మాయా టమాటాలు 3 Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

కేసర్ పురం గ్రామంలో ఒక ధనవంతుల కుటుంబంలో ఉండేది. ఆ కుటుంబంలో ఒక చిన్న పాపా పనిచేస్తూ ఉండేది ఆమె పేరు కీర్తన.ఆమె ఉదయాన్నే వచ్చి అక్కడ ఇంటి పని మొత్తం చేసుకుని. సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోయేది.
ఆమె తల్లి శారద ఆమెకు కళ్లు కనపడవు.
అందుకోసమే కీర్తన ఆమెకు కంటి ఆపరేషన్ చేయించడం కోసం. పని చేసి రూపాయి రూపాయి కూడా పెడుతూ ఉంటుంది.
అలా రోజులు గడుస్తున్నాయి.
ఒకరోజు కీర్తన ఎప్పటిలాగే పనికి వెళ్లడానికి సిద్ధమై….. అమ్మ నేను పనికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు. అని అంటుంది ఇందులో కీర్తన తాగుబోతు తండ్రి అక్కడికి వచ్చి…. అది బాగానే ఉంటుంది . దానికి ఏమి నువ్వు వెళ్లి డబ్బులు సంపాదించు.
అని అంటాడు కీర్తన….. మరి ఏం చేయాలి నాన్న ఇంట్లో నువ్వు ఉన్న కూడా లేనట్టే కదా.
అతను కోపంగా…. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు అలా ఉంది నిన్ను చూస్తుంటే .
పాప ఏడుస్తూ….. నాన్న నువ్వు తాగుడు మానేసి అమ్మ కంటి ఆపరేషన్ చేయిస్తే ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా . ఎందుకు నాన్న ఇలాగ చేస్తున్నావ్.
అందుకే అతను ఏం మాట్లాడకుండా … నేను బాగా తాగి తాగి అలసిపోయాను. నేను విశ్రాంతి తీసుకుంటాను . అనిచెప్పి లోపలికి వెళ్ళి పడుకుంటాడు పాప చేసేది ఏమి లేక తల్లికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
తల్లి శారదా గుడ్డిది కావడంతో ఒకచోట కూర్చొని ఉంటుంది . అప్పుడే అతను నిద్ర లేచి మెల్లగా ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నవో వెతకడం మొదలు పెడతాడు. అతడు అలా వెతుకుతూ ఉండగా పాప తన తల్లి ఆపరేషన్ కోసం దాచిపెట్టిన డబ్బు కనబడుతుంది దాన్ని తీసుకొని తన మనసులో…. వామ్మో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది . ఇంకా రెండు మూడు నెలల వారికి మనం ఎక్కడ ఇక్కడికి రావలసిన అవసరం లేదు. అని చెప్పి ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
కొంచెం సమయం తర్వాత పాప తన పనులు ముగించుకొని అక్కడికి వస్తుంది.
ఆమె డబ్బులు తీసుకువచ్చి తల్లితో…. అమ్మ ఈరోజు నెల జీతం వచ్చింది. ఈ నెల నుంచి నాకు 10,000 రూపాయలు ఇస్తారు అంట. మరి చాలా సంతోషంగా ఉంది అమ్మ ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితే ఇక కంటి ఆపరేషన్ పూర్తి అవుతుంది.
తల్లి ఏడుస్తూ…. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీలాంటి కూతురు నా కడుపున పుట్టింది. ఏ పాపం నాకు అంటుందో తాగుబోతు భర్త మొగుడు దొరికాడు.
అమ్మ నాకోసము ఇంత చిన్న వయసులో కష్టపడుతున్న తల్లి నీ రుణం ఎలా తీర్చుకోవాలి . అంటూ ఏడుస్తుంది పాప…. అమ్మ ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావ్ నాకు జన్మనిచ్చి నేను నీకు రుణపడి లాగా చేసావు కదా అమ్మ.
ఇక పాప ఆ డబ్బును దాచడం కోసం డబ్బా నీ తెరుస్తుంది అందులో డబ్బులు ఉండవు.
… అమ్మ అమ్మ ఇక్కడున్న డబ్బులు ఏమైపోయాయి అమ్మ . డబ్బులు లేవు అంటూ కంగారుపడుతూ వెతకడం మొదలు పెడుతుంది ఆమె….. అయ్యో సరిగ్గా చూడమ్మా . ఇంటికి మీ నాన్న తప్ప ఎవరూ రాలేదు అమ్మ . అంటూ ఏడుస్తుంది.
కీర్తన పెద్దగా ఏడుస్తూ….. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అమ్మ .నాన్న
డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. మీ ఆపరేషన్ కోసం కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టాను అమ్మ . డబ్బు మొత్తన్ని తీసుకొని వెళ్ళిపోయాడు.
అంటూ ఏడుస్తుంది తల్లి ఆ మాటలు విని…. భగవంతుడా ఎందుకంటే ఇలాంటి మొగుడునీ
ఇచ్చావు నాకు ఆపరేషన్ జరిగితే నేను పని చేసుకుంటూ నా బిడ్డ నువ్వు బాగా చదివించు కోవాలనుకున్నాను. అంటూ చాలా బాధపడుతూ కూర్చుంటే ఆ తల్లి కూతురు ఇద్దరు ఆ రోజు గడిచి పోతుంది ఇక ఆ మరుసటి రోజే పాప చాలా దిగులుగా పనికి వెళ్తుంది.
అక్కడ పని చేస్తూ ఉండగా యజమానురాలు…. కీర్తన ఏంటమ్మా అలా ఉన్నావు. అని అంటుంది పాప ఏమీలేదని సమాధానం చెబుతుంది యజమానురాలు….
సరేగాని పాప పైన పాడై పోయిన వస్తువులు చాలా ఉన్నాయి అవన్నీ బయట పడేయాలి .
ఆ బస్తాల నీది ఇస్తాను వాటిలో ఉన్న వస్తువులు బయటపెట్టు పాడైపోయింది అన్నీ బయటపెడతా అందుకు ఆమె సారే అంటుంది.
ఇక గోతాలు అన్ని బయటపేడతారు అందులో ఉన్న వస్తువులన్నిటినీ బయటకి తీస్తూ ఉంటారు ఇంతలో. పాపకు ఒక బొమ్మ కనపడుతుంది ఆ బొమ్మ ఒక పెద్ద పడవ పడవ లో ఒక చెట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆ బొమ్మ.
పాప దాన్ని చూసి… హరి చాలా బాగుంది ఈ బొమ్మ. అంటూ దాన్ని పట్టుకుంటుంది యజమానురాలు దాన్ని చూసి…. కీర్తన ఆ బొమ్మ నీకు కావాలా.
కీర్తన…. అవునమ్మా ఇది చూడ్డానికి చాలా బాగుంది నాకు ఇస్తారా అని జాలిగా అడుగుతుంది. అందుకు ఆమె తీసుకో అని సమాధానం చెబుతుంది.
పాపా చాల సంతోషపడుతూ పని ముగించుకొని ఆ బొమ్మ తీసుకొని ఇంటికి వస్తుంది.
ఇక అక్కడ తల్లి తో కాసేపు మాటలు చెప్పి
విశ్రాంతి తీసుకుంటుంది.
ఆమె కన్నుమూసిన వెంటనే ఆమె తెలియని ఒక ప్రపంచానికి వెళ్తుంది చుట్టుపక్కల అంతా నీళ్లు . పాపా పడవలో ఉంటుంది అక్కడ ఒక పెద్ద మాయ టమోటా చెట్టు ఉంటుంది ఆ చెట్టు…. ఈ లోకానికి నీకు స్వాగతం పాప అంటుంది పాప చాలా భయపడి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది . అది కల అని తెలుసుకుంటుంది పాప.
ఇక పాపకి నిద్ర పట్టక చిన్నగా నడుచుకుంటూ ఆ బొమ్మ దగ్గరికి వెళుతుంది. ఆ బొమ్మ ని ఎలా చూస్తూ దాన్ని పట్టుకొని…. చాలా అందంగా ఉన్నావు నువ్వు. అని దాని తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ మొత్తం నీళ్లు గా మారిపోతుంది ఆమె పడవలో ఉంటుంది. ఎదురుగా మాయ టమాటా చెట్టు ఉంటుంది . పాప కంగారుపడుతూ ఇది నిజమా కలా నాకు ఏమీ అర్థం కావటం లేదు. మాయ టమాటా చెట్టు…. పాప ఇదంతా నిజమే. కంగారు పడకు. నువ్వు నన్ను తీసుకొచ్చాడు కదా నేను బొమ్మని కాదు మాయ చెట్టు ని ఈ పడవ. ఎంతో కాలంగా నేను ఆ ఇంట్లోనే ఉండిపోయాను. నేను ఒక స్వామీజీ వరం వల్ల మహిళలు పొందిన మాయా చెట్టునీ. నేను ఎవరి ఇంట్లో అయితే ఉంటాను వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను . మొదటి వాళ్ళు బొమ్మ రూపంలో నన్ను చేర్చుకుంటారు ఆ తర్వాత వింతలు చూస్తారు కానీ పాపం ఆ ధనవంతుల కుటుంబంలో నాకు గురించి తెలియక . నన్ను ఒక మూటలో కట్టి పెట్టేశారు ఇప్పుడు నేను బయటకి వచ్చాను కదా అందరికీ సహాయం చేయవచ్చు.
అని అంటుంది ఆ మాటలకి పాప చాలా సంతోష పడుతూ…. ఓ మాయ టమాటా చెట్టు నువ్వు అందరికీ సహాయం చేస్తాను అంటున్నావు కదా . నా తల్లి ఆపరేషన్ కి నాకు డబ్బు సహాయం చేయవా నీకు డబ్బు కావాలి అంటే నేను కష్టపడి పనిచేసి మొత్తం డబ్బు ఇచ్చేస్తాను అంటూ జాలీగా అడుగుతుంది.
మాయ టమాటా చెట్టు పాప అమాయకత్వాన్ని చూసి…. పాపా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు .
నేను కురిపించే ఈ మాయ టమోటాలను. మీ అమ్మ కంటిమీద ఉంచు. ఆ తర్వాత నీకు అంతా మంచి జరుగుతుంది.
అని మాయ టమాటాల వర్షం కురిపిస్తుంది.
పాప చాలా ఆశ్చర్యపోతుంది ఇంతలో ఒక్కసారిగా మళ్లీ అక్కడ అన్ని మాయమైపోతాయి . అక్కడ ఉన్న బొమ్మ బొమ్మ గానే ఉంటుంది కానీ అక్కడ రెండు టమోటాలు ఉంటాయి.
పాప చాలా సంతోష పడుతూ వాటిని తీసుకొని తల్లి కంటిమీద ఉంచుతుంది . వెంటనే తన తల్లి కళ్ళు వస్తాయి.
ఆమె పైకి లేచి… నేను చూడగలుగుతున్నాను. అని అంటుంది పాపం హత్తుకుంటుంది పాప ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతోంది. వాళ్ళిద్దరూ ఆ బొమ్మని చూసి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక ఆ మాయ టమోటా బొమ్మ సహాయంతో
వాళ్లు చాలా ధనవంతులే సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *