మాయా చేపల చెట్టు Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

అది దక్షిణ పురం అనే గ్రామం. ఆ గ్రామం చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద నది ఉన్నది అక్కడ ప్రజలు అందరూ ఆ నది మీద ఆధారపడి జీవించేవాళ్ళు. పడవల సహాయంతో అక్కడికి వెళ్లే వాళ్ళు చేపలు పట్టుకుని వాటిని తీసుకొచ్చి ఆమ్ముకుని జీవనాన్ని కొనసాగించే వాళ్ళు.
అలా సాగిపోతూనే ఉంది ఒకరోజు కృష్ణయ్య రాజమ్మ అనే దంపతులు ఆ గ్రామానికి చేరుకుంటారు.
వాళ్ళు ఆ గ్రామంలో కొత్త వాళ్ళు అంతా వింతగా అనిపిస్తూ ఉంటుంది.
పైగా రాజమ్మ గర్భవతి.
వాళ్లకి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి అప్పుడే ఒక పెద్ద ఆవిడ వాళ్లకి కనిపిస్తుంది.
వాళ్లు ఆమెతో….. అమ్మ మాది ఊరు అంతపురం అనే గ్రామం . మా ఊరికి వరదలు వచ్చి అంతా కొట్టుకుపోయింది. ఎక్కడ వాళ్లు అక్కడో చెల్లాచెదురై పోయారు. భగవంతుని దయవల్ల నేను నా భార్య మీ ఊరు చేరుకున్నాము . నా భార్య గర్భవతి మేము ఇక్కడ ఉండటానికి ఏదైనా ఒక ఇల్లు ఉంటే చెప్పగలరా.
ఎందుకు ఆ పెద్దావిడ… అయ్యో ఎక్కడో ఎందుకు బాబు మా ఇంటి పక్కనే మా రెండో ఇల్లు ఉంది మీరు అక్కడ ఉండొచ్చు. నాతోపాటు రండి అని ఉంటుంది అందుకు వాళ్లు చాలా సంతోష పడుతూ…. అమ్మ అడిగిన వెంటనే సహాయం చేశారు మీ మేలు మర్చిపోలేము. అని కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆమె అక్కడి నుంచి వాళ్లని ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంది.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు భార్యాభర్తలిద్దరూ అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. భార్య… ఏమండీ మీరు అలా బాధపడకండి నేను చూడలేకపోతున్నాను. మీరు ఏదో ఒక పని చేసి నన్ను నా బిడ్డను బ్రతికించొచ్చు.
అతను…. నిన్న మొత్తం అదే పనిలో ఉన్నాను ఇక్కడ సముద్రం వేట తప్ప మరో పని అంటూ లేదు అది నాకు చేత కాదు ఇలా అయితే నువ్వు నేను ఇద్దరం పస్తులు ఉండాల్సిందే. నా బాధ మొత్తం నీ గురించి నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి అంటూ ఏడుస్తాడు.
ఆ మాటలన్నీ చాటుగా వింటున్న పెద్దావిడ… అయ్యో పాపం మీ ఇల్లు చాలా f
దినస్థితిలో ఉన్నట్టున్నారు. అని వాళ్ళ పైన జాలిపడి భోజనం తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తుంది.
వాళ్ళు ఆమె వైపు చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆమె…. చూడు బాబు నీ భార్య నా కూతురు లాంటిది. నువ్వు తప్పుగా ఏమీ అనుకోకు కూతురికి తల్లి అన్నం పెట్టు కదా అని అంటుంది. వాళ్లు ఏం మాట్లాడకుండా చాలా కృతజ్ఞత తో భోజనం చేస్తారు.
వాళ్ల ఆకలి తీర్చేందుకు ఆ పెద్దావిడ చాలా సంతోషపడుతుంది.
ఇక ఆమె అతనితో…. చూడు బాబు ఇక్కడ
చేపల వేట తప్ప మరొకటి ఉండదు. నా దగ్గర నా భర్త పడవ , మరియు వల్ల ఉన్నాయి నీకు చేతనైనంత వరకు నదిలో వేటకు వెళ్లి చేపలు పట్టుకుని వాటిని అమ్మి పెట్టే బాధ్యత నాది.
అని అంటుంది అందుకు తను సరే అంటాడు.
ఆమె దగ్గర పడవ వల ను తీసుకొని ఆ నది లోకి వెళ్తాడు .
నదిలో చాలా దూరం ప్రయాణించి వలను విసురుతాడు. కానీ దానిని లాగడం అతని వల్ల కాదు చేపలు వాళ్ళతో పాటు బలంగా లోపలికి వెళ్ళి పోతూ ఉంటాయి అతను చాలా కంగారుపడుతూ…. అయ్యో ఒక్కగానొక్క అవకాశం ఇది పోతే మేము ప్రతి రోజు పస్తులు ఉండాల్సి వస్తుందేమో అంటూ ఈత రాకపోయినా ఆ వల ని పట్టుకునే సాహసం చేసి దానిలో దూకుతాడు.
అతనిఖీ వచ్చిన విధంగా ఈదుకుంటూ ఆ చేపల వాళ్ళని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు.
ఇంతలో ఒక పెద్ద చేప అతన్ని అమాంతం మింగేస్తుంది.
ఆ చేప కడుపులో ఒక పెద్ద లోకమే ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద మాయ చెట్లు ఉంటాయి.
ఆ చెట్లకి బంగారు చేపలు ఉంటాయి.
దాన్ని చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు.
ఆ మాయ చెట్టు అతనితో…. మానవ నువ్వు చాలా అదృష్టవంతుడివి. అందుకే పౌర్ణమి నాడు కనబడే ఈ మాయ చేప శరీరంలోకి ప్రవేశించావ్వు. నేను మాయ చెట్టు ని ఇక్కడికి
ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మనిషి వస్తూనే ఉంటాడు వాళ్లకు మేము సహాయం చేస్తూనే ఉంటాము.
అందుకే అతను చాలా ఆశ్చర్యపోతూ…. ఓ మాయ చెట్టు మీకు చాలా కృతజ్ఞతలు మా ఇంటి పరిస్థితి అస్సలు బాలేదు నా భార్య గర్భవతి. ఆమెకు కనీసం నేను ఒక్క పూట కూడా కడుపునిండా అన్నం పెట్టలేక పోతున్నాను నాకు సహాయం చెయ్యి.
నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను.
అని ప్రాధేయ పడుతూ అడుగుతాడు అందుకు మాయ చెట్టు…. ఓ మానవా నువ్వు నన్ను గట్టిగా పట్టుకో. ఆ తర్వాత నీకు అంత అర్థం అవుతుంది. అందుకు అతను ఆ మాయ చెట్టు ని గట్టిగా పట్టుకున్నాడు వెంటనే ఆ మాయ చెట్టు అతనితో సహాయం మాయమైపోయి ఆ నదిలో ప్రత్యక్షమవుతుంది. అతను ఒక పడవలో నిలబడి ఉంటాడు. అక్కడ జరుగుతుంది అంతా అతనికి అయోమయంగా ఆశ్చర్యంగా ఉంటుంది . అతను మాయ చెట్టు తో…. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మాయ చెట్టు నన్ను బయటకి తీసుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అదేవిధంగా మీరు సహాయం చేస్తే నా కుటుంబం బాగుపడుతుంది.
అని అంటాడు అందుకు మాయ చెట్టు…. సరే మానవా. తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను. నా కొమ్మల మీద కనబడుతున్న బంగారు చేపలన్ని నీకే సొంతం కాని ఒక షరతు . ఈ బంగారు చేపలను కేవలం స్వచ్ఛమైన మనసుతో మాత్రమే స్వీకరించాలి. లేదంటే అవి నీ పాలిట శాపం అవుతాయి.
అందుకు అతను…. మాయ చెట్టు కేవలం నా కుటుంబ పరిస్థితి బాగోలేదు కాబట్టే నేను ఆశ్రయం అడిగాను. నా మనసులో మరో దురుద్దేశం ఏమీ లేదు. అని అంటాడు అందుకు మాయ చెట్టు…. నీ వంతు ప్రయత్నం చెయ్యి అంటుంది.
అతను …. సరే అని చెప్పి ఆ బంగారు చేప ని ఒక్కొక్కటిగా తీసుకుంటాడు .
కొన్ని బంగారు చేపలు తీసుకొని పడవలో ఉంచుకుంటాడు. ఆ తర్వాత…. ఓ మాయ చెట్టు నాకు ఈ బంగారు చేపలు సరిపోతాయి వీటితో నా జీవితం మారిపోతుంది . నీకు చాలా కృతజ్ఞతలు అని అంటాడు మాయ చెట్టు… సరే మానవ నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను నీకు ఏ అవసరమైనా ఇక్కడికి రావచ్చు. సంతోషంగా వెళ్లి రా అని దీవించి అతని పంపిస్తుంది అతను పడవలో సరాసరి వాటిని తీసుకొని ఇల్లు చేరుకుంటాడు.
ఇంటిదగ్గర భార్యతో వాటిని చూపించి జరిగిన విషయమంతా చెబుతాడు.
దా నిని చూసి ఆమె ఎంతో సంతోష పడుతూ…. ఏమండీ మనకి ఇది లభించడానికి కారణం ఆ పెద్దావిడ ఆమెకు సహాయం చేద్దాము అని అంటుంది అందుకు అతను సరే అంటాడు .
కొన్ని బంగారు చేపలు తీసుకువెళ్లి ఆమెకు ఇచ్చి జరిగిన విషయం చెబుతాడు.
వాటిని చూసి ఆమె చాలా సంతోషపడుతు వాటిని తీసుకుంటుంది . కొన్ని రోజులు గడిచాయి వాళ్ళు ఆ బంగారు చేపలను అమ్మి డబ్బు సంపాదించి మంచి ఇంటి నిర్మించుకొని సంతోషంగా ఉంటారు కానీ ఆ పెద్దావిడకి
అతనిచ్చిన బంగారు చేపలు సరిపోవు ఆమెకు ఇంకా కావాలి అని అతని దగ్గరికి వెళ్లి ఏడుస్తూ… బాబు నీకు విషయం తెలియదు కదా నా భర్త పిల్లలు ఎంతో అప్పు చేసి వాళ్ళ దేవుడి దగ్గరికి చేరుకున్నారు నేను ఆ అప్పులు కట్టలేక పోతున్నాను దయచేసి నువ్వు నన్ను ఆ మాయ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు . నా గోడు నీ చెప్పుకుంటాను .
అది నాకు సహాయం చేస్తుందేమో.
అందుకు అతను సరే అని చెప్పి పడవలో ఆమెను మాయ చెట్టు దగ్గరికి తీసుకు వెళ్తాడు.
అక్కడ ఆమె ఏడుస్తూ అబద్ధాలని మాయ చెట్టు చెబుతుంది మాయ చెట్టు… సరే ఈ బంగారు చేపలు నీ సొంతం చేసుకో కానీ మనసులో ఏదో ఎలాంటి దురుద్దేశం లేకుండా ఉంటే నీ సొంతం అవుతాయి అని అంటుంది అందుకు ఆమె… నాకు ఇప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి నేను కష్టాల్లో ఉన్నాను. ఇవి నాకు కావాలి అంటూ అమాంతం వాటిని పట్టుకుంటుంది. ఆమె మనసులో దురుద్దేశం ఉంది కాబట్టి ఆమె వాటిని పట్టుకుని వెంటనే ఆమె శరీరమంతా మంటలు మండుతూ….. కాపాడండి నన్ను కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తోంది.
అతను…. మాయ చెట్టు దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు.
మాయ చెట్టు ఏం మాట్లాడకుండా అలా ఉంటుంది. ఆమె అలా కాలిపోయి ఒక బంగారు చేపల గా మారిపోతుంది .
దాన్ని చూసిన అతను ఆశ్చర్యపోతాడు .
ఆ బంగారు చేప సరాసరి ఆ చెట్టు కొమ్మ మీద కి చేరుకుంటుంది.
మాయ చెట్టు…. ఇప్పుడు నీకు అర్థం అయిందా. ఇక్కడ బంగారు చేపలు గా మారిపోయిన వాళ్లంతా మనుషులు స్వార్ధంతో కూడిన మనుషులు. మీకు గనక స్వార్థం ఉన్నట్టయితే నువ్వు కూడా ఇలా బంగారు చేప లాగా మారిపోయి వాడివి.
నీకు స్వార్థం లేదు కాబట్టి నీకు అందాల్సిన సహాయం అందింది. అని అంటుంది. అతనికి అంతా అర్థమయ్యే అక్కడినుంచి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *