మాయా బంగారు పిల్లవాడు The Magical Child | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu

బేబీ వాళ్ళ తమ్ముడు ఏడుస్తూ ఉంటాడు. బేబీ వాళ్ళ సవతి తల్లి….. అబ్బాబా ఏంటి వీడి ఏడుపు ఒకటే గోల. అసలు చెవుల దిద్దులు పడిపోతున్నాయి. నావల్ల కాదు వేడిని భరించడం. పోయే మీ అమ్మ పోతూ పోతూ వీటిని కూడా తీసుకెళ్లాల్సిన కాన్పులో విడు కూడా పోతే బాగుండేది. బేబీ…. ఎందుకు పిన్ని ఆలా మాట్లాడుతావు చిన్నపిల్లలన్న తర్వాత ఏడుస్తరు గా.

సవతి తల్లి …. ఏంటి నీతులు చెప్పడానికి వచ్చావా పనులు చేశావా లేదా. అనవసరంగా మీ నాన్నని కట్టుకొని పెద్ద తప్పు చేశాను పిల్లలను వాడిని కట్టుకొని ఏ భార్య సుఖపడింది. సవతి తల్లి అన్న పేరు తప్ప ఏమీ ఉండదు.
నోరు మూసుకొని పని చెయ్యి నాకు తల పగిలిపోతుంది అని తిట్టి వెళ్లి ఆమె పడుకుంటుంది.
బేబీ పని చేయకుండా వాళ్ళ తమ్ముడు ని ఎత్తుకొని…… ఊరుకో తమ్ముడు ఊరుకో ఊరుకో ఏడవకు. అంటూ ఓదారుస్తూ ఉంటుంది.
చాలా సమయం వరకు లోపల నా సవతి తల్లి వాళ్ల ఏడుపుని గమనిస్తూనే ఉంది తనకి చాలా చిరాగ్గా ఉండి. బయటకు వచ్చి…. ఒసేయ్ బేబీ వాడిని నాకిచ్చి నువ్వు పని చేసుకో పోవే. అని చాలా కోపంగా ఆ పిల్లని తీసుకోని తన పక్కకునెట్టి బయటకు వస్తుంది .
బేబీ చాలా భయపడుతూ ఆమె వెనక వెళ్తూ …. ఎక్కడికి తీసుకెళ్తున్న పిన్ని వాడిని. వాడి నాకు ఇవ్వు నేను తీసుకుంటాను. ఏడవ కుండ నేను చేస్తాను.
అందుకు ఆమె చాలా కోపంగా నువ్వు వెళ్ళు అంటూ అతన్ని తీసుకొని వెళ్లి…. ఒరేయ్ నువ్వు ఇక్కడ చావు . అంటూ అతన్ని చెరువులో విసిరేస్తోంది.
పిల్లవాడు ఏడుస్తూ పెద్దపెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు.
ఆమె అక్కడి నుంచి వెళ్లి పోతుంది బేబీ ఏడుస్తూ….. కాపాడండి ఎవరైనా మా తమ్ముని కాపాడండి.. అంటూ పెద్దగా ఏడుస్తూ కేకలు వేస్తోంది.
వాళ్ళ తమ్ముడు నీటిలో మునిగిపోయాడు.. బేబీ ఏడుస్తూ …. ఒరే తమ్ముడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా. అంటూ ఏడుస్తూ బాధపడుతూ అక్కడే ఉంటుంది ఆమె ఏం చేయలేని పరిస్థితి.
తను అక్కడే ఉండిపోతుంది ఒక్కసారిగా వాళ్ళ తమ్ముడు కిలకిల నవ్వులు వినబడ్డాయి ఆమె చాలా ఆశ్చర్యంగా చూస్తోంది.
వాళ్ళ తమ్ముడు శరీరమంతా బంగారం. తల మాత్రం మనిషి తల ఉంటుంది దాన్ని చూసి చాలా కంగారు పడిపోతుంది. బేబీ కి అసలేమీ అర్థం కాదు.
తన తమ్ముని పట్టుకుంటుంది.
అతను తమ్ముడు పట్టుకుని వెంటనే బంగారం మొత్తం కుప్పుగా పడిపోయి పిల్లవాడు మాయమై పోతాడు. బేబీ మరింత కంగారు గా….. ఒరేయ్ తమ్ముడు ఎక్కడ రా నువ్వు. ఎక్కడ నువ్వు అంటూ కేకలు వేస్తూ వెతుకుతూ ఉంటుంది.
మళ్లీ చెరువు నుంచి పెద్దగా నవ్వుతూ వాళ్ళ తమ్ముడు శరీరమంతా డబ్బులు కట్టలతో
బయటకు వస్తాడు.
బేబీ మళ్లీ తన తమ్ముని పట్టుకుంటుంది. తన తమ్ముడు మైయ మై పోయి అక్కడ కుప్పలు కుప్పలుగా డబ్బు పడుతుంది.
బేబీకి అంతా కల లాగా అనిపించి…… నేను చూస్తుంది కలా నిజమా భగవంతుడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. నాకేం అర్థం కావటంలేదు.
అంటూ కంగారు పడుతూ ఉండగా మళ్ళీ పెద్ద పెద్ద నవ్వులతో చెరువు నుండి తన తమ్ముడు వజ్రాల రూపంలో వస్తాడు. తన శరీరం అంతా వజ్రాలు తల మాత్రం మనిషి తల.
బేబీ బయటకు వచ్చి….. ఒరేయ్ తమ్ముడు ఏంటి ఇదంతా నాకు భయంగా ఉంది అంటూ వాడిని పట్టుకుంటుంది.
మళ్లీ తను మాయమైపోయే అక్కడ వజ్రాలు కుప్పగా పడతాయి.
బేబీ కళ్ళు తిరిగి కింద పడి పోతుంది.
వెంటనే తన తమ్ముడు చెరువు నుంచి బయటకు వచ్చి…. అక్క లే అక్క లే అని అంటాడు.
బేబీ ఒక్కసారిగా లేచి….. ఒరేయ్ తమ్ముడు నువ్వు ఇంత చిన్న పిల్లవాడు ఇలా మాట్లాడుతున్నావు ఈ బంగారం డబ్బు వజ్రాలు ఏంటి నాకు ఏమీ అర్థం కావడం లేదు.
అప్పుడు మాయ చెరువు నుండి శబ్దం వినబడుతుంది….. చూడు పాపా నేను ఒక మాయా చెరువు ని. నేను బంగారం డబ్బు వజ్రాల నీ ఇస్తాను.
నాలో ఏ వస్తువు అయితే పడుతుందో అదే వస్తువు తిరిగి మీకు వస్తుంది. అందుకే మీ తమ్ముడు మూడు రూపాల్లో మాత్రమే కాకుండా తను కూడా సజీవంగా బయటకు వచ్చాడు.
ఆ మాటలు వినగానే బేబీ చాల సంతోషపడుతూ…… ఇవన్నీ మేము ఇంటికి తీసుకు వెళ్ళవచ్చా.
అందుకు మాయ చెరువు….. తప్పకుండా ఇంటికి తీసుకెళ్లవచ్చు ఇది చూసిన తర్వాత మీ పిన్ని పూర్తిగా మారిపోతుంది. తన గయ్యాలి తనం వదిలి పెట్టి మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం మొదలుపెడుతుంది.
ఆ మాట వినగానే పాప మరింత సంతోషపడుతు….. నిజంగా మీరు చెప్పినట్టు జరిగితే మీ మేము ఎప్పటికీ మర్చిపోము అని అంటుంది.
ఇక తర్వాత వాటన్నిటినీ మూట కట్టుకొని. తన తమ్ముని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *