మాయా బొమ్మల చెట్టు Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales- Kattappa Kathalu

శారద తన భర్త రాము మరణించడంతో తన కూతురైన బేబీ ని తీసుకొని పని కోసం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఆమెకు పని దొరకదు. నిలవడానికి నీడ లేక వాళ్ళిద్దరు ఎంతో బాధపడుతూ ఉంటారు. తన కూతురు బేబీ ఏడుస్తూ…. అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ నన్ను ఇలా రోజు వీధి వీధి తిప్పుతున్నాను నా కళ్ళు నొప్పిగా ఉంటున్నాయి. ఆకలిని మండిపోతుంది అమ్మ. అంటూ ఏడవడం మొదలు పెడుతుంది శారదా పాప ఏడుపును చూసి ఏం మాట్లాడకుండా అలా బొమ్మలాగా కూర్చుంటుంది.
ఇంతలో ఒక కారు అటుగా వెళుతూ ఆ కారు నుంచి ఒక బొమ్మ కింద పడుతుంది.
ఆ బొమ్మని చూసి పాప…. బలే బలే బొమ్మ అంటూ అక్కడికి వెళుతుంది.
ఇక పాప ఆ బొమ్మ తో ఆట పిచ్చిలో పడి ఆకలి మర్చిపోతుంది.
దానిని చూసిన తల్లి…. దేవుడా ఆకలి మర్చిపోయేలా గా నువ్వు ఏదైనా చేయగలదు. మేము అందరమూ మీ చేతిలో కీలుబొమ్మలము.
అంటూ ఎంతగానో బాధ పడుతుంది.
ఇంతలో ఎవరో ఒక వ్యక్తి అటుగా వెళుతూ ఆమెతో…. అమ్మ కొంచెం అన్నం ఉంది తింటావా. అని అంటాడు అందుకు ఆమె తింటాను బాబు అని అంటుంది . వెంటనే అతను ఒక భోజనం పార్సిల్ ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
శారదా చాల సంతోషపడుతూ పాప ని పిలిచి…. పాప ఇలా రా అమ్మా అంటూ పిలిచి ఆమెకు భోజనం పెడుతుంది.
పాప ఆ భోజనం తిని … అమ్మ నాకు నిద్ర వస్తుంది. అని అంటుంది ఎందుకు సరే అని చెప్పి తల్లి ఆమెను జోకొడుతూ పడుకో పెడుతుంది. ఇంతలో ఒక స్వామీజీ అటుగా వెళుతూ ఉంటాడు. అతను ఆమెను చూసి…. అమ్మ ఈ బొమ్మ నాకు ఇవ్వగలవా నేను ఒక ముఖ్యమైన వ్యక్తి ని కలవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటి అందమైన బొమ్మలు కనబడ లేదు . నేను కలవాల్సిన వ్యక్తికి ఒక పాప ఉంది. ఆ పాపకి బొమ్మనీ బహుమతిగా తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాను.
దీనికి బదులు నీకు ఏదైనా బహుమతి ఇస్తాను.
అందుకు ఆమె…. తీసుకొని స్వామి నాకు బహుమతి ఏమీ వద్దు. కానీ ఒక పూట అయితే మా ఆకలి తీరింది. మళ్ళీ ఆకలి మొదటి స్థానానికి వస్తుందిగా తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి. అంటే చాలు అని దీనంగా అడుగుతోంది ఆ మాటలు విన్న స్వామీజీ ఆమె పైన చాలా జాలి చూపిస్తూ…. సరే అమ్మ నువ్వు అడగ్గానే నాకు సహాయం చేశావు. నీకు కచ్చితంగా ఇంతకుమించి బహుమతి లభిస్తుంది. నేను చెప్పినట్టు చేస్తావా.
అందుకు ఆమె చెప్పండి స్వామి చేస్తాను అంటుంది.
స్వామీజీ….. ఈ ఊరికి ఈశాన్య దిశగా ఒక వాగు ఉంటుంది ఆ వాగు దాటితే పెద్ద అడవి అడవి దాటితే కొండలు. కొండలు దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మాయలు గల చెట్టు మిమ్మల్ని చూసిన వెంటనే మీరు ఏదైతే సహాయం
అలాంటి సహాయమే మీకు గొప్పగా లభిస్తుంది
అని చెప్తాడు అందుకు ఆమె సరే అని చెబుతోంది.
స్వామీజీ ఆ బొమ్మనీ తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆమె పాపను భుజాన వేసుకుని చిన్నగా స్వామి చెప్పిన వైపుగా వెళుతూ ఉంటుంది. స్వామి చెప్పినట్టుగా ఒక బాగా కనపడింది ఆమె వాగు దాటడానికి ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తుంది.
అక్కడ ఏమీ కనిపించదు ఇంతలో ఒక ఒక పెద్ద తాటి మట్ట కొట్టుకు వస్తూ ఉంటుంది.
ఆమె వెంటనే దానిమీద కూర్చుని నెట్టుకుంటూ అవతలి దరికి చేరుతుంది.
అలా వాగు దాటడానికి పూర్తవుతుంది. వాగు దాటిన తర్వాత అడవి ఆమె అడవిలో వెళుతూ ఉంటుంది దారి పొడుగునా ముళ్ళు ఆమె కాలికి ముళ్ళు గుచ్చుకొని….. అమ్మ అంటూ అరుస్తూ బాధపడుతూ ఉంటుంది. తన కాలికి గుచ్చుకున్నాయి ముళ్లు తీసుకుంటూనే ముందుకు సాగుతుంది.
అలా రెండు రోజులు ప్రయాణిస్తుంది తినడానికి ఏమీ ఉండదు.
పాప… అమ్మ మనం ఎక్కడ ఉన్నాము నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది అమ్మ. చాలా ఆకలవుతుంది అమ్మ మనం ఊరెళ్ళి పోదాం పద.
ఆమె…. వెళ్దాము ఊరికి వెళ్దాం తల్లి ఇక్కడ ముందు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఆ తర్వాత ఊరికి వెళ్దాం అని అంటుంది ఇక వాళ్ళు అక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతూ
ఉంటారు అక్కడ ఏమీ కనపడదు. ఒక చిన్న నీటి గుంట మాత్రం ఉంటుంది.
వాళ్లు ఆ గుంటలో నీటిని తాగి మళ్ళీ ముందుకు వెళ్తారు . అలా వెళుతూ వెళ్తూ చివరిగా కొండ ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ స్వామికి చెప్పినట్టుగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు నిండా రకరకాల బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు చూసి పాప… బలే బలే బొమ్మలు అమ్మ బొమ్మలు కావాలి నాకు ఆ బొమ్మలు కావాలి నాకు అంటూ మారాం చేస్తుంది.
ఇంతలో ఆ మాయ చెట్టు…. పాపా ఈ బొమ్మలు అన్ని నీకే
ఇదిగో తీసుకో అంటూ వాటన్నిటిని పాప ముందు ప్రత్యక్షం చేస్తుంది ఆ పాట చాల సంతోషపడుతూ వాటి తో ఆడుకోవడం మొదలు పెడుతుంది.
ఆ తర్వాత మాయ చెట్టు తన తల్లితో…. ఏమిటి శారద అలా ఆశ్చర్యపోతూ చూస్తున్నావు. ఈ బొమ్మలు ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా. నువ్వు స్వామీజీకి బొమ్మనీ
బహుమతిగా ఇచ్చావు అందుకే నీకు కావాల్సింది బహుమతి ఏ రూపంలో నీకు లభించింది. నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి రావాలి అనుకున్నావో అప్పుడే నీకు కావాల్సింది బహుమతులను ఏర్పాటు చేసి ఉంచాను. అని అంటుంది ఆమె… నేను నాకు ఏదో డబ్బు సహాయం చేస్తారు అనుకున్నాను కానీ ఇలా బొమ్మలు సహాయం చేస్తారు అని అస్సలు అనుకోలేదు ఈ బొమ్మలు వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉంది చెప్పు.
కడుపు నిండుతుంది కాలు కదులుతుందా.
అంటూ ఏడుస్తుంది మాయ చెట్టు….హా హా హా మీ మనుషులంతా ఎందుకు ఇంత అమాయకంగా ఉన్నారు పిచ్చిదానా. ఈ బొమ్మల్ని అమ్ముకుంటే నీకు డబ్బు వస్తుంది కదా. ఖచ్చితంగా డబ్బుతో నువ్వు సుఖం గా ఉంటావు. చూడు ఇది మాయ బొమ్మలు పిల్లలతో మాట్లాడగలవు అటు చూడు.
అంటూ ఉంది. పాపతో కారు బొమ్మ మాట్లాడుతూ ఉంటుంది…. పాపా నీ పేరు ఏంటి . నా పేరు జిమ్మీ. పాప చాలా ఆశ్చర్య పోతూ. ఆ కార్ తో మాట్లాడుతూ ఉంటుంది దాన్ని చూసి. శారద చాలా ఆశ్చర్యపోతుంది.
మాయ చెట్టు…. ఇప్పుడు నీకు అంత అర్థమైంది కదా. ఈ మాయ బొమ్మలు వ్యాపారం మొదలు పెట్టు నీకు అంతా మంచి జరుగుతుంది. అని అంటుంది అందుకు ఆమె సరే అని చెప్పి మాయ చెట్టు కి కృతజ్ఞతలు చెప్పి బొమ్మలు తీసుకొని తిరిగి గ్రామానికి చేరుకుంటారు అక్కడ శారదా తన వ్యాపారం మొదలు పెడుతుంది. వచ్చే పోయే వాళ్ళ పిల్లలు ఆ బొమ్మలు చూసి చాలా ఆశ్చర్య పోతారు ఆ బొమ్మలు వాళ్ళతో మాట్లాడడం తో….. నాన్న నాకు ఆ బొమ్మలు కావాలి.
నాన్న నాకు ఆ బొమ్మలు కావాలి అంటూ మారాం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాదనలేక వాటిని కొన్ని పెడతారు అలా తన వ్యాపారం బాగా సాగి పోతుంది. కొన్ని రోజులకు అది ఒక పెద్ద ఆట వస్తువుల షాపు గా మంచి పేరు తెచ్చుకుంది శారదా కష్టాలు తీరిపోయి. తన కూతుర్ని చదివించు కుంటూ సంతోషం గా జీవిస్తుంది

Add a Comment

Your email address will not be published. Required fields are marked *