మాయా బాతు — దెయ్యాలు_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక ఆడ దెయ్యం నడుచుకుంటూ వెళ్తూ తన లో…. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. అని పాటలు పాడుకుంటూ వెళ్తుంది. అంతలో ఆ దెయ్యానికి దూరం నుంచి మరో పాట వినబడుతుంది…. చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక.

ఆ పాట విన్న దెయ్యం….. ఇదేంటి ఇంత రాత్రి సమయంలో అది ఇక్కడ పాటల ఎవరు వాడుతున్నారు. అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్తుంది అప్పుడు దాని ఎదురుగా ఒక దెయ్యం కనిపిస్తుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ దెయ్యం తో…… ఓ దెయ్యమా నన్ను ఏం చేయకు నన్ను ఏం చేయకు. నన్ను చంపకు నీకు పుణ్యం ఉంటుంది.
అప్పుడా రెండో దయ్యం…. ఛీ ఊరుకో రాత్రి రాత్రి పెద్ద జోక్ లు వేస్తున్నావు. ముందు మనం చచ్చిన తర్వాత ఇక్కడ వచ్చాము ఇప్పుడు నువ్వు దెయ్యానివే నేను దెయ్యాన్ని ఎందుకు అంత భయపడుతున్నావు.
అప్పుడు ఆ మొదటి దెయ్యం….. ఓ అవును కదా నువ్వు దెయ్యానివే నేను దయ్యాన్ని.
అవును అది సరే గానీ ఈ అడవిలో నిన్ను ఎప్పుడు చూడలేదే.
రెండో దెయ్యం…. నేను నిన్ను చూడ లేదే. ఆయన నేను వచ్చి రెండు రోజులు అవుతుంది.
మొదటి దెయ్యం…. అవునా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు చెల్లి.
మొదటి దెయ్యం…. అబ్బో వరసలు బాగానే కలుపుతున్న అక్క. అసలు నేను చచ్చి రెండు రోజులు అవుతుంది.
మొదటి దెయ్యం…. ఓహో అవునా అసలు నువ్వు ఎందుకు చచ్చిపోయావు ఎలా చచ్చిపోయాఉ చెల్లి.
రెండో దెయ్యం….. అదొక పెద్ద కథ అక్క.
1దెయ్యం….. అబ్బో అంత పెద్ద స్టోరీ నా తల్లి. మేము అంత వినలేం కానీ కొంచెం షార్ట్ కట్ లో చెప్పు.
అందుకు రెండో దెయ్యం….. చెప్తాను అక్క చెప్తాను నా కథ నీకు తప్ప ఎవరికి చెప్తాను. నా పేరు సరళ నా భర్త పేరు రమేష్. మాకు డబ్బులు లేదనే కానీ సమాజంలో మంచి పేరు ఉంది. కానీ నాకు నగలు చీరలు మీద ఆశ ఎక్కువ.ఎప్పుడు మా ఆయన్ని అవి తీసుకురా ఇది తీసుకురా అంటూ సతాయిస్తూ ఉంటాను. కానీ ఆయన నా మాటలు పట్టించుకునే వాడే కాదు.
ఆ మాటలు విన్న మొదటి దెయ్యం…… ఈ story నేను ఎక్కడో విన్నట్టుందే. నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా . ఇది ఏదో సినిమా లో ఉన్నట్టు నాకు కొడుతుంది. అది బాగా ఆలోచించి ఆ గుర్తొచ్చింది ఇది శుభలగ్నం సినిమాలో రోజా ఆమని ల స్టోరీ.
మీ స్టోరీ చెప్పమంటే సినిమా స్టోరీ చెప్తున్నావ్ ఏంటి.
అందుకు రెండో దెయ్యం….. అయ్యో అక్క నేను చెప్పేది పూర్తిగా విను నా జీవిత కథ అంతా ముందుగానే సినిమాలో వచ్చేసింది.
మొదటి దెయ్యం…. ఓహో అవునా ఆ తర్వాత ఏమైందో చెప్పు.
రెండో దెయ్యం..,. ఇంకే ఉంటది ఆ సినిమాలో జరిగినట్లుగానే అలాగే నా జీవితంలోకి ఒకటి వచ్చింది.నీ మొగుని నాకు ఇవ్వు నేను పెళ్లి చేసుకుంటాను నీకు ఎన్ని కోట్లు కావాలన్నా అన్ని కోట్లు ఇస్తాను అని చెప్పింది.
నేను ఏదో ఆశపడి నా మొగుణ్ణి దానికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత నాకు అది ఒక బాక్స్ లో కోట్లు ఇచ్చి పంపించింది. వాళ్ళిద్దరు హనుమాన్కి హ్యాపీగా వెళ్లిపోయారు .
నేను అది పంపించిన బాక్స్ ఓపెన్ చేసి చూసి గుండె ఆగి సచ్చిను.
మొదటి దెయ్యం….. మరి అన్ని కోట్లు ఒకేసారి చూస్తే నీ గుండె ఆగిపోదా . అయితే ఆ కోట్లు చచ్చిపోయావు అన్నమాట.
రెండో దెయ్యం… అవును ఆ కోట్లు చూసి చచ్చిపోయాను ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే నీకు ఏమవుతుందో.
మొదటి దెయ్యం…. ఏంటది చెల్లి చెప్పు.
రెండో దెయ్యం…. అది నాకు ఇచ్చింది కోట్ల డబ్బులు కాదు వేసుకునే కోట్లు వాటితోపాటు ఫాంట్లు.
ఆ మాటలు విన్న ఆ దెయ్యం…..హా…హా..హా …అని పెద్దగా నవ్వుతూ కోట్లు అంటే నేను డబ్బులు అనుకున్నాను వేసుకునే కోట్ల తల్లి. అదే ఎవరో నీకు బాగానే నామం పెట్టి వెళ్ళింది.
ఆ మాటలు విన్న దయ్యం…. అక్క నవీన్ చాలు కానీ ఇప్పుడు నేను ఎలా చచ్చిపోయాను చెప్పాను మరి నువ్వెలా చచ్చిపోయావు.
మొదటి దెయ్యం…. అది ఒక విషాదమైన గాధ.
రెండో దెయ్యం…. అబ్బో నీ కథ లో అంత విషాదం ఉందా.
దెయ్యం…..అవును చెల్లి నా కథలో విషాదమే ఉంటుంది ఇది చెప్పిన తర్వాత నీ మనసు చలించిపోతుంది.
అబ్బో ఏంటో అది చెప్పు అక్క వింటాను.
మొదటి దెయ్యం….. నా పేరు రంగమ్మ అందరు నన్ను రంగమ్మత్త రంగమ్మత్త అని పిలిచేవాళ్ళు. నాకు కొంచెం తిండి పిచ్చి ఎక్కువ చెల్లి.
అయితే ఒక రోజు ఏం జరిగిందంటే మా ఆయన్ని బలనీకీ టానిక్ తీసుకురమ్మని చెప్పాను. ఆయన తీసుకొస్తాను లే అన్నాడు.
అయితే నేను ఇంట్లో పని చేసుకుంటుండగా టానిక్ సీసా కనపడింది. అప్పుడు నేను మా ఆయన్ని ఎంతో మెచ్చుకొని . ఉన్న టానిక్ అంత తాగేశాను.
రెండో దెయ్యం…. అదేంటి నీకు ఎంత తిండి పిచ్చి అయితే మాత్రం. అంత టానిక్ ఒకేసారి తాగుతారా.అయినా అంత తాగడం వల్ల ఏ వాంతులు విరోచనాలు అవ్వడం కానీ నువ్వు చచ్చిపోయాఉ ఏంటి.
మొదటి దెయ్యం…. ఆ అక్కడే అసలైన కాదు ఉంది. మా ఆయన నా పొలానికి వేసే ముందు డబ్బు అవసరం అయ్యి ఒక మూలన ఉండే డబ్బా ని తీశాడు. అందులో కొంచెం మందు ఉందంట. దాని ఎక్కడ పోయాలో తెలీక కాళీ టానిక్ సీసా ఉంటే అందులో పోసి వెళ్ళాడు అంట. ఆ విషయం తెలీక నేను దాన్ని గటగటా తాగేశాను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను. ఏంటో ఇది ఒక రకమైన పురుగుల మందు వాసన వస్తుంది అని. చచ్చాక తెలిసింది అది టానిక్ కాదు పురుగుల మందు అని.
ఆ మాటలు విన్న ఆ దెయ్యం పెద్దగా…హా..హా …హా…. తిండి పిచ్చి ఉండాలి కానీ అమ్మ నీ అంత తిండి పిచ్చి ఉంటే ఏమవుతుందో తెలుస్తుంది.
మొదటి దెయ్యం… డబ్బుకు ఆశపడి నువ్వు.
తిండికి ఆశపడి నేను ఇద్దరం బలే సచ్చి దెయ్యాల గా మారి ఏం లే.
అవును అక్క నాకు ఒక అనుమానం…. ఎవరైనా టానిక్ ని కొంచెం తాగుతారు కదా నువ్వు మొత్తం ముందు తాగావు.
దెయ్యం…..అంటే చెల్లి కొంచెం తాగితే కొంచెం బాగానే వస్తుంది మొత్తం తాగితే చాలా బలం వస్తుందని అట్లా చేశాను.
2….. అబ్బా మాటలే నీ కకృత్తి లో చ్…..చి..
1…అబ్బా అలా అన్మాకు చెల్లి నా మీద నాకే విరక్తి వస్తుంది. అయినా నువ్వేం తక్కువ అయింది కోట్లు కోసం ఆశపడి మొగుణ్ణి అమ్ము కొన్నావు.
2…సరే సరే గానీ అక్క నాకు చాలా ఆకలిగా ఉంది ఎక్కడ చూసినా ఎవరు కనపడటం లేదు ఈ మనుషులు అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు.
1….. ఇంకెక్కడ మనుషులే తల్లి మనం 2020లో చచ్చి దయ్యాలుగా మారాము 2021 చూడకుండానే చచ్చే లాగా ఉన్నారు
. 2….. అక్క నువ్వు అంటుంది నాకు ఏమి అర్థం కావడం లేదు. కొంచెం నాకు అర్థమయ్యేలాగ చెప్పు.
1…. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది తల్లి. కొత్త వ్యాధి కారణంతో చాలా మంది చనిపోయారు. చాలా మంది పట్టణాలు వదిలేసి సొంత ఊరైన పల్లెటూరికి వెళ్లిపోయారు. అదలా ఉంటే మొన్నటికి మొన్న వైజాగ్ లో గ్యాస్ లీక్ అయ్యి పాపం ఎంతో మంది ప్రాణాలు పోయాయి. అంతేనా అదంతా ఉంది అనుకుంటే ఇది కొత్త గా మిడతల పుట్టుకొచ్చాయి. అవి పంట పొలాలను నాశనం చేసి రైతుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాయి. పాపం వాటికి పరిష్కారం ఏమిటో ఆలోచిస్తే చాలా మంది నిద్ర పోకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏంటో ఈ 20 20 సంవత్సరంలో దేవుడు మనుషుల అందరితో 20 20 మ్యాచ్ ఆడుకుంటున్నాడు. పాపం.
అమ్మో ఇన్ని జరుగుతున్నాయా. నేను చచ్చి రెండు రోజులు అవుతుంది నాకు ఆ కొత్త వ్యాధి గురించి తప్ప నాకు ఇంకేమి తెలియదు.
1…. సర్లే చెల్లి తెలుసుకొని ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ లే. కానీ మనం ఎక్కడికన్నా వెళ్దాం పద ఇక్కడే ఉంటే మనకు తినడానికి ఏమీ ఉండదు. సరే పద అక్క అంటూ ఆ రెండు దెయ్యాలు నడుచుకుంటూ…… అక్క అక్క నువ్వు ఎక్కడ ఏ చెల్లి చెల్లి నీ పక్కనే. అబ్బా దాగుడుమూతలు ఆపవే. ఎక్కడమ్మా నువ్వు చెప్పవే. అంటూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్లకి మార్గమధ్యలో . ఒక బాతు కనపడుతుంది. దాన్ని చూసి….. అక్క అది ఒక బాతు ఇద్దరం దాన్ని పట్టుకొని మసాలా వేసుకొని తిందాం పద. అంటూ దాని వెంట పడతారు.
కానీ ఆ బాతు మాత్రం వాళ్ళకి చిక్కదు వాళ్లు దానిని పట్టుకునే సమయానికి అది మాయమై పోతుంటుంది.
2…. ఇదే మాయ పాత అక్క పట్టుకుని సమయానికి మాయమైపోతుంది.
1…. నిజమే చెల్లి ఈదడం మనకంటే మాయలమారి లాగుంది.
దాంతో మనకెందుకులే చెల్లి మనం వెళ్లి పోదాం పద.ఇంకొంచెం ముందుకు వెళితే తినడానికి ఏమైనా దొరుకుతాయా దాంతో తిరిగి తిరిగి కాళ్ళు చేతులు నొప్పి పుట్టడమే కాకుండా ఆకలి మరింతగా ఎక్కువైపోయింది.
అని వాళ్ళిద్దరు ముందుకు వెళ్తుండగా ఆ బాతు దయ్యంగా మారి…..హా….హా ..హా. .. ఎందుకు అంత నిరాశగా వెళ్ళిపోతున్నారు. ము కొంచెంసేపు కష్టపడితే నేనెవరో తెలిసి పోతుంది కదా.
ఆ దయ్యాన్ని చూసిన ఈ రెండు దెయ్యాలు… నీకసలు బుద్ధుందా ఒకపక్క మేము ఆకలితో అల్లాడి పోతుంటే. ఇలాంటి ఆటలు ఆడుతున్నావు నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు ఒక దెయ్యనీ వి అయ్యుండి మరో దెయ్యాలతో ఇలాగే ఆడుకునేది.
చి చి బుద్ది లేని గాడిద….. అంటూ దాన్ని బాగా చడామడా తిట్టి వెళ్ళిపోతుంటాయి.
అప్పుడు ఆ దెయ్యం…. అక్క ఒక్క నిమిషం ఆగండి. నేను ఆట పట్టించింది కేవలం మీతో స్నేహం చేయడం కోసం మాత్రమే.మరి ఏ తప్పుడు ఉద్దేశంతో కాదు ఇదిగో నా దగ్గర తినడానికి చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. అంటూ ఆహారపదార్థాలు తీసుకొచ్చి చూపిస్తుంది. ఆహార పదార్థాలు చూసి చూసి ఆ దెయ్యాల చాలా సంతోషపడి
ఆవురావురుమంటూ తింటాయి ఆ రోజు నుంచి ఆ ముగ్గురు కలిసి హాయిగా జీవిస్తూ ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *