మాయా తిరగలి 2 | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

అది అందమైన పల్లెటూరు అక్కడ కొండ ప్రాంతంలో ఒక ముసలి వ్యక్తి అది కూడా కళ్ళు సరిగ్గా కనపడని సింగయ్య ఉండేవాడు. అతను మనవరాలు పేరు పావని. అతను గుడ్డివాడైన ముసలివాడైన తన మనవరాలి మూడు పూటలా అన్నం పెట్టడం కోసం కొండ రాళ్లతో తిరగలి తయారు చేసే వాడు వాటిని
పావని కాలి నడక తో ఆ ఊరిలో ఆ పక్క ఊరిలో తిరిగి వాటిని అమ్మేది.
అలా వచ్చిన డబ్బుతో వాళ్ళిద్దరూ మూడు పూటలా తినేవాళ్ళు. ఒకరోజు అతను ఎప్పటిలా గే తిరగలి తయారు చేస్తూ ఉంటాడు పాప…. తాత అసలు ఈ తిరగలి ఎందుకింత బరువు ఉంటుంది నేను రెండు తిరుగుళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఎక్కువ దూరం వెళ్లలేక పోతున్నాను తాత
నాకు చాలా నొప్పిగా ఉంటుంది. నాతోటి వాళ్ళందరూ బడికి వెళ్తుంటే నేను మాత్రం ఇలా బరువులు మోస్తూన్నాను. నేను కూడా చదువుకోవాలి అంటే ఏం చేయాలి తాత అని జాలిగా అమాయకంగా అడుగుతుంది పావని.
తాత…. అయ్యో నా బంగారు తల్లి ఇలా అడిగితే ఏం సమాధానం చెప్పేది నాకు కళ్లు కనిపిస్తే నువ్వు కూడా అందరి పిల్లల్లాగే చదువుకుంటూ ఉండేదని ఆ బరువును మోస్తూ ఉండేదని కాదమ్మా అంటూ ఏడుస్తాడు.
తాత ఏడవడం చూసిన పాప అతని దగ్గరికి వెళ్లి కన్నీరు తుడుస్తూ …. అయ్యో తాత ఏడవకు ఊరుకో. అంటూ ఓదారుస్తుంది.
చాలా సమయం తర్వాత అతను తిరగలి తయారు చేయడం పూర్తి చేస్తాడు ఆ తర్వాత పాప ఒక చిన్న తిరగలి ఒక పెద్ద తిరగలి నెత్తిన పెట్టుకొని ఊర్లోకి వెళ్లి….. తిరగలి బాబు తిరగలి. తీరగలమ్మ తిరుగుళ్ళు.
అంటూ పిలుస్తూ ఉంటుంది.
ఆరోజు తిరగలిల్లు ఎవరు కొనుక్కో పోవడంతో పాపా నడుచుకుంటూ పక్క గ్రామానికి వెళ్తుంది అక్కడ కూడా
ఆరోజు తిరగలిల్లు ఎవరూ కొనుక్కో రు.
ఆమె అలాగే నడుచుకుంటూ ఇంటికి సాయంత్రానికి చేరుకుంటుంది తాత…. అమ్మ పావని వచ్చావా తల్లి నేను ఎంత కంగారు పడిపోతూన్ననో తెలుసా డబ్బులు తెచ్చావా అమ్మ
పావని చాలా బాధపడుతూ…. తాత ఈరోజు తిరగల్లు ఎవరు కూడా కొనుక్కోలేదు.
డబ్బులు ఏమి తీసుకురాలేదు తాత పక్క ఊరికి కూడా వెళ్లి వచ్చాను అని అంటుంది ఆ మాటలు విన్న అతను…. ఏం కాదులే తల్లి ఒకసారి ఇలాగే జరుగుతూ ఉంటాయి.
ఏం చేస్తాం అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా.
అని అంటాడు అందుకు ఆమె అంటుంది ఇక భోజనం చేసి ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారు ఆ మరుసటిరోజు పాప మళ్ళీ ఆ రెండు తిరగలిల్లు తీసుకొని ఊళ్లోకి వెళ్తుంది ఆమె ఊర్లో తిరుగుతూ …. తిరగలమ్మ తిరగల్లు అంటూ కేకలు వేసింది కానీ ఆ రోజు ఎవరూ కూడా పట్టించుకోరు.
పాప చాలా అలిసిపోయి చెట్టు దగ్గర కూర్చుని ఏడుస్తూ…. ఈ రోజు కూడా ఎవరు ఈ తిరగలిల్లుతీసుకోలేదు. ఇంట్లో డబ్బులు అయిపోతే మళ్ళీ తాత ,నేను తినడానికి కూడా ఏమీ ఉండదు.
అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఒక స్వామీజీ అటుగా వెళుతూ ఉంటాడు అతన్ని చూసి …. స్వామీజీ వెళ్తున్నాడు ఆయనకి తిరగాలి కావాలేమో అని అతని దగ్గరకు తిరిగి తీసుకొని వెనుకనుంచి…. స్వామి స్వామి తిరగలి తీసుకోండి స్వామి స్వామి స్వామి తిరగలి తీసుకోండి స్వామి దీంతో మీరు సెనగలు తీసుకోవచ్చు కందులు రాగులు అన్ని విసురు కోవచ్చు.
స్వామి స్వామి తీసుకోండి స్వామి అంటూ వెంట పడుతుంది. స్వామి చాలా హడావిడిగా వెళుతూ ఉండడంతో నాకు వద్దు తల్లి…. నన్ను ముట్టుకోకు దూరంగా వెళ్ళు అంటూ విసిరికొడతాడు. అతను అలా విసుక్కోవడం తో పాప కింద పడుతుంది ఆ తిరగలి తన చేతి మీద పడి దెబ్బ తగులుతుంది.
పాపా….. అమ్మ అంటూ అరుస్తూ ఏడవడం మొదలు పెడుతుంది.
దాన్ని చూసిన స్వామీజీ…. అయ్యో నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను పిల్లలు దేవుడితో సమానం అన్నమాట మరి చానా దూరంగా ఉండమని అసలు కొన్నాను భగవంతుడా నన్ను క్షమించు అంటూ భగవంతుని ప్రార్ధిస్తూ పాప దగ్గరికి వెళ్లి …. చిన్నారి నీకు దెబ్బ తగిలింద అమ్మ నన్ను క్షమించు . మీ గాయం ని ఇట్టే మాయం చేస్తాను అంటూ తన మాయాశక్తి తో. ఆ గాయాన్ని తొలగించి వేస్తాడు.
దాన్ని చూసిన పాప చాలా సంతోష పడుతూ…. స్వామి నీకు చాలా మాయలు ఉన్నాయా అయితే నాకు సహాయం చేయి స్వామి ఈగో ఈ తిరగల్లు అమ్ముడుపోయే అలా చేయి.
ఆ మాటలకి స్వామి చిన్నగా నవ్వుతాడు పావని…. స్వామి నువ్వు నాకు ఊరికే చెయ్యొద్దు నువ్వు వీటిని అమ్మి పెడితే మా తాత చేత నీకు ఒక పెద్ద తిరగలి చేయించి ఇస్తాను కావాలంటే రోజు నేనే మీకు ఆ తిరగలి తో పని కూడా చేసి పెడతాను ఈ ఒక్క పని చెయ్యి స్వామి . లేదంటే మేము పస్తులు ఉండాల్సి వస్తుంది అంటూ ఏడుస్తుంది.అతను…. అయ్యో బాధపడకు తల్లి. ఒక తిరిగలి నాకు ఇవ్వు అని దాన్ని తీసుకొని డబ్బులు ఇస్తాడు.
ఆ తర్వాత ఆమెతో…. ఇదిగో ఈ తిరగలి ఇంటికి తీసుకుని వెళ్లి దానిలో కందులు వేసి తిప్పి నీకు మంచి జరుగుతుంది సరేనా అని అంటాడు. అందుకు ఆమె సరే అని చెప్పి దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది.
స్వామి చెప్పినట్టుగా ని తిరగలిలో కందులు వేసి తిప్పడం మొదలుపెడుతుంది .
అలా ఆమె తిప్పడం మొదలు పెట్టిన వెంటనే దానిలో నుంచి బంగారం బయటకు వస్తుంది దాన్ని చూసిన ఆమె… తాత తాత ఇలా రా తాత బంగారం తాత అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తోంది. అతను చాలా ఆశ్చర్యంగా…. ఏంటమ్మా నువ్వు అనేది అంటూ అని అంటాడు పాపా జరిగిన విషయమంతా చెప్పి ఆ బంగారం అతని చేతిలో పెడుతుంది.
దానిని తాకిన వెంటనే అతనికి గుడ్డితనం పోయి కళ్ళు వస్తాయి. అతనికి కనిపించడంతో అతను ఎంతో సంతోషపడుతూ… నాకు కళ్ళు వచ్చాయమ్మా నాకు కళ్ళు వచ్చాయి అంటూ పాపనీ హత్తుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు కొన్ని రోజులకి ఆ వాళ్లు ధనవంతులు అవుతారు ఇక పాపా సంతోషంగా బడికి వెళ్తూ చక్కగా చదువుకుంటుంది. స్వామీజీ చేసిన మాయ తిరగలి తో. వాళ్ల జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *