మాయా మొక్కజొన్న చెట్టు సహాయం 3 |Telugu kathalu|Telugu Stories|Bedtime Dreams Telugu |Kattapa

అతని పేరు బద్రి. అతను చాలా మంచివాడు. ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. అతని భార్య పేరు లక్ష్మి ఆమె చనిపోవడంతో అతని కూతురు విమల అని తన తల్లి దగ్గర ఉంచాడు. అతని తల్లి శారదమ్మ మనవరాలు బేబీని చాలా చక్కగా చూసుకుంటూ వుండేది. అతను వారానికి ఒక రోజు ఆమె దగ్గరికి వెళ్లి చూసి వస్తాడు.
అలా ఉండగా ఒక రోజు అతను తల్లి దగ్గరికి వెళ్తాడు. అతని తల్లి తో…. అమ్మ నా కూతురు బేబీ ఎక్కడ . నేను వచ్చి చాలా సేపు అయింది. కానీ నా కూతురు ఎక్కడా కనపడలేదు.
బేబీ ఒకచోట దాక్కొని…. నాన్న నేను ఎక్కడున్నానో కనిపెట్టు అని అంటుంది అందుకు అతను ఆమెను వెతకడం మొదలు పెడతాడు ఇంతలో పాప కనబడుతుంది అతను చాలా సంతోషంగా ఆమెను దగ్గరకు తీసుకుంటాడు .
బేబీ చాలా సంతోష పడుతూ తండ్రితో…. నాన్న ఈ రోజు నాకోసం మీరు ఏం తీసుకొని వచ్చారు. అతను…. నీకు ఇష్టమైన మొక్క జొన్న కండె అని చెప్పి మొక్కజొన్న కండెల ఇస్తాడు ఆమె చాలా సంతోష పడితే వాటిని తీసుకుంటుంది.
ఆ తర్వాత ఆమె బయటికి వెళ్లి ఆడుకుంటూ ఉంటుంది ఇంటి దగ్గర ఉన్న తల్లి కొడుకు ఇద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు.
తల్లి….. అబ్బాయ్ ఏంటి పొలం సంగతి ఏమనుకుంటున్నావ్.
అతను….. పొలం గురించి మాట్లాడడానికి వచ్చాను అమ్మ. నేను మొక్కజొన్న పంట ని పండించాలని అనుకుంటున్నాను . దానికి తగిన ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి మొదటి మొక్క నా కూతురు చేత నటించాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను.
రేపు ఉదయం మొక్కలు నాటడానికి మనుషులు వస్తారు అందుకే పూజ చేయించి మొక్కని పొలంలో నాటుతోంది అన్న ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను నా కూతుర్ని తీసుకుని వెళ్తాం అమ్మ అని అంటాడు.
ఆ మాటలు విన్న ఆమె చాలా సంతోషపడుతూ….. బాబు తీసుకొని వెళ్ళు మంచిదే కదా. అని అంటుంది ఆ తర్వాత ఆమె అతను పాపను తీసుకుని తన ఇంటికి వచ్చేస్తాడు. పాపా ఇంటి పనులు మాత్రం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు
భోజనం చేసిన తర్వాత చాలా సేపు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు.
ఆ మరుసటి రోజు ఉదయం అతను నిద్ర లేచి ఆ పాప నీ తీసుకొని పొలానికి వెల్తాడు అక్కడ పాప మొదటి మొక్కని నాటుతోంది .
అందుకే అతను చాలా సంతోష పడతాడు తర్వాత పొలాన్ని వేస్తాడు . పొలం సాగు చేస్తూ అక్కడే ఉంటాడు తండ్రి.
ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం పాపని తీసుకుని తల్లి దగ్గర వదిలిపెడతాడు.
ఆమె అక్కడే ఉంటుంది. రోజులు గడిచాయి ఒక రోజు తీవ్రమైన గాలి వాన వచ్చి అతని పంట పూర్తిగా నాశనం అయిపోతుంది.
దాన్ని చూసిన అతను చాలా బాధ పడుతూ….. అయ్యో భగవంతుడా నేను అప్పు చేసి మరీ ఈ పంటను వేసాను కానీ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది మోసపోయి బాధపడుతున్నారు అంటూ చాలా బాధపడతాడు. అప్పులవాళ్ళు అతని వేధించడంతో ఏం చేయాలో తెలియక తన ఇంటిని అమ్మేసి అప్పులు తీరుస్తాడు.
ఆ తర్వాత అతను అక్కడి నుంచి తన తల్లి దగ్గరికి వెళ్లి పోతాడు. అతను తల్లి తల్లి జరిగే విషయం చెప్పి….. అమ్మ నేను ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చే శాను. పొలం మీద చేసిన అప్పులు కారణంగా ఈ విధంగా చేయాల్సి వచ్చింది . ఇప్పుడు ఆ ఊర్లో మానాకు రెండెకరాల పొలం తప్ప ఇంకేమీ లేదు.
అని అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతాడు. ఇంకా అతను పొలం పని చేయాలనీ అసలు అనుకోడు. ఇక అదే ఊర్లో మత్స్యకారుల తో కలిసి చేపల వేటకు వెళుతూ ఉంటాడు.అతను చేపలు పట్టి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేవాడు అలా కొన్ని రోజులు బాగానే సాగుతుంది తర్వాత తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లి కొడుకు తో…. బాబు ఇంక నేను ఎక్కువ పని చేయలేకపోతున్నాను ఇక నువ్వే కుటుంబ బాధ్యతలు పూర్తిగా నిర్వహించాలి.
అని అంటుంది అందుకు అతను… సరే అమ్మ నువ్వు విశ్రాంతి తీసుకో సమయానికి, భోజనం మందులు వేసుకో. అంతకంటే నువ్వేం చేయొద్దు. అని చెప్పి అక్కడ నుంచి చేపల వేటకు వెళ్లి పోతాడు. ఆ రోజు సాయంత్రం సమయం అవుతుంది తండ్రి ఇంటికి రాకపోవడంతో అతని తల్లి మరియు కూతురు. ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటారు. బేబీ నాయనమ్మ తో….. నాయనమ్మ ఏంటి నాన్న ఇంత వరకు తిరిగి రాలేదు నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. అందుకు ఆమె కూడా చాలా భయపడుతూ అదే విషయాన్ని చెబుతుంది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడకు వచ్చి ఆమెతో….. అమ్మ బద్రి వెంబడి ఒక పెద్ద తిమింగలం పడింది. అతను భయపడి పడవ ని ఇష్టం వచ్చినట్టుగా పోనిచ్చాడు . అతను ఎటు వెళ్ళాడో తెలియదు ఆచూకి కనబడడం లేదు .
అందుకు ఆమె…. ఏంటి బాబు నువ్వు చెప్తుంది . అయ్యో నా బద్రి కోసం ఎవరు గాలించి లేదా.
అతను…. లేదమ్మా అందరూ భయంతో వెనక్కి తిరిగి వచ్చేసారు.
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు
బేబీ…. నాన్న కోసం వాళ్ళు ఎవరూ గాలిoచలేదు ఇప్పుడు మన నాన్న కోసం త్వరగా వెళ్ళి వెతుకుదాం పద నాయనాన్న నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది అందుకు ఆమె ….. సరే పద అమ్మా అంటూ నది దగ్గరకు వెళ్తుంది.
వాళ్లు ఒడ్డున ఉన్న పడవ ని తీసుకొని నది లోకి వెళ్తారు. బేబీ…. నాన్న నా మాట విన పడుతుందా. నాన్న నా మాట వినపడుతుందా అంటూ కేకలు వేస్తోంది నాయనమ్మ కూడా….. బాబు బద్రి నా మాట వినపడుతుందా బాబు బద్రి నా మాట విన పడుతుందా. అంటూ కేకలు వేస్తూ ఉంటుంది
వాళ్లు చాలా అమాయకంగా అతని వెతుక్కుంటూ వచ్చారు. నిజానికి వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా కేకలు వేస్తూ ఉంటారు. నది లో ఆ పడవ చాలా దూరం ప్రయాణిస్తుంది. కానీ ఎక్కడా బద్రి ఆచూకీ దొరక్కపోవడంతో వాళ్ళిద్దరు ఏడవడం మొదలు పెడతారు.
బేబీ…. నాయనమ్మ నాకు మా నాన్న కావాలి. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను ఇప్పుడు తండ్రిని కూడా పోగొట్టుకోవాలా. చెప్పు నాయనమ్మ నేను ఏం పాపం చేశాను ఆ దేవుడికి నేనంటే ఎందుకు కోపం.
నాయనమ్మ….. అయ్యో ఊరుకో తల్లి ఆ భగవంతుడికి న్యాయం లేదు. మనం ఇలా ఒంటరి వాళ్లను చేసి నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు . అయ్యో బద్రి అంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఇంట్లో ఒక్కసారిగా దూరం లో ఒక పెద్ద చెట్టు నదిలో కనబడుతుంది. ఆ చెట్టు దగ్గర ఒక పడవ ఉంటుంది. వాళ్లు దాన్ని చూసి చాలా ఆశ్చర్య పోతూ ఉంటారు బేబీ…. నాయనమ్మ ఈ వింత చూసారా . నదిలో చెట్టు దాని కింద పడవా కచ్చితంగా నాన్న ఆ పదవిలో ఉండి ఉంటారు. త్వరగా తెడ్డు సహాయంతో పడవని అక్కడికి తీసుకు వెళ్ళండి. అని అంటుంది ఆమె తండ్రి సహాయంతో పడవని అక్కడికి తీసుకు వెళ్తుంది. ఆ పడవలో బద్రి ఉంటాడో బద్రి ని చూసి ఆ వాళ్ళిద్దరూ….. బాబు బద్రి నేను తల్లిని వచ్చాను రా ఒకసారి లేరా . అంటూ కేకలు వేస్తోంది బేబీ…. నాన్న ఒకసారి లేవండి నాన్న ఒకసారి లేవండి అంటూ కేకలు వేస్తోంది. చేతిలో ఆ మాయ చెట్టు…. దయచేసి కొంతసేపు మీరు ఏం మాట్లాడకుండా ఉండండి అతనికి ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం.
చెట్టు మాట్లాడడం చూసిన వాళ్ళు ఇద్దరు చాలా ఆశ్చర్యపోతూ….. ఎవరు మీరు చూడ్డానికి మొక్కజొన్న చెట్టు లాగా ఉన్నారు కానీ ఇంత పెద్దగా ఎలా. అసలు ఈ నది లోకి ఎలా వచ్చారు నా కొడుకుకి విశ్రాంతి ఎందుకు అవసరం నా కొడుకు ఏం జరిగింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది.
అప్పుడా ఆ మాయా చెట్టు…. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకేసారి జవాబు నేను చెప్తాను వినండి. నేను ఒక మాయ చెట్టు ని నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. ఇతను మీ అబ్బాయి అనుకుంటా నాకు అర్థమైంది ఇతన్ని ఒక పెద్ద చేప తరుముకుంటూ వచ్చింది ఆ చేప నుంచి నేను అతని కాపాడాను అతను భయంతో స్పృహ తప్పి పడిపోయాడు . అతనికి ఏమీ కాదు మీరేం భయపడకండి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే అదే కుదుటపడుతుంది.
అని సమాధానం చెబుతుంది అందుకు ఆమె ఏడుస్తూ….. ఎందుకు అన్ని సమస్యలు మాకే వస్తున్నాయి. అంటూ ఏడుస్తుంది మాయ చెట్టు…. అయ్యో బాధపడకండి అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి నాకు చెప్పండి నేను మీ సమస్యను కచ్చితంగా తీరుస్తాను.
బేబీ…. నిజంగా కచ్చితంగా మీరు సహాయం చేస్తారా.
మాయ చెట్టు…. ఖచ్చితంగా తీరుస్తాను పాప అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు.
అప్పుడు బేబీ…. మా నాన్న మొక్కజొన్న ల పొలం వేశాడు కానీ గాలివాన కారణంగా తీవ్ర నష్టం వచ్చింది . ఇల్లు అమ్మి అప్పు తీర్చడు.
అప్పటి నుంచి ఇక్కడే చేపల వేటకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది అప్పుడా మాయా చెట్టు….. ఓహో ఇలా జరిగిందా అయితే ఇక నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితాలు ఈక్కడికి రావడంతో పూర్తిగా మారిపోతాయి అంటూ చెట్టుకు మొక్కజొన్న కండెలు వచ్చేలాగా చేస్తుంది అవి చాలా రంగురంగులుగా ఉంటాయి దాన్ని చూసి నా వాళ్ళిద్దరు చాలా ఆశ్చర్యపోతారు.
బేబీ…. ఇదేంటి సహాయం చేయమంటే ఇదేదో చేస్తున్నారు.
మాయా చెట్టు…. ఇది సహాయమే ఈ మాయ మొక్కజొన్నలను మీ పొలంలో నాటండి
మీరు కచ్చితంగా మంచి జరుగుతుంది. అని చెబుతుంది అందుకు బేబీ సరే అంటుంది వాళ్ళిద్దరు వాటిని తీసుకుంటారు.
కొంచెం సమయం తర్వాత బద్రి కి మెలకువ వస్తుంది అక్కడ ఏం జరుగుతుందో అతనికి ఏమీ అర్థం కాదు అప్పుడు తల్లి జరిగిన విషయం పూర్తిగా వివరిస్తుంది.
అందుకు అతను మాయ చెట్టు వైపు చూసి నమస్కరిస్తూ…. నీకు చాలా కృతజ్ఞతలు. అని అంటాడు అందుకు ఆమె …. మరేం పర్వాలేదు సహాయం చేయడం కోసమే కదా మేము ఉన్నది అని అంటుంది అందుకు. వాళ్లు చాలా సంతోష పడితే అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్తారు . ఆమె చెప్పినట్టుగా ఆ ముగ్గురు పొలంలో ఆ మొక్కజొన్న కండెల నీ వేస్తారు. వాళ్లు అలా పొలం లో మొక్కజొన్న కండెలు పొలంలో వే నాటిన వెంటనే అవి పెద్ద పెద్ద చెట్లు గా మారి బంగారం లోకి మారిపోతాయి వాటిని చూసి…. అయ్య బాబోయ్ బంగారు మొక్కజొన్న లు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ కేరింతలు పెడుతూ ఉంది బేబీ. బద్రి అతని తల్లి కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇక వాళ్ళందరూ నిలబడి నమస్కరించి…. ఓ మాయ చెట్టు మాకు ఇంతటి గొప్ప వరాన్ని అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీరు చేసిన మేలు మా జీవితంలో మర్చిపోలేము. అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆ తర్వాత ఆ బంగారాన్ని తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించి. చాలా ధనవంతుడు అవుతారు ఇక వాళ్లకి ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *