మాయా రొట్టెల చెట్టు Magical Roti Tree | Telugu Kathalu | Telugu Moral Stories | Telugu Comedy Videos

సురేంద్రపురం అనే గ్రామంలో అను అనే ఒక పాప ఉండేది. అను వాళ్ళ తండ్రి అను చిన్నతనంలోనే చనిపోయాడు, ఆయన చనిపోయినప్పటినుండి అను వాళ్ళ తల్లి గౌరీ అనుని ఎంతో కష్టపడి పెంచుతూ ఉంటుంది. కాలంతో పాటు అనుకూడా పెరుగుతూ ఉంటుంది. అనుకి అవసరాలు కూడా పెరుగుతుంటాయి

ఒకరోజు అను గౌరీ దగ్గరికి వచ్చి

అను :- అమ్మ నేను నా ఫ్రెండ్స్ తో కలిసి విహార యాత్రకి వెళ్లాలనుకుంటున్నాను, ఒక వారం రోజుల్లో వెళ్ళాలి అనుదుకు కొంత డబ్బు కావాలి నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు, ఒక వారం రోజుల్లోగా డబ్బు కావలి అని అంటుంది అను

గౌరీ :- అంత ఎక్కువ డబ్బు కావాలంటే నేను ఎక్కడనుండి తీసుకురావాలి, నేను ఎంత కష్టపడినా నాకు వచ్చే డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది, ఇప్పుడు నీకు డబ్బు కావాలంటే నేను ఎలా తీసుకురాగలను అని అడుగుతుంది

అను :- చూడమ్మా నీ కష్టాలు నాకు చెప్పే అవసరం లేదు నాకు వినే అంత ఓపిక కూడా లేదు, డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఇది ఒక్కటే విషయం చెప్పు అని అడుగుతుంది

గౌరీ :- నువ్వు అంత కఠినంగా మాట్లాడితే నేను ఏమి చేయగలను తల్లి నా తల తాకట్టు పెట్టైనా నీకు డబ్బులు ఇస్తాను ఇంకా వారం రోజుల సమయం ఉందని అంటున్నావు గా ఇస్తానులే అని అంటుంది గౌరీ

డబ్బుల పనిమీద వేరే వేరే ఇళ్లకు తిరుగుతున్న గౌరికి వీరమ్మ అనే మహిళ కనిపిస్తుంది దారిలో

వీరమ్మ :- ఏంటి గౌరీ? ఎక్కడికి వెళ్తున్నావు, చేతినిండా పనులు చేస్తున్నట్టు ఉన్నవు, మొన్న పోయాలం పనులలో కనిపించావు, మల్లి జమీందారు గారి ఇంట్లో పాచి పని చేస్తున్నావు, అలాగే మన ఊరిలో ఉన్న బడి ఊడ్చే పనికి కుదిరావని తెలిసింది, నిజమేనా అని అడుగుతుంది

గౌరీ :- అవునక్క డబ్బుల అవసరం చాలా ఉంది, మల్లి ఈ వారంలో అను వాళ్ళ స్నేహితులతో ఎక్కడికో విహార యాత్రకి వెళ్తుందంతా డబ్బులు కావాలని మొండి పట్టు పట్టింది. చేసేదేమి లేక ఇలా అన్ని పనులు చేయాల్సి వస్తుంది సరే అక్క ఇంకా కొంత మందిని డబ్బులు అడగాలి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది గౌరీ

అలా వీరమ్మ ముందుకి వెళ్తుండగా అను అప్పుడే స్కూల్ నుంచి వస్తూ వీరమ్మని చూసి

అను :- పెద్దమ్మ మా అమ్మని చూసావా? కూతురు మీద పట్టింపు కూడా లేకుండా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అని అంటుంది

వీరమ్మ :- ఏంటమ్మా మీ అమ్మ గురించి నీకు ఏమి తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావు. నువ్వు సుఖంగా ఉండాలని మీ అమ్మ చేయని కష్టం లేదు, పొద్దునే లేచి జమీందారు గారి ఇంట్లో పాచి పని చేసి అక్కడనుండి పొలం పనులకి వెళ్లి పొద్దంతా కష్టపడి మల్లి బడి శుభ్రం చేసే పనికి కుదిరింది, నీకోసం పగలనకా రాత్రనకా కష్టపడి పనిచేస్తూ ఉంటె పైనుంచి నువ్వనే మాటలు కూడా పడాలి, నీకు తిండి పెట్టడం కోసం మీ అమ్మ ఎన్ని రోజులు పస్తులు పడుకుందో నీకు తెలుసా? అని అడుగుతుంది

అను :- మా అమ్మ నా కోసం ఇంత కష్టపడుతుందా నేను మా అమ్మకోసం ఎదో ఒకటి చెయ్యాలి అని అనుకోని ఆలోచిస్తూ బయలుదేరుతుంది, ఇంతలో అక్కడ ఒక కుక్క ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తుంది, అలా గాయాలతో ఉన్న కుక్కని చూసిన అనుకి ఎంతో బాధ వేస్తుంది, వెంటనే వెళ్లి కుక్కకి కట్టు కడుతుంది, ఆ కుక్క వెంటనే ఒక స్వామిజిగా మారిపోతుంది,

స్వామిజి :- చూడు తల్లి ఇది నాకు శాపం, పూర్వం నేను ఒక ముని ఆశ్రమం లో విద్యాబ్యాసం చేస్తుండగా ఒకసారి మా గురువుగారు కర్రవిద్య నేర్పిస్తున్నప్పుడు కార జారీ ఆయనకు తగిలింది అప్పుడు నేను నవ్వడం గమనించిన మా గురువుగారు గాయాలతో ఉన్న కుక్కలా బ్రతకమని శాపం ఇచ్చారు, నేను క్షమించమని ఎంతగానో వేడుకోగా శాపవిమోచనంగా ఎవరైతే నీ మీద ప్రేమతో నీ గాయానికి సేవ చేస్తారో వారి ప్రేమ వల్ల నువ్వు మల్లి మామూలు స్థితికి వస్తావు అని చెప్పాడు ఈ రోజు కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు నీ వల్ల నాకు మంచి జరిగింది, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు చాలా దిగులుగా ఉన్నట్టు కనిపిస్తున్నావు నీ బాధ ఏంటో చెప్పు నేను తీరుస్తాను అంటాడు

అను :- మా అమ్మ నాకోసం రాత్రి పగలు తేడా లేకుండా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కష్టపడుతుంది. కానీ మల్లి నాకోసమే సరిగా తిండి కూడా తినడం లేదు దీనికి ఏదైనా ఒక పరిష్కారం చెప్పు స్వామి అని వేడుకుంటుంది

స్వామిజి :- దీనంతటికి ఒకే ఒక్క పరిష్కారం అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో ఒక మాయా చెట్టు ఉంటుంది, దాని దగ్గరికి వెళ్లి నువ్వు ఏది కోరుకుంటే నీకు అది దొరుకుతుంది అని చెప్పి స్వామిజి మాయమైపోతాడు

స్వామిజి చెప్పినట్టుగా అను ఆ చెట్టు దగ్గరికి వెళ్లి

అను :- ఓ మాయా చెట్టు మాయా చెట్టు మాకు తినడానికి సారైన ఆహారం లేదు ఒక మంచి రుచికరమైన ఆహారాన్ని రోజు ఇవ్వవా అని అడుగుతుంది, ఆ చెట్టు వెంటనే కొన్ని రొట్టెలను తన కొమ్మలకు ప్రత్యక్షం చేస్తుంది, అను ఆ రొట్టెలను తీసుకొని ఎంతో సంతోషంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది, జరిగిన విషయాన్నంతా వాళ్ళ అమ్మకి చెబుతుంది.

అనులో వచ్చిన మార్పుకి గౌరీ ఎంతో సంతోషిస్తుంది. ఇక అను గౌరీ వచ్చిన డబ్బులని దాచుకుంటూ మాయా చెట్టు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *