మాయా నది సహాయం | Telugu Kathalu | Telugu Stories | Bedtime Stories | Panchatantra kathalu

అది పౌర్ణమి రోజు రాత్రి శాంతి కిరణ్ దంపతులిద్దరూ తన కూతురైన రోజా తో కలిసి ప్రశాంతంగా నిద్ర పోతున్నారు. ఇంతలో ఒక పెద్ద శబ్దం వచ్చింది ఒక్కసారిగా వాళ్లంతా నిద్ర నుండి మేల్కొంటారు. అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. కిరణ్ ఒక్కసారిగా మాయమై పోతాడు. దాన్ని చూసిన శాంతి కూతురు రోజా ఇద్దరు ఆ కంగారు పడిపోతుంటారు. శాంతి…. ఏమండీ ఏమండీ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ చాలా కంగారుగా అరుస్తూ ఉంటుంది. రోజా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అతని కోసం వెతకడం మొదలుపెడతారు చాలా చాలా సమయం తీసుకుంటారు కానీ అతను ఎక్కడా కనిపించడు ఇంతలోనే తెల్లవారిపోతుంది వాళ్ళు ఒకళ్ళ దగ్గర కూర్చొని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటారు.
అప్పుడు వాళ్లకి ఒక శబ్దం వినపడుతుంది…. ఎవరు మీరు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నారు మీకు ఎలాంటి అవసరం ఏదైనా ఉంటే చెప్పండి నేను మీ అవసరం తీరుస్తాను. అని శబ్దం వినబడుతుంది ఆ మాటలు వినగానే ఆ తల్లి కూతుర్లు ఇద్దరు చాలా కంగారు పడిపోతుంటారు ఆ పాప… అమ్మ ఆ నదిలో చూడు నది మాట్లాడుతుంది.
అని అంటుంది తల్లి దాని వైపు చూసి చాలా ఆశ్చర్య పోతూ….. మీరు నిజంగా మాకు సహాయం చేస్తారా. అని ఏడుస్తూ అడుగుతుంది నది …..ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను అని చెబుతోంది.
ఆ తరువాత ఆమె జరిగిన విషయమంతా చెబుతుంది ఆ మాటలు విన్న నాది… నేను మాయ శక్తి గలిగిన నదిని ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. నీ భర్త ఎక్కడున్నాడో నాకు తెలుసు . నేను అతని దగ్గరికి మిమ్మల్ని చేరుస్తాను. అని ఒక పడవని ప్రత్యక్షం చేస్తుంది.
వాళ్ళిద్దర్నీ ఆ పడవలో ఎక్కమని చెబుతుంది వాళ్ళిద్దరూ ఆ పడవలో కూర్చుంటారు. పడవ అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నది లోపల ఒక పెద్ద చెట్టు కనబడుతుంది ఆ చెట్టు కు ఒక పెద్ద తోర్ర ఉంటుంది. ఆ పడవ ఒక్కసారి ఆ త్వరలోనే కి వెళ్లిపోతుంది. ఇక పడవ అక్కడి నుంచి కదలకుండా అలాగే ఉంటుంది .
వాళ్ళిద్దరికీ చాలా కంగారు పుడుతుంది వెంటనే ఆమె…. ఓ మాయ నది ఈ పడవ ఇకనుంచి కదలటం లేదు ఏమైంది. మాకు చాలా కంగారుగా ఉంది.
అప్పుడు నది …. కంగారు పడకండి నేను ఉన్నా కదా అని తన మాయాశక్తి తో మళ్ళీ కదిలేలా చేస్తుంది.
మళ్లీ పడవ మరికొంచెం ముందుకు వెళుతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
పెద్ద నీటి సుడిగుండం వస్తుంది పడవ అందులో పడి పోతుందేమో అన్నంత భయం కలుగుతుంది వాళ్ళిద్దరికీ వాళ్ళ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగానే పాప అందులో పడిపోతుంది.
పాపా….. అమ్మ కాపాడమ్మా అమ్మ కాపాడమ్మా ఆమా అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి పెద్ద పెద్దగా ఏడుస్తూ…. ఓ మాయ నది నా బిడ్డను కాపాడు నా బిడ్డ నీటి సుడిగుండంలో కొట్టుకుపోతుంది. మాయ నది ఏ మాట్లాడకపోవటంతో ఆమెకు చాలా కంగారు పుడుతుంది.
ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు ఆమె అరుస్తూ…. ఓ మాయ నది నేను నిన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చాను నా బిడ్డను కాపాడు మీకు పుణ్యం ఉంటుంది. భగవంతుడా నా బిడ్డను కాపాడు. అయ్యో అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ. ఏది ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. ఆమె ఒక్కసారిగా అందులోకి దూకి తన బిడ్డను కాపాడుకోవాలని అనుకుంటుంది. ఆమె అనుకున్న విధంగానే అందులోకి దూకి తన బిడ్డ కోసం వెతుకుతూ ఉంటుంది .
ఒక్క క్షణం అక్కడ అంతా మాయమైపోయి వాళ్ళిద్దరు తిరిగి పడవలోకి చేరుకుంటారు.
అప్పుడు మాయ ఆయనది వాళ్లతో….. నేను మిమ్మల్ని కేవలం పరీక్షిస్తున్ననాను ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు నా మీద నమ్మకం వదిలిపెట్టకుండా ఉంటే . నేను కచ్చితంగా సహాయం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా మీద నమ్మకాన్ని విడిచి పెట్టకండి అది మీకే ప్రమాదం.
అందుకు పాప…. ఓ మాయ నది అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్న . అసలు ఇంతకీ మా నాన్ననీ ఎవరు తీసుకెళ్లిపోయారు.
మాయ నది…. మీ నాన్న ఎక్కడ ఉన్నాడు నాకు తెలుసు కానీ తీసుకెళ్తున్న వ్యక్తి ఎందుకు తీసుకు వెళ్లడం నాకు తెలీదు మీరు అక్కడికి చేరుకుంటే మీకు అంత అర్థం అవుతుంది. మీరు అక్కడికి చేరుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి జాగ్రత్త. నా మీద నమ్మకం విడిచి పెట్టకండి విశ్వాసంతో ఉండండి.
అని అంటుంది అందుకు వాళ్ళు సరే అంటారు ఇక మళ్ళీ ఆ పడవ ముందుకి సాగుతుంది.
అలా పడవ వెళ్తూ ఉండగా ఆ నది లోపల నుంచి ఒక పెద్ద ముసలి ఒక్కసారిగా బయటకు వస్తుంది.
ముసలి ని చూసి వాళ్ళు కంగారు పడిపోయి…. ఓ మాయ నది మమ్మల్ని కాపాడు. అంటూ కళ్ళు మూసుకొని నాదినీ ప్రార్ధిస్తూ ఉంటారు.
ఇంతలో ఆ ముసలి ఆమెను తీసుకొని అక్కడినుంచి లోపలికి వెళుతుంది.
పాపా….. అమ్మ అ అమ్మ అంటూ ఏడుస్తూ నదితో ఓ మాయ నది నువ్వు అలా చూస్తూ ఉండకు దయచేసి మా అమ్మని కాపాడు. నీ మీద విశ్వాసం ఉంచండి అన్నావు కదా దయచేసి మా అమ్మ ని కాపాడు అంటూ ప్రార్థిస్తుంది. ఆ ముసలి బయటకు వచ్చి ఆమెను పడవలో వదిలిపెట్టి అక్కడినుంచి మాయమైపోతుంది.
దాన్ని చూసిన పాప ఊరట పడుతూ …. అమ్మా నువ్వు చేసావా నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూనే…. ఓ మాయా నది ఎందుకు ఇలాంటివి అన్ని మాకు
వస్తూ ఉన్నాయి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు.
అందుకో మాయ నది…… చెప్పాను కదా మీ నాన్న ని తీసుకెళ్లి నా వాళ్లే ఇదంతా చేస్తున్నారు అని.
అందుకు వాళ్లు… మమ్మల్ని నువ్వే మా నాన్న దగ్గరకు చేర్చాలి ఇక్కడ ఉన్న ఒడిదుడుకుల నుంచి మమ్మల్ని కాపాడండి. అంటూ ప్రాధేయపడ్డారు మాయ నది ….తప్పకుండా అదే పని చేస్తాను మీరు క్షేమంగానే మీ నాన్న దగ్గరికి చేరుకుంటారు.
అని అంటుంది వాళ్లు చాలా సంతోష పడతారు ఇక పడవ మళ్ళీ ప్రయాణం అవుతుంది.
ఇక వాళ్ళు అలా ముందుకు సాగిపోతారు .
వాళ్ళు చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాళ్లకు ఒక పెద్ద గృహ కనబడుతుంది.
ఇక పడవ ఆ పక్కనే ఆగిపోతుంది వాళ్ళు …. ఓ మాయ నది పడవ ఇక్కడ ఆగిపోయింది మేము ఈ గుహలోకి వెళ్ళమంటారా .
మాయ నది…. వెళ్లండి జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి నేను మీకు సహాయం చేస్తాను లోపల నీ భర్త ఉన్నాడు. అని అంటుంది అందుకు ఆమె చాలా సంతోష పడుతూ పాపను తీసుకుని లోపలికి వెళ్తుంది.
లోపల గ్రుహాంతర చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ అతని కోసం వెతుకుతూ ఉంటారు ఇంతలో ఒక చోట అతను శవమై కనపడతాడు.
ఆ భార్య భర్త ని చూసి….. ఏమండీ ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు. భగవంతుడా ఎందుకు నా భర్తని మృత్యువాత పడేలా చేశావు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా భగవంతుడా. నా భర్తను నాకు తిరిగి ఇవ్వు.
అని ఎంతగానో బాధ పడుతూ ఉంటుంది పాప కూడా ఎంతగానో ఏడుస్తూ…. నాన్న మేము నీకోసం వెతుక్కుంటూ వచ్చాము.
అని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఒక మాంత్రికుడు అక్కడికి వస్తాడు.
ఆ మాంత్రికుడు చూసి వాళ్ళు చాలా భయపడతారు పాప…. మాయ నది మాకు సహాయం చెయ్యి అంటూ కేకలు వేస్తోంది.
ఇంతలో ఆ మాంత్రికుడు…. ఎవరు మీరు ఎక్కడ దాక ఎలా వచ్చారు.
ఆమె ఏడుస్తూ…. నా భర్తని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు. నీకు ఏమి అవసరం ఉంది నా భర్తను చంపడానికి. నిజం చెప్పు అంటూ ఏడుస్తుంది అతను…. నీ భర్త కి ఒక అమూల్యమైన శక్తి ఉన్నది. అది ఎవరికీ తెలియదు అది నాకు మాత్రమే తెలుసు అతడి ఆత్మను సంవత్సరం పాటు తన శరీరం
నుంచి బంధించి . సంవత్సరం తరువాత అతని ఆత్మ నాలో ఐక్యం చేసుకుంటే
ఎన్నో గొప్ప మహాత్మ మేయిన శక్తులు నాకు సొంతం అవుతాయి .
అందుకే నీ భర్తని ఇక్కడికి తీసుకు వచ్చాను అతని ఆత్మ బంధించాను అంటూ తనను బంధించిన సీసాని చూపిస్తాడు.
ఆ తల్లి కూతురు ఇద్దరు ఏడుస్తూ…. మీరు చేస్తుంది చాలా పెద్ద పొరపాటు దయచేసి ఆత్మను తిరిగి తన శరీరం లో కి పంపించండి
అంటూ ఎంతగానో ప్రాధేయ పడతారు.
ఆ మాంత్రికుడు…హా హా హా మర్యాదగా మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపొండి లేదంటే మీ ప్రాణాలను తీసేస్తాను జాగ్రత్త.
అంటూ వాళ్లని భయ పెడుతూ ఉంటాడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు పాప తన మనసులో…. ఓ మాయ నది మమ్మల్ని కాపాడు. దయచేసి నా తండ్రిని కాపాడు అంటూ ఎంతగానో వేడుకుంటారు అలా ఆమె ప్రార్థిస్తూ ఉండగానే ఒక్కసారిగా అతని చేతిలో ఉన్న సీసా కింద పడుతుంది దానిలో ఉన్న ఆత్మ వెంటనే రవి శరీరంలోకి ప్రవేశిస్తుంది అతను వెంటనే మేల్కొంటాడు దాన్ని చూసిన మంత్రగాడు చాలా కోపంతో…. ఇది ఎలా సాధ్యం మీలో ఒక్కరు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్లారు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా సునామీ లాగా నీరు పొంగి పోతుంది.
ఆ నీటిలో ఆ నలుగురు కొట్టుకు పోతూ ఉంటారు.
ఆ మాంత్రికుడు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక్కసారిగా అక్కడ నీటి సుడిగుండం మొదలవుతుంది.
అతను ఆ సుడిగుండంలో కి వెళ్ళిపోయి…. కాపాడండి ఎవరైనా కాపాడండి నా మహాశక్తులు పనిచేయడం లేదు ఎవరైనా కాపాడండి. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు.
ఇది ఇలా ఉండగా ఆ ముగ్గురు సురక్షితంగా ఒక పడవలో చేరుకుంటారు.
వాళ్ల కళ్ళముందే ఆ మాంత్రికుడు నీటిలో పూర్తిగా మునిగిపోయి మరణిస్తాడు.
ఇక వాళ్ళు క్షేమంగా ఉండడంతో ఆ మాయానది తో….. ఓ మాయ నది మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకు వచ్చినందుకు చాలా సంతోషం నా భర్త ప్రాణాలు మాకు దక్కిచావు మమ్మల్ని ప్రాణాలతో ఆ మాంత్రికుడి నుంచి కాపాడావు నీకు చాలా చాలా కృతజ్ఞతలు.
అని మాయా నదికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అందుకు మాయానది…. భయపడకుండా మీరు క్షేమంగా ఇల్లు చేరండి ఈ పడవ మిమ్మల్ని క్షేమంగా మీ గ్రామానికి చేరుస్తుంది. అని అంటుంది అందుకు వాళ్లు చాలా కృతజ్ఞతలు చెబుతూ ఆ మాయానది కి నమస్కారం చేసుకుంటారు ఇక ఆ పడవ నదిలో ప్రయాణం అవుతుంది. అలా ప్రయాణం అయి వాళ్ళని వాళ్ళ గ్రామానికి చేరుస్తుంది.
వాళ్లు అక్కడ నుంచి తిరిగి చాల సంతోషపడుతూ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. అందరూ ప్రాణాలతో బయటపడిన అందుకు ఎంతగానో సంతోష పడతారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *