మాయా తిరగలి | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

వీణ అనే పాప చాలా హడావిడిగా పెద్ద మూట ను తీసుకొని ఇంట్లో కి వెళ్తుంది.
మంచం పై ఉన్న తన తల్లి ….. వీణ ఏంటమ్మా ఆది. అడుగుతుంది ఎందుకు వీణ ఆ మూటను విప్పి చూపిస్తుంది. అందుకు ఆమె చాలా ఆశ్చర్యపోతూ ….. వామ్మో అని అంటుంది. ఆమె అలా ఎందుకు అన్నది ఆ పాప ఏం తెచ్చింది. అనేది కథ లోకి వెళ్లి తెలుసుకుందాం. అది ధోని పూడి అనే గ్రామం ఆ గ్రామంలో శారదా వీణ అనే తల్లి కూతుర్లు ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా పేద కుటుంబం.
శారద కూలిపని చేసుకుంటూ. వచ్చిన డబ్బుతో ఇంటి కుటుంబాన్ని గడిపేది. అలా రోజులు గడిచాయి ఒకరోజు ఆమె ఎప్పటిలాగే
పనికి వెళ్లి అక్కడ పని చేస్తూ ఉంటుంది ఆ పని చివరి రోజు కావడంతో సాయంత్రం సమయం అవుతుంది. ఆమె పని ముగించుకుని డబ్బులు తీసుకొని ఇంటికి తిరిగి ప్రయాణం అవుతుంది. ఆమె అలా వెళ్తూ ఉండగా ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమె వెంట పడుతున్నట్లు అనిపిస్తుంది ఆమె చాలా కంగారుగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆమె వెంట వస్తూ ఉంటారు చాలా కంగారు పడిపోతూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆమె వెంట పరుగులు తీస్తారు . వాళ్ళిద్దరూ ఆమెను పట్టుకొని….. మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బుని ఇవ్వు లేదంటే కత్తితో పొడిచి చంపేస్తాము. అని బెదిరిస్తారు ఆమె చాలా కంగారు పడుతూ…… అయ్యా మీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఏం చేయకండి నాకు ఒక బిడ్డ ఉన్నది. నా కోసం ఎదురు చూస్తుంది నేను తప్ప ఆ దానికి ఎవరూ లేరు. మాది చాలా పేద కుటుంబం. దయచేసి నన్ను వదిలి పెట్టండి. నా దగ్గర ఉన్న డబ్బులు మీకు ఎందుకు పనికిరావు. అని ఏడుస్తూ చెబుతుంది అందుకు వాళ్ళు….. నువ్వు ఏం చెప్పినా నీ మాట వినే పరిస్థితిలో మేము లేము కానీ మర్యాదగా డబ్బులు ఇవ్వు లేదంటే పైలోకానికి వెళ్లిపోతావి
అని అంటారు ఆ మాటలకి ఆమె చాలా భయపడుతూ ఆమె దగ్గర ఉన్న డబ్బుని వాళ్లకి ఇస్తూ…… అయ్యా ఒక్క వంద రూపాయలు ఇవ్వండి ఇంట్లో తినడానికి ఏమీ లేవు. బియ్యం తీసుకుని వెళ్తాను. లేదంటే ఈరోజు కూడా నా కూతురు నేను పస్తులు ఉండాల్సి వస్తుంది. అని అంటుంది అందుకు వాళ్లు … అయ్యో పాపం నీకు 100 రూపాయలె కదా కావాల్సింది ఇదిగో తీసుకో అంటూ ఆమెను గట్టిగా పక్కకు నెడతారు ఆమె సరాసరి ఒక బండ కి తగిలి తలకు తీవ్రమైన గాయం అవుతుంది.
ఆమె అక్కడే సృహ తప్పి కింద పడిపోతుంది.
ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర పాపా తల్లి కోసం ఎదురు చూస్తూ…… అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మా నాకు చాలా భయంగా ఉంది. త్వరగా నువ్వు ఇంటికి రా అమ్మ నాకు ఆకలిగా ఉంది. అంటూ ఏడుస్తూ చాలా సమయం అక్కడే కూర్చుంటుంది. ఎంతసేపటికీ తల్లి రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్ళడం మొదలు పెడుతుంది ఆమె రోడ్డు మీద వెతుక్కుంటూ…. అమ్మ ఎక్కడున్నావ్ అమ్మ అమ్మ ఎక్కడున్నావ్. అటు కేకలు వేస్తూ ఉంటుంది. ఎంత సమయం వెతికినా కూడా పాపకి తల్లి జాడ కనిపించదు ఆమె ఒక చోట కూర్చొని పెద్దగా ఏడుస్తూ… అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావ్ అమ్మ నన్ను వదిలేసి అంటూ చాలా పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఆ పాప ఆ విధంగా ఏడ్చి ఏడ్చి అక్కడే నిద్ర లోకి జారి పోతుంది. ఇక ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించడం. ఆ సూర్యకిరణాలు ఆమెను తాకి నిద్రలేవడం జరుగుతుంది.
ఆమె… అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ . అమ్మా నీ కోసము నేను ఎక్కడ అని వెతక మంటావు చెప్పమ్మా. అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే ఒక స్వామీజీ స్నానానికి వెళుతూ ఆ పాపని చూస్తాడు.
ఆ పాపతో అతను….. ఎవరమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు.
అప్పుడు పాప ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది.
స్వామీజీ…. అయ్యో బాధ పడకమ్మా నువ్వు నాతో పాటుగా మీ అమ్మనీ చూపిస్తాను.
అని ఆ పాప ని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు.
ఆ సమయంలో మంచం మీద తన తల్లి పడుకొని ఉంటుంది.
దాన్ని చూసి మా పాప ఆమె దగ్గరకు పరుగులు తీస్తూ వెళ్లి….. అమ్మ నీకు ఏమైందమ్మా. అమ్మ నీకు ఏమైంది అంటూ పిలుస్తూ ఉంటుంది. ఆమె ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో ….. స్వామి మా అమ్మకి ఏమైంది స్వామి. స్వామి మిమ్మల్ని అడుగుతుంది మా అమ్మకు ఏమైంది చెప్పండి అంటుంది ఎందుకు అతను….. చూడు పాప మీ అమ్మ నిన్న రాత్రి తలకు గాయం తో సృహ తప్పి పడిపోతే ఇక్కడికి తీసుకు వచ్చాను .
కట్టు కట్టి మందు ఇచ్చాను. నువ్వేమీ కంగారు పడుకో మీ అమ్మ సృహా నుంచీ మేలుకొంటుంది.
అన్నీ సరిగ్గా చెప్తాడో చాలా సమయం తర్వాత ఆమె శృహ నుంచి మేలుకుంటుంది.
ఆమె పాప ని చూసి….. అమ్మ వీణ అంటూ ఆమెను కౌగిలించుకుంది.
పాప ఏడుస్తూ…. అమ్మ నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో నాకు చాలా భయం వేసింది తెలుసా అంటూ ఏడుస్తుంది.
స్వామీజీ….. ఏడవకు పాప. అమ్మ అసలు నిన్ను ఎవరు కొట్టి వెళ్లారు అని అడుగుతాడు అందుకు ఆమె జరిగిన విషయం చెబుతుంది.
దానిని విన్న స్వామీజీ…… ఈ దొంగలకి మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం అలవాటైపోయింది. చి చి అని తిట్టుకుంటూ …. సరే అమ్మ ఇక మీరు చిన్నగా ఇంటికి బయలుదేరండి ఏమీ కాదు ఆ గాయం తగ్గిపోతుంది మందు రాశాగా అని అంటాడు.
అందుకు ఆమె…. చాలా కృతజ్ఞతలు స్వామి అన్న ఎక్కడికి తీసుకు వచ్చినందుకు అలాగే మరో చిన్న సాయం చేస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది .
స్వామిజి ఏంటో చెప్పమని అడుగుతాడు ఆమె…. ఏం లేదు స్వామి నా బిడ్డ రెండు రోజు నుంచి పస్తూ ఉంటుంది. నా బిడ్డ ఆకలి ఇచ్చారు అంటే మీకు రుణపడి ఉంటాను స్వామి అంటూ బాధపడుతుంది.
స్వామీజీ…. అయ్యో ఎంత మాట తల్లి ఆమె కాదు నువ్వు కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళచ్చు. అని అంటాడు అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది వాళ్ళిద్దరికీ భోజనం వడ్డిస్తారు స్వామీజీ. ఆకలి మీద ఉన్న వాళ్లు శుభ్రంగా భోజనం చేస్తారు.
ఆ తర్వాత ఆమె….. మీకు చాలా కృతజ్ఞతలు స్వామి అంటూ కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోతారు.
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు పని చేసుకుంటూ ఉండగా తల తిరుగుతున్నట్లుగా. ఉండడంతో మంచంపై వెళ్ళి విశ్రాంతి తీసుకుంటోంది.
చాలా సమయం తర్వాత పాప నిద్ర లేచి….. అమ్మ అమ్మ ఏమైందమ్మా పడుకున్నావు.
అమ్మ నీకు ఒంట్లో సరిగ్గానే ఉంది కదా.
అందుకు ఆమె….. అమ్మ నాకు ఒంట్లో సరిగ్గా లేదు. ఒళ్లంతా నొప్పులు జ్వరం గా ఉంది తల్లి . నన్ను కాసేపు పడుకో నివ్వు. అని అంటుంది అందుకు పాపా సరే అని ఇంటి పని మొత్తం చేసుకుంటుంది. చాలా సమయం వరకు తల్లి లేకపోవడంతో పాప స్వామీజీ ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ కి తల్లి విషయం చెప్పాలని అనుకుంటుంది ఆమె అనుకున్న విధంగానే. స్వామిజి దగ్గరకు బయలు దేరుతుంది.
అక్కడ స్వామీజీకి తల్లి విషయం చెబుతుంది.
స్వామీజీ ఆ పాపకు మందు, మరియు తినడానికి ఇస్తాడు ఆ పాప మందు , భోజనం తీసుకొని ఇంటికి వెళ్ళి తల్లికి అందిస్తుంది.
తల్లి వాటిని సేకరించి మళ్ళీ విశ్రాంతి తీసుకుంటోంది. అలా రెండు రోజులు గడుస్తున్నాయి ఆమె ఆరోగ్యం కుదట పడుతుంది కానీ నీరసంగా ఉండటం వలన ఎక్కడికి వెళ్ళకుండా చిన్నగా పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది .
ఇక ఇలా ఉండగా పాపా స్వామిజి దగ్గరికి వెళుతూ వస్తు స్వామిజి కి పని చేస్తూ ఉంటుంది.
రెండు రోజులు గడుస్తాయి ఒకరోజు స్వామీజీ
ఇంట్లో తిరగలి తిప్పుతూ పప్పుని విసురుతూ ఉంటాడు. అప్పుడే పాప అక్కడికి వస్తుంది.
స్వామీజీని చూసి….. స్వామి మీరు పని చేస్తున్నారా. ఇప్పుడు మీకు పూజ సమయం అయ్యింది కదా . ఇలా మీరు పని చేస్తే ఎలా చెప్పండి దేవుడు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు . నేను ఈ పని చేస్తాను మీరు పూజ చేసుకోండి అని అంటుంది అందుకు స్వామీజీ నవ్వుకుంటూ …. సరే ఈరోజు అయితే నేను పూజ పూర్తి చేసుకున్నది కానీ నాకు మరో పని ఉంది నువ్వు అంతలోకి నువ్వు పప్పు నీ విసురుతూ ఉండు.
అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది ఇక ఆమె అక్కడ పప్పుని వేసి తిరగాలి విసురుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా ఆ తిరగలి నుంచి బంగారం నాణ్యాలు బయటకు వస్తాయి. ఆమె అలా తిప్పుతూ ఉంటే ఆ బంగారం నాణ్యాలు అలా వస్తూ ఉంటాయి. పాప చాలా కంగారుపడుతూ భయంతో….. స్వామి స్వామి ఒకసారి ఇలా రండి బంగారం స్వామి నాకు చాలా భయంగా ఉంది ఒకసారి రండి స్వామి అంటూ ఏడుస్తూ ఉంటుంది.
స్వామీజీ అక్కడకు వచ్చి….. ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఇప్పుడు ఏం జరిగిందని ఆ బంగారం అంతా నీకే సొంతం.
ఏడవకు అది బంగారం ఇది మాయ తిరగలి.
ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తిరగలి యొక్క మాయ శక్తి కోల్పోయి ఉన్నది మళ్లీ నీ కల్మషంలేని చేతి స్పర్శ తో ఆ తిరగలి కి మాయాశక్తి తిరిగి వచ్చింది.
నువ్వు చాలా ధన్యురాలిని తల్లి .
వెళ్ళు ఆ బంగారం తీసుకొని ఇంటికి వెళ్ళు.
ఇక మీరు సంతోషంగా గడప వచ్చు ఆ బంగారం తో. అని అంటాడు అందుకు పాప చాల సంతోషపడుతూ స్వామీజీని పట్టుకొని…. స్వామీజీ ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఎంతో కష్టపడుతూ ఉంటుంది
తిండి తినడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు ఇక ఈ రోజుతో మాకు ఆ కష్టమంతా తీరిపోయింది. అంటూ చాలా కృతజ్ఞతలు చెప్పుకొని వాటిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి బయలు దేరుతుంది. ఆమె ఎవరన్నా వాటిని తీసుకుంటారేమోనని చాలా కంగారు పడుతూ ఉంటే ఇంటికి వెళ్తుంది ఇక ఇల్లు చేరుకొని ఊపిరి పీల్చుకుంటుంది దాన్ని చూసిన తల్లి…. ఏంటమ్మా అని ప్రశ్నించగా ఆమె దాన్ని తేల్చి చూపిస్తుంది అందులో ఉన్న బంగారం చూసి తల్లి చాలా ఆశ్చర్యపోతూ…. ఇంత బంగారం ఎక్కడికి తల్లి అని అడుగుతుంది అప్పుడు పాప జరిగిన విషయమంతా చెబుతుంది.
అందుకు తల్లి ఎంతగానో సంతోషపడుతూ….. భగవంతుడా ఇన్ని రోజులకు గాను మా కుటుంబం మీద నీకు జాలి కలిగిందా. అంటూ భగవంతుని ప్రార్ధిస్తూ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఆ తర్వాత స్వామీజీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక వాళ్ళు ఆ బంగారం నీ సొమ్ము చేసుకొని మంచి ఇల్లు నిర్మించుకొని . వాళ్ళ వంతు పేదలకు సహాయం , స్వామీజీకి సేవ చేసుకుంటూ సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *