మాయా పిల్లల చెట్టు Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

సోముచర్ల అనే గ్రామం లో
కిరణ్, మాధవి అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకి పెళ్లి చాలా సంవత్సరం అవుతుంది కానీ పిల్లలు లేరు. ఆ విషయం అయ్యి ఆ దంపతులిద్దరూ బాధపడుతూ ఉంటారు అలా రోజులు గడిచాయి ఒకరోజు కిరణ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి… ఒసేయ్ మాధవి నిన్నే పెళ్లి చేసుకుని దగ్గర్నుంచి నాకు సుఖం లేదు. నీకు పిల్లలు పుట్టరు నువ్వు గొడ్రాలు వి .
నీవల్ల నా స్నేహితులు నన్ను సూటిపోటి మాటలతో అవమాన పరుస్తున్నారు.
నేను ఇంకా ఈ మాతలని భరించలేను మరో పెళ్లి చేసుకుంటాను .
అని తిడుతూ ఉంటాడు ఆమె ఏడుస్తూ…. ఎందుకండీ అలా మాట్లాడుతున్నారు ఏ రోజు ఈ రోజు ఎందుకు తాగి వచ్చారు.
అని చాలా బాధపడుతుంది అతను చాలా కోపంగా…. నీవల్లే నేను చనిపోయాను నీవల్లే తాగుతున్నాను నువ్వు వద్దు నాకు. నేను మరో పెళ్లి చేసుకుంటాను నువ్వు చావు అంటే ఇష్టం వచ్చినట్టుగా ఆమెను కొడుతూ ఉంటాడు.
పాపం ఆమె ఏడుస్తూ…. ఏమండీ దయచేసి నన్ను కొట్టకండి. ఏమండీ దయచేసి నన్ను కొట్టకండి అంటూ పెద్ద పెద్ద ఏడుస్తుంది ఆ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ళు అక్కడకు చేరుకొని …. ఏమైంది కిరణ్ ఎందుకు ఆమెను కొడుతున్నావు. అయ్యో వాతలు పొంగిపోయి ఎలా అరుస్తుంది చూడు కొంచెం కూడా ఇది లేదా నీకు.
అందుకు అతను కోపంగా… ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదంటే మిమ్మల్ని చంపేస్తాను.
అంటూ వాళ్ళ మీద కర్ర లేపుతాడు . వాళ్లు భయంతో అక్కడినుంచి వెళ్ళిపోతారు అలా ప్రతిరోజూ అతను మద్యం సేవించి రావడం ఇష్టం వచ్చినట్టుగా . కొడుతూ ఆమెను చిత్రహింసల పెడుతూ. చచ్చి పో అని అంటూ ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ పాపం ఎవరూ కూడా వచ్చి ఆపలేని పరిస్థితి. అలానే రోజులు గడిచాయి ఒక రోజు ఆమె ఏడుస్తూ రాత్రి సమయం….
నేను ఇంకా బ్రతికి ఎందుకు ఉండాలి నా భర్తకు నేను అడ్డుగా ఉండి అతని హింసించడం తప్ప నేను లేకపోతే మరో పెళ్లి చేసుకొని ఆమె ద్వారా పిల్లల్ని కంటాడు.
నా అడ్డు తొలగించుకోవడం మంచిది . అని ఏడుస్తూ రాత్రి సమయం అక్కడినుంచి
ఆ ఊర్లో ఉన్న నది దగ్గరకు వెళ్తుంది.
ఆమె అలా నది వైపు వెళ్ళడం ఒక ముసలావిడ చూస్తుంది.
ఆమె కేకలు వేస్తూ….. అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మాయి అంటూ ఆమె వెంట పడుతుంది. ఆమె చూస్తూఉండగానే నదిలోకి
దూకుతుంది మాధవి.
ఆ ముసలావిడ…. ఎవరైనా కాపాడండి. మాధవి నదిలో పడిపోయింది అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తోంది రాత్రి సమయంలో ఆమె కేకలు విన్న వాళ్ళు అక్కడకు చేరుకుంటారు .
కిరణ్ కూడా అక్కడ చేరుకుంటాడు .
అందరూ కిరణ్ తో…. చి చి నీ వల్ల నిండు ప్రాణం పోయింది. భార్యని పొట్టన పెట్టుకున్నాడు కదరా . ఛీ తూ అంటూ ముఖాన ఉమ్మేసి వెళ్తారు.
తెల్లవారిపోతుంది ఎక్కడ వాళ్లు అక్కడ ఇల్లు చేరుకుంటారు.
నదిలో పడి పోయిన మాధురి మాత్రం ఒక చోటికి కొట్టుకు పెడుతుంది అక్కడ ఒక పెద్ద చెట్టు ఆమెను కాపాడుతుంది అని ఒక మాయ చెట్టు మాయ చెట్టు పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ప్రసాదించే చెట్టు.
ఆ చెట్టు మాధువితో….. ఎందుకు నువ్వు చావాలని అనుకుంటున్నావు.
అసలు ఏం జరిగింది అని అడుగుతుంది అందుకు మాధవి ఏడుస్తూ నాకు పిల్లలు లేరు నా భర్త నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెబుతుంది.
మాయ చెట్టు. .. అయ్యో ఈ మాత్రం దానికే చనిపోవాల. సరే నా మాయ శక్తితో నీకు గర్భం వచ్చేలాగా చేస్తాను. పిల్లాపాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి దీవిస్తుంది.
ఆమె చాల సంతోషపడుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఆ తరువాత మాధవి అక్కడ మాయమై ఇంట్లో ప్రత్యక్షమవుతుంది.
భర్త ఆమెను చూసి చాలా ఆశ్చర్య పోతాడు.
మాధవి సంతోషంగా భక్తితో జరిగిన విషయమంతా చెప్తుంది.
అతను చాలా సంతోషపడుతూ…. ఎంత మంచి శుభవార్త తీసుకొచ్చావు అంటూ ఎంతో సంతోష పడతాడు.
కొన్ని నెలలు గడిచాయి ఆమె ప్రసవవేదన పడుతూ ఒక ఆడ బిడ్డకు జన్మనిస్తుంది.
దాన్ని చూసిన కిరణ్ మళ్ళీ చాలా కోపంగా సూల్న్నoత అని కూడా లేకుండా . నాకు ఈ అమ్మాయి వద్దు నాకు అబ్బాయి కావాలి వారసుడు కావాలి. నాకు వారసుడే కావాలి అంటూ ఆమెను కొట్టడం మళ్లీ మొదలు పెడతాడు.
మాధవి ఏడుస్తూ…. ఏంటండీ ఇది ఆడ బిడ్డ అయితే ఏంటి మగ బిడ్డ అయితే ఏంటి మనకు పుట్టిన బిడ్డ కదా.
అందుకు అతను…. ఒసేయ్ నాకు మళ్ళీ కోపం తెప్పించకు ఆ బిడ్డను కత్తితో పొడిచి చంపేస్తాను. ఈ పాప నాకొద్దు ఇది పెరిగి పెద్దయితే కట్నాలు కానుకలు పెళ్లిళ్లు సీమంతాలు అంటూ ఎన్ని తతంగాలు ఉంటాయో. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత స్థోమత నాకు లేదు.
నాకు ఈ బిడ్డ పొద్దు చంపేస్తాను అంటూ కత్తి తీసుకుని అక్కడికి వస్తాడు.
మాధవి అడ్డుకొని….. వద్దండి కళ్ళు తెరవని పసికందునీ చంపకండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తూ అడ్డుకుంటుంది.
నీకు అలాగే రోజు ఆ విషయంలో గొడవలు.
పిల్లను చంపేస్తాను అంటూ బెదిరింపులు.
వాటన్నిటినీ తట్టుకోలేక మాధురి అతనితో…. సరే ఒక పని చేయండి మనం మాయ చెట్టు దగ్గరికి వెళ్దాము. ఆమె పరిష్కారం చెబుతుంది. అని అంటుంది అందుకు తను సరే అంటాడు ఇక ఇద్దరూ ఒక పడవలో ఆ బిడ్డను తీసుకుని మాయ చెట్టు దగ్గరికి ప్రయాణం అవుతారు.
వాళ్లు ఆ మాయ చెట్టు దగ్గర చేరుకొని మాయ చెట్టు తో….. ఓ మాయ చెట్టు మాకు ఈ ఆడబిడ్డ వద్దు మగబిడ్డను ప్రసాదించు.
అంటూ ఏడుస్తూ ఉంటారు మాయ చెట్టు….. నీకు మతి ఉండే మాట్లాడుతున్నారా. ఆడబిడ్డ వద్దు అని ఎందుకు అంటున్నారు.
కిరణ్… ఆడబిడ్డ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. పైగా అధికమైన ఖర్చు.
అందుకే నాకు మగ బిడ్డ కావాలి.
దానిని ప్రసాదించండి లేదంటే ఆడబిడ్డను కూడా మీరే తీసుకోండి
మాయ చెట్టు చాలా కోపంగా…. పిల్లలు కావాలి అనుకునేది మీరే మళ్ళీ వద్దు అనుకునేది మీరేనా.
ఏ మి మనుషుల అయ్యా మీరు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు.
మాధవి….. ఓ మాయ చెట్టు ప్రతిరోజు ఈ బాధ నేను భరించలేకపోతున్నాను . నా మొగుడి చేతిలో నేను తనుల్లు తినలేను.
దయచేసి ఈ బిడ్డను తీసుకుని మగబిడ్డను ప్రసాదివ్వు.
మాయ చెట్టు…. మగ బిడ్డ కావాలి మగబిడ్డ కావాలని ఎందుకు అంటున్నారు. అసలు ఆడజన్మ లేకపోతే నీ మగ జన్మ ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించావా.
నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి చెత్తకుప్పలో నిన్ను పడేసి ఉంటే నీ పరిస్థితి ఏంటి.
చూడండి ఆడ మగ అంటూ ఎలాంటి బేధం లేదు. ఈ కాలాన్ని బట్టి చూస్తే అన్ని రంగాల్లో ఆడవాళ్లదే పై చేయి. మగవాడికి ఏమాత్రం తీసిపోకుండా ఎంతో కష్టపడుతూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఆడవాళ్ళు.
ఆడవాళ్లు గాజులు తొడుక్కొని వంటింట్లో పరిమితం చేయాలనుకున్న మగవాళ్ళకి ఒక సవాల్ లాంటిది.
అయినా మగ బిడ్డలు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా పెళ్లయిన తర్వాత తల్లిదండ్రులని అనాధ ఆశ్రమంలో వదిలేస్తున్నారు.
మరికొంతమంది తిండి పెట్టకుండా చిత్రహింసలు చేస్తున్నారు కానీ ఆడబిడ్డ అలా కాదు ఆమెకు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కావాలి ఎందుకంటే ఆమె కూడా ఒక ఆడది కాబట్టి. ఆడదానికి సహనం ఓర్పు ఎక్కువ.
అంతెందుకు ఈ భూమి మోస్తున్న భూమాత ఒక ఆడది. ఎంతమందికి మనుగడ ఇస్తున్నా ఆమె మగవాళ్ళని వద్దు అనుకుంటే అసలు మీరందరూ ఉండే వాళ్లేనా. అప్పుడు ఈ భూమి మీద ఆడవాళ్ళు తప్ప మగ పుట్టుక ఉండేది కాదు. అంతెందుకు నీ తల్లి ఆరోగ్యం బాగోక పోతే నువ్వేం చేసావు గుర్తుందా.
అందుకు కిరణ్ ఏడుస్తూ…. అవును నాకు గుర్తుంది నేను ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నా పెద్దమ్మ కూతురు మా అక్కని తీసుకు వచ్చాను . మా అక్క కడుపున పుట్టకపోయినా నా తల్లిని బాగా చేసుకుంది. నా కళ్ళు కనిపించావు . అవును అక్క చెల్లి తల్లి భార్య వీళ్ళందరూ ఆడ వల్లే కదా లేకపోతే మాకు మనుగడ లేదు. వాళ్ళు లేకపోతే అసలు ప్రపంచమే లేదు అంటూ పెద్దగా అరుస్తూ ఏడుస్తాడు.
అతనికి బుద్ధి కలిగేలా గా చేసిన మాయ చెట్టు కి కృతజ్ఞతలు చెప్పుకొని. సంతోషంగా ఆ పాపను తీసుకుని ఆ భార్యభర్తలిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు.
ఇక ఆరోజు నుంచి కిరణ్ ఆ పాపని తన భార్యని చాలా చక్కగా చూసుకుంటూ నూతన జీవితానికి నాంది పలుకుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *