మాయా తిరగలి | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Fairy Tales

బేబీ పచ్చళ్ల వ్యాపారం చేస్తూ ఉండేది. చిన్న పిల్ల అయినప్పటికీ పచ్చళ్ల వ్యాపారం ఎలా చేయగలుగుతుంది అని వాళ్ళ ఊరి ప్రజలందరూ చాలా ఆశ్చర్య పోతారు. వాళ్ళ అమ్మ మంచం పైన ఉండి ఏం చేయాలి అనేది చెబుతూ ఉంటుంది.

అమ్మ చెప్పినట్టు గానీ అన్నీ సక్రమంగా చేస్తూ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటుంది బేబీ . ఆమె రోటి పచ్చళ్ళు కూడా తయారు చేసి ఇంటి దగ్గర అమ్ముతూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బుతో తల్లి కి మందులు తీసుకొచ్చి ఇల్లుని గడుపుతూ ఉంటుంది. రోజులు గడిచాయి బేబీ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది . అలా ఉండగా  ఇంటి బయట నుంచి పక్షుల అరుపులు పెద్ద పెద్ద గాలులు గందరగోళంగా ఉంటుంది బేబీ చాలా ఆందోళన పడి ఏం జరిగిందో అంటూ బయటకు వచ్చి చూస్తుంది . వళ్ళ ఇంటి ఆవరణలో ఒక వినాయక విగ్రహం కనబడుతుంది. దాన్ని చూసి బేబీ చాలా కంగారు పడుతూ…. ఉన్నట్టుండి ఈ విగ్రహం ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు దీనిని ఇక్కడ నుంచి పెట్టారు బహుశ రెండు రోజులు వినాయక చవితి ఉంది కదా ఎవరైనా ఇక్కడ పెట్టుకొని వెళ్ళారేమో మళ్లీ వస్తారేమో అని ఆ వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంటి బయట పంచ లో పెట్టి తన ఇంట్లోకి వెళ్లి పని చేసుకుంటుంది . ఇంతలో తన తల్లి ఆమెతో….. బేబీ ఈరోజు గణపయ్యకు పూజ చేసావా లేదా.

బేబీ కోపంగా…. అమ్మ నేను గత నాలుగు రోజుల నుంచి పూజ చేయడం లేదు ఎందుకంటే ఆ భగవంతుడు మనకు ఏం చేశాడు నిన్ను మంచానపడేశాడు నాకు తండ్రిని దూరం చేశాడు. అలాంటప్పుడు ఆయనకు పూజను ఎందుకు చేయాలి అందుకే నాకు బాగా జ్ఞానోదయం అయింది పూజలు చేయడం మానేశాను.

అని కఠినంగా మాట్లాడుతుంది తల్లి ఆ మాటలు చాలా బాధ పడదు….. తప్పమ్మా అలా మాట్లాడకూడదు భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే. ఆయన కృప లేకపోతే మనం ప్రాణాలతో ఉండను. అలా మాట్లాడకూడదు అని చెప్తుంది కానీ బేబీ అసలు ఆ మాటలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటోంది. ఇంతలో ఒక ఆమె అక్కడకు వచ్చి….. అమ్మ బేబీ రేపు మా ఇంటికి బంధువులు వస్తున్నారు. వాళ్లకి భోజనం మా ఇంటి దగ్గర అనుకుంటున్నాను . రోటి టమాటా పచ్చడి అద్భుతంగా చేస్తావు కదా ఒక అరకేజీ కావాలమ్మ నీకు డబ్బులు కావాలంటే ఈరోజు ఇచ్చేస్తాను అని అంటుంది ఆందికు బేబీ….. సరే  పిన్ని తప్పకుండా అని అంటుంది ఆమె డబ్బులు బేబీ కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది బేబీ టమాటా ని తీసుకొచ్చి ఆ పనిలో మునిగి పోతుంది ఆమె పని చేస్తుండగా ఉన్నట్టుండి ఆమెకు నీరసం వస్తుంది అలా ఎందుకు వచ్చిందో అర్థం కాదు కొంచెం ఒంట్లో బాగోక పోతే ఆమె ….. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత  పని చేస్తాను అని చెప్పి వెళ్లి పడుకుంది కానీ ఆరోజు ఆమెకు తీవ్రమైన జ్వరం రావడంతో అలాగే నిద్రపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం పచ్చడి కోసం ఆమె రానే వస్తుంది. అప్పుడు బయట ఉన్న వినాయక విగ్రహం బేబీ రూపంలోకి మారి…. పిన్ని నేను బయట ఉన్నాను నేను నీకోసం ఇంటికి వెళ్ళాను అక్కడ ఎవరూ లేకపోతే మళ్లీ ఇంటికి వచ్చాను నువ్వు ఇక్కడకు వచ్చావు .

అని అంటుంది ఆమె…. అవునా బేబీ సరే ఆ పచ్చడి ఇవ్వమ్మా . డబ్బులు నీకు నిన్న ఇచ్చాను కదా అని అంటుంది ఎందుకు బేబీ రూపంలో ఉన్న వినాయకుడు అవును ఇచ్చాక పిన్ని అని అంటాడు . ఆమె దాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది .

వినాయకుడు తన రూపంలోకి మారి ఇంటి లోపలికి వెళ్లి మంచం పై ఉన్న బేబీ తల్లిని ముట్టుకుంటాడు . ఆమె ఆరోగ్యం పూర్తిగా మాయం అయిపోతుంది అలాగే పాప దగ్గరికి వెళ్లి పాపను కూడా ముట్టుకుంటాడు.

జ్వరం పూర్తిగా అయిపోతుంది ఆ తర్వాత వినాయకుడు అక్కడ ఉన్న రోటిలో రోకలి తో దంచుతూ ఉంటాడు . ఆ రోటి నుంచి బంగారు కాసులు వస్తూ ఉంటాయి.

ఇంతలో బేబీకి ఏదో శబ్దం రావడంతో పైకి లేచి చూస్తుంది . ఎదురుగా వినాయకుడు ఉంటాడు . వినాయకుని చూసి ఆశ్చర్యపోతుంది . వినాయకుడు…. బేబీ నువ్వు నా దగ్గరికి రావడం లేదు కదా అందుకే నేను నీ దగ్గరికి వచ్చేశాను . నువ్వు రోజు పూజలు చేస్తూ ఉంటే నాకు ముచ్చటగా ఉంటుంది . ఈరోజుతో నీ కష్టాలు అన్ని తీరిపోతాయిలే . నామీద కోపం తెచ్చుకోకు అని చెప్పి అక్కడ నుంచి వినాయకుడు మాయమై పోతాడు ఆమెకు అంతా కల లాగా ఉంది ఇంతలో తల్లి అక్కడికి వస్తుంది దాన్ని అంతా చూసి ఆశ్చర్యపోతుంది. పాపా జరిగిన విషయం చెప్పండి ఇక వాళ్ళిద్దరూ…. గణపయ్య మమ్మల్ని క్షమించు నీకు పూజలు చేయడం నిర్లక్ష్యం చేశాము. నువ్వు నాకోసం వచ్చావా గణపయ్య జై గణపయ్య అంటూ భజనలు చేస్తారు. ఇక ప్రతిరోజు వినాయకుడు తాకిన రోటి నుంచి బంగారం వస్తూ ఉంటుంది. దాంతో వారిద్దరి ఎంతో సంతోష పడుతూ గణపయ్య ఆరాధిస్తూ సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *