువ్వులను ఎవరైతే దుస్టూలు చూస్తారో. వాళ్లు మన మనసుని మార్చుకొని మీకు సహాయం చేస్తారు. ఇంకొకటి నిజం కూడా ఒప్పుకుంటారు. అని సమాధానం చెబుతుంది అందుకామె చాలా సంతోషపడుతుంది.
తనంత చూస్తున్న పాప…. నీకు చాలా కృతజ్ఞతలు మాయ చెట్టు . మమ్మల్ని తిరిగి ఊరికి పంపించు. అని జాలిగా అడుగుతుంది వెంటనే మాయ చెట్టు…. తప్పకుండా పంపిస్తాను అని చెప్పి ఒక పడవనీ ప్రత్యక్షం చేసి…. మీరు అందులో కూర్చోండి సరాసరి మీ ఊర్లో ఉంటారు. అని అని అంటుంది అందుకు వాళ్లు సరే అని చెప్పి పడవలో కూర్చుంటారు. వాళ్లు కూర్చున్న వెంటనే
మాయ చెట్టు వాళ్లకి పువ్వులు ఇస్తుంది ఆ తర్వాత . నా తర్వాత ఆ పడవ కదులుతుంది వాళ్ళలా ప్రయాణించి సరాసరి ఒడ్డుకు చేరుకుంటారు.
ఒడ్డున రామయ్య ఉంటాడు.
రామయ్య వాళ్ళని చూసి…. శారదమ్మ పాప ఇద్దరు వచ్చేసారా మీరు. నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా .
శారద…. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు రామయ్య ఇంతకీ ఆ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరో తెలిసిందా.
అతను…. లేదమ్మా నన్ను కొట్టి పారిపోయాడు. అదే సమాధానం చెబుతాడు ఇంతలో అతని భార్య …. ఏమండీ ఎక్కడున్నారు మీ కోసం వెతుకుతున్నాను. అని అతన్ని పిలుస్తూ అక్కడికి వస్తుంది.
ఆమె అక్కడకు వచ్చి శారదా చేతిలో ఉన్న పువ్వు ని చూస్తుంది ….. అమ్మ గారు ఎక్కడ చేస్తున్నారు ఈ పువ్వులు ఎక్కడివి చాలా అందంగా ఉన్నాయి అని వాటిని అని పట్టుకుంటుంది.
అలా ఆమె వాటిని పట్టుకుని వెంటనే ఏడుస్తూ…. అమ్మ గారు నన్ను క్షమించండి నేను మీ కొడుకుని కోడల్ని చంపేస్తాను. మిమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నించాను కేవలం మీ డబ్బులు తీసుకోవడం కోసమే ఈ డబ్బుతో కోట్ల ఆస్తికి అధికారిని కావాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేశారు అటు ఏడుస్తుంది ఆ మాటలు విన్న అతను…. ఏంటి నువ్వు మాట్లాడుతుంది నాకేం అర్థం కావటంలేదు.
అని అంటాడు అప్పుడు శారదా…. రావయ్య నీ భార్య చెప్పింది నిజమే. అంటూ నదిలో మాయ చెట్టు గురించి చెబుతుంది.
దాన్ని విన్న రామయ్య చాలా బాధపడుతు… నా భార్య బదులు నేను మరింత ఎక్కువ క్షమాపణ కోరుకుంటున్నాను . దయచేసి క్షమించండి అంటూ ఏడుస్తాడు శారద….. అయ్యో రామయ్య నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు ఎందుకంటే ఏం చేసినా ఇప్పుడు నా కొడుకు కోడలు తిరిగి రారు కానీ ప్రాణాలు తీయడం అనేది చాలా పెద్ద తప్పు . ఇలాంటివి ఇంకా ఎప్పుడు జరగకూడదు. జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్తారు.
అక్కడ వాళ్ళ ఆ పువ్వులన్నీ నాటుతారు.
ఆ పువ్వులు భూమిలో నాటిన వెంటనే ఆ చెట్లు గా మారి అవి పువ్వులు పూస్తాయి.
వాటిని చూసి వాళ్ళిద్దరు చాలా సంతోష పడతారు ఇక ఆ మాయ చెట్టు సహాయంతో వాళ్ళ ఇంటికి ఎవరు చెడు ఉద్దేశంతో వచ్చిన వాళ్లే నిజాన్ని ఒప్పుకొని మంచిగా మారి.
వాళ్ళకి సహాయం గా ఉంటూ ఉంటారు అలా వాళ్ళ జీవితంలో మరో కొత్త మలుపు తిరుగుతుంది. వాళ్ళిద్దరూ జరుగుతున్న పరిణామాలు చూసి చాలా ఆనందపడు తు…. ఓ మాయ చెట్టు నీకు చాలా కృతజ్ఞతలు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంటూ వాళ్ళిద్దరూ కూడా మాయ చెట్టు కి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *