మాయా చెట్టు సహాయం | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

అది ఒక పెద్ద నది ఆ నదిలో రాత్రి సమయం ఒక పడవలో తల్లి కూతురు ఇద్దరూ కొట్టుకుపోతూ.. భయంతో కేకలు వేస్తూ ఉంటారు…. కాపాడండి ఎవరైనా మమ్మల్ని కాపాడండి. దయచేసి మమ్మల్ని కాపాడండి. అంటూ కేకలు వేస్తూ ఉంటారు.
లోపల పాప… అమ్మ మనం ఎక్కడికి వెళ్లి పోతున్నము అమ్మ. అంటూ ఏడుస్తూ భయ పడుతూ ఉంటుంది తల్లి….. బాధ పడకమ్మా నేను ఉన్నా కదా. అంటూ ధైర్యం చెబుతూ తన మనసులో….. భగవంతుడా ఎక్కడికి మమ్మల్ని తీసుకెళ్తున్నావూ. కొంచెం మా పైన జాలి చూపించు. అని అంటూ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటుంది ఆ రోజంతా వాళ్ళు అలాగే నదిలో కొట్టుకు పోతూ ఉంటారు చాలా సమయం అవుతుంది తెల్లవారిపోతుంది పాపా …. అమ్మ చాలా ఆకలిగా ఉందమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆమెకు ఏం చేయాలో అర్థం కాక అక్కడ నది నీటిని ఆమెకు తాగమని చెబుతూ….. అమ్మ ఈ నీళ్ళతోనే కడుపు నింపుకో తల్లి. అంటూ ఏడుస్తూ చెబుతుంది. ఆమె సరే అని చెప్పి నీళ్లు తాగుతూ ఉండగా పొరపాటున జారి అందులో పడిపోతుంది. అప్రమత్తంగా ఉన్న తల్లి వెంటనే ఆమె చేతిని పట్టుకొని పైకి లాగుతుంది.
తల్లి… అమ్మ చూసుకోవాలి కదా ఎంత ప్రమాదం తప్పింది. భగవంతుడా మమ్మల్ని ఈ కష్టం నుంచి బయటపడే యి. అంటూ చాలా బాధపడుతుంది. వాళ్ళు అలాగే వెళ్ళి పోతూ ఉంటారు ఎక్కడికి వెళతారో తెలియదు. ఆ పాప….. అమ్మ సాయంత్రం సమయం అవుతుంది అమ్మ ఈ నీళ్లతో కడుపు నిండటం లేదమ్మా చాలా ఆకలిగా ఉందమ్మ. అంటూ తల్లితో ఎంతో బాధపడుతూ చెబుతుంది తల్లి ఏం చేయలేని పరిస్థితి. ఇంతలో ఆ పడవ ఒక చోటకి పెళ్లి ఆగుతుంది అక్కడ ఒక చెట్టు ఉంటుంది.
దాన్ని చూసి తల్లి…. అమ్మ ఇప్పటినుంచి మనం బయటికి వెళ్దాం పద లేదంటే పడవ మళ్ళీ ముందుకు కదులుతుంది ఏమో. అని అంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి దిగబోతోంది కదా ఆ చెట్టు ….. మీరు భయపడకండి ఈ పడవ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు అని అంటుంది ఆ మాటలు వినగానే తల్లి కూతురు ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు. తల్లి… ఎవరు మాట్లాడుతున్నారు మాకు అర్థం కావటం లేదు. అని అంటుంది అప్పుడు చెట్టు….. మీరు చూసింది విన్నది సరైనదే నేను చెట్టుని మాయ చెట్టు ని మాట్లాడుతున్నాను. అని అంటుంది . వాళ్లు అలాగే చూస్తూ ఉంటారు.
ఆ చెట్టు….. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు నేను మిమ్మల్ని ఏమీ చేయను.
అని అంటుంది తల్లి వెంటనే తేరుకొని…. నువ్వు మాయ చెట్టుని అంటున్నావు కదా నా కూతురు ఆకలితో బాధపడుతుంది. నా కూతురికి తినడానికి ఏమన్నా ఇవ్వండి. అని అంటుంది అందుకు మాయ చెట్టు తన మాయతో ఆ చెట్టుకి కాయలు కాసేలా చేస్తుంది. తల్లి ఎంతో సంతోష పడుతూ వాళ్ళు ఆ పడవ లోనే ఉండి ఆ చెట్లు కాయలునీ కోసి తన బిడ్డకు అందిస్తుంది.
ఆ తర్వాత అని కూడా ఆకలిగా ఉండడంతో ఆ పండ్లు తీసుకుని తింటుంది. అలా ఇద్దరు ఆ పడవలో కూర్చుని వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు. తల్లి చెట్టుతో……. చాలా కృతజ్ఞతలు నా కూతురి ఆకలి నా ఆకలి తీర్చి నందుకు. ఆ చెట్టు…. అది సరే కానీ ఇంతకీ మీరు ఎవరు ఈ పడవలో ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు. అప్పుడు ఆమె ఏడుస్తూ….. చెబుతాను అంటూ జరిగిన విషయం చెప్పడం మొదలు పెడుతుంది.
//ఫ్లాష్ బ్యాక్//
మాది కృష్ణాపురం అనే ఒక గ్రామం. నేను నా భర్త ఎంతో సంతోషంగా మా జీవితాలు గడుపుతూ ఉన్నాము మాకు చాలా ఆస్తి ఉంది మా ఆయన మంచి వ్యాపారవేత్త . మా వ్యాపారాలు చాలా చక్కగా సాగిపోతున్నాయి అప్పుడే నేను గర్భవతిని తెలుసుకున్నాను చాల సంతోషపడుతూ నా భర్తతో… ఏమండీ నేను ఒక శుభవార్త చెప్తాను దాని విన్నారంటే మీరు ఎగిరి గంతేస్తారు. అది అవుతుంది.
అతను….. ఏంటి ఆ శుభవార్త రజిని.
భర్త…. ఇప్పుడు మనం ముగ్గురము కాబోతున్నాము. ఆ మాటలకి నా భర్త చాలా సంతోషపడ్డాడు. నాకు కావలసిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు అందించాడు నెలలు గడిచాయి నేను కీర్తి కి జన్మనిచ్చను.
అలాగే సంతోషంగా మా జీవితాలు సాగిపోతున్నాయి కీర్తి కొంచెం పెద్ద అయింది.
చక్కగా బడికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చి ఇంట్లో చదువుకుంటుండేది దాన్ని చూసి నన్ను ఎంతగానో మురిసిపోయాము.
అలా ఉండగా ఒకరోజు నా భర్త చాలా కంగారుపడుతూ….. రజిని వెంటనే బట్టలు సర్దు ఇక్కడి నుంచి త్వరగా వెళ్లి పోవాలి .
రజిని…. ఎందుకండీ ఎందుకు ఇక్కడ నుంచి త్వరగా మనం వెళ్ళాలి . అని అడుగుతుంది భర్త….. నా స్నేహితులు నన్ను మోసం చేశారు. బిజినెస్ లో చాలా డబ్బు నష్టపోయము.
నేను కొందరి దగ్గర అప్పు తీసుకున్నాను . మన బిజినెస్ నష్టపోయాను అని తెలిసి వాళ్లు కచ్చితంగా ఇక్కడికి వస్తారు . మనం ఇక్కడి నుంచి వెళ్లకపోతే . ఆ డబ్బు మొత్తం మనమే కట్టాల్సి వస్తుంది. అంత డబ్బు మన దగ్గర ఇప్పుడు లేదు వాళ్ళకి మనం ఏమి చెప్పినా కూడా నమ్మరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. అందుకు నేను ఏం మాట్లాడకుండా బట్టలు సర్దుకొని పాపని తీసుకొని ముగ్గురు బయల్దేరాం . అప్పుడే కొంత మంది అక్కడికి వచ్చి….. మా దగ్గర అప్పు తీసుకొని మంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నారా మర్యాదగా మా డబ్బు మాకు తిరిగి ఇచ్చి వెళ్ళండి.
భర్త… ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అందుకే ఇకనుంచి వెళ్ళిపోతున్నాము. మళ్లీ కొత్త వ్యాపారం ఏదైనా మొదలుపెట్టి. మీ అప్పు మొత్తం తీరుస్తాను.
అందుకు వాళ్లు చాలా కోపంగా….. అసలు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు కొత్త వ్యాపారం ఎలా మొదలు పెడతారు రా ఇవన్నీ నమ్మి మాటలు లాగా లేవు తలా ఒక దెబ్బ వేస్తే కానీ నేడు దారిలోకి రాడు అంటూ నా భర్త ని కొట్టడం మొదలుపెట్టారు నేను ఎంతగానో అడ్డుకున్నాను కానీ ఏం లాభం నా భర్తకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. నేను ఏడుస్తూ….. మీరు అసలు మనుషులు కాదు పశువులు. డబ్బు మేము మెల్లగా ఇస్తాము అని చెప్పినా కూడా వినలేదు ఇప్పుడు నా భర్త ప్రాణాలు తీసుకురండి . లేదా నన్ను నా కూతుర్ని కూడా చంపేయండి . అంటూ ఏడవడం మొదలు పెట్టాను. ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. నా గాజులు మంగళసూత్రాన్ని కూడా వాళ్ళకి ఇచ్చి …. ఇవే నా దగ్గర ఉన్నాయి. అదిగో మా బంగ్లా దాన్ని అమ్ముకోండి . ఎంతో కొంత డబ్బులు వస్తాయి వాటిని తీసుకొని సద్ది పెట్టుకోండి అంటూ ఏడుస్తూ …. నా భర్తకి జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగించి .నా బిడ్డను తీసుకుని రోడ్డు మీదకి వచ్చాను. ఎటు వెళ్లలేని పరిస్థితి అప్పుడే ఊరి చివర ఒక స్థలంలో చిన్న పూరిగుడిసెలో ఏర్పాటు చేసుకొని అక్కడే ఉన్నాము . నాలుగు ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటూ. నా బిడ్డను చదివిస్తాను . మూడు పూట్ల కాకపోయినా రెండు పుట్ల తింటున్నాము.
అక్కడే కొన్ని నెలలు ఉన్నాము.
ఆ తర్వాత ఆ స్థలం యజమానురాలు అక్కడికి వచ్చింది. ఆమె నాతో…. అమ్మ మీరు ఎవరో నాకు తెలియదు కానీ . ఈ స్థలం మాదే. ఇక్కడ మేము కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నాము .
ఇన్ని రోజులు మేము అద్దె ఇంట్లోనే ఉన్నాము కొంత డబ్బు సంపాదించుకొని ఇల్లు కట్టు కోవాలి అనుకుంటున్నాము. అందుకే ఇలా ఖాళీగా స్థలాన్ని వదిలేసాము ఇప్పుడు కొంత డబ్బు కూడా పెట్టుకున్నాము కాబట్టే ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకున్నాము అందుకే ఇక్కడికి వచ్చాము . మీరు దయచేసి మీ పూరి గుడిసెలు తొలగించి ఇక్కడి నుంచి వెళ్తే మా పనులు మొదలు పెట్టుకుంటాము.
అది చాలా వినయం గా మాట్లాడింది.
మరొకరు ఆ స్థానంలో ఉంటే వేరే లాగా మాట్లాడే వాళ్ళు ఏమో ఆమె మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది అందుకే నేను ఏమీ మాట్లాడకుండా…. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాకు మీరు చాలా మేలు చేసినట్లే . చాలా రోజుల నుంచి ఈ స్థలంలోనే మేము ఉంటున్నాము చాలా సంతోషం. అది ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని పాపను తీసుకుని అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మీదకి వచ్చాము. మళ్లీ మా కాలినడక మొదలైంది.
ఆరోజు చీకటి పడిపోవడంతో ఎక్కడ ఉండాలో తెలియక నది దగ్గర ఉన్న నది దగ్గర ఉన్న పడవలో తల దాచుకోవడం కోసం
ఒడ్డున ఉన్న ఒక పడవలో విశ్రాంతి తీసుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు పడవ ఉన్నట్టుండి నదిలో కి కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము.
దాని అంతా విన్న మాయ చెట్టు …. జరిగిందేదో జరిగిపోయింది . మీరు రావాల్సిన చోటికి వచ్చారు మీ అవసరం ఇక్కడ ఒకరికి ఉంది కాబట్టే ఇక్కడికి చేరుకున్నారు . అదే భగవంతుని మహిమ. ఆ మాటలు విన్న ఆమె…. నాకు ఏమీ అర్థం కాలేదు నా అవసరం ఎవరికి ఉంది.
మాయా చెట్టు….. ఏం లేదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక తల్లి ప్రసవ వేదన పడుతూ పడవలో ఇక్కడికి చేరుకుంది. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చి చావు బతుకుల మధ్య…. దయచేసి నా బిడ్డను కాపాడండి. నాకు ముందు వెనుక ఎవరూ లేరు. అంటూ ఏడుస్తూ మరణించింది ఆమె ఎవరు ఏంటి అనేది తెలుసుకునే లేపే ఆమె ప్రాణాలు విడిచింది. అప్పటినుంచి ఆ బిడ్డను నేనే పెంచుతున్నాను. ఆ పాప ప్రతిసారి నాకు అమ్మ కావాలి అమ్మ కావాలి అంటే మీ అమ్మ వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు మీరు ఆ బిడ్డకి తల్లి కావాలి. మీరే తల్లిలాగా ఆమెను చూసుకోవాలి. మీరంతా ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు మీకు కావాల్సిన అన్ని అవసరాలు నేను తీరుస్తాను.
అందుకు ఆమె…. తప్పకుండా సవతి తల్లి లాగా కాదు నా కన్న బిడ్డ లాగా చూసుకుంటాను. అని అంటుంది అప్పుడు మాయ చెట్టు…. లలిత లలిత ఎవరొచ్చారో చూడు మీ అమ్మ మీ చెల్లి వచ్చారు. అని అంటుంది . లలిత పరుగు పరుగునా చాల సంతోషపడుతూ అక్కడికి వస్తుంది .
ఆ తల్లి కూతురు ఇద్దరూ పడవా నుంచి దిగి ఆమె దగ్గరికి వెళ్తారు. లలిత ఏడుస్తూ…. అమ్మ వచ్చేసావా ఇన్ని సంవత్సరాలు
నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు.
అంటూ ఏడుస్తుంది ఆమె…. కొంచెం పని మీద అక్కడే ఉండాల్సి వచ్చింది . ఇదిగో మీ చెల్లెలు కీర్తి అంటుంది. ఆమె కీర్తి ని పట్టుకొని….. కీర్తి మనిద్దరి ఇక్కడే ఆడుకోవచ్చు . ఈ అక్క అంటే నీకు ఇష్టమే కదా . అందుకు ఆమె ఇష్టమే అంటుంది . ఆ మాటకి లలిత ఎంతో సంతోష పడుతూ ఆమెను హత్తుకొని. హాయిగా అక్కడే ఆమెతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. లలిత వాళ్లే తన సొంత తల్లి చెల్లి అనుకొని వాళ్లతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ మాయ చెట్టు వాళ్ళకి అక్కడ ఒక ఇల్లు నిర్మిస్తుంది . వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఆ తల్లి ఇద్దరు బిడ్డల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ తన తల్లి ప్రేమ ను అందిస్తుంది. లలితకు తల్లిలేని లోటు తీరుతుంది.
దాని అంతా చూస్తున్న మాయ చెట్టు….. ఎవరు ఎక్కడికి ఎప్పుడు ఎలా చేయాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. ఏంటో ఈ సృష్టికి ఆయన చేసే మాయ. అనుకుంటుంది.
ఆ మాయ చెట్టు వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్లకు సహాయం గా ఉంటుంది. ఇక ఆ తల్లి కూతుర్లు ఎంతో హాయిగా వాళ్ళ జీవితాన్ని అక్కడే గడుపుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *