మాయా పుచ్చకాయ ట్రైన్ | Telugu Kathalu | Telugu Stories | Bedtime Stories | Panchatantra kathalu

అది ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక స్వామీజీ నివసిస్తూ ఉండేవాడు. అతను ప్రతి రోజూ తపస్సు చేసుకొని . అక్కడ ఉన్నది తింటూ సంతోషంగా కాలం గడుపుతున్నాడు అలా ఉండగా ఒకరోజు ఆ అడవిలోకి ఒక పిల్లవాడు ఏడ్చుకుంటూ వస్తాడు. అతను సరాసరి ఆ స్వామీజీ కంట పడతాడు స్వామీజీ ఆ పిల్లవాణ్ణి చూసి…. బాబు ఎవరయ్యా నువ్వు . ఇంత దూరంలో ఉన్న అడవికి ఎలా వచ్చావు.
అందుకు ఆ పిల్లవాడు ఏడుస్తూ…. స్వామి నన్ను ఇక్కడి నుంచి తన ఇంటికి పంపించండి . మా అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు స్వామీజీ తన దివ్య దృష్టితో ఆ పిల్లవాడు ఎవరు ఏంటో అని తెలుసుకుంటాడు . స్వామీజీ కి దృశ్యం అంతా కళ్లకు కట్టినట్టుగా కనబడుతుంది అది కృష్ణాపురం గ్రామం . అడవికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంది అక్కడ రాధమ్మ అనే ఒక డబ్బు గల ఆమె ఉన్నది అతని కొడుకుకి ఈ బాబు పేరు కృష్ణ.
వాళ్ళ బంధువులు ఆమె దగ్గర డబ్బుని ఎలా అయినా కాచేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అలా ఉండగా ఒక రోజు
కృష్ణ వాళ్ళ బాబాయ్ కిరణ్ ఆమె దగ్గరకు వచ్చి….. వదిన ఆస్తి పంపకాలు గురించి వచ్చింది కాబట్టి ఇ అడుగుతున్నాను నీ ఆస్తి అంతా అనే పేరు మీద ఉంది కదా మీ పేరు నిర్ణయించుకో లేదా .
ఆమె … మీ అన్న గారు చనిపోక ముందే నా పేరు రాసి పెట్టారు. నేను నా కొడుకు పేరున రాసి ఇస్తాను కొంచెం వీడు పెద్ద అయితే అదే పని చేస్తాను.
ఆ మాటలు విన్న అతను తన మనసులో… అయితే నీ కొడుకు నీకు ఉండదు వదిన వాణి మాయం చేస్తాను. ఆ తర్వాత నిన్ను కూడా సైడ్ చేసేస్తాను. ఆస్తి మొత్తం నాకే సొంతం అవుతుంది. అని అనుకొని ఆమెతో…. మంచిదేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి సమయం అందరు నిద్రపోతుండగా పిల్లవాడిని దొంగిలించి చాలా దూరం తీసుకొచ్చి అడవిలో వదిలి పెడతాడు. అతను అడవి నుంచి రాకుండా ఒక స్వామీజీ ఇచ్చిన ఒక జలాన్ని ఒక అడవిలో చల్లుతాడు అతను అడవి దాటి రాలేదు. అదంతా కళ్లకు కట్టినట్టుగా స్వామీజీ కనబడుతుంది.
అప్పుడు స్వామి జి ఆ పిల్ల వాడితో…. చూడు బాబు నేను నిన్ను త్వరలోనే మీ అమ్మగారి దగ్గరికి పంపిస్తాను నువ్వు నాతో పాటే ఉండు.
అని అంటాడు అందుకు పిల్లవాడు ఏడుపు ఆపి ఆ స్వామీజీతో ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక కోతి మరియు ఏనుగు వస్తాయి వాటిని చూసి పిల్లవాడు చాల భయపడి పోయాడు.
కోతి…. ఎవరు స్వామీ ఈ పిల్లవాడు.
స్వామీజీ…. కొందరు దుర్మార్గులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇతని సురక్షితంగా ఇంటికి పంపించాలి. కానీ దానికి చాలా సమయం ఉంది అంటూ జరిగిన విషయం పూర్తిగా చెప్తాడు అందుకు కోతి…. సరే స్వామి అప్పటి వరకు మేము పిల్లవాడు తో ఆడుకుంటాము. అని అంటుంది స్వామీజీ సరే అంటాడు పిల్లవాడితో…. చూడు బాబు ఈ ఏనుగు ఈ కోతి చాలా మంచివి నువ్వు వాటితో సంతోషంగా ఆడుకోవచ్చు.
అని చెబుతాడు ఎందుకు బాబు సరే అంటాడు. ఇంకా కోతి , ఏనుగులతో ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు .
స్వామీజీ ఆ పిల్లవాడిని ఏవిధంగా ఇంటి పంపించాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాని గురించి పూజలు చేస్తూ ఉంటాడు రోజులు గడిచాయి ఆ పిల్లవాడు ఒక రోజు పెద్దగా ఏడుస్తూ….. స్వామి నాకు గుర్తుకు వస్తుంది దయచేసి నన్ను మా అమ్మ దగ్గరికి పంపించండి నేను ఇక్కడ ఉండలేను.
అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు స్వామిజి అతనికి నచ్చచెప్పి
అతన్ని నిద్రపోతాడు అప్పుడు ఏనుగు…. స్వామి ఈ పిల్లవాడు ఎంత మారాం చేస్తుంటే మీరు ఈ పిల్లవాడు ఎందుకు ఇక్కడే ఉంచుతారు అతని ఇంటికి మాయ శక్తితో పంపించవచ్చు కదా .
అందుకు స్వామీజీ…. అది ఇక్కడ ఉన్న ఏ మనిషి వల్ల కాదు ఎందుకంటే ఒక మంత్రగాడి చేత వాళ్ళ బాబాయి పూజలు చేయించి. పిల్లవాడు ఏ మనిషి ద్వారా కూడా తిరిగి ఇంటికి రాకుండా ఒక బంధం కలిగినా నా ఇచ్చి వాటిని అడవిలో కుమ్మరింపు చేశాడు.
అది చాలా కష్టం నేను దానికోసమే పూజ చేస్తూ ఉన్నాను.
ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది.
అని అంటాడు అందుకు ఏనుగు మంచిది స్వామి అని అంటుంది . కొన్ని రోజులు గడచాయి పౌర్ణమి రోజు రానే వచ్చింది.
స్వామీజీ పూజ చేస్తూ ఉండగా ఒక స్వరం స్వామీజీకి వినబడుతుంది
…. మీరు పిల్లవాడిని కాపాడాలి అని అనుకుంటే మనిషి ద్వారా కాదు పశువుల ద్వారా మాత్రమే . పిల్లవాడు సురక్షితంగా ఇల్లు చేరగలడు తన వెళ్లడానికి. బంకమట్టి. చాలువ ఇచ్చే ఫలము .తో కూడిన వాహనం ని ఉపయోగించి పిల్లవాణ్ణి సురక్షితంగా ఇల్లు చేర్చవచ్చు . అని చెప్పి స్వరం మాయమైపోతుంది అక్కడే ఉన్న కోతి ఏనుగు స్వామీజీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ…. స్వామి ఆ కనిపించని స్వరం చెప్పింది మాకు ఏమీ అర్థం కాలేదు.
మీరు అయినా అర్థం అయ్యేలాగా మాకు చెప్పగలరా .
స్వామీజీ….. మనుషులు వల్ల కానిది ఇప్పుడు మీ వల్ల సాధ్యమవుతుంది ఇవ్వగలరు .
సలవు ఇవ్వగల ఫాలం పుచ్చకాయ.
అలాగే బంకమట్టి వీటితో మీరు వాహనం తయారు చేయండి.
అని అంటాడు అందుకు కోతి ఏనుగు సరే అంటాయి కోతి ఏనుగు కలిసి అడవిలో పుచ్చకాయలు ఉన్న ప్రదేశానికి వెళతాయి అక్కడ పుచ్చకాయ ని తీసుకొచ్చి స్వామిజి ఆశ్రమం ముందు పెడతాయి.
ఆ తర్వాత బంకమట్టితో తీసుకువస్తాయి.
కోతి బంకమట్టితో పెద్ద పెద్ద చక్రాలు తయారు చేస్తుంది.
ఏనుగు పుచ్చకాయతో ఒక పెద్ద రైలు బోగీలను తయారు చేస్తోంది .
ఇక కోతి ఏనుగు కలిసి పుచ్చకాయ రైలు బండినీ తయారు చేస్తాయి .
స్వామీజీ దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి…. శభాష్ చాలా అందంగా బండి ని తయారు చేశారు.
ఇక పిల్లవాణ్ణి ఈ బండి మీద కూర్చుని పెడితే
సురక్షితంగా ఇల్లు చేరుస్తుంది. అయితే మార్గంమధ్యలో పిల్లవాడికి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అలాంటి
ప్రమాదం వచ్చినప్పుడు మీరు. .. నేను చెప్పిన ఒక మంత్రాన్ని జపించండి అని వాళ్ళకి ఒక మంత్రాన్ని చెప్పుతాడు . అందుకు కోతి ఏనుగు సరే అని చెప్పి ఆ మంత్రాన్ని గుర్తు పెట్టుకుంటాయి అప్పుడే పిల్లవాడు అక్కడికి వస్తాడు ఆ బండిని చూసి….. బలే బలే చాలా అద్భుతంగా ఉంది ఈ బండి.
నేను ఎక్కి కూర్చొని వచ్చా అని అడుగుతాడు స్వామీజీ…. తప్పకుండా బాబు ఇంక నువ్వు మీ ఇంటికి చేరే సమయం ఆసన్నమైంది.
నువ్వు ఆ బండి మీద ఎక్కి కూర్చో.
అని అంటాడు అందుకు పిల్లవాడు సరే అని చెప్పి దాని మీద కూర్చుంటాడు తర్వాత కోతి కూడా దానిపైన ఉంటాయి .
ఇంకా అలా కూర్చున్న వెంటనే ఒక్కసారిగా బండి ముందుకు సాగుతుంది. అలా వెళ్తూ ఉండగా వాహనానికి పట్టాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి.
అలా ఆ వాహనం ముందుకు సాగుతూ ఉంటుంది పిల్లవాడు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటాడు.
అలా వెళుతుండగా ఒక్కసారిగా ఆవాహనం ఆగిపోతుంది.
ఎందుకు వాహనం ఆగిందో వాళ్ళకి అర్థం కాదు అప్పుడు ఎదురుగా ఒక పులి కనపడుతుంది.
ఆ పులి కోతితో….. నాకు చాలా ఆకలిగా ఉంది ముందు నిన్ను తినాలా లేదా ఈ మనిషి పిల్లవాడిని తినాలా లేదా ఆ ఏనుగుని తినాలా.
త్వరగా చెప్పండి సమయం లేదు.
కోతి…. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు దారికి అడ్డు లే పిల్లవాని మేము సురక్షితంగా ఇంటికి చేర్చాలి.
అందుకు పులి ఏమాత్రం ఒప్పుకోదు….. నాకు ఆహారం కాకుండా ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోలేరు.
అని అంటుంది అప్పుడు ఆ కోతి కి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ప్రమాద సమయంలో మంత్రాన్ని వాడమని ఇక ఆ ఏనుగు కోతి ఇద్దరు కూడా స్వామి చెప్పిన మంత్రాన్ని జపిస్తారు ఇక వెంటనే ఆ పులి మనసు మారిపోతుంది.
ఆ పులి కూడా ఆ వాహనంలో చేరిపోతుంది.
వాళ్లంతా స్నేహితులుగా మారిపోతారు మళ్లీ వాహనం అక్కడి నుంచి బయల్దేరుతుంది.
అలా ఆ వాహనం అడవి దాటిన తర్వాత
గాల్లోకి ఎగురుతుంది.
దాన్ని చూసి ఆ పిల్లవాడు ఎంతో సంతోష పడుతూ మరింత పెద్దగా అరుస్తూ కేరింతలు కొడతాడు. ఇక ఆ రైలు సరాసరి వెళ్లి ఆ పిల్లవాడు ఇంటి ముందు అవుతుంది ఆగిన వెంటనే అక్కడ ఉన్న జంతువులు వాహనం అన్ని మాయమైపోతాయి.
దాన్ని చూసి పిల్లవాడు చాలా ఆశ్చర్య పోతాడు. ఇక అతను సరాసరి ఇంట్లోకి అమ్మ అనుకుంటూ వెళ్తాడు పిల్లవాడి అరుపులు విన్న తల్లి బాబు అంటూ అతని దగ్గరికి వెళ్లి అతని హత్తుకుంటుంది.
ఆమె ఏడుస్తూ…. ఒరేయ్ బాబు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు రా ఈ అమ్మ ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లావు .
అందుకు పిల్లవాడు అడవిలో జరిగిన విషయం అంతా చెప్తాడు దానిని విన్న తల్లి చాలా ఆశ్చర్యపోతుంది.
అప్పుడే వాళ్ళ బాబాయ్ అక్కడికి వస్తాడు పిల్లవాని చూసి తన మనసులో…. హరి నేను ఎన్నో పూజలు చేపించి. మరి వాడిని అడవిలో వదిలి పెడితే మళ్ళీ వాడు తిరిగి అక్కడికి ఎలా వచ్చాడు.
అని అనుకుంటాడు అప్పుడు అతని తల్లి
పిల్లవాడి బాబాయ్ తో జరిగిన విషయం చెబుతుంది.
దానివల్ల అతనికి చాలా కోపం వేసి ఒక కత్తి తీసుకుని…. మర్యాదగా ఆస్తి కాగితాలు మొత్తం నాకు ఇవ్వు. వాటన్నిటికీ నా పేరు మీద రాసి లేదంటే ఈ పిల్లవాడునీ నీకు దక్కకుండా చేస్తాను అంటూ బెదిరిస్తాడు ఆమె…. వద్దు పిల్లల్ని ఏం చేయొద్దు నేను ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాను. ముందా కాగితాలు మొత్తం మీ చేతిలో పెడతాను అని మాత్రం ఏమి చెయ్యద్దు అంటూ ఎంతగానో ప్రాధేయ పడుతోంది.
ఇంతలో ఆ పిల్లవాడు తన మనసులో….. స్వామీజీ దయచేసి మమ్మల్ని కాపాడు దయచేసి మమ్మల్ని కాపాడు అని స్వామిజి నీ . తెలుసుకుంటాడో తలుచుకున్న వెంటనే వాళ్ళ బాబాయ్ కోతి లాగా మారిపోతాడు.
దాన్ని చూసి అతను …హా హా హా అని పెద్దగా నవ్వుకుంటాడు తల్లి అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఇక ఆ కోతి అక్కడి నుంచి పరుగులు తీస్తూ బయటకు వెళ్ళిపోతుంది.
ఇక ఆమె ఎంతో సంతోష పడుతూ పిల్లవాణ్ణి దగ్గర తీసుకొని. స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని పిల్లవాడునీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ సంతోషంగా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *